chilakaluripata
-
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి విడదల రజిని
-
వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రి అరెస్టు!
సాక్షి, చిలకలూరిపేట: పెంపుడు కుమార్తెను వ్యభిచారం చేయమని వేధిస్తున్న తండ్రిని పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరులో నివాసం ఉండే ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మిట్టనోసుల ప్రభుదాసు ఎలియాస్ వీరారావు ఒక కుమార్తెను పెంచుకున్నాడు. ఆమె చేత 13 సంవత్సరాల వయస్సు నుంచే బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆమెకు వివాహం జరిగాక కూడా వ్యభిచారం చేయిస్తుండటంతో భర్త వదలివేశాడు. దీంతో ఆమె చిలకలూరిపేట పట్టణంలో తన కుమార్తెతో కలసి జీవనం కొనసాగిస్తోంది. ఇది తెలిసి వీరారావు తిరిగి ఆమెను వ్యభిచారం చేయాల్సిందిగా కొట్టి గాయపరచటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
ఆస్తి కోసం తండ్రి దారుణహత్య
చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): ఆస్తి కోసం ఓ కిరాతకుడు కన్న తండ్రినే కడతేర్చాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గొండ్రగుంట నాగయ్య(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆస్తి విషయంలో కొడుకు హరిబాబు గత కొంతకాలం నుంచి తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే తెల్లవారు జామున నిద్రిస్తున్న తండ్రిని తన మేడలో ఉన్న కండువాతో హరిబాబు ఉరివేసి చంపాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.