
మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా.! ఇదే పాయింట్‌తో '23' అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంచలన ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. గతంలో మల్లేశం, 8 ఏ.ఎం మెట్రో, వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. '23' సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

23 సినిమా టీజర్‌లోని అంశాలు తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. 1991 సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మారణకాండ ఘటనతో టీజర్ ప్రారంభమవుతుంది. ఆపై 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలూరిపేటలో బస్సు దహనంతో పాటు.. 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి గురుంచి తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఈ మూడు ఘటనలలో మరణించిన వారి స్టోరీ ఒకే మాదిరి ముగియగా.. హంతకుల కథ చివరకు ఏమైంది అనే పాయింట్‌తో '23' చిత్రంలో చూపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment