జనాల్ని పిచ్చోళ్లను చేయొద్దు.. ఆలియా భట్‌పై నటి ఫైర్‌ | Bhushan Kumar Wife Accuses Alia Bhatt of Fooling Audience For Jigra | Sakshi
Sakshi News home page

జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్‌ మొత్తం ఖాళీ.. అయినా..!

Published Sat, Oct 12 2024 6:34 PM | Last Updated on Sun, Oct 13 2024 9:44 AM

Bhushan Kumar Wife Accuses Alia Bhatt of Fooling Audience For Jigra

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్‌ రైనా మరో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదలైంది. ప్రమోషన్స్‌లో చాలా కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.

థియేటర్‌ ఖాళీ..
దీనిపై ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్‌ స్పందించింది. జిగ్రా చూద్దామని పీవీఆర్‌ మాల్‌కు వెళ్లాను. థియేటర్‌ అంతా ఖాళీ.. ప్రతిచోటా ఇదే పరిస్థితి.. అయినా ఆలియా భట్‌ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటించినందుకు! పెయిడ్‌ మీడియా ఎందుకు సైలెంట్‌గా ఉందో అర్థమవట్లేదు.

 

జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దు
ఏదేమైనా మనం ఆడియన్స్‌ను ఫూల్‌ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్‌లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్‌ హాల్‌ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. 

అందుకే ఈ కోపం?
ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు.

చదవండి: కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేసిన సోనియా.. అక్కడ కూడా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement