
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 3 గంటలపాటు జరిగిన విచారణలో జానీ మాస్టర్ దారుణాలను మహిళ డ్యాన్సర్ పోలీసులకు వివరించింది.
షూటింగ్ టైమ్‌లో క్యారవాన్‌లో జానీ మాస్టర్ బలవంతం చేశాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. తన కోరిక తీర్చమని ఎంతో వేధించాడని.. లేకుంటే ఎలాంటి ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు వివరించింది. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు వాపోయింది. బాధిత యువతి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే??
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment