లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.
జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది.
ఆ అమ్మాయి స్టేట్‌మెంట్‌తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్‌గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.
కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment