కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.
జైల్లో ఖైదీగా..
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.
చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..!
Comments
Please login to add a commentAdd a comment