
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’(Mazaka) . ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదని చెప్పినట్లుగాను ఈ మూవీ ఉంటుంది. పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్( Rao Ramesh), రీతూవర్మ(Ritu Varma), అన్షు ప్రధాన పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించారు.
మజాకా సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సినిమా వినోదాత్మకంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సందీప్ కిషన్, 'మన్మథుడు' పేమ్ అన్షు భారీగానే కష్టపడ్డారు. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ డీల్ మాత్రం మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది.

కథేంటంటే..
వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.
మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment