
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఇటీవలే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
(ఇది చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)
అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీమాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జానీమాస్టర్ కోసం ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అసలు కేసు ఏంటంటే?
మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.
అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన బాధని బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment