రావు రమేష్ కథానాయకుడిగా... పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రంలో నటి ఇంద్రజ ఆయన సరసన నటించడం విశేషం. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.
'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు.
'ఎప్పుడూ సగం సగం ఎంటర్‌టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు.
సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు.
రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆయనతో పాటుగా భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య.
Comments
Please login to add a commentAdd a comment