అల్లు అర్జున్‌ సినిమా సీన్లు రీక్రియేట్‌ చేస్తూ సాంగ్‌ విడుదల | Maruthi Nagar Subramanyam Movie Song Out Now | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ సినిమా సీన్లు రీక్రియేట్‌ చేస్తూ సాంగ్‌ విడుదల

Published Wed, Apr 17 2024 10:24 PM | Last Updated on Thu, Apr 18 2024 9:34 AM

Maruthi Nagar Subramanyam Movie Song Out now - Sakshi

రావు రమేష్ హీరోగా నటించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట 'మేడమ్ సార్ మేడమ్ అంతే'ను ఇవాళ విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద 'మేడమ్ సార్ మేడమ్ అంతే' పాటను తెరకెక్కించారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.'మేడమ్ సార్ మేడమ్ సార్'ను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ పాడారు. ఇప్పటి వరకు ఆయన ఇంత హుషారైన పాటను పాడలేదని చెప్పాలి. కళ్యాణ్ నాయక్ అందించిన అద్భుతమైన బాణీని తన గాత్రంతో మరో స్థాయికి తీసుకు వెళ్లారు. భాస్కరభట్ల పాటను రాశారు.  

'మారుతీ నగర్ సుబ్రమణ్యం' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''టైటిల్ పాత్రలో రావు రమేష్ లుక్, ఆల్రెడీ విడుదల చేసిన టైటిల్ సాంగ్ 'నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం'కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. భాస్కరభట్ల గారు తొలి పాటతో పాటు ఈ పాటకూ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ రోజు సన్నాఫ్ సుబ్రమణ్యంగా నటించిన అంకిత్ కొయ్య సాంగ్ విడుదల చేశాం. అతను పోషించిన పాత్రకు, అల్లు అర్జున్ గారికి సినిమాలో చిన్న కనెక్షన్ ఉంటుంది.

అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 'జోహార్', 'తిమ్మరుసు', 'మజిలీ', 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించిన అంకిత్ కొయ్య మంచి నటన కనబరిచారు. రమ్య పసుపులేటి ఈ జనరేషన్ ఇన్నోసెంట్ అమ్మాయి రోల్ చేశారు. వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. లిధా మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మా సినిమాలో పాటల్ని విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement