Rao Ramesh
-
'మజాకా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
బ్యాచిలర్స్ కోసం జోరు పెంచిన 'సందీప్ కిషన్'
సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మజాకా' (Mazaka Movie) నుంచి బ్యాచిలర్స్ కోసం అదిరిపోయే సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్‌ను మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. (ఇదీ చదవండి: 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. ప్రియుడిని ప్రకటించిన 'అభినయ')ఈ చిత్రంలో రీతూవర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. రావు రమేశ్, అన్షు కీలకపాత్రలు పోషించారు. నాగార్జునతో మన్మథుడులో నటించిన అన్షు (Anshu Ambani) చాలా కాలం తర్వాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇస్తుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ధనుంజయ్ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సహ–నిర్మాత: బాలాజీ గుత్తా ఉన్నారు.'మజాకా' సినిమా కోసం సుమారు రూ. 30 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, జీ స్టూడియోస్ వారు కేవలం ఓటీటీ హక్కులను 20 కోట్లకు సొంతం చేసుకున్నారని ప్రచారం ఉంది. ఇదే నిజమైతే.. సందీప్ కిషన్ సినిమాకు భారీ డీల్ సెట్ అయినట్లే అని చెప్పవచ్చు. థియేటర్ రన్లో రూ. 10 కోట్లు రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పవచ్చు. -
ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రావు రమేశ్ అంటే సహాయ పాత్రలు, విలన్ పాత్రలే గుర్తొస్తాయి. తనదైన యాక్టింగ్‌తో తెలుగులో ఓ మార్క్ సృష్టించాడు. ఇన్నాళ్లు ఇతడు సైడ్ క్యారెక్టర్స్ చేశాడు. కానీ రీసెంట్గా హీరోగానూ మెప్పించాడు. ఈయన్ని ప్రధాన పాత్రధారిగా పెట్టి 'మారుతీనగర్ సుబ్రమణ్యం' అనే మూవీ తీశారు. గత నెలల్లో థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయింది.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)రావు రమేశ్ లీడ్ రోల్ చేసిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమాని మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథతో తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు సెప్టెంబరు 20 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.'మారుతీనగర్ సుబ్రమణ్యం' విషయానికొస్తే.. మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కోర్టు స్టే వల్ల అది హోల్డ్‌లో ఉండిపోతుంది. గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని పట్టుబట్టి ఖాళీగా ఉండిపోతాడు. ఊరి నిండా అప్పులు. ఇలా జీవితం సాగిస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో ఓ రోజు రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇవి వేసింది ఎవరు వేశారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)We got the laughter therapy you need!The biggest family entertainer of the year#MaruthiNagarSubramanyam premieres on Aha on the 20th!@lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/JZWAfCeklh— ahavideoin (@ahavideoIN) September 13, 2024 -
టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేసింది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుందని పోస్ట్ చేసింది. మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారంటూ ఆహా ట్వీట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. Madam, Sir twaralo #aha lo sandadi cheyyabotunnaru. Get ready to laugh out loud! 🤣 The hilarious #MaruthiNagarSubramanyam is coming soon to #aha! @lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/AWx0p6Bjuy— ahavideoin (@ahavideoIN) September 10, 2024 -
'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదుఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.ఎవరెలా చేశారు? రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
నాకు ఇష్టమైతేనే వస్తా: అల్లు అర్జున్
‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ . సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్‌గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. అయినా తబితగారు స్వతహాగా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. రావు రమేష్‌గారి లాంటి నటుడు ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఈ మధ్య చిన్న చిత్రాలకు జనాలు థియేటర్స్‌కి వస్తుండటం మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ శుక్రవారం కూడా కొనసాగాలి. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. గత ఏడాది నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఈ ఏడాది ‘కాంతార’ కి వస్తే బాగుండు అనుకున్నా. రిషబ్ శెట్టిగారికి వచ్చినందుకు అభినందనలు. నిత్యామీనన్ మంచి నటి. నాకు మంచి ఫ్రెండ్. తనకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ‘కార్తికేయ 2’ మూవీ యూనిట్‌కి, జానీ మాస్టర్‌కి కూడా అభినందనలు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావడం వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్దది అయిపోయింది. బన్నీ ఎప్పుడూ కూడా తాను స్టార్ అనుకోడు.. నేను బాగా నటించాలన్నదే తన లక్ష్యం. ఓ స్టార్ హీరో నటించడమే గొప్ప విషయం అనుకుంటే గనక.. గొప్పగా నటించే రావు రమేశ్‌కూడా బిగ్గెస్ట్ స్టార్. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లలో నాకు సరైన స్క్రిప్ట్ దొరికిందని నమ్మి, ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను’’ అని రావు రమేష్ చెప్పారు. ‘‘ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు, ఆయ్’ వంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ కోవలో మంచి కథతో వస్తున్న మా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా ఆదరించాలి’’ అన్నారు తబితా సుకుమార్. ఈ వేడుకలో నిర్మాతలు మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
అల్లు అర్జున్‌తో కలిసి పని చేశా: అంకిత్ కొయ్య
రావు రమేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు.సినిమాల్లోకి వద్దన్నారుమాది విశాఖ. మా నాన్నగారు టీచర్. మా తాతయ్య గారు హెడ్ మాస్టారుగా రిటైర్ అయ్యారు. సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు నో అన్నారు. వన్ ఇయర్ ట్రై చేస్తా. అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్టు ఉద్యోగం చేస్తా అని చెప్తే సరే అన్నారు. ఏడాదిలోపే 'మజిలీ' చేసే ఛాన్స్ వచ్చింది. అది విడుదల అయ్యే టైంకి మరో రెండు నెలల్లో 'జోహార్' చిత్రీకరణకు వారణాసి వెళ్లాలని కబురు వచ్చింది. నాగశౌర్య గారి 'అశ్వత్థామ'లో నటించాను. రైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేశా. అల్లు అర్జున్ మా అన్నయ్యఆ తర్వాత 'తిమ్మరుసు', 'శ్యామ్ సింగ రాయ్', 'సత్యభామ', రీసెంట్ 'ఆయ్'తో పాటు ఇంకొన్ని సినిమాల్లో నటించాను. కాలేజీలో ఉండగా అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు. మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. అల్లు ఫ్యామిలీకి, నాకు కనెక్షన్ ఉందేమోఈ మూవీ ట్రైలర్ చూసి అల్లు అరవింద్.. 'ఏవయ్యా... నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నావ్ అంట. తెలిసింది' అని సరదాగా అన్నారు. అల్లు ఫ్యామిలీకి, నాకు ఏదో కనెక్షన్ ఉందేమో! అల్లు అర్జున్ గారితో 'ఓఎల్ఎక్స్' యాడ్ చేశా. అల్లు అరవింద్ గారి బ్యానర్ లో 'ఆయ్' చేశా. ఈ 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అల్లు ఫ్యామిలీ మెంబర్ అని చెప్పే రోల్ చేశా. 'ఆయ్' మంచి విజయం సాధించింది. అది 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అన్నారు. -
తప్పు తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది: డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి అలాంటి తప్పు జగరకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’’ కథ రాసుకున్నాను. ఆ తర్వాత ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా రావు రమేశ్ గుర్తుకు వచ్చారు. ఆయన సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చేయరేమో అని చాలా మంది చెప్పారు. అయితే ఒక్కసారి కథ చెప్పి చూద్దాం అని ఆయనను సంప్రదించాను. ఫస్ట్ డైలాగ్ చెప్పిన వెంటనే నవ్వేశాఉ. 15,20 నిమిషాల్లో కథ వివరించా. వెంటనే రావు రమేశ్ ఓకే చేశారు’ అని అన్నారు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఆయన దర్శకత్వంతో రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మారుతి నగర్ సూర్య’. హర్ష వర్దన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఎందుకిలా' వెబ్ సిరీస్‌తో నేను దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.→ ఈ సినిమాలో రావు రమేష్ , అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.→ ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.→ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.→ సుకుమార్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను -
'ఏంటి సుబ్రమణ్యం పొద్దున్నే పూజ మొదలెట్టావా?.. ఆసక్తిగా ట్రైలర్!
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల. మోహన్ కార్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా వర్చువల్‌గా విడుదల చేశారు. 'ఏంటి సుబ్రమణ్యం పొద్దున్నే పూజ మొదలెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది.. ఏ బ్రాండో' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'నీకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు' అని అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో రావు రమేశ్ యాక్షన్, డైలాగ్, ఫుల్ కామెడీ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. కాగా.. సినిమాను ఆగస్టు 23న ఈ సినిమా విడుదల కానుంది. -
అల్లు అర్జున్ సినిమా సీన్లు రీక్రియేట్ చేస్తూ సాంగ్ విడుదల
రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే'ను ఇవాళ విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.'మేడమ్ సార్ మేడమ్ సార్'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు. 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''టైటిల్ పాత్రలో రావు రమేష్ లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ 'నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం'కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'జోహార్', 'తిమ్మరుసు', 'మజిలీ', 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు. -
రావు రమేష్, ఇంద్రజల 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సరికొత్తగా పోస్టర్ లాంచ్
రావు రమేష్ కథానాయకుడిగా... పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రంలో నటి ఇంద్రజ ఆయన సరసన నటించడం విశేషం. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. 'ఎప్పుడూ సగం సగం ఎంటర్టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆయనతో పాటుగా భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య. -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్‌గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్‌గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
Extra Ordinary Man Movie Wallpapers: నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ స్టిల్స్
-
ఈ మూవీలో నా క్యారెక్టర్ ఎక్స్ట్రా ట్రార్డినరీ గా ఉంటుంది
-
ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!
టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరిస్తున్న రావు రమేశ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్ రోల్స్‌లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. వీకే నరేశ్ మళ్ళీ పెళ్లి హీరోగా వీకే నరేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై వీకే నరేశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. మారుతీనగర్‌లో రావు రమేశ్ విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్‌కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచాయి. -
హీరోగా మారిన రావు రమేశ్.. క్షణం క్షణం ట్విస్టులే
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు(ఫిబ్రవరి 24) సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు. -
Leharaayi Movie Review : 'లెహరాయి' మూవీ రివ్యూ
హీరో రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటించిన చిత్రం 'లెహరాయి'. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో రామకృష్ణ పరమహంస దర్శకత్వం వహించారు. ఎస్.ఎల్.ఎస్.పతాకంపై మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. లెహరాయి బేసిక్‌గా తండ్రి కూతుళ్ళ మధ్య కథ. మేఘన(సౌమ్య మీనన్)ని తండ్రి( రావు రమేష్) ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఎంతలా అంటే… తనకు రెండో సంతానం కూడా వద్దు అనేంతగా గారాబంగా పెంచుతాడు. మేఘన కూడా తండ్రి కోరుకున్న విధంగానే ప్రేమకు దూరంగా ఉంటూ వస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల తన క్లాస్ మేట్ అయిన కార్తీక్(రంజిత్)ని ప్రేమిస్తుంది. ఈ విషయం వేరే వ్యక్తుల ద్వారా మేఘన తండ్రికి తెలుస్తుంది. మరి చివరికి ఏం జరిగింది? కూతురి ప్రేమను తండ్రి అంగీకరిస్తాడా? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. … ఇందులో హీరోగా నటించిన రంజిత్ స్టూడెంట్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. సౌమ్య మీనన్ సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే కుర్రకారును ఆకట్టుకుంటుంది. రావురమేష్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాడు. తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే సెంటిమెంట్ డ్రామా బాగా పండింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ నటన ఆకట్టుకుంటుంది. గగన్ విహారి విలనిజం బావుంది. మిగ్రతా పాత్రధారులు తమ పాత్రల పరిధి వరకు బాగానే చేశారు. కథ,కథనం.. విశ్లేషణ: తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కే సినిమాలు వెండితెరపై ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. గతంలో ఇదే ఫార్మాట్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ కథ, కథనంలో కొత్తదనం చూపిస్తే ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తాయి. కూతురే సర్వస్వం అని ఫీలయ్యే తండ్రికి ఆ అమ్మాయి కాలేజీలో ఓ అబ్బయిని ప్రేమించడం, అది తెలిసి తండ్రి ఎలా రియాక్ట్ అయ్యాడన్నదే కథ. అయితే తండ్ర-కూతుళ్ల మధ్య భావేద్వేగాలపై దర్శకుడు మరికాస్త ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. కొన్ని పాత్రలు అవసరం లేకున్నా కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది. ఆలీ, సత్యం రాజేష్ లాంటి వారితో కామెడీని పండించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం
ప్రముఖ నటుడు రావు రమేశ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా రావు రమేశ్ పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్గా ఆయన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మేకప్‌మ్యాన్ కుటుంబానికి రూ. 10లక్షల చెక్ అందించి ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు ఏ అవసరం వచ్చిన తాను ఉన్నానని, వారికి తన సాయం ఎప్పడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక రావు రమేశ్ దయా హృదయం చూసి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్ నటి తమ వద్ద పనిచేసే కళాకారులను, కార్మికులను పెద్ద నటులు, నిర్మాతలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి మీరు స్ఫూర్తి అంటూ రావు రమేశ్‌ను కొనియాడుతున్నారు. కాగా అలనాటి సీనియర్ నటులు రావు గోపాలరావు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయనటుడిగా ఎలాంటి పాత్రల్లోనైన ఇట్టే ఒదిగిపోతూ ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంటున్నారు. ఇక తాజాగా తన మేకప్ అర్టిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి మరోసారి అభిమానులు మనసు గెలుచుకున్నారు ఆయన. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. -
షాకింగ్ : హీరోకు సమానంగా రావు రమేష్ రెమ్యునరేషన్
Rao Ramesh Remuneration: ప్రముఖ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ నటుడు రావు గోపాలరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడగుపెట్టినా నటుడిగానే గుర్తింపు సంపాదించుకున్నారు. గమ్యం, కొత్త బంగారు లోకం వంటి పలు సినిమాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ నాయట్టు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేష్ ప్రముఖ పాత్రలోకనిపించనున్నారట. ఇందుకు గాను ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి ఉండటంతో ఈ సినిమా కోసం ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రెమ్యునరేషన్ విషయంలో ఇది రికార్డ్ అనే చెప్పవచ్చు. స్టార్లకు సమానంగా రావు రమేష్ పారితోషికం అందుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించనున్న ఈ సినిమా త్వరలోనే స్క్రిప్టు పనులు పూర్తి చేసి సెట్స్ పైకి వెళ్లనుంది. -
Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్‌లుక్ వైరల్
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా - సిద్దార్ధ్ - అదితి - అనూ ఇమాన్యూయేల్ - జగపతిబాబు ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న రావు రమేశ్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఆయన పుట్టిన రోజు(మే 25)సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో రావు రమేశ్ టక్ చేసుకొని సీరియస్‌గా చూస్తున్నాడు. ఇందులో గూని బాబ్జీగా రావు రమేశ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పేరుకు తగ్గట్టే ఆయన గూని తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర వ్యంగ్యంగా సాగుతూ నెగెటివ్ టచ్ ఉంటుందట. యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. Wishing the Incredibly Versatile Actor #RaoRamesh garu a Very Happy Birthday! Introducing him as #GooniBabji from our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @aditiraohydari @ItsAnuEmmanuel @chaitanmusic @DirAjayBhupathi @AnilSunkara1 @AKentsOfficial @SonyMusicSouth pic.twitter.com/l0BBWyq6Ny — AK Entertainments (@AKentsOfficial) May 25, 2021 చదవండి: KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది -
KGF Chapter 2: రావు రమేశ్ లుక్ వచ్చేసింది
కన్నడ స్టార్ యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. 2018లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన‘కేజీఎఫ్’సినిమాకు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను కేజీఎఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేకర్స్ అభిమానులతో పంచుకుంటున్నారు . Wishing our #KannegantiRaghavan, #RaoRamesh sir a very Happy Birthday.#KGFChapter2. pic.twitter.com/3iFBNK4EFx — Hombale Films (@hombalefilms) May 25, 2021 తాజాగా టాలీవుడ్ నటుడు రావు రమేశ్ పుట్టినరోజు(మే 25) సందర్భంగా తన రోల్‌పై స్పెషల్ మ్యాగజైన్ రిలీజ్ చేసింది కేజీఎఫ్ టీమ్. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం . ఈ చిత్రంలో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర పోషిస్తున్నారు. రాకీ కేసును డీల్ చేసే సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ 'అధీరా' పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. -
నిన్న రావు రమేష్.. నేడు ఉత్తేజ్
హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సినీ సెలబ్రెటీల పేరుతో నకిలీ అకౌంట్లను సృష్టించి వివాదస్పద పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు రావు రమేశ్ పేరుతో ట్విటర్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, టాలీవుడ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై వివాదస్పదంగా ట్వీట్లు చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ట్వీట్లపై రావు రమేశ్ స్పందించారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. తాజాగా నటుడు ఉత్తేజ్ కూడా నకిలీ అకౌంట్ల సమస్య బారిన పడ్డారు. ఆయన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి పలు అభ్యంతకర పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్లపై ఉత్తేజ్ స్పందించారు. ‘నమస్తే!! సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో నాకు ట్విటర్ అకౌంట్ లేనే లేదు. నా పేరుతో వస్తున్న తప్పుడు వార్తల్ని ఖండిస్తున్నాను. సంఘంలో ఓ అస్తిత్వం, వ్యక్తిత్వం లేని వాళ్లు మాత్రమే ఇలాంటి చీప్ ట్రిక్స్ తో వాగుతుంటారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఉత్తేజ్ మీడియాకు వివరించారు. ఇక నకిలీ ఆకౌంట్లపై టాలీవుడ్ ప్రముఖులు అందోళన చెందుతున్నారు. నకిలీ ఖాతాలను నియంత్రించేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్ మహేశ్ సర్ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్ -
ట్విటర్ పోస్టులపై క్లారిటీ ఇచ్చిన రావు రమేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన సోషల్ మీడియా పోస్టులపై సినీ నటుడు రావు రమేష్ స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఎటువంటి అకౌంట్స్ లేవని ఆయన స్పష్టం చేశారు. ‘సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చిన పోస్టులకు నాకెలాంటి సంబంధం లేదు. నా పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి.. పోస్టులు చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’అని రావు రమేష్ మీడియాకు వెల్లడించారు. కాగా, రావు రమేష్ పేరుతో ట్విటర్లో వస్తున్న పోస్టింగుల నేపథ్యంలో.. సదరు ట్విటర్ ఖాతాకు అఫీషియల్ గుర్తింపు లేకపోవడంతో పలువురు ఆయనను సంప్రదించారు. దాంతో తాను ఎలాంటి ట్వీట్లు చేయలేదని, అసలు తనకు సోషల్ మీడియా ఖాతాలేవీ లేవని రావు రమేష్ వెల్లడించారు. -
‘కేజీఎఫ్-2’ కీలక పాత్రలో రావు రమేష్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సౌత్ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో యశ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వేల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో అందరి చూపు రెండవ భాగం చాప్టర్-2 పైనే ఉంది. దీంతో సెంకడ్ పార్టులో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్లు మెరవబోతున్నారు. ఇప్పటికే పవర్‌పుల్ యాక్టర్ సంజయ్‌దత్ విలన్ అధీర పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రవీనా టాండన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. (రవీనా ఆగయా) Welcome on board Rao Ramesh sir. We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen. Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm — Prashanth Neel (@prashanth_neel) February 10, 2020 కాగా ప్రస్తుతం కేజీఎఫ్-2లో టాలీవుడ్ వర్సటైల్ నటుడు రావు రమేష్ నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘కేజీఎఫ్-2 షూటింగ్‌కు స్వాగతం. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. కేజీఎఫ్-2లో భాగస్వామ్యమైనందుకు రావు రమేష్‌కు థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పాత్ర తెరపై ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
ఆట ఆరంభం
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశాం. ఆ నెక్ట్స్ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. -
బంధాలను గుర్తు చేసేలా...
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నటులు సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్‌లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్ ఉన్న లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
బన్నీ సినిమా నుంచి రావు రమేష్ అవుట్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్ నటుడు రావూ రమేష్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రావు రమేష్ తప్పుకోవటం వెనకు ఎలాంటి వివాదాలు లేదు. కేవలం డేట్స్ సర్దుబాటు కానీ కారణంగానే ఆయన తప్పుకున్నారట. ముందుగా అనుకున్న సమయం కన్నా షూటింగ్ ఆలస్యం కావటంతో రావు రమేష్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో ఆయన స్థానంలో హర్షవర్దన్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సుశాంత్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
-
‘ఓ బేబీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఓ బేబీ జానర్ : ఫాంటసీ కామెడీ డ్రామా తారాగణం : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్, తేజ సంగీతం : మిక్కీ జే మేయర్ దర్శకత్వం : నందినీ రెడ్డి నిర్మాత : సురేష్ బాబు, సునితా తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యూన్వూ థామస్ కిమ్ పెళ్లి తరువాత విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న సమంత, తాజాగా చేసిన మరో ప్రయోగం ఓ బేబీ. వృద్ధురాలైన ఓ మహిళకు తిరిగి యవ్వనం వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న పాయింట్‌ను ఎంటర్టైనింగ్ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు నందిని రెడ్డి. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? బేబీ పాత్రలో సమంత మెప్పించారా? కథ : సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన సావిత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇది పూర్తిగా సమంత సినిమా. తన బాడీ లాంగ్వేజ్‌కు, ఎనర్జీకి తగ్గ పాత్రలో సమంత జీవించారనే చెప్పాలి. బేబి పాత్రలో మరో నటిని ఊహించుకోలేనంతగా సమంత మెప్పించారు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ సమంత అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. సినిమా బాధ్యత అంతా తన భుజాల మీదే మోసిన సమంత వందశాతం సక్సెస్ అయ్యారు. కీలక పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కూడా జీవించారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, రావూ రమేష్‌లు తమకు అలవాటైన పాత్రల్లో అలవోకగా నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, సమంత కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి తరువాత సక్సెస్ వేటలో వెనుకపడ్డారు. దీంతో లాంగ్ గ్యాప్ తరువాత సమంత ప్రధాన పాత్రలో కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో రీమేక్ చేశారు. రెగ్యులర్ లేడీ ఓరియంటెడ్ సినిమాల తరహాలో కాకుండా ఓ ఫన్ రైడ్‌లా సినిమాను తెరకెక్కించిన నందిని సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సూపర్బ్‌గా వర్క్ అవుట్ అయ్యింది. తొలి భాగాన్ని ఎంటర్టైనింగ్గా నడిపించిన దర్శకురాలు ద్వితీయార్థం ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో నడిపించారు. ఎంటర్టైన్మెంట్ కాస్త తగ్గటం, కథనం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు సాగడంతో సెకండ్ హాఫ్ కాస్త లెంగ్తీగా అనిపిస్తుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. సినిమాకు మరో ప్రధాన బలం లక్ష్మీ భూపాల్ అందించిన సంభాషణలు. డైలాగ్స్ నవ్వులు పూయిస్తూనే, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడనే చెప్పాలి. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కపాట కూడా లేకపోవటం నిరాశపరిచే అంశమే. నేపథ్య సంగీతం పరవాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్ఫుల్గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. ఎడిటింగ్ పరవాలేదు. ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌కు కత్తెర పడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత పర్ఫామెన్స్ ఫస్ట్ హాఫ్ కామెడీ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాప్ లెంగ్త్ సంగీతం సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
మా ఇద్దరి ఒప్పందం అదే
‘‘సాధారణంగా అందరం మన అమ్మలను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. కసురుతాం.. విసుక్కుంటాం. అయినా అమ్మ మనకు చాలా ప్రేమను పంచుతారు. మనమందరం తల్లులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదేమో? ‘ఓ బేబీ’ సినిమాలో ఈ పాయింట్‌ని చూపించాం. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి అన్నారు. సమంత లీడ్ రోల్లో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. సునీత తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానుంది. నందినీ రెడ్డి పలు విశేషాలు పంచుకున్నారు. ► కొరియన్ చిత్రం ‘మిస్. గ్రానీ’ చూస్తున్నంత సేపు నేను చాలా కనెక్ట్ అయ్యాను. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. అందరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. కథలో క్వాలిటీ ఉంది. బెస్ట్ యాక్టర్స్ ఈ సినిమాలో పని చేశారు. లక్ష్మిగారు, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్‌గారు, సమంత అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. డైరెక్షన్లో నేను చే సిన చిన్నచిన్న తప్పులు కూడా వాళ్ల అద్భుతమైన యాక్టింగ్‌తో కవర్ చేసేశారు. ► ఆర్టిస్ట్‌కి కథ ప్లస్ అయ్యే సినిమాలు కొన్ని.. కథకు ఆర్టిస్ట్ ప్లస్ అయ్యే సినిమాలు మరికొన్ని. ‘ఓ బేబీ’ రెండు విభాగాల్లోకి వస్తుంది. ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ విందు భోజనంలా ఉంటారు. సినిమాలో బేబక్క పాత్ర చాలా కీలకం. లక్ష్మీగారు అద్భుతంగా చేశారు. ఆమె ఒప్పుకోకపోయి ఉంటే ఈ సినిమాను చేసేవాళ్లం కాదేమో? ఈ పాత్రకు ఆప్యాయత, వెటకారం అన్నీ ఉండాలి. లక్ష్మీగారే కరెక్ట్ అని భావించాం. ► రీమేక్‌తో వచ్చిన చిక్కేంటంటే సినిమా సరిగ్గా రాకపోతే పాడు చేశారు అంటారు. హిట్ అయితే అలానే తీశారు.. హిట్ అయిపోయింది అంటారు. రీమేక్స్‌తో ఎక్కువ పేరు సంపాదించడం కొంచెం కష్టం. నా సినిమాలన్నీ 50 రోజుల్లోనే పూర్తి చేస్తాను. కానీ సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది? అని అడుగుతుంటారు. ఒక్కోసారి ఐడియా స్టేజిలో బావుంటుంది. కథ రాశాక నచ్చకపోవచ్చు. అలా లేట్ అవుతూ సినిమా సినిమాకు గ్యాప్ వస్తుంది. ఈసారి నుంచి అలా జరగుకుండా చూసుకుంటాను. ► ఈ సినిమాకు సమంత కేవలం యాక్టర్‌గానే కాకుండా అన్ని బాధ్యతలూ చూసుకున్నారు. ‘నువ్వేదైనా తప్పు చేస్తుంటే నేను చెబుతా.. నేనేదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు.. మన మధ్య ఈగో అనేది అడ్డురాకూడదు అని సినిమా స్టార్ట్ అవ్వక ముందే సమంత–నేను ఒప్పందం చేసుకున్నాం(నవ్వుతూ). ► దర్శకురాలిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. యాక్షన్ కామెడీ, స్పోర్ట్స్ సినిమాలు చేస్తాను. ప్రస్తుతం వైజయంతీ బ్యానర్లో ఓ సినిమా చేయాలి. రెండు కథలున్నాయి. అందులో మల్టీస్టారర్ సినిమా ఒకటి. వెబ్ సిరీస్‌ల ట్రెండ్ కూడా బాగా పెరుగుతోంది. ఇంకా స్టార్టింగ్ స్టేజిలోనే ఉంది. వెబ్ థియేటర్‌కి హాని చేస్తుందా? అంటే చెప్పలేం. ► ‘ఓ బేబీ’ సినిమా పూర్తయ్యాక అమ్మ మీద కసురుకోవడం కొంచెం తగ్గింది. ఒకవేళ బేబీలా నేను మళ్లీ వయసులో వెనక్కి వెళితే సినిమాలు కాకుండా వేరే ప్రొఫెషన్ని కూడా ట్రై చేస్తానేమో? ఇండస్ట్రీలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ మెల్లిగా ఆ సంఖ్య పెరగాలి. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘ఓ బేబీ’ సినిమా సెట్లో మహిళా సాంకేతిక నిపుణుల సంఖ్య కొంచెం పెరిగింది. మహిళలు ఉండాలనే ఉద్దేశం కంటే కూడా వాళ్ల ప్రతిభని గుర్తించే తీసుకున్నాం. -
మంచి సినిమాలే చేయాలనుకున్నా
‘‘సురేశ్ ప్రొడక్షన్స్ స్థాపించిన 55ఏళ్లలో తొలిసారి ఓ మహిళా డైరెక్టర్‌తో సినిమా చేశాం. నందినీతో ఎప్పుడో సినిమా చేయాల్సింది కానీ చేయలేకపోయాం. ఇప్పుడు కూడా నలుగురు నిర్మాతలు యూనిట్ అయ్యి ‘ఓ బేబీ’ సినిమా తీశాం’’ అని డి.సురేశ్‌బాబు అన్నారు. సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య తారలుగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. సురేశ్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఓ బేబి’ సినిమాకి ఎక్కువగా లేడీ యూనిట్ పనిచేశారు. ఫస్ట్ టైమ్ నా బంధువు, నా ఫ్యామిలీ మెంబర్‌తో(సమంత) ఈ సినిమా చేశా. ఇంతకుముందు మా ఇంట్లో అబ్బాయిలు మాత్రమే సినిమాలు చేసేవారు ఇప్పుడు అమ్మాయి కూడా చేసేసింది. వెంకటేశ్, చైతన్య, రానా.. ఇప్పుడు సమంత. ఈ సినిమాని కొరియా హక్కులు కొని రీమేశాం. మన సినిమాలు కూడా తొందర్లో కొని ఫారిన్లో రీమేక్ చేస్తారు. ఇది మంచి ట్రెండ్’’ అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌గా నాకు ఫస్ట్ చెక్ ఇచ్చింది సురేశ్సారే.. సురేశ్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా రావాల్సింది కానీ జరగలేదు. నా నాలుగో సినిమా ఈ ప్రొడక్షన్లో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది యూనివర్శల్ స్టోరీ. ఇప్పటి వరకూ సమంత చేసిన పాత్రలకంటే ‘ఓ బేబి’ లో ఎక్కువ షేడ్స్ కనిపిస్తాయి’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘అదృష్టం అనేది ఉండొచ్చు. అయితే ‘మంచి సినిమాలు చేయాలి.. లేకపోతే ఇంట్లో కూర్చోవాలి’ అని నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. దాని తర్వాత వచ్చిన సినిమాలే ‘రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, మజిలీ’. నాకు ఓ చిన్న బాధ ఉండేది. నేను రిటైర్ అయ్యేలోపు ఓ పూర్తిస్థాయి వినోదాత్మక సినిమా చేయాలని. ‘ఓ బేబీ’ ద్వారా నాకు ఆ ఆశ తీరింది. ఈ సినిమా సురేశ్ ప్రొడక్షన్లో చేయడం సంతోషంగా ఉంది. సురేశ్‌గారు ఫోన్ చేసి సీన్స్ ఎలా వచ్చాయి అని అడిగేవారు. దీంతో నాకు ఓ బాధ్యత అనిపించి ఎడిటింగ్ రూమ్‌కి వెళ్లి రషెస్ చూసుకునేవాణ్ణి. ఈ సినిమా నాకు ఓ పాఠం నేర్పింది. ఈ సినిమా నా కెరీర్లో ఓ స్పెషల్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సునీత, నటుడు తేజ పాల్గొన్నారు. -
అల్లూరి నేషనల్ హీరో – సి. సునీల్‌కుమార్
‘‘స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజుగారిని ఒక ప్రాంతీయ హీరోగా కాకుండా జాతీయ హీరోగా చూపించాలనే ఆలోచనతో ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్’ అనే సినిమా చేయబోతున్నాం’’ అని దర్శకుడు పి. సునీల్‌కుమార్ రెడ్డి అన్నారు. రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ సమర్పణలో శ్రావ్య ఫిల్మ్స్ సహకారంతో పి. సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సీతారామరాజు: ది ట్రూ వారియర్’. ఈ సినిమా విశేషాల గురించి హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో పి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘జాతీయ చరిత్రలో అల్లూరి సీతారామరాజుగారికి సముచితమైన స్థానం దక్కకపోవడం తెలుగువారి దురదృష్టం అనుకోవాలి. ఈ సినిమాలో రావు రమేష్, ఎల్బీ శ్రీరామ్, జీవా, షఫీ లాంటి నటులతో పాటు తమిళ, హిందీ నటీనటులు నటిస్తారు. యూరోపియన్ యాక్టర్స్‌ను కూడా తీసుకున్నాం. నా కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం. జూన్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటుటన్నాం’’ అని అన్నారు. ‘‘అల్లూరి సీతారామరాజు బయోపిక్ నిర్మించడం ఆనందంగా ఉంది. రిసాలి ఫిల్మ్ అండ్ స్టూడియోస్‌తో సినిమా రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. మంచి సౌకర్యాలతో వైజాగ్‌లో ఏర్పాటు చేశాం. అకాడమీ స్టూడెంట్స్‌కు ఈ సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇస్తున్నాం. ఈ ఏడాదిలోనే రెండు సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. కన్నడలో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇందుకు సునీల్‌కుమార్ బాగా సహకరిస్తున్నారు’’ అన్నారు అకాడమీ ప్రతినిధి కె. శ్రీనివాస్. ‘‘ గతంలో మేం తీసిన చిత్రాలు బాగా ఆడాయి. నంది అవార్డులు తెచ్చిపెట్టాయి. రిసాలి ఫిల్మ్ అకాడమీతో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు రవీందర్. -
యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించే చిత్రం : రావు రమేశ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మహానేత వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలేనని తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవకు అభినందనలు. ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమా చూసి రాత్రంతా ఆ మహానేత గురించే ఆలోచించాను. సినిమాలోని ప్రతీ సీన్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి అంతరాత్మను తాకే సినిమా ఇది. ముఖ్యంగా యాత్రలో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనస్సును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్‌ను ఆయన మోసిన విధానం అద్భుతం. మహీ తీసిన విధానం, మ్యూజిక్, సిరివెన్నల సీతారమశాస్త్రి ‘పల్లెల్లో కళ ఉంది.. పంటల్లో కలిముంది’ అనే లిరిక్స్ కదిలించాయి. రోజు పేపర్లో రైతుల ఆత్మహత్యలు చూసి మొండిగా తయారయ్యాం. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మంచి సినిమా. ఈ అనుభూతిని వర్ణించలేను. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. నిన్న చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. చాలా తృప్తినిచ్చిన పాత్ర. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తన అనుభూతి పంచుకున్నారు. -
సినిమా చూసిన తర్వాత ఆ మహానేత ఆలోచనలే
-
బేబీ ముస్తాబవుతోంది
పెళ్లయిన హీరోయిన్స్‌కు కెరీర్ సాగడం కష్టం అనే అపోహను ఈ ఏడాది నాలుగు సూపర్ హిట్స్ (రంగస్థలం, మహానటి, యు టర్న్, అభిమన్యుడు)తో బద్దలు కొట్టారు సమంత. అంతే కాదు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వచ్చే ఏడాదిని ప్లాన్ చేసేశారు కూడా. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ చిత్రం ‘మిస్ గ్రానీ’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు సమంత. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇందులో సమంత 70 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనున్నారు. దీని కోసం పూర్తిస్థాయి ప్రోస్థెటిక్ మేకప్‌ను ఉపయోగిస్తున్నారట. ఇందులో సమంత తనయుడిగా రావు రమేశ్ కనిపించనున్నారట. విశేషమేంటంటే ‘అత్తారింటికి దారేది, రాజుగారి గది 2’చిత్రాల్లో రావు రమేశ్ కూతురిగా సమంత యాక్ట్ చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు యంగ్ హీరో నాగశౌర్య కనిపిస్తారట. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ‘ఓ బేబీ– ఎంత సక్కగున్నవే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
వచ్చే ఏడాది జన నేత
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జనరంజకమైన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ సినిమా తెరకెక్కింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్ 21న విడుదల కావడం లేదట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
వెలుగుతున్న క్యారెక్టర్లు
కొన్ని క్యారెక్టర్లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్లు కలర్ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ బ్రైట్ స్టోరీ. సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి దర్శక– నిర్మాతలు నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్ థౌజండ్ వాలా, హీరోయిన్ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు ఒక క్యారెక్టర్ తెచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరు. భూమిక చక్రం ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్’లో ఘోస్ట్ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. రావు రాకెట్ ‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్ డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్’ సినిమాలతో ఎట్రాక్ట్ చేసి, నటుడిగా రాకెట్ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. నవ్వుల మతాబు జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్ కామెడీ సినిమాలు నరేశ్ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్ అనే అనొచ్చు. ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్ ఓనర్ పాత్రలో నరేశ్ పేల్చిన నవ్వులకు థియేటర్ పకపకలాడింది. ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్ రంగ’, ‘దేవ దాస్’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చేసి ఆడియన్స్ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్. బిజీ బాంబ్ ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ. ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్ మీద పేల్చారు. జనవరి టు నవంబర్ సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది మా అమ్మ నా టార్చ్ బేరర్ ‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు.. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్ సీన్ అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్లోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ చేశాను. హరీష్ శంకర్ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. – రావు రమేశ్ డబుల్ సౌండ్ బాంబు హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్ సౌండ్ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్’ సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్’లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్ వల్ల ప్రత్యేకమైన వెకేషన్ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. – మురళీ శర్మ ఇంటింటా ఈశ్వరీ రజనీకాంత్.. హైడ్రోజన్ బాంబ్. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
కోలీవుడ్‌కి విలన్‌గా...
దివంగత నటులు రావుగోపాలరావుది ప్రత్యేకమైన విలనిజమ్. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారాయన. ఆయన తనయుడు రావు రమేశ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తాజాగా తమిళ చిత్రసీమలోకి విలన్‌గా అడుగుపెడుతున్నారు. ‘అఆ, ఛల్ మోహన్‌రంగ’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రమణియన్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో ప్రతినాయకుని పాత్రకు రావు రమేశ్‌ని సంప్రదించారట. ఈ కథ విని, ఎగై్జట్ అయిన రావు రమేశ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. -
RX100 రైడెర్స్
-
ఆదితో జతకట్టనున్న సురభి!
శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఆది జోడిగా సక్సెస్ఫుల్ హీరోయిన్ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
టైటిల్ వినగానే షాక్ అయ్యా – అశోక్ రెడ్డి
‘‘కథను నమ్మి తీసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడినా బూడిదలో పోసిన పన్నీరే. ట్రైలర్ చూసిన వారందరూ సినిమా హిట్ అంటున్నారు. రామ్‌కీగారు ఈ చిత్రంలో చక్కటి హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు’’ అని నటుడు రావు రమేశ్ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. కెసిడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ –‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా ట్రైలర్ కొందరికి చూపించగానే తమిళ సినిమా ట్రైలర్‌లా ఉందన్నారు. రా నేటివిటీ మూవీస్ తమిళ్, మలయాళ వాళ్ల సొంతమా? తెలుగులో తీయలేమా? అనిపించి ఈ సినిమా తీశా. మన నేటివిటీని మనం పట్టుకోం. ఎందుకంటే తెలుగు సినిమాలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల్ని దాటి వెళ్లిన సినిమా ఇది. ఇన్క్రెడిబుల్ లవ్‌స్టోరీ’’ అన్నారు. ‘‘అజయ్‌గారు నాకు స్టోరీ చెబుతూనే సినిమా చూపించేశారు. రెండు గంటలు స్టోరీ చెప్పారు. టైటిల్ ‘ఆర్ఎక్స్ 100’ అనగానే నేను షాక్. ఎందుకంటే నా లైఫ్‌లో ఫస్ట్ బైక్ అది. స్టోరీకి తగ్గ టైటిల్. యంగ్ జనరేషన్ అంతా ఈ సినిమాకి రిలేట్ అవుతారు. డైరెక్టర్ చాలా హార్డ్ వర్కర్. ఆయన్ని మేమంతా పని రాక్షసుడు అంటాం’’ అన్నారు అశోక్‌రెడ్డి. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్, నటుడు రామ్కీ తదితరులు పాల్గొన్నారు. -
రావు రమేశ్‌కు మాతృవియోగం
దివంగత నటుడు రావు గోపాలరావు సతీమణి కమలకుమారి (73) శనివారం తుది శ్వాస విడిచారు. కమలకుమారి హరికథ కళాకారిణి. ఆంధ్రపదేశ్, కర్ణాటకల్లో కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చిన ఘనత ఆమెది. దూరదర్శన్‌లో చేసిన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మంచి పేరు సంపాదించుకున్నారామె. స్వతహాగా పురాణాలను ఇష్టపడని రావు గోపాలరావు ఓ సందర్భంలో కమలకుమారి చెప్పిన హరికథ విని, తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఆమె హరికథ చెప్పే తీరుకి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ తర్వాత స్నేహితులు కొందరు ‘మీ ఇద్దరూ చక్కని ప్రతిభావంతులు. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు’ అంటే... అప్పటికే ఒకరి పట్ల మరొకరికి మంచి అభిప్రాయం ఉండటంతో వివాహం చేసుకున్నారు. భార్యను ఏనాడూ ఏకవచనంతో పిలవలేదాయన. ‘కుమార్జీ’ అని పిలిచేవారట. ఈ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమలకుమారి తెలిపారు. భర్త మరణం తర్వాత తనలో సగభాగం చచ్చుబడినట్లయిందని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో పెద్ద కుమారుడు రావు రమేశ్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రావు రమేశ్ మంచి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలకుమారి హైదరాబాదులోని స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మరణ వార్త తెలుసుకుని నటుడు చిరంజీవి స్వయంగా వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇంకా పలువురు సినీ రంగ ప్రముఖులు కమలకుమారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
రావు గోపాల్ రావు భార్య కన్నుమూత
ప్రముఖ హరికథా కళాకారిణి, ప్రముఖ నటులు రావు గోపాల్ రావు భార్య కమల కుమారి (73) ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. ఎన్నో వేదికలపై హరికథా గానం చేసిన కమల కుమార్ రావు గోపాల్ రావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొండాపూర్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. -
‘ఆర్ఎక్స్ 100’ ఫస్ట్‌లుక్
కార్తికేయ, పాయల్ రాజ్పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆర్ఎక్స్ 100 (RX 100). ప్రస్తుతం నిర్మాణాంతరకార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కేసీడబ్ల్యూ బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భావోద్వేగాలతో కూడిన సహజమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీణ్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. జూన్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆసక్తికరంగా ‘ఆర్ఎక్స్ 100’
కార్తికేయ, పాయల్ రాజ్పుట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ RX 100. ఈ చిత్రం ప్రీ లుక్‌ను హోలీ సందర్భంగా ఈ రోజు విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. KCW బ్యానర్ పై జి. అశోక్ రెడ్డి తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు రావురమేష్, సింధూర పువ్వు రాంఖీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. కబాలీ సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకు ప్రవీన్ కే ఎల్ ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఫిబ్రవరి 23న ‘హైదరాబాద్ లవ్ స్టోరి’
త్వరలో చి..ల..సౌ సినిమాతో దర్శకుడిగా మారుతున్న రాహుల్ రవీంద్రన్ హీరోగానూ ఆసక్తికర చిత్రాలు చేస్తున్నారు. రాహుల్ రవీంద్ర, రేష్మి మీనన్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’హైదరాబాద్ లవ్ స్టోరి’ ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్‌కు రెడీ అవుతోంది. జియా, రావు రమేష్, సూర్య, సనలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాజ్ సత్య దర్శకత్వం వహించారు. ఏం.ఏల్ రాజు, ఆర్.ఏస్ కిషన్, వేణు గోపాల్ కొడుమగుల్లలు సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దర్శకనిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
అమ్మమ్మగారింట్లో...
‘‘అమ్మమ్మగారి ఇల్లు అంటే జ్ఞాపకాల పొదరిల్లు. ఆప్యాయతల అల్లర్లు, సంతోషాల మధురిమలు. అవన్నీ దండిగా మా ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాలో ఉన్నాయి’’ అంటున్నారు దర్శకుడు సుందర్ సూర్య. నాగశౌర్య, బేబి షామిలి జంటగా శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ పతాకంపై సుందర్ సూర్య దర్శకత్వంలో కేఆర్ అండ్ రాజేష్ నిర్మించిన సినిమా ‘అమ్మమ్మగారిల్లు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటించా. కథను నమ్మి సినిమా చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమాతో మరింత దగ్గరవుతాను. దర్శకుడు సూర్య బాగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. నాగశౌర్య నటన హైలైట్’’ అన్నారు నిర్మాతలు. ‘‘దర్శకునిగా నాకిది తొలి సినిమా. రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా రాసుకున్న కథ ఇది’’ అన్నారు. ‘‘ఓయ్’ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతో మరో సినిమా చేయలేదు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను’’ అన్నారు షామిలి. అమ్మమ్మ పాత్రలో సుమిత్ర నటించిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, సుమన్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ రమణ. -
నాన్న స్థాయికి ఎదగడమంటే సాహసమే!
శ్రీకాకుళం, అరసవల్లి: ‘తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు అంటే ఓ చరిత్ర... ఓ నిఘంటువు. ఏదో కొన్ని సినిమాల్లో బాగా నటించి ఆడేస్తే...గొప్పోళ్లం కాదు..’అంటూ ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్ కుమార్ తనదైన శైలిలో చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాన్న రావు గోపాలరావు పేరు సినిమాతెర ఉన్నంత కాలం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సినిమాలన్నీ ఏప్రిల్‌లో ఖరారు అవుతాయని, కళామతల్లి సేవలో తనకు పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇటీవలే 100 సినిమాలు దాటాయని, అయినా నిత్య విద్యార్థిగానే ఇండస్ట్రీలో ఉంటానని తెలిపారు. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని, విభిన్న పాత్రలేవైనా చేస్తానని చెప్పారు. ఇటీవల దువ్వాడ జగన్నాధం (డిజె) సినిమాలో రొయ్యిల నాయుడు పాత్రను, గతంలో నాన్న రావు గోపాలరావు ‘ఆ ఒక్కటీ అడక్కు..’అనే సినిమాలో పోషించిన పాత్రను పోలినట్టు నటించే ప్రయత్నం చేశానని, ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. శ్రీకాకుళంలోనే పుట్టానని, తన తల్లి కుటుంబీకులంతా అరసవల్లిలోనే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వీధిలో ఉన్న మేనమామ కుమారుడు మండా శుకుడు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. నీలమణిదుర్గ సేవలో.. పాతపట్నం: పాతపట్నంలో కొలువైన శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని నటుడు రావు రమేష్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. -
తండ్రి చేసిన పాత్రలోనే..!
ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉన్న నటుడు రావు రమేష్. లెజెండరీ యాక్టర్ రావు గోపాలరావు తనయుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిర రమేష్.. లేట్‌గా అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతీ సినిమాలో రావు రమేష్ కంపల్సరీ యాక్టర్‌గా మారిపోయాడు. ఈ శుక్రవారం రిలీజ్‌కు రెడీ అవుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు రావు రమేష్. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజేలో రావు రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. రావుగోపాల్ రావు.. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో కనిపించిన గెటప్ లోనే డీజే సినిమాలో నటిస్తున్నాడు రావు రమేష్. కేవలం లుక్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ పేరు కూడా రొయ్యల నాయుడే కావటం విశేషం. అయితే క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్న రమేష్, తన తండ్రికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడతానని చెబుతున్నాడు. -
ఒక్కసారి ఓడిపోయి చూడు!
‘గెలుపుదేముందిరా మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.ఒక్కసారి ఓడిపోయి చూడు...ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం అవుతుంది’ (పిల్లజమీందారు) అని నీతులు చెప్పగలడు.‘మీ అబ్బాయి బాగున్నాడు.హైటు, ఆ పద్ధతీ అది... నా దృష్టిలో పడ్డాడు’ (ముకుందా) అని కూడా అనగలడు.‘దృష్టిలో పడ్డాడు’ అనే మాటకు అర్థం ‘వాడి అంతు తేలుస్తా’ అనే విషయం ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ గొంతులోని మెలిక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది.క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాదు ‘విలన్’ గా కూడా ప్రేక్షకులకు చేరువైన రావు రమేష్ ఈ వారం మన ‘ఉత్తమ విలన్’తెలుగు సినిమాలో విలనిజానికి రావుగోపాల్రావు ఎన్సైక్లోపీడియాలాంటి వారు. దర్పం నుంచి డైలాగు డెలివరీ వరకు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. రావుగోపాల్రావు కుమారుడిగా తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారో తెలియదుగానీ విలనిజంలో తనదైన సై్టల్‌ను క్రియేట్ చేసుకొని ప్రత్యేకతను చాటుకుంటున్నారు రావురమేష్. నిజానికి నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు రమేష్. స్టిల్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. చెన్నైలోని బ్రిటీష్, అమెరికన్ లైబ్రరీలలో గంటలతరబడి ఫొటోగ్రఫీ పుస్తకాలను అధ్యయనం చేసేవారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కాలిఫోర్నియాలో యాక్షన్, యానిమేషన్ కోర్సు చేయాలనుకున్నా, కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు. తండ్రి చనిపోయిన తరువాత తన గమ్యం ఏమిటో తేల్చుకోలేకపోయారు రమేష్. ఏడు సంవత్సరాలు అలా గడిచిపోయాయి! రమేష్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు... ఒక రచయిత కూడా ఉన్నాడు. సొంత కథతో డైరెక్షన్ చేయాలనుకున్నారు. ‘‘దర్శకత్వం కాదు... ముందు నటుడవ్వు’’ అంటూ వాళ్ల అమ్మగారు బ్రెయిన్‌వాష్ చేయడంతో ఎట్టకేలకు టీవీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు. సీరియల్స్‌లో నటిస్తున్న టైమ్‌లో ‘సీమసింహం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. హీరోయిన్ సిమ్రాన్ సోదరుడిగా డైలాగ్‌లేని చిన్న క్యారెక్టర్.‘రావుగోపాల్రావుగారి అబ్బాయి’ అనే గుర్తింపుతో తనకు సినిమాల్లో అవకాశాలు పరుగెత్తుకుంటూ వస్తాయి అనుకున్నారు రమేష్. కాని తాను ఊహించింది తప్పని ఆ తరువాతగానీ తెలిసిరాలేదు! బ్యాక్ టు చెన్నై... మళ్లీ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించారు. చిత్రసీమలో దేనికైనా టైమ్ రావాలంటారు.మూడు సంవత్సరాలు ఆలస్యంగా ‘గమ్యం’ రూపంలో ఆ టైమ్ రానేవచ్చింది. ఆ సినిమాలో రమేష్ పోషించిన నక్సలైట్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. చంద్రశేఖర్ ఏలేటి ‘ఒక్కడున్నాడు’ సినిమాలో చిన్న వేషం వేశారు. ఆ తరువాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.‘మగధీర’ ‘కొత్త బంగారు లోకం’ ‘ఆవకాయ బిర్యానీ’... మొదలైన సినిమాలతో రమేష్ కెరీర్ స్పీడందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాదు... విలన్‌గా కూడా తన సత్తా చాటి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు రమేష్. రావు రమేష్ నటుడు మాత్రమే కాదు...మంచి చదువరి... రచయిత.ఫొటోగ్రíఫీ ప్రేమికుడు.పుస్తకాల్లో చదివిన అపార విషయాలు ఆయనలో ‘రచయిత’కు ఉపకరించవచ్చు. రచయితగా ‘భావుకత’ ‘ఊహాశక్తి’ తనలోని ‘ఫొటోగ్రాఫర్’కు ఉపకరించవచ్చు. ఇవన్నీ కలసి ఆయన నటనలో పరిణతి తీసుకువచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చనిపోవడానికి సంవత్సరం ముందు మహానటుడు రావుగోపాల్రావు తన కుమారుడిని పిలిచి... ‘‘ఏం కావాలనుకుంటున్నావు?’’ అని అడిగారు.షేర్‌మార్కెట్ గురించి ఆసక్తి ఉన్నట్లు చెప్పారు రమేష్.‘‘షేర్‌మార్కెట్ అంటే నీకోసం నువ్వే బతకాలి. నలుగురితో బ్రతికే ప్రొఫెషన్ ఎంచుకో’’ అని సలహా ఇచ్చారు రావుగోపాలరావు.నలుగురితో బ్రతికే వృత్తినే కాదు, నలుగురి చేత ప్రశంసలు అందుకునే వృత్తిని ఎంచుకొని ‘రావు రమేష్’గా వెండితెరపై తనదైన శైలిని సృష్టించుకొని ‘శబ్బాష్’ అనిపించుకుంటున్నారు. -
క్లైమాక్స్‌లో కన్నీళ్లు వచ్చాయి
‘‘గురువారం సినిమా చూశా. ట్రెండీగా, ఫ్యామిలీలకు నచ్చే విధంగా దర్శకుడు బాగా తీశారు. క్లైమాక్స్‌లో రావు రమేశ్ నటనకు కన్నీళ్లు వచ్చాయి’’ అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. హెబ్బా పటేల్, రావు రమేశ్, తేజస్వి, అశ్విన్, నోయెల్, పార్వతీశం ముఖ్య తారలుగా బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ (గోపీ) నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ఈ నెల 16న విడుదలైంది. శుక్రవారం చిత్రబృందాన్ని దాసరి అభినందించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రాన్ని 40 రోజుల్లో కంఫర్ట్బుల్ బడ్జెట్లో చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. షెడ్యూల్ ప్రకారం అనుకున్న బడ్జెట్లో సినిమా తీయడం అరుదుగా జరుగుతుంది. గోపీ ఇలాగే మంచి సినిమాలను తీయాలి. నోట్ల రద్దు లేకపోతే ఇంకా బాగా కలెక్ట్ చేసేది’’ అన్నారు. ‘‘దాసరిగారు నా తొలి చిత్రాన్ని మెచ్చుకోవడం అంటే అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు దర్శకుడు. ‘‘దాసరిగారి ఆశీస్సులతో మరిన్ని మంచి చిత్రాలు తీస్తా’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. -
దర్శకుడు చెప్పినట్టే చేస్తా
‘‘నా కూతురు 6వ తరగతి చదువుతోంది. ముద్దుగా ‘మా అమ్మ ఎక్కడ’ అంటుంటాను. ఏ తండ్రికైనా కూతురుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఈ చిత్రంలో నాది అటువంటి పాత్ర కావడంతో తల్లిదండ్రులు అందరూ తమను తాము చూసుకుంటు న్నారు’’ అన్నారు రావు రమేశ్. బండి భాస్కర్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’లో హీరోయిన్ హెబ్బా పటేల్ తండ్రిగా రావు రమేశ్ నటించారు. ఈ 16న రిలీజైన ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఐదేళ్ల వరకూ ఇలాంటి తండ్రి పాత్ర రాదంటుంటే హ్యాపీగా ఉంది. హెబ్బా, తేజస్వి, అశ్విన్, పార్వతీశం, నోయెల్ బాగా నటించారు. ‘దిల్’ రాజు సలహాలు వెలకట్టలేనివి. సమష్టి కృషి ఫలితమే ఈ చిత్ర విజయం. ప్రతి సినిమాలోనూ దర్శకుడు చెప్పినట్టు నటిస్తా. మా నాన్నగారి (రావు గోపాలరావు)తో సహా ఎవర్నీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించను. ప్రస్తుతం ‘ఓం నమో వేంకటేశాయ’, ‘కాటమ రాయుడు’, ‘దువ్వాడ జగన్నాథమ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు. -
బాయ్‌ఫ్రెండ్స్‌తో.. నేనా?
‘‘బాయ్‌ఫ్రెండ్స్‌తో సరదాలు, షికార్లు సినిమాల్లోనే. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ అమ్మాయిల కాలేజీలో చదివా. తర్వాత సినిమాల్లోకి వచ్చేశా. కొందరు అబ్బాయిలపై మనసుపడ్డా. కానీ, రియల్ లైఫ్‌లో నాకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్లతో తిరిగేంత టైమ్ లేదు’’ అన్నారు హెబ్బా పటేల్. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ ముఖ్యతారలుగా భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ 16న రిలీజవుతోన్న ఈ సినిమా గురించి హెబ్బా పటేల్ మాట్లాడుతూ - ‘‘ఇందులో పద్మావతిగా చేశా. తండ్రి గారాబంగా పెంచిన ఆ అమ్మాయి సిటీకి వచ్చిన తర్వాత ముగ్గుర్ని ప్రేమిస్తుంది. ఆమె చేసే తప్పుల వల్ల మిగతావాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఆమె తండ్రి ఏం చేశాడనేది చిత్రకథ. తండ్రికూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సినిమా. ‘అలా ఎలా?’, ‘కుమారి 21ఎఫ్’ తర్వాత ‘దిల్’ రాజుగారు మరోసారి నా సినిమా రిలీజ్ చేస్తున్నారు. ‘మిస్టర్’, ‘ఏంజిల్’, ‘అంధగాడు’ చిత్రాల్లో నటిస్తున్నా’’ అన్నారు. -
ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్
చిన్నప్పట్నుంచీ నాన్నే ఆ అమ్మాయి జీవితం. వయసొచ్చిన తర్వాత ముగ్గురు అబ్బాయిలు బాయ్‌ఫ్రెండ్స్ పేరుతో ఆమె జీవితంలోకి వస్తారు. ఎవరా ముగ్గురు? వాళ్లపై ఆమె తండ్రి అభిప్రాయం ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘నాన్న.. నేను.. నా బాయ్‌ఫ్రెండ్స్’. బండి భాస్కర్ దర్శకత్వంలో రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, పార్వతీశం, అశ్విన్‌బాబు, నోయెల్ ముఖ్యతారలుగా బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 16న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘సినిమా బాగా నచ్చి ‘దిల్’ రాజుగారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అన్ని వర్గాలవారూ చూడదగ్గ చిత్రం ఇది’’ అని నిర్మాత తెలిపారు. -
శ్రీవారి సేవలో గాలి జనార్దన్‌రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమారుడు స్వామిని దర్శించుకున్నారు. శ్రీవారిని గురువారం దర్శించుకున్న ప్రముఖుల్లో నటుడు రావు రమేశ్ కూడా ఉన్నారు. -
వెంటాడి... వేటాడే షేర్
తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ముఖేశ్ రుషి, షఫీ, రావు రమేశ్, రోహిణి; కథ: డైమండ్ రత్నబాబు సంగీతం: తమన్ కెమేరా: సర్వేష్ మురారి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు ఫైట్స్: రామ్ - లక్ష్మణ్ నిర్మాత: కొమర వెంకటేశ్ దర్శకత్వం: మల్లికార్జున్ ‘నా గురించి నీకు తెలుసు కదా బాబాయ్! నచ్చితే ఎంత రిస్కయినా చేస్తాను!’...‘షేర్’ సినిమాలోని ఓ సీన్లో బ్రహ్మానందంతో హీరో కల్యాణ్‌రామ్ చెప్పే డైలాగ్ ఇది. సినిమాకే కాదు... కల్యాణ్‌రామ్ కెరీర్‌కూ వర్తించేలా దర్శక, రచయితలు రాసుకున్న డైలాగ్ అనొచ్చేమో. ఎంచుకొనే కథ, పాత్రల్లో రిస్క్ చేయడానికెప్పుడూ వెనకాడని కల్యాణ్‌రామ్ తనకు నచ్చిన కథ, దర్శకుడితో చేసిన కొత్త ఫిల్మ్ - ‘షేర్’. కథ ఏమిటంటే... హైదరాబాద్‌లో గౌతమ్ (కల్యాణ రామ్) ఒక సివిల్ ఇంజనీర్. తల్లితండ్రులు (రావు రమేశ్, రోహిణి). తమ్ముడు చెస్ ప్లేయర్. జీవితం సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో పప్పీ (‘రుద్రమదేవి’లో విలన్ పాత్రధారి విక్రమ్‌జీత్ విర్క్)తో హీరో ఢీ అంటే ఢీ అనాల్సొస్తుంది. పప్పీ తండ్రి దాదా (ముఖేశ్ ఋషి) కలకత్తాలో బడా మాఫియా డాన్. తమ్ముడు ఛోటా (షఫీ), ఇంకా చాలా పరివారం ఉంటుంది. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మన కుర్ర విలన్ పప్పీకేమో పెళ్ళి పిచ్చ. జీవితంలో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనీ, అదే ‘నా గోల్, ఎయిమ్, లక్ష్యం’ అని తిరుగుతుంటాడు. ‘నాది అనేది నా దగ్గర ఎవడైనా తీసుకుంటే వాడిది అనేది నేను లాక్కుంటా’ అన్నది కుర్ర విలన్ పప్పీ పద్ధతి. అతని పెళ్ళి చెడిపోవడానికి హీరో కారణమవుతాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవడానికి హీరో ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సాయాజీ షిండే) కూతురు నందిని (సోనాలీ చౌహాన్)కీ, హీరోకీ మధ్య ప్రేమ. ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని కుర్ర విలన్ ఆరాటం. ఈ క్రమంలో ఏకంగా హీరోయిన్ తండ్రి దగ్గరకే వెళ్ళి డి.జి.పి.ని చేస్తానని ఆశ చూపించి పెళ్ళికి ఒప్పిస్తాడు. అప్పుడిక హీరో గారూ కాబోయే మామగారి దగ్గరకు వెళ్ళి, మాఫియాగాళ్లను ఎన్కౌంటర్ చేసి, ఆ క్రెడిట్ మామగారికి వచ్చేలా చేసి, తానే డి.జి.పి.ని చేస్తానంటాడు. అలా ముందుగా కుర్ర విలన్ బంధువును చంపడంతో ఎన్కౌంటర్ల పర్వానికి శ్రీకారం చుడతాడు. ఇక సెకండాఫ్‌లో కూడా ఆ పర్వం కొనసాగిస్తూనే, ‘శ్రీను వైట్ల సినిమాల ఫక్కీ’లో హీరో వెళ్ళి కుర్ర విలన్ పెళ్ళి ఇంట్లో తిష్ఠ వేస్తాడు. అక్కడ కామెడీకి తోడు, హీరో ఎన్కౌంటర్లకు సంబంధించి ఒక సస్పెన్స ఫ్లాష్‌బ్యాక్ కూడా తెలుస్తుంది. హీరోకు అంత పగ ఎందుకు, కుర్ర విలన్‌ను అడ్డుపెట్టుకొని పెద్ద విలన్ దాదాను హీరో ఏం చేశాడు, ఏమిటన్నది మిగతా సినిమా. నటీనటుల విషయానికొస్తే... కల్యాణ్‌రామ్ అలవాటైన నటన చూపారు. అలాగే, నందమూరి వారసత్వాన్ని గుర్తు చేసేలా పెద్ద ఎన్టీయార్ ఫోటోలు, కటౌట్లు, ప్రస్తావనలు, ఆయన ముసుగు ముఖానికి వేసుకొని విలన్ ముఠా వాళ్ళను కొట్టడాలు లాంటివన్నీ సినిమాలో పుష్కలం. గాలిలో ఎగిరి విలన్లను కొట్టడాలు, తుపాకీలతో కాల్పుల తరహా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ‘రేయ్... వాయిస్ ఉంది కదా అని వాల్యూమ్ పెంచితే, స్పీకర్లు పగిలిపోతాయ్’ లాంటి (విలన్‌తో) ‘హీరో’చిత డైలాగులూ ఉన్నాయి. పాటలకు చేసే డ్యాన్సుల్లో కల్యాణ్‌రామ్ మునుపటి కన్నా నైసు తేలినట్లూ అర్థమవుతుంది. ఇలా సగటు తెలుగు సినిమా హీరో చేయగలిగినవన్నీ సినిమాలో ఉన్నాయి. హీరోయిన్ సోనాలీ చౌహాన్ సెకండాఫ్‌లో ఆట్టే కనిపించకపోయినా కనిపించిన ఫస్టాఫ్ అంతా డ్యాన్సులు, హీరోతో లవ్ సీన్లతో సరిపెడుతుంది. సినిమాలో కామెడీకి బ్రహ్మిగా బ్రహ్మానందం, ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ ఫిష్ వెంకట్, ఒకటి రెండు సీన్లలో వచ్చే అలీ, పృథ్వి, స్వర్గీయ ఎమ్మెస్ నారాయణ - ఇలా తెర నిండా చాలామంది ఉన్నారు. కొన్ని డైలాగ్ పంచ్‌లు నిజంగానే నవ్విస్తాయి. ‘పోలవరం ప్రాజెక్టు, వీడి (కుర్రవిలన్) పెళ్ళి జరిగినట్టే ఉంటాయ్. కానీ, జరగవ్... చిరాగ్గా’ అని ట్రైలర్లో వినిపించిన డైలాగ్ సినిమాలో సెన్సార్ వల్లో, శ్రేయోభిలాషుల హెచ్చరిక వల్లో కానీ ‘సల్మాన్‌ఖాన్ పెళ్ళి.. వీడి పెళ్ళి..’ అంటూ మారింది. సినిమాలో విలన్ల బ్యాచ్ కూడా పెద్దదే. కలకత్తాలోని దాదాగా ముఖేశ్ రుషి, అతని కుడి భుజంగా ఆశిష్ విద్యార్థి, అలాగే కొడుకులుగా విక్రమ్‌జీత్ విర్క్, షఫీ - ఇలా చాలామందే ఉన్నారు. కుర్ర విలన్‌తో హీరోకు సవాలు ఎదురైన దగ్గర నుంచి కథ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచినా, మధ్యకొచ్చేసరికి అది ప్రేమను గెలిపించుకోవడం కోసం కాబోయే మామగారైన సాయాజీ షిండేను డి.జి.పి.ని చేయడానికి హీరో సాగిస్తున్న ఎన్కౌంటర్ల వ్యవహారంగా కనిపిస్తుంది. సినిమా ముగింపుకొచ్చేసరికి అప్పటి దాకా జరుగుతున్నదంతా విలన్‌పై హీరో వ్యక్తిగత ప్రతీకారపు కథ అని కలర్ మారింది. ఇలాంటి చిత్రమైన కథాకథన పద్ధతి అనుస రించారు. కెమేరా వర్క, ఒకట్రెండు పాటలు బాగున్నాయి. మొత్తానికి, పాపను చంపిన వ్యక్తుల మీద పగతో చిరంజీవి ‘జై చిరంజీవా’ అనడం చూశాం. ఇదే దర్శక, హీరోల కాంబినేషన్లో చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ‘కత్తి’ చూశాం. ఇంకా చాలా చాలానే చూశాం. ఇప్పుడు వీటన్నిటికీ వినోదాత్మక నయారూపం ఈ ‘షేర్’. వెరసి, ఈ కథలో ప్రేమ షేర్ ఎంత, పగ షేర్ ఎంత అన్నది వదిలేస్తే, ప్రేక్షకులు ఆలోచించేది మాత్రం తమకు దక్కే వినోదం షేర్ ఎంత అనే... చిరాగ్గా! నిజానికి, ఈ సినిమా కల్యాణ్‌రామ్ గత చిత్రం ‘పటాస్’ రిలీజ్ కన్నా ముందే ప్రారంభమైంది. అయితే, రకరకాల కారణాల వల్ల నిర్మాణంలో ఆలస్యమైంది. ‘షేర్’ నిర్మాణంలో ఉండగానే ‘పటాస్’ రిలీజై, కమర్షియల్ సక్సెస్ సాధించడంతో, యూనిట్ పునరాలోచనలో పడింది. కథ మార్చలేదు కానీ, ‘పటాస్’కు ప్లస్సయిన వినోదాన్ని ఇందులోనూ జొప్పించడానికి కామెడీ సీన్లు కొత్తగా తిరగరాసుకున్నారు. మొదట ఈ సినిమాకు వన్యా మిశ్రా అనే అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నారు. పది రోజుల షూటింగ్ తరువాత రషెస్ చూసుకొని, తాము అనుకొన్న పాత్రకు ఆమె నప్పడం లేదని, కొత్త హీరోయిన్ని పెట్టుకొన్నారు. అలా సోనాల్ చౌహాన్ వచ్చింది. రీషూట్ చేయాల్సొచ్చింది. దర్శకుడు మల్లికార్జున్‌కు ఇది 4వ సినిమా. అందులో మూడింటిలో (‘అభిమన్యు’, ‘కత్తి’, ‘షేర్’) కల్యాణ్‌రామే హీరో. -
మామా అల్లుళ్ల సవాల్!
ఓ యువకుడు తనకు నచ్చిన అమ్మాయి ప్రేమను ఎలా గెల్చుకున్నాడు? అలాగే తమను వ్యతిరేకించినఅమ్మాయి తండ్రిని ఎలా ఆడుకున్నాడు? ఫైనల్‌గా తమ ప్రేమను పెళ్లి వరకూ ఎలా తీసుకెళ్లాడు? అనే కథాంశంతో తె రకెక్కిన చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా, రావు రమేశ్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రూపేశ్ డి. సాహిల్, జి.సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. రావు రమేశ్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు సోమనాథ్ చటర్జీ. బెంగాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా నటించాను. మా నాన్నగారు రావు గోపాలరావు, చిరంజీవిగారు మామా అల్లుళ్లగా నటించిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తుంది. ఈ సినిమా చూసిన ‘దిల్’ రాజుగారు చాలా బాగుందన్నారు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో నాకు, అవికా గోర్‌కు మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఓ మంచి ప్రేమకథకు మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు’’ అని రాజ్ తరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్-దాశరథి శివేంద్ర. -
'ముకుంద' టీంతో సాక్షి చిట్‌చాట్
-
'ముకుందా' టీంతో సాక్షి చిట్‌చాట్
-
సినిమా రివ్యూ: నీజతగా...నేనుండాలి
ప్లస్ పాయింట్స్: కథ, కథనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: హీరోయిన్ డైలాగ్స్, డబ్బింగ్ కథ, స్క్రీన్ ప్లే: షగుఫ్తా రఫీఖ్ సంగీతం: మిథున్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ నిర్మాత: బండ్ల గణేష్ దర్శకత్వం: జయ రవీంద్ర బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికీ-2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికీ-2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని తాజాగా ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే. కొద్దికాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్జే, గాయకుడు రాఘవ జయరాం. డ్రగ్స్, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పాపులారిటీని క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని టాలెంట్‌ను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప సింగర్ చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప సింగర్‌ని చేశాడా? సింగర్‌గా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి. రాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. సగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికీ-2 మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ మళ్లీ వినాలనే రేంజ్లో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది. విశ్లేషణ: దేశవ్యాప్తంగా ఆషికీ-2 చిత్రానికి యువతతోపాటు అన్నివర్గాల నుంచి లభించిన ఆదరణ ఈ మధ్యకాలంలో ఏచిత్రానికి లభించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు, కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా.. ఆషికీ-2 చిత్ర ప్రభావం వెంటాడుతునే ఉంటుంది. ఆషికీ-2 చిత్రం ప్రభావం ఆ రేంజ్లో ఉంటుంది. ‘నీజతగా నేనుండాలి’ చిత్ర విషయానికి వస్తే.. ఆ రేంజ్లో ఫీల్ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఇంటెన్సిటిని, ఫీల్‌ను కొనసాగించడానికి జట్టు తమ శాయశక్తులా ప్రయత్నించారు. నటీనటుల యాక్టింగ్‌ను.. డైలాగ్స్, డబ్బింగ్ ఎక్కువగా డామినేట్ చేశాయి. హీరో, హీరోయిన్ల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆషికీ-2 చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను తెరపైన చూపించడంలో సంగీతం, దర్శకుడు జయ రవీంద్ర ప్రతిభ ప్రధానపాత్ర పోషించింది. ఆషికీ-2 చూడని ప్రేక్షకులకు ‘నీజతగా నేనుండాలి’ ఓ ఫీల్‌ను కలిగిస్తుంది కాని.. అద్బుతమైన ఫీలింగ్‌ను మాత్రం కాదు.. -
సినిమా రివ్యూ: గీతాంజలి
హారర్ కామెడీ చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేయడానికి సిద్ధంగా ఉంటారని ‘కాంచన’, ‘ప్రేమకథా చిత్రం‘ ఇతర చిత్రాలు నిరూపించాయి. అదే హారర్, కామెడీ కథాంశంతో పేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ఫీల్‌గుడ్ టైటిల్‌తో తాజాగా ‘గీతాంజలి’ అనే చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అంజలి, కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డిలతో కథా రచయిత కోన వెంకట్,దర్శకుడు రాజ్కిరణ్లు సంధించిన సరికొత్త అస్త్రం ఎలాంటి అనుభూతిని పంచిందో తెలుసుకోవడానికి కథలోకి వెళ్తాం. కథ: దిల్ రాజుకు కథ చెప్పి సినీ దర్శకుడిగా మారి ఓ నంది అవార్డును సంపాదించాలనే లక్ష్యంతో నందిగామ నుంచి శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్ చేరుకుంటాడు. తన మిత్రుడు మధుతో కలిసి చవకగా వస్తుందన్న ఆశతో ఓ స్మశానంకు సమీపంలోని ఓ ఫ్లాట్‌లో నివాస్ అద్దెకు దిగుతారు. అంతకుముందు అదే ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువతి దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. నందిగామ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఇష్టపడిన అంజలి అనే అమ్మాయి తరచుగా ఆ ఫ్లాట్‌కు వస్తూ ఉంటుంది. దిల్‌రాజు క్రియేటివ్ టీమ్ అని చెప్పిశ్రీనివాస్ను సత్యం రాజేశ్, జబర్ధస్త్ శంకర్లు బురిడీ కొట్టించి ఆ ఫ్లాట్‌లో చేరుతారు. అలా ఫ్లాట్‌లో చేరిన వారికి దెయ్యం రూపంలో ఎదురైన అనుభావాలేమిటి? శ్రీనివాస్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అంజలికి ఆఫ్లాట్కు సంబంధమేమిటి? ఆ ఫ్లాట్‌లో యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆఫ్లాట్లో నిజంగా దెయ్యం ఉందా? అనే ప్రశ్నలకు కామెడీ టచ్ చేసి హారర్ రూపంలో అందించిన సమాధానమే ’గీతాంజలి’. సమీక్ష దెయ్యాలున్నాయా అనే ప్రశ్నకు సమాధానం పక్కనపెడితే.. దెయ్యాల కథతో వెండితెరపై వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను కొత్త ఒరవడిని సొంతం చేసుకున్నాయి. దెయ్యాల కథ ఎప్పటికి ఓ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్. సరిగ్గా అలాంటి కథను ఎంచుకుని రెగ్యులర్ పాయింట్‌తో కోన వెంకట్ చేసిన సరికొత్త ప్రయోగం చేశాడు. కోన వెంకట్ పాయింట్‌ను దర్శకుడు రాజ్‌కిరణ్ తెరకెక్కించిన విధానం.. అనుసరించిన కథనం ఖచ్చితంగా సినీ అభిమానులను కొత్త అనుభూతికి గురిచేస్తుంది. హారర్ సినిమాకు కావాల్సిన సీన్లను పక్కాగా సిద్ధం చేసి.. కామెడీ రంగు అద్ది తెరపైన అందంగా గీతాంజలిని తీర్చిదిద్దడంలో కోన వెంకట్ టీమ్ ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. కథకు అసవరమైన నటీనటులు అంజలి, బ్రహ్మనందం, శ్రీనివాస్‌రెడ్డి, రావు రమేశ్, శంకర్, సత్యం రాజేశ్, మధుల ఎంపిక చక్కగా కుదిరింది. కథ డిమాండ్ మేరకు శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్ ఇతర పాత్రల క్యారెక్టరైజేషన్‌ను పకడ్బందీగా డిజైన్ చేశారు. దాంతో శ్రీనివాస్‌రెడ్డి, అంజలి, రావు రమేశ్‌లు వ్యక్తిగతంగా ఎక్కడ కనిపించరు.. కేవలం పాత్రలే తెరమీద కనిపిస్తాయి. ఇప్పటి వరకు గ్లామర్ తారగానే ప్రేక్షకులకు సుపరిచితులైన అంజలిని ఓ కొత్త కోణంలో కనిపించిడమే కాకుండా గ్లామర్‌తోనూ మెరిసింది. తన కెరీర్లో అంజలికి ఈ చిత్రం దిబెస్ట్‌గా మిగిలడం ఖాయం. కామెడీ పాత్రలకే పరిమితమైన శ్రీనివాస్‌రెడ్డిని ఓ నటుడిగా ఆవిష్కరించిన చిత్రంగా మారనుంది. కమెడియన్ శంకర్, రాజేశ్‌లు మరోసారి తన సత్తాను చాటారు. ఇక సైతాన్ రాజ్‌గా బ్రహ్మనందం ఫెర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా తెరమీద చూడటమే సమంజసం. నిర్మాత దిల్‌రాజు తొలిసారి తెలుగు సినీ తెరపై కనిపించడం విశేషం. టెక్నికల్: సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫిని, ఎడిటర్ ఉపేంద్ర నుంచి మెరుగైన పనిని రాబట్టుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హారర్ మూడ్‌ను ఎలివేట్ చేయడానికి సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి కథకు ప్రాణం పోసింది. లక్కరాజు ప్రవీణ్ అందించిన ట్యూన్లకు సాయి శ్రీరామ్ తెరమీద అందమైన దృశ్యాలుగా మలిచారు. కాఫీ సాంగ్, ఎండింగ్ టైటిల్స్‌లో బ్రహ్మనందంపై వచ్చే థీమ్ సాంగ్‌లను ఈ చిత్రనికి అదనపు ఆకర్షణ. ప్రేక్షకుల్లో ఓ భయాన్ని కలిగించే విధంగా దృశ్యాలను మలచడంలో సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫి, ప్రవీణ్ నేపథ్య సంగీతం ఎస్సెట్‌గా మారింది. ముగింపు: చిత్ర తొలిభాగంలో వినోదానికి పెద్ద పీట వేసి.. రెండవ భాగంలో కథలోకి వెళ్లడం వల్ల కొంత వేగం త గ్గినట్టు అనిపిస్తుంది. అయితే సానుకూల అంశాలు ఎక్కువ మోతాదులో ఉన్న కారణంగా కొన్ని లోపాలు అంతగా బయటకు కనిపించవు. హారర్, కామెడి చిత్రాలను ఆదరించేవారికి, కొత్తదనం, వెరైటీ చిత్రాలను ఆశించే వారికి ’గీతాంజలి’ ఓ చక్కటి చిత్రం. ఈమధ్యకాలంలో విడుదలైన హిట్ చిత్రాల్లో ‘గీతాంజలి’ చోటు సంపాదించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. -రాజబాబు అనుముల -
'అంతకు ముందు, ఆతరువాత' సినిమా రివ్యూ
ఇప్పుడొస్తున్న అన్ని ప్రేమకథలూ ఒకేలా ఉంటున్నాయనేది సగటు తెలుగు సినీ ప్రేక్షకుడి ఫిర్యాదు. అందులో వాస్తవం కూడా ఉంది. అందమైన అమ్మాయి, అబ్బాయి... తొలి చూపులో ప్రేమ... కులమో, మతమో, డబ్బో ఇలా ఏదో ఒక అవాంతరం రావడం... చివరకు కథ సుఖాంతం కావడం. ఈ నేపథ్యానికి రకరకాల మసాలాలు అద్దడం. ఫైనల్‌గా ప్రొడక్ట్ ఇదే. ఇంద్రగంటి మోహనకృష్ణలాంటి సెన్సిబుల్ దర్శకుడు ఓ ప్రేమకథ తీస్తున్నాడంటే, ఇలాంటి మసాలాలే ఉంటాయా? అదే జరిగుంటే, అసలు మనం ఈ సినిమా గురించే మాట్లాడుకోనవసరం లేదు. ముందు ఈ సినిమా కథ గురించి చెప్పుకుందాం. 23 ఏళ్ల కుర్రాడు ఓ ఫంక్షన్లో అమ్మాయిని చూసీ చూడగానే మనసు పారేసుకుంటాడు. తను కూడా ఈ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. కానీ ఏవో కన్ఫ్యూజన్లు. ఈ ప్రేమ జీవితాంతం ఇంతే ఫ్రెష్‌గా, క్వాలిటీగా ఉంటుందా? ప్రేమలో ఉండగా రంగు రంగుల సీతా కోకచిలుకలా ఉండే జీవితం పెళ్లి కాగానే గొంగళిపురుగులా కనిపిస్తుందా? అని రకరకాల సందేహాలు. దీనికి పరిష్కారం ఏంటి? అబ్బాయికో ఐడియా వస్తుంది. ఇద్దరం రెండు నెలల పాటు భార్యాభర్తలుగా సహజీవనం చేద్దామంటాడు. ఆ అమ్మాయి భయపడుతూ, ఇబ్బందిపడుతూనే ఓకే అంటుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ప్రణయం. సెకండాఫ్ ఏమో సహజీవనం. ఫైనల్‌గా ఈ జంట ఏం తెలుసుకున్నారు? ఏం తేల్చుకున్నారన్నదే మిగిలిన కథ. వినగానే రెగ్యులర్ స్టోరీ కాదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ రెండు నెలల సహజీవనం కాన్సెప్ట్ అంటేనే, మన థాట్స్ ఎటెటో వెళ్లిపోవడం, బోలెడంత రొమాన్స్‌ని ఆశించడం సహజం. కానీ ఇంద్రగంటి ఈ కథను డీల్ చేసిన విధానం ఎక్స్లెంట్. మనలో చాలామందిమి రొమాన్స్‌కి, సెక్స్‌కి తేడా ఎప్పుడో మర్చిపోయాం. రొమాన్స్ అంటే సెక్స్ అన్నట్టుగా కొన్ని సినిమాలు డెఫినిషన్ చెప్పేశాయి. కానీ ఇంద్రగంటి రొమాన్స్‌కి, సెక్స్‌కీ మధ్య ఉండే సున్నితమైన లేయర్‌ని టచ్ చేశాడు. ఇంతటి గంభీరమైన, సంప్రదాయ విరుద్ధమైన కథాంశాన్ని చాలా హోమ్లీగా, లవ్లీగా, సెన్సిబుల్‌గా, క్లీన్‌గా చూపించాడు. నిజం చెప్పాలంటే ఇది లవ్‌స్టోరీ కాదు. లైఫ్ స్టోరీ. ప్రేమ అనే వస్తువుని తీసుకుని జీవితాన్ని స్వచ్ఛంగా ఆవిష్కరించాడు. జీవితం ఒక సినిమా అనుకుంటే, దానికి ప్రత్యేకంగా ట్రయిలర్స్ ఏమీ ఉండవు. ముఖ్యంగా లైఫ్ సినిమాకి లవ్ అనేది ట్రయిలరే కాదని స్పష్టంగా చెప్పారు. అలాంటి అనుమానాలు, పొరపాట్లు, సర్దుబాట్ల గురించి ఇంద్రగంటి సున్నితంగా చర్చ లేవనెత్తారు. అయితే తను ఎక్కడా క్లాసులు పీకుతున్న ధోరణిలో లేకుండా ఓ లైవ్లీగానే ఈ సినిమాని ఆవిష్కరించారు. ప్రేమకథలో ఫ్యామిలీ ఎమో షన్స్నీ, డ్రామానీ అందంగా సమ్మిళితం చేయడంతో సినిమాకో డెప్త్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. హీరోయిన్, హీరోతో కలిసి 2 నెలలు వేరే ఫ్లాట్‌లో ఉంటుంది. ఆ రెండు నెలలు ఇంట్లో చెప్పకుండా ఎలా మేనేజ్ చేసిందనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే హీరో బిజినెస్ స్టార్ట్ చేయడం, ఆ వ్యవహారాలు... అంత ఇంపాక్టివ్గా అనిపించవు. ఇలాంటి చిన్న చిన్నవి మినహా ఓవరాల్‌గా సినిమా ఓకే. హీరోగా సుమంత్ అశ్విన్‌కిది రెండో సినిమా. ఎక్కడా జర్కుల్లేకుండా చాలా ఈజ్‌తో అనిల్ పాత్రలో అందంగా ఇమిడిపోయాడు. తనకు మంచి భవిష్యత్తు ఉందని ఈ సినిమా నిరూపించింది. ఇక హీరోయిన్ ఇషా ఆ పాత్రకు టైలర్‌మేడ్‌లా అనిపించింది. మనకో తెలుగు కథానాయిక దొరికినందుకు ఆనందపడాలి. తండ్రి పాత్రలకు ప్రకాశ్‌రాజ్‌కు ఆల్టర్నేట్గా రావు రమేష్ స్థిరపడిపోయినట్టే. అంత గొప్పగా ఇందులో యాక్ట్ చేశారు. రోహిణి, రవిబాబు, ఝాన్సీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. చాలాకాలం తర్వాత కనిపించిన మధుబాల మాత్రం నిరాశపరుస్తారు. సెపరేట్ కామెడీ ట్రాక్స్ లేకపోయినా, అవసరాల శ్రీనివాస్ పాత్రే పెద్ద రిలీఫ్ ఇస్తుంది. కళ్యాణి కోడూరి రీరికార్డింగ్, పీజీ విందా ఫొటోగ్రఫీ సినిమాకు మెయిన్ హైలైట్స్. డైలాగ్స్ బాగా స్కోర్ చేస్తాయి. ఈ సినిమా విషయంలో నిర్మాత దామోదర ప్రసాద్ టేస్ట్‌ని మెచ్చుకోవాలి. హైలైట్స్: హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫ్రెష్‌నెస్, డైలాగ్స్, నేచురల్ రొమాంటిక్ సీన్స్ డ్రాబ్యాక్స్: ద్వితీయార్థంలో స్లో నేరేషన్, కొన్ని బలహీన సన్నివేశాలు బాటమ్ లైన్: సినిమా చూసిన తర్వాత కూడా... కూల్