బిగ్‌బాస్‌ను వదిలిపెట్టనంటున్న సోనియా.. కొత్తగా ఏం చేసిందంటే? | Bigg Boss Telugu 8: Soniya Akula Open New Youtube Channel | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేసిన సోనియా.. అక్కడ కూడా..

Oct 12 2024 5:37 PM | Updated on Oct 13 2024 9:55 AM

Bigg Boss Telugu 8: Soniya Akula Open New Youtube Channel

బిగ్‌బాస్‌ షో వల్ల నెగెటివ్‌ అయినవారు చాలామందే ఉన్నారు. అయితే తాను కరెక్ట్‌గా ఉన్నానని.. కానీ, బిగ్‌బాసే తప్పుగా చూపించాడని ఫైర్‌ అయింది సోనియా ఆకుల. తన మాటల్ని, ప్రవర్తనని మరో కోణంలో ప్రేక్షకులకు చూపించాడని, అందువల్లే జనాలు తనను విమర్శిస్తున్నారంటోంది. ఎక్కడికి వెళ్లినా, ఏమాత్రం ఛాన్స్‌ దొరికినా బిగ్‌బాస్‌ను తిడుతూనే ఉంది. 

కొత్త యూట్యూబ్‌ ఛానల్‌..
మితిమీరిన హగ్గులు, పర్సనల్‌ టార్గెట్‌ వంటి స్వయంకృతపరాధాలను సైతం ఒప్పుకోకపోవడం గమనార్హం. తాజాగా ఈ బిగ్‌బాస్‌ (ఎనిమిదో సీజన్‌) బ్యూటీ తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సొంత యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించినట్లు వెల్లడించింది. సామాజిక సేవ నుంచి బిగ్‌బాస్‌ వరకు మీరు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేశాను. 

ఒక్కటేం ఖర్మ.. అన్నీ ఉంటాయ్‌
యువర్స్‌ సోనియా.. ఇక్కడ బిగ్‌బాస్‌ షోలో ఎపిసోడ్‌ వెనకాల జరిగిన స్టోరీలను, నా యాక్టింగ్‌ కెరీర్‌కు సంబంధించిన కథనాలను, వ్యక్తిగత విషయాలను, లైఫ్‌స్టైల్‌ కంటెంట్‌.. ఇలా అన్నీ మీతో పంచుకుంటాను. అలాగే సెలబ్రిటీల ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కచ్చితంగా సపోర్ట్‌ చేస్తామని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం నిన్ను బిగ్‌బాస్‌లోనే చూడలేకపోయాం.. ఇంకా యూట్యూబ్‌లో ఏం చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.

 

 మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement