జిగ్రా విమర్శలపై కరణ్‌ జోహార్‌ పోస్ట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన నటి! | Divya Khossla Reacts To Karan Johar Cryptic Post On Jigra Controversy, Deets Inside | Sakshi
Sakshi News home page

Jigra Movie Controversy: జిగ్రా విమర్శలపై కరణ్ జోహర్‌ కౌంటర్‌.. ఘాటుగా స్పందించిన నటి!

Published Sun, Oct 13 2024 4:34 PM | Last Updated on Mon, Oct 14 2024 10:59 AM

Divya Khossla reacts to Karan Johar cryptic post on Jigra

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించిన తాజా చిత్రం జిగ్రా. వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదలైంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తి  డిమ్రీల సినిమా 'విక్కీ విద్య కా వో వాలా వీడియో' రిలీజైంది. దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.

అయితే జిగ్రా కలెక్షన్లపై ప్రముఖ నిర్మాత భార్య, నటి దివ్య ఖోస్లా విమర్శలు చేసింది. ఎందుకు ఫేక్ వసూళ్లు  ప్రకటిస్తున్నారని మండిపడింది. తాను జిగ్రా థియేటర్‌కు వెళ్తే అంతా ఖాళీగా కనిపించిందని పోస్ట్ చేసింది. ‍ అయితే నటి దివ్య ఖోస్లా కామెంట్స్‌పై నిర్మాత కరణ్ జోహార్ రియాక్ట్ అయ్యారు. నిశ్శబ్దమే మూర్ఖులకు సరైన సమాధానమంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు.

తాజాగా కరణ్ జోహార్ కామెంట్స్‌పై నటి దివ్య రియాక్ట్ అయింది. కరణ్ పేరు ప్రస్తావించనప్పటికీ అతని పోస్ట్‌పైనే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దివ్య కాస్తా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మీకు సిగ్గు లేకుండా ఇతరులకు చెందిన వాటిని దొంగిలించడం అలవాటు.. మీరు ఎల్లప్పుడూ మౌనంగానే ఆశ్రయం పొందుతారు. మీకు వెన్నెముకే కాదు.. అలాగే వాయిస్ కూడా లేదంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ప్రస్తావించింది.

జనాన్ని పిచ్చోళ్లను చేయొద్దు

కాగా.. అంతకుముందు ఆడియన్స్‌ను ఫూల్‌ చేయొద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ పోస్టుకు తను థియేటర్‌లో జిగ్రా సినిమా చూస్తున్న ఫోటోను జత చేసింది. అందులో థియేటర్‌ హాల్‌ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలియాపై దివ్య ఖోస్లా విరుచుకుపడటానికి రెండు కారణాలున్నాయి. ఆలియా 'జిగ్రా'.. దివ్య నటించిన 'సవి' సినిమాను పోలి ఉంది. దీంతో సవి మూవీని ఆలియా కాపీ కొట్టిందన్న కామెంట్లు వినిపించాయి. మరొకటి... శుక్రవారం నాడు జిగ్రాతో పాటు 'విక్కీ విద్యా కో వో వాలా వీడియో' సినిమా రిలీజైంది. ఈ మూవీకి టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించాడు. బహుశా ఈ కోపంతోనే తను అలా విరుచుకుపడి ఉండవచ్చని పలువురూ భావిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement