ఆలియా భట్ భారీ యాక్షన్ మూవీ జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 11న హిందీతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో సత్య పాత్రలో ఆలియా భారీ యాక్షన్ సీన్స్‌లో మెప్పించినప్పటికీ కథలో పెద్దగా బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలను మిగిల్చింది. ఆలియా భట్ తమ్ముడి పాత్రలో వేదాంగ్ అద్భుతంగా నటించారు.
అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన జిగ్రా సినిమాను కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించారు. అయితే, జిగ్రా ఓటీటీలో విడుదల కానున్నట్లు చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే, డిసెంబర్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. హిందీతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలోనూ విడుదల కానుంది.
జిగ్రా కోసం సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. అయితే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 30 కోట్ల లోపే కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. జిగ్రాతో రూ. 60 కోట్లకు పైగానే నిర్మాతలు నష్టపోయినట్లు సమాచారం. జిగ్రా తర్వాత మరో రెండు సినిమాల్లో అలియా భట్ నటిస్తుంది. అల్ఫా, లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్‌లలో ఆమె భాగం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment