Jigra Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కానీ ప్రస్తుతం దేశం మొత్తం 'పుష్ప 2' ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ఎవరితో మాట్లాడిన చర్చంతా ఈ మూవీ గురించే. ఈ సినిమా టికెట్ దొరికితే సరేసరి లేదంటే చూసేందుకు ఓటీటీల్లోకి 20కి పైగా కొత్త సినిమాలు వచ్చేశాయి. వాటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్.(ఇదీ చదవండి: పుష్ప 2 'జాతర' సాంగ్ రిలీజ్ చేశారు!)ఓటీటీల్లో ఈ శుక్రవారం రిలీజైన సినిమాలు విషయానికొస్తే ఆలియా భట్ 'జిగ్రా', నరుడి బ్రతుకు నటన, అమరన్, మట్కా లాంటి చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటే అగ్ని (హిందీ), సార్ (తమిళ) చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏయే సినిమా ఏ ఓటీటీల్లోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (డిసెంబరు 6)అమెజాన్ ప్రైమ్నరుడి బ్రతుకు నటన - తెలుగు సినిమాఅగ్ని - హిందీ మూవీద టట్టాస్ - డచ్ సిరీస్మొహ్రే - హిందీ సిరీస్ద స్టిక్కీ - ఇంగ్లీష్ సిరీస్మట్కా - తెలుగు సినిమానెట్ఫ్లిక్స్జిగ్రా - తెలుగు డబ్బింగ్ సినిమాఏ నాన్సెన్స్ క్రిస్మస్ విత్ సబ్రినా కార్పెంటర్ - ఇంగ్లీష్ మూవీబిగ్గెస్ట్ హయస్ట్ ఎవర్ - ఇంగ్లీష్ సినిమాక్యాంప్ క్రషర్ - స్పానిష్ చిత్రంఎకోస్ ఆఫ్ ద పాస్ట్ - అరబిక్ సిరీస్హయాయో మియాజకీ అండ్ ద హెరోన్ - జపనీస్ మూవీమేరీ - ఇంగ్లీష్ సినిమాఅమరన్ - తెలుగు సినిమావిక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో - హిందీ మూవీ (డిసెంబర్ 7)ఆహామందిర - తెలుగు సినిమాజీ5మైరీ - హిందీ సిరీస్ఆహాసార్ - తెలుగు డబ్బింగ్ సినిమాజియో సినిమాక్రియేచర్ కమాండోస్ - ఇంగ్లీష్ సిరీస్లాంగింగ్ - ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 7)మనోరమ మ్యాక్స్ఫ్యామిలీ - మలయాళ సినిమాఆపిల్ ప్లస్ టీవీఫ్లై మీ టూ ద మూన్ - ఇంగ్లీష్ మూవీసోనీ లివ్తానవ్ సీజన్ 2 - హిందీ సిరీస్(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. బన్నీ టీమ్‌పై కేసు నమోదు) -
ఓటీటీలో 'జిగ్రా' స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'అలియా భట్' యాక్షన్ మూవీ
ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలోకి రానుంది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపింది. అంకుర్ పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఈ చిత్రం మెప్పించలేదు.అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కథనాలు వస్తున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది. -
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
జిగ్రా విమర్శలపై కరణ్ జోహార్ పోస్ట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన నటి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తి డిమ్రీల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే జిగ్రా కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత భార్య, నటి దివ్య ఖోస్లా విమర్శలు చేసింది. ఎందుకు ఫేక్ వసూళ్లు ప్రకటిస్తున్నారని మండిపడింది. తాను జిగ్రా థియేటర్‌కు వెళ్తే అంతా ఖాళీగా కనిపించిందని పోస్ట్ చేసింది. అయితే నటి దివ్య ఖోస్లా కామెంట్స్‌పై నిర్మాత కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. నిశ్శబ్దమే మూర్ఖులకు సరైన సమాధానమంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.తాజాగా కరణ్ జోహార్ కామెంట్స్‌పై నటి దివ్య రియాక్ట్ అయింది. కరణ్ పేరు ప్రస్తావించనప్పటికీ అతని పోస్ట్‌పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దివ్య కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీకు సిగ్గు లేకుండా ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అలవాటు.. మీరు ఎల్లప్పుడూ మౌనంగానే ఆశ్రయం పొందుతారు. మీకు వెన్నెముకే కాదు.. అలాగే వాయిస్ కూడా లేదంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రస్తావించింది.జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుకాగా.. అంతకుముందు ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు. -
జనాల్ని పిచ్చోళ్లను చేయొద్దు.. ఆలియా భట్‌పై నటి ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. ప్రమోషన్స్‌లో చాలా కష్టపడ్డారు కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారమూ జరుగుతోంది.థియేటర్ ఖాళీ..దీనిపై ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్ స్పందించింది. జిగ్రా చూద్దామని పీవీఆర్ మాల్‌కు వెళ్లాను. థియేటర్ అంతా ఖాళీ.. ప్రతిచోటా ఇదే పరిస్థితి.. అయినా ఆలియా భట్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్ కలెక్షన్స్ ప్రకటించినందుకు! పెయిడ్ మీడియా ఎందుకు సైలెంట్‌గా ఉందో అర్థమవట్లేదు. జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దుఏదేమైనా మనం ఆడియన్స్‌ను ఫూల్ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్ హాల్ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. అందుకే ఈ కోపం?ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు.చదవండి: కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన సోనియా.. అక్కడ కూడా.. -
'జిగ్రా' కోసం ఆలియాకి మహేశ్ బాబు విషెస్
పేరుకే స్టార్ హీరో కానీ కొత్త సినిమా రిలీజైతే చాలు హీరో మహేశ్ బాబు చూస్తుంటాడు. కచ్చితంగా ట్వీట్ పెట్టి మూవీ ఎలా ఉందో చెప్పేస్తుంటాడు. ఈసారి అలానే రిలీజ్‌కి ముందే ఆలియా భట్ 'జిగ్రా' మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు.(ఇదీ చదవండి: 'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)బాలీవుడ్ బ్యూటీ ఆలియా ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జిగ్రా'. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11నే థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే కాదు తెలుగులో ఈసారి దసరాకు 'విశ్వం', 'మా నాన్న సూపర్ హీరో', 'జనక అయితే గనక' చిత్రాలు ప్రేక్షకుల పలకరించాయి. 'వేట్టయన్', 'మార్టిన్', 'జిగ్రా' అనే డబ్బింగ్ చిత్రాలు కూడా ఇదే పండక్కి థియేటర్లలోకి వచ్చాయి. మరి వీటిలో ఏది హిట్ అయిందో లేదో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తవ్వాల్సిందే.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
షారుఖ్ ఖాన్ కుమార్తెపై యంగ్ హీరో ఇంట్రెస్టెంగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముద్దుల తనయ, నటి సుహానా ఖాన్‌పై యంగ్ హీరో వేదాంగ్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మేకప్ వేసుకోవడానికి చాలా సమయం తీసుకుంటుందని, షూటింగ్ సమయంలో ఆమె టీమ్ అంతరాయం కలిగించేదని చెప్పారు. ఆయన కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఆలియా బట్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా వేదాంగ్ రైనా మీడియాతో ముచ్చటించారు. (చదవండి: రానాకి ఇంతకంటే బెటర్ ప్రశంస ఉండదేమో?)ఈ సందర్భంగా తొలి సినిమా కోస్టార్ సుహానా ఖాన్‌పై ఎప్పుడైనా కోపం వచ్చిందా అని విలేకరి ప్రశ్నించాడు. దీనిపై వేదాంగ్ స్పందిస్తూ.. ‘సుహానా చాలా మంచి అమ్మాయి. అందరితో కలిసిసోతుంది. కోపం వచ్చేలా ఆమె ప్రవర్తించదు. కానీ ఒక విషయంలో మాత్రం నాకు కొంచెం చిరాకుగా అనిపించేంది. ఆమె రెడీ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. షూటింగ్ సమయంలో మేమంతా రెడీ అయి ఆమె కోసం ఎదురు చూసేవాళ్లం. దాదాపు గంట లేట్‌గా సెట్‌పైకి వచ్చేది. (చదవండి: పెళ్లి గురించి అమితాబ్ ప్రశ్న.. జునైద్ ఖాన్ ఆన్సర్‌కు తండ్రి షాక్)షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ‘జుట్టు బాలేదు..మేకప్ సరిగా లేదు’అంటూ ఆమె టీమ్ మధ్యలో అంతరాయం కలిగించేంది. దాని వల్ల మా బృందం అంతా ఇబ్బంది పడింది. ఇందులో సుహానాది తప్పులేదు. ఆమె పాత్ర అలా డిజైన్ చేశారు. అందుకే మేకప్‌కి ఎక్కువ సమయం తీసుకునేది’అని వేదాంగ్ చెప్పారు. -
హైదరాబాద్ : ఆలియా భట్ 'జిగ్రా'మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహిళలందరూ హీరోలే: దర్శకుడు త్రివిక్రమ్
‘‘మహిళలందరూ ఎప్పటికీ హీరోలే. మహిళలు లేకుండా తర్వాతి తరాలు లేవు. మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శక్తి అంటేనే స్త్రీ కదా. ఈ తొమ్మిది రోజులు (దసరా నవరాత్రులు) ఈ విషయాన్నే మనం ప్రపంచం అంతా చెబుతున్నాం. వీలుంటే మమ్మల్ని (పురుషులు) కొంచెం ఎంపవర్ చేయండి’’ అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో, వేదాంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.‘జిగ్రా’ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దగ్గుబాటి రానా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఆర్ఆర్’తో ఆలియా మన ఇళ్లల్లోకి వచ్చారు. ఈ విజయదశమికి ఆమెకు విజయాన్ని కానుకగా ఇచ్చి, మన ఇంటి అడపడుచులా పంపుదాం. తెలుగు, తమిళ, మలయాళం... ఇలా అన్ని చోట్ల ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ నాకు తెలిసి ఒకరు రజనీకాంత్‌గారు... తర్వాత సమంతగారే అనుకుంటున్నాను. సమంతగారూ ముంబైలోనే కాదు... అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వస్తుండండి. సినిమాలు చేయాలి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఎదిగాను. తెలుగు ప్రేక్షకులే నా ఫ్యామిలీ. హీరోయిన్లుగా మా సినిమాలు చూస్తున్న అమ్మాయిలకు వాళ్ల కథలో వాళ్లే హీరోలు అని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. మా కథల్లో మేమే హీరో అని ఆలియా భట్ తన వర్క్‌తో గుర్తు చేస్తుంటారు. కొన్ని రోజుల క్రితం రానా ఓ ఫిమేల్ మూవీని (35: చిన్న కథ కాదు’ సినిమాను ఉద్దేశించి కావొచ్చు) ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు ‘జిగ్రా’ను రిలీజ్ చేస్తున్నారు.ప్రతి అమ్మాయికి రానాలాంటి బ్రదర్ ఉండాలేమో ’’ అని మాట్లాడారు. ఆలియా భట్ మాట్లాడుతూ– ‘‘సమంతకు, నాకు కలిపి త్రివిక్రమ్‌గారు ఓ కథ రాయాలని కోరుకుంటున్నాను. పురుషాధిక్య ప్రపంచంలో స్ట్రాంగ్‌గా నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా సమంత హీరోనే. తెలుగు ప్రేక్షకుల ప్రేమ ‘జిగ్రా’ పై కూడా ఉండాలి’’ అని తెలిపారు. ‘‘జిగ్రా’ అంటే ధైర్యం. యాక్టింగ్ అంటే ఆలియా’’ అని చెప్పారు వాసన్ బాల. ‘‘సినిమా ప్రమోషన్ విషయంలో ఆలియా అంకితభావం చూస్తుంటే ఇక్కడ ఉన్న యాక్టర్స్‌కు కొంత నేర్పాలని అనుకుంటాను’’ అని రానా అన్నారు. ఈ వేడుకలో జాన్వీ నారంగ్, సిమ్రాన్ నారంగ్ పాల్గొన్నారు. -
సమంత-త్రివిక్రమ్‌తో సినిమా.. ఆలియా పెద్ద కోరిక
చాలారోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంతని త్రివిక్రమ్, ఆలియా భట్ ఆకాశానికెత్తేశారు. హైదరాబాద్‌లో జరిగిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదంతా జరిగింది. కొత్త మూవీ ప్రమోషన్ కోసం భాగ్యనగరానికి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. సినిమా గురించి చెప్పడం కంటే సమంతకి ఎలివేషన్స్ ఇచ్చింది. త్రివిక్రమ్‌తో మూవీ చేయాలని ఉందనే కోరిక బయటపెట్టింది.(ఇదీ చదవండి: సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)సమంత గురించి మాట్లాడిన ఆలియా భట్.. తెరపైనే కాదు తెరముందు కూడా హీరోనే అని సామ్‌ని ఆకాశానికెత్తింది. పురుషాధిక్య ప్రపంచంలో సమంత ప్రయాణం చాలా స్ఫూర్తి దాయకమని, అలాంటి ఆమె తన సినిమాని ప్రొత్సహించేందుకు ముందుకు రావడం చాలా ఆనందం ఉందని చెప్పింది. మంచి సినిమాలను ప్రేమించడంలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అని మనోళ్ల ప్రేమ గురించి పొగిడింది. తమ ఇంటికి తెలుగుతో ఎంతో అనుబంధం ఏర్పడిందని, తన కూతురు.. నాటునాటు పాట వినని రోజే ఉండదని ఆలియా చెప్పింది.అలానే సమంత, తనని లీడ్ రోల్స్‌లో ఓ సినిమా తీయాలని ఇదే వేడుకకు అతిథిగా హాజరైన దర్శకుడు త్రివిక్రమ్‌ని ఆలియా భట్ కోరింది. అయితే ఇదేమంత పెద్ద కష్టం కాకపోవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్.. త్వరలో అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. గురూజీ అనుకుంటే బన్నీ సరసన సమంత, ఆలియా భట్ని పెడితే పాన్ ఇండియా తగ్గట్లు సరిపోతుంది. మరి ఆలియా కోరిక త్వరలో తీరుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా) -
చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన సమంత (ఫొటోలు)
-
సమంతపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత రీసెంట్ టైంలో సినిమాలు చేయనప్పటికీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నీమధ్య తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కారణంగా సామ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అదలా ఉంచితే చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చింది. ఆలియా భట్ 'జిగ్రా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి హాజరైన సామ్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన నాగార్జున.. విచారణ వాయిదా)సమంత ఏం చెప్పింది?సినిమా టీమ్‌కి విషెస్ చెప్పింది. అలానే హీరోయిన్లుగా తమకు ఎంతో బాధ్యతగా ఉంటుందని, ప్రతి అమ్మాయి కథలో వాళ్లే హీరోలని చెప్పింది. చాలారోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని అభిమానులని ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులు తన కుటుంబమని క్లారిటీ ఇచ్చింది.త్రివిక్రమ్ టీజింగ్ఇదే ఈవెంట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.. సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'ఏ మాయ చేశావే' సినిమా నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే ఏం అక్కర్లేదని, ఆమెనే ఓ శక్తిని ఆకాశానికెత్తేశాడు. ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ కూడా రండి, మీరు చేయడం లేదని మేం రాయడం లేదు, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. 'అత్తారింటికి దారేది' లాగా సమంత కోసం హైదరాబాద్ రావడానికి దారేది అని అనలేమో అని త్రివిక్రమ్ చెప్పారు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్‌ను ప్రశ్నించే దమ్ముందా? నిర్మాతపై పూనమ్ కౌర్ ఫైర్) -
నీడల్లే నేను తోడు ఉండనా...
‘అంకుర్ నువ్వు ఏమన్నా చేశావా? నువ్వు ఏదన్నా టచ్ చేశావా? ఏదన్నా తిన్నావా ఓకే... కబీర్ నీ ఫోన్‌తో ఏమైనా కాల్స్ చేశాడా? లేదుగా? బ్లడ్ శాంపిల్స్ తీస్తే క్లీన్ వస్తుంది కదా... నువ్వేం భయపడకు... నీకేం కానివ్వను’ అని ఆలియా భట్ పలికే సంభాషణలతో ‘జిగ్రా’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా, అంకుర్ పాత్రలో వేదాంగ్ నటించారు. కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా హీరో రానా విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇంకా ఈ ట్రైలర్లో ‘దారే లేకున్నా... నీ వెంట నీడల్లే నేను తోడు ఉండనా... ఏమైనా కానీ... ఏ పిడుగే రానీ నేను తోడు ఉండనా...’ అనే పాట కూడా వినిపిస్తుంది. -
స్టార్ హీరోయిన్ మూవీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్!
బాలీవుడ్ భామ అలియా భట్ నటించిన తాజా చిత్రం జిగ్రా. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. ఈనెల 27న విడుదల కావాల్సిన జిగ్రా.. దేవర ఎంట్రీతో బాక్సాఫీస్ నుంచి తప్పుకుంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా నిర్మాత వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. జిగ్రా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11న దసరా సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమె చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన హిందీ ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. The #Jigra trailer looks absolutely amazing… taking you on an emotional rollercoaster! Best wishes to Alia and the entire team for a blockbuster release on October 11th! ❤️🔥Here's the Telugu trailer!https://t.co/a5AabB24uZ#JigraTelugu #KaranJohar @apoorvamehta18 @aliaa08… pic.twitter.com/oXeWCs4U7V— Ram Charan (@AlwaysRamCharan) September 29, 2024 -
Jigra Trailer: యాక్షన్‌తో అదరగొట్టిన ఆలియా
ఆలియా భట్ ప్రధాన పాత్రధారిగా, వేదంగ్ రైనా మరో కీలక పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. ‘మౌనిక ఓ మై డార్లింగ్, పెడ్లర్స్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వాసన్ బాల ‘జిగ్రా’ చిత్రాన్ని తెరకెక్కించారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సత్యా ఆనంద్ పాత్రలో ఆలియా భట్, అంకుర్ ఆనంద్ పాత్రలో వేదంగ్ రైనా నటించారు. మరణ శిక్ష విధించబడి, జైల్లో మూడు నెలల్లో మరణించనున్న తన తమ్ముణ్ణి ఓ అక్క ఏ విధంగా కాపాడుకుంది? అనే కోణంలో ‘జిగ్రా’ కథ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘నన్ను నేను ఓ ఎథికల్ పర్సన్‌గా ఎప్పుడూ అనుకోలేదు. అంకుర్‌కి సిస్టర్‌గానే అనుకున్నాను, లోపల ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా?, అంత ధైర్యం ఎవరికి ఉంది? నువ్వు నా సిస్టర్‌గా ఉన్నప్పుడు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ట్రైలర్లో ఆలియా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. -
అక్కా తమ్ముడి కథతో ఆలియా భట్ 'జిగ్రా'
ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమెకు తెలుగులోనూ బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకు తగ్గట్లే రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చరణ్ కొత్త సినిమాల్లో హీరోయిన్ అంటూ రూమర్స్ వచ్చాయి. సరే ఇవన్నీ పక్కనబెడితే 'జిగ్రా' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ఆలియా చేసింది. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆలియా యాక్షన్ సీన్స్ గట్టిగానే చేసినట్లుంది.(ఇదీ చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలైన అక్కా తమ్ముడు. ఒకరంటే ఒకరికి ప్రాణం. బంధువుల దగ్గర పెరుగుతారు. పెద్దయిన తర్వాత తమ్ముడు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్తాడు. అక్కకేమో తమ్మడంటే పంచ ప్రాణాలు. కానీ అతడిని ఉరి తీయడానికి పోలీసులు సిద్ధమవుతారు. మరి చివరకు అక్కాతమ్ముడు కలిశారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.కంటెంట్ బాగుంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం జనాలు ఆదరిస్తున్నారు. ఆలియా భట్ 'జిగ్రా' ట్రైలర్ చూస్తే హిట్ కళ కనిపిస్తుంది. లెక్క ప్రకారం 'దేవర'తో పాటే రిలీజ్ కావాలి. కానీ రెండు వారాలు వెనక్కి జరిగి అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది. హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మరి ఆలియా 'జిగ్రా'తో ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్) -
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!
హీరోయిన్ ఆలియా భట్, నటుడు–గాయకుడు–నిర్మాత దిల్జీత్ సింగ్ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదంగ్ రైనా మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జిగ్రా’. వాసన్ బాల దర్శకత్వంలో కరణ్ జోహార్, ఆలియా భట్, అపూర్వ మెహతా, షాహీన్ భట్, సౌమెన్ మిశ్రా నిర్మిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకున్న హీరోయిన్ మేఘా ఆకాశ్.. హాజరైన సీఎం!)ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 11న విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు దిల్జీత్ సింగ్ వర్క్ చేస్తున్నట్లుగా ఇన్‌స్టా వేదికగా ఆలియా భట్ పేర్కొన్నారు. అయితే దిల్జీత్ సింగ్ ఓ పాట పాడనున్నారా లేక పాటతో పాటు గెస్ట్ రోల్ కూడా చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక 2016లో వచ్చిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమాలో ఆలియా భట్, దిల్జీత్ సింగ్ లీడ్ రోల్స్‌లో నటించగా, షాహిద్ కపూర్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)