చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): ఆస్తి కోసం ఓ కిరాతకుడు కన్న తండ్రినే కడతేర్చాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గొండ్రగుంట నాగయ్య(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆస్తి విషయంలో కొడుకు హరిబాబు గత కొంతకాలం నుంచి తండ్రితో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలోనే తెల్లవారు జామున నిద్రిస్తున్న తండ్రిని తన మేడలో ఉన్న కండువాతో హరిబాబు ఉరివేసి చంపాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.