Indraja
-
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘సీఎం పెళ్లాం’.. మంచి సందేశం ఇచ్చే చిత్రం
జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీఎం పెళ్లాం’. గడ్డం వెంకట రమణారెడ్డి దర్శకత్వంలో బొల్లా రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో పోలీసాఫీసర్‌గా నటించాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో సీఎం భార్యగా నటించాను. సందేశాన్నిచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు ఇంద్రజ. (చదవండి: వాడు హగ్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా లేదు.. ఫైర్ అయిన యష్మి)‘సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది’ అని అన్నారు నటుడు అజయ్. ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సందేశాత్మక చిత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది. ఓ సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేసేందుకు ముందుకొస్తే ఎలా ఉంటుందనేది చూపించే ప్రయత్నం చేశాం’’ అని వెల్లడించారు గడ్డం వెంకట రమణారెడ్డి. ‘‘ఈ చిత్రంలో మహిళా సాధికారకత అంశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు బొల్లా రామకృష్ణ. -
‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
నాకు ఇష్టమైతేనే వస్తా: అల్లు అర్జున్
‘‘పుష్ప 2: ది రూల్’ క్లైమాక్స్ షూటింగ్లో ఉన్నా. నా జీవితంలో ఎంతో క్లిష్టమైన క్లైమాక్స్ షూటింగ్ . సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్లకి మనం సపోర్ట్‌గా నిలబడగలగాలి. అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా. నాకు ఇష్టమైతేనే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికీ తెలిసిందే’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. తబితా సుకుమార్ సమర్పణలో బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘సుకుమార్‌గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. అయినా తబితగారు స్వతహాగా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. రావు రమేష్‌గారి లాంటి నటుడు ఉండటం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఈ మధ్య చిన్న చిత్రాలకు జనాలు థియేటర్స్‌కి వస్తుండటం మంచి ట్రెండ్. అదే ట్రెండ్ ఈ శుక్రవారం కూడా కొనసాగాలి. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా మీరు సపోర్ట్ చేయాలి. గత ఏడాది నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఈ ఏడాది ‘కాంతార’ కి వస్తే బాగుండు అనుకున్నా. రిషబ్ శెట్టిగారికి వచ్చినందుకు అభినందనలు. నిత్యామీనన్ మంచి నటి. నాకు మంచి ఫ్రెండ్. తనకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. అలాగే ‘కార్తికేయ 2’ మూవీ యూనిట్‌కి, జానీ మాస్టర్‌కి కూడా అభినందనలు. డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బన్నీ రావడం వల్ల ఈ చిన్న సినిమా కాస్త పెద్దది అయిపోయింది. బన్నీ ఎప్పుడూ కూడా తాను స్టార్ అనుకోడు.. నేను బాగా నటించాలన్నదే తన లక్ష్యం. ఓ స్టార్ హీరో నటించడమే గొప్ప విషయం అనుకుంటే గనక.. గొప్పగా నటించే రావు రమేశ్‌కూడా బిగ్గెస్ట్ స్టార్. ఈ సినిమా హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఇన్నేళ్లలో నాకు సరైన స్క్రిప్ట్ దొరికిందని నమ్మి, ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాను’’ అని రావు రమేష్ చెప్పారు. ‘‘ఇటీవల ‘కమిటీ కుర్రోళ్ళు, ఆయ్’ వంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ కోవలో మంచి కథతో వస్తున్న మా ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ని కూడా ఆదరించాలి’’ అన్నారు తబితా సుకుమార్. ఈ వేడుకలో నిర్మాతలు మోహన్ కార్య, బుజ్జి రాయుడు పెంట్యాల, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
తప్పు తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది: డైరెక్టర్ లక్ష్మణ్ కార్య
'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి అలాంటి తప్పు జగరకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’’ కథ రాసుకున్నాను. ఆ తర్వాత ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా రావు రమేశ్ గుర్తుకు వచ్చారు. ఆయన సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా చేయరేమో అని చాలా మంది చెప్పారు. అయితే ఒక్కసారి కథ చెప్పి చూద్దాం అని ఆయనను సంప్రదించాను. ఫస్ట్ డైలాగ్ చెప్పిన వెంటనే నవ్వేశాఉ. 15,20 నిమిషాల్లో కథ వివరించా. వెంటనే రావు రమేశ్ ఓకే చేశారు’ అని అన్నారు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఆయన దర్శకత్వంతో రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మారుతి నగర్ సూర్య’. హర్ష వర్దన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'ఎందుకిలా' వెబ్ సిరీస్‌తో నేను దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.→ ఈ సినిమాలో రావు రమేష్ , అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.→ ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.→ డైరెక్టర్ సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా ప్రివ్యూ వేశాం. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.→ సుకుమార్ సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను -
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన లేడీ కమెడియన్
ప్రముఖ లేడీ కమెడియన్ శుభవార్త చెప్పేసింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో విషయాన్ని ఇన్ స్టా వేదికగా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు, ఫాలోవర్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: పెళ్లి బంధానికి పూర్తి న్యాయం చేశా.. కానీ: సమంత)ప్రముఖ తమిళ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ శంకర్. దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో 'విజిల్') సినిమాతో నటిగా మారిన ఈమె.. బాగానే గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత విశ్వక్ సేన్ 'పాగల్', కార్తీ 'విరుమాన్' చిత్రాల్లోనూ ఇంద్రజ సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది.ఈ ఏడాది మార్చిలో కార్తీక్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఇంద్రజ.. ప్రస్తుతం తాను గర్భవతి అయినట్లు ప్రకటించింది. ఈ విషయం తెలియగానే ఎమోషనల్ అయిపోయానని, మాటలు రావట్లేదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది. లవ్ మామ అని భర్తని ఉద్దేశించి తెగ ప్రేమ కురిపించింది.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) -
ఇండియా ఫైల్స్‌లాంటి సినిమా అవసరం
‘‘ప్రస్తుత సమాజానికి ‘ఇండియా ఫైల్స్’ లాంటి సినిమా చాలా అవసరం. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలే మూలాలుగా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అద్దంకి దయాకర్ లీడ్ రోల్లో ఇంద్రజ, సుమన్, ‘శుభలేఖ’ సుధాకర్ ఇతర ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండియా ఫైల్స్’. బొమ్మకు హిమమాల సమర్పణలో డా. బొమ్మకు మురళి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘అద్దంకి దయాకర్ నటన చూడలేదు. కానీ ఆయనకు ప్రతి సబ్జెక్ట్, సమస్యల పట్ల ఉన్న అవగాహన నాకు తెలుసు. దయాకర్ ఎప్పటికైనా పెద్ద నాయకుడు కావాలి’’ అన్నారు. ‘‘గద్దర్‌గారు ΄ాడి, నటించిన ΄ాటకి నేను సంగీతం అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎంఎం కీరవాణి. డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ– ‘‘నటనంటే తెలియని నాకు 40 రోజులు శిక్షణ ఇచ్చి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే చాన్స్ కల్పించిన మురళిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ సినిమా సమాజం గురించి చాలా విషయాలు నేర్పిస్తుంది... ఆలోచింపజేస్తుంది’’ అన్నారు బొమ్మకు మురళి. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ మాట్లాడారు. -
Indraja Sankar: కమెడియన్ రోబో శంకర్ కూతురు ఇంద్రజ పెళ్లి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కమెడియన్ ఇంట వేడుకలు.. బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నటి
కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్మెంట్ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరుముద్దలు.. 'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్(విజిల్) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్ సేన్ 'పాగల్' మూవీలో 'ఈ సింగిల్ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. View this post on Instagram A post shared by sai sreedevi (@sai.sree.devi) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) చదవండి: బాలీవుడ్ స్టార్స్.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రావు రమేష్, ఇంద్రజల 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సరికొత్తగా పోస్టర్ లాంచ్
రావు రమేష్ కథానాయకుడిగా... పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం'. ఈ చిత్రంలో నటి ఇంద్రజ ఆయన సరసన నటించడం విశేషం. లక్ష్మణ్ కార్య దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా రావు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చివర్లో ఆ క్యూఆర్ ఇచ్చారు. అది స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోని విజయవాడ మావయ్య, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కెజియఫ్'లో రాఘవన్ క్యారెక్టర్లు ఎంత పాపులర్ అనేది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇద్దరూ రావు రమేష్ ముందు ప్రత్యక్షం అయ్యారు. 'ఎప్పుడూ సగం సగం ఎంటర్టైన్ చేయడమేనా? ఫుల్లుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం ఉందా? లేదా? అని! క్యారెక్టర్లు, సినిమా చేస్తున్నాం అంటే సరిపోయిందా? ప్రేక్షకులకు చక్కగా ఫుల్ మీల్స్ పెట్టినట్లు ఫుల్లుగా ఎంటర్టైన్ చేసి ఒక్కసారైనా పంపాలి కదా!' అని విజయవాడ మావయ్య అడిగితే... 'ఎస్! హి ఈజ్ రైట్. ఇది హాట్ ఇష్యూ, స్వీట్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ! నువ్వు తప్పకుండా సమాధానం చెప్పాలి' అని గట్టిగా అడిగారు. అప్పుడు రావు రమేష్ ''ఆన్సర్ చాలా సింపుల్. దేనికైనా అవకాశం రావాలి. ఇప్పుడు అవకాశం వచ్చింది. చేశాను. రిలీజ్ అవుతుంది' అని చెప్పారు. సినిమా పేరేంటో? అని విజయవాడ మావయ్య అడిగితే... 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' అని చెప్పారు. పేరు బావుందని విజయవాడ మావయ్య చెబితే... సినిమా ఇంకా బావుంటుందని రావు రమేష్ తెలిపారు. సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం... ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆయనతో పాటుగా భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.ఆర్ట్ డైరెక్షన్: సురేష్ భీమంగని, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పీఆర్వో: పులగం చిన్నారాయణ, సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శ్రీహరి ఉదయగిరి, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల, నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: మోహన్ కార్య. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
మారుతినగర్లో నవ్వులు
రావు రమేష్, ఇంద్రజ జంటగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ‘‘ఈ చిత్రంలో మంచి వినోదాత్మక పాత్రలో నటించారు రావు రమేష్‌గారు. ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు లక్ష్మణ్ కార్య. ‘‘అజీజ్ నగర్, బీహెచ్ఈఎల్, కనకమామిడి, వనస్థలిపురం... ఇలా హైదరాబాద్ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. రావు రమేష్‌గారు ఈ సినిమాలో చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను నవ్వించడం పక్కా’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీతం: కల్యాణ్ నాయక్. -
ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!
అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సీఎం పెళ్లాం(కామన్ మ్యాన్ పెళ్లాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, సురేశ్ కొండేటి, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ..'ఇది వెరైటీ సినిమా అని కానీ చూశాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్‌తో పాటు పొలిటికల్ పాయింట్స్ నేపథ్యంలో ఉంటుంది. నిజంగా పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం.'అని అన్నారు. -
యువతకు సందేశం
‘‘నేటి యువతకు సందేశం ఇవ్వడానికే ‘రజాకార్’ సినిమా తీశారు. ఇలాంటి చిత్రం తీసే ధైర్యం చేసిన మా డైరెక్టర్ సత్యనారాయణకి థ్యాంక్స్’’ అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుశ్రేయ త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో యాటా సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రాజాసింగ్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ సినిమా టీజర్ చూస్తేనే ఎంతో కోపం వస్తోంది.. ఇక సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి’’ అన్నారు. ‘‘తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17 మా సినిమాకి కథా వస్తువుగా మారింది. ఆ రోజు జరిగిన విముక్తి పోరాటంతో ఈ సినిమా తీశాను’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘ఈ చిత్రం మన చరిత్ర గురించి అందరికీ తెలియజేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
యాంకర్ రష్మీపై వల్గర్ కామెంట్ చేసిన కమెడియన్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది. బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది. హీరోయిన్గా స్థిరపడాలనే ఆశతో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం బుల్లితెర యాంకర్‌గా స్థిరపడిపోయిందనే చెప్పవచ్చు. అక్కడ తను స్టార్ పొజీషన్‌లోనే ఉన్నారు కూడా. తను సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌లో కూడా విపరీతమైన క్రేజ్ తనకు ఉంది. (ఇదీ చదవండి: అరియానా లుక్‌పై ట్రోల్స్.. ఈ కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేశావా అంటూ..?) తాజాగా తను హోస్ట్ చేస్తున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌లో రష్మిని అవమానించినట్లేనని చెప్పవచ్చు . ఇదే షోలో ఇప్పటి వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ కూడా వచ్చి చేరాడు. తన స్కిట్లో భాగంగా రష్మిని ఏకంగా 'రాత్రికి వస్తావా' అంటూ డబల్ మీనింగ్ అర్థం వచ్చేలా చిల్లర డైలాగ్ వేశాడు. దీంతో రష్మీ కూడా నన్ను ఎందుకు రమ్మంటున్నావు అంటూ సమాధానం ఇస్తుంది. రాత్రికి ఎందుకు రమంటారో తెలియదా..? అంటూ ఆటో రాంప్రసాద్ తిరిగి అంటాడు. అప్పుడు రష్మితో సహా సెట్లోని అందరు కూడా షాక్ అయ్యారు. దీంతో అక్కడే ఉన్న ఇంద్రజ కలుగజేసుకుని ఏయ్... అనేసరికి వెంటనే తేరుకున్న ఆటో రాంప్రసాద్ 'ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ' మరో డైలాగ్‌తో కవర్ చేస్తాడు. ఇలాంటి కవరింగ్‌లు ఆ ప్రోగ్రామ్‌లలో సర్వసాధారణమైనా మరీ ఇంతలా దిగజారిన చిల్లర డైలాగ్‌లు ఉంటే ఎలా అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ సినిమా బడ్జెట్‌నే రూ. 200 కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లకు కొన్నదో తెలిస్తే) గతంలో ఇలాంటి ప్రోగ్రామ్లలోనే విష్ణుప్రియ ముక్కు మీద వేసిన పంచులు, తనను బాడీ షేమింగ్ చేస్తూ వేసిన జోకులు ఎన్నో అని చెప్పవచ్చు. నిజానికి ఆమె ముక్కు మీద ఓ వేయిసార్లు జోకులు వేసి ఉంటారేమో. ఆమెపైనే కాదు.. ఇమ్మూ కలర్ మీద, రష్మి మేకప్ మీద కూడా స్కిట్ల పేరుతో బోలెడు కామెంట్లు చేసేవారు. వాటిని సోషల్‌మీడియాలో నెటిజన్లు కూడా చాలాసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎదో రకంగా వచ్చిన అవకాశాలను పోగొట్టుకోకూడదని ఈ ప్రోగ్రామ్స్‌లోని నటులు కూడా వాటిని భరిస్తూనే ఉంటారని చెప్పవచ్చు. -
కాబోయే భర్తను పరిచయం చేసిన 'విజిల్' నటి
తమిళ నటుడు రోబో శంకర్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. తనకు కాబోయే భర్తను సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. డైరెక్టర్ శంకర్‌తో తరచూ రీల్స్ చేస్తున్న ఇంద్రజ అతడితోనే ఏడడుగులు వేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గుడిలో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మీరు పెళ్లి చేసుకున్నారా? అని అడిగారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ.. పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్ డేట్ చెప్తానంది. కాగా ఇంద్రజ బిగిల్(తెలుగులో విజిల్) సినిమాలో ఫుట్‌బాలర్ పాండియమ్మగా నటించింది. ఇందులో ఆమె నటించిన కామెడీ, సెంటిమెంట్ సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఆమె సర్వైవర్ అనే షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం ఆమె కార్తీ విరుమాన్ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఇంద్రజ. ఆమె తండ్రి రోబో శంకర్ కళక్క పోవదు యారు, అడు ఏడు ఈడు వంటి కామెడీ షోలలో మెరిశాడు. ఇదర్కు తానే ఆశైపట్టై బాలకుమార, వేలైను వందుత వేళ్లైకారన్, ఇరుంబు తిరై, విశ్వాసం, అన్నాత్తే చిత్రాలతో వెండితెరపైనా మెరిశాడు. View this post on Instagram A post shared by தொடர்வோம் கார்த்திக் (@dr.thodarvom_karthick) View this post on Instagram A post shared by Ani Anish (@anianishh) View this post on Instagram A post shared by INDRAJA SANKAR (@indraja_sankar17) చదవండి: పంజాబ్‌ను ఓ ఊపు ఊపిన సింగర్, ఇప్పటికీ వీడని హత్య మిస్టరీ -
హీరోగా మారిన రావు రమేశ్.. క్షణం క్షణం ట్విస్టులే
విలక్షణ నటుడు రావు రమేష్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’. పీబీఆర్ సినిమాస్ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నటి ఇంద్రజ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రోజు(ఫిబ్రవరి 24) సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ..వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. రావు రమేష్ లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్. కథ నచ్చి ఆయన ఓకే చేశారు. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం' అని చెప్పారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
Indraja: ఇది కదా స్పందన అంటే.. హామీ ఇచ్చిన క్షణం నుంచే...
సాక్షి, శ్రీకాకుళం: వినతిపత్రాలు తీసుకోవడం.. చూద్దాం, చేద్దాం.. అని దాటవేసే నేతల తీరుకు అలవాటు పడిన రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తున్న తీరు అద్భుతంగా కనిపిస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఆరోగ్య సమస్యలతో చేయూత కోసం తన వద్దకు ఎవరు.. ఏ సమయంలో వచ్చినా ఆయన అక్కున చేర్చుకుని తక్షణ వైద్య సహాయం అందేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా ప్రభుత్వం నుంచి భరించేందుకు సై అంటున్నారు. దానికి తాజా ఉదాహరణ ఉమ్మడి జిల్లాకు చెందిన చిన్నారి ఇంద్రజ. తల అసాధారణంగా పెరిగిపోయే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ పాపను తల్లిదండ్రులు ఈ నెల 23న నరసన్నపేట వచ్చిన సీఎం వద్దకు తీసుకెళ్లి తమ గోడు విన్నవించుకోవడమే ఆలస్యం.. సీఎంవో నుంచి కలెక్టర్ వర కు ముఖ్యమంత్రి అందరినీ ఉరుకులెత్తించారు. దాంతో అదే రోజు రాత్రి నుంచి జెమ్స్‌లో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్సకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష చెక్కును కూడా బాలిక తల్లిదండ్రు లకు ఇచ్చారు. ఇవన్నీ చూసి బాలిక తల్లిదండ్రులతో పాటు వారి గ్రామ ప్రజలు అబ్బుర పడుతున్నారు. మేనమామలా ఆదుకుంటానని ఇచ్చిన హామీని వైఎస్ జగన్ అక్షరాలా అమలు చేస్తూ ఆ కుటుంబంలో వెలుగులు నింపుతూ దేవుడు మామయ్యనని అనిపించుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. నవంబర్ 23 ఇంద్రజ తల్లితో చర్చిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ హామీ ఇచ్చిన క్షణం నుంచే... ► ఈ నెల 23న నరసన్నపేటలో తమ కుమార్తె ఇంద్రజను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌ను బాధితురాలి తల్లిదండ్రులు కోరారు. ► పది నిమిషాలకే సీఎం జగన్ నేరుగా వారితోనే మాట్లాడి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి నయం చేస్తామని భరోసా అందించారు. ► అదే రోజు సాయంత్రం 7 గంటలకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి.. డీఎంహెచ్‌వో మీనాక్షి పర్యవేక్షణలో ఇంద్రజను జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ►అదే రోజు రాత్రి 10 గంటల నుంచే జెమ్స్‌లో ఇంద్రజకు ప్రాథమిక వైద్య పరీక్షలు ప్రారంభించారు. న్యూరో సర్జన్ వైద్య బృందాల సమీక్షించాయి. ►ఈ నెల 24న జెమ్స్ ఆసుపత్రిలో ఇంద్రజకు ఉన్న వ్యాధి హైడ్రోసిఫలిస్ అని నిర్ధారించారు. ►ఈ నెల 25న జెమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు నేరుగా వైద్య పరీక్షలు చేసి అవసరమైతే హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు. తల్లిదండ్రుల నిర్ణయం మేరకు దేశంలో ఎక్కడైనా ఆపరేషన్ చేయించాలంటూ సీఎం కార్యాలయం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టుగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే చిన్నారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విశాఖలో చేయాలా, విజయవాడలోనా.. హైదరాబాద్‌లోనా అన్నది మీరే నిర్ణయించుకోవాలని కలెక్టర్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఆప్షన్ ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష చెక్ అందజేశారు. మా కుటుంబానికి దేవుడు... మా కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడు. 11 ఏళ్లుగా ఇంద్రజ చికిత్స కోసం అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిప్పాను. ప్రయోజనం లేదు. దిక్కు తోచని స్థితి. వావిలవలసకు చెందిన పాలూరి సిద్ధార్థ నరసన్నపేటకు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. పాపతో కలిసి అక్కడ నిలబడి ఉండగా ముఖ్యమంత్రి జగనన్న చూసి పరుగున వచ్చి మా పాప పడుతున్న బాధను పరిశీలించారు. మా కుమార్తె ఆపరేషన్‌కు భరోసా ఇచ్చారు. నా భర్త అప్పలనాయుడు కిడ్నీరోగి. రాజమండ్రిలో ఉంటున్నారు. మాకు ముగ్గురు కుమార్తెలు. ఇంటి వద్దనే పెద్ద పాప ఆలనా, పాలనా చూసుకొని ఉంటున్నాను. ఓ వైపు బతకడం కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమ్మల్ని ఆదుకున్నారు. ఆయన చల్లగా ఉండాలి. –మీసాల కృష్ణవేణి, ఇంద్రజ తల్లి, చిన్నశిర్లాం, రేగిడి మండలం -
చిన్నారి ఇంద్రజకు హైడ్రోసిఫలిస్
శ్రీకాకుళం రూరల్: విజయనగరం జిల్లా శిర్ల గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి, అప్పలనాయుడు దంపతుల కుమార్తె ఇంద్రజకు శ్రీకాకుళం మండలం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గురువారం చికిత్స మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ వెంటనే డీఎంహెచ్‌వో డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షితో మాట్లాడి జెమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేయించారు. న్యూరోసర్జన్ డాక్టర్ కృష్ణచైతన్య ఆ చిన్నారిని పరీక్షించి హైడ్రోసిఫలిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. పుట్టినప్పటి నుంచి ఇంద్రజ బ్రెయిన్లో నీరు చేరడంతో తల పెరిగిందని, శారీరక ఎదుగుదల నిలిచిపోయిందని చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగున్నా, రక్త పరీక్షలు, బ్రెయిన్ స్కానింగ్ చేయాల్సి ఉందన్నారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, అవసరమైతే బీవీ సెంటింగ్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వివరించారు. డాక్టర్ కృష్ణచైతన్యతోపాటు డాక్టర్ సుధీర్ కూడా ఉన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ స్పందించి చిన్నారి ఇంద్రజకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా కల్పించిన విషయం విదితమే. -
ఇంద్రజను ఆదుకుంటానని పేరెంట్స్ కు మాటిచ్చిన సీఎం జగన్
-
అలనాటి హీరోయిన్ ఇంద్రజ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందింది ఇంద్రజ. పలు సినిమాల్లో కథానాయికగా నటించి ప్రేక్షకులకు చేరువైన ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తాజాగా ఓ షోలో ఇంద్రజ తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయింది. తనది ప్రేమ వివాహమని వెల్లడించింది. తన పెళ్లికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే వచ్చారంది. అంతేకాదు, ఈ పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా రూ.7500 మాత్రమేనని చెప్పుకొచ్చింది. కాగా మలయాళంలో హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే ఇంద్రజ ప్రేమ వివాహం చేసుకుంది. 2006లో నటుడు, బిజినెస్మెన్ మహమ్మద్ అబ్సర్‌ను పెళ్లాడింది. వీరికి కుమార్తె సారా ఉంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె ఇటీవలే ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. స్టాండప్ రాహుల్ సినిమాలో హీరో తల్లిగా నటించి అలరించిన ఆమె ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. చదవండి: ‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్ పోతెన్ మృతి అతడిని రిజెక్ట్ చేసింది, పైలట్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది! -
‘పుష్ప’ పార్ట్ 2లో అలనాటి హీరోయిన్‌కు కీ రోల్!
అలనాటి తారలు వరసగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ వెండితెర ఏలిన స్టార్ హీరోయిన్లు తల్లి పాత్రలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాధిక, ఖుష్భు, ఆమని వంటి నటీమణులు రీఎంట్రీ ఇవ్వగా.. ఇటీవల రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ హీరో ప్రాజెక్ట్స్ సీనియర్ నటీమణులు ఎంట్రీ ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. తాజాగా 90ల్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నటి ఇంద్రజ కూడా వెండితెర ఎంట్రీకి రెడీ అయ్యింది. చదవండి: స్పెషల్ సాంగ్‌కు రష్మిక షాకింగ్ రెమ్యునరేషన్, నిర్మాతలకు చుక్కలు ఇప్పటికే బుల్లితెరపై అలరిస్తున్న ఆమె ‘స్టాండప్ రాహుల్’ మూవీతో బిగ్స్క్రీన్పై సందడి చేయబోతోంది. ఈ మూవీలో రాజ్ తరుణ్‌కు ఇంద్రజ తల్లి పాత్రలో నటించనుంది. ఇదిలా ఉంటే ఇప్పడు ఆమెకు పాన్ ఇండియా ఆఫర్ వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’.. ప్రస్తుతం పార్ట్ 2ను రూపొందుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో అ్లలు అర్జున్, రష్మిక మందన్నా లీడ్ రోల్లు పోషిస్తున్నారు. చదవండి: స్పెయిన్‌లో పెళ్లి సందడి హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్.. ప్రస్తుతం పుష్ప పార్ట్2 రూపొందించే బిజీలో అల్లు అర్జున్, సుక్కు ఉన్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం సుక్కు ఇంద్రజ స్పందించారట. ‘పుష్ప’ సినిమాలో ఉన్న నటీనటులే పుష్ప 2 లో ఉంటారని గతంలో సుకుమార్ క్లారిటీ ఇవ్వగా.. ఇప్పుడు కథలో కొన్ని మార్పులు చేసి, అందుకు తగ్గట్టే పాత్రలను ఎంచుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ కీ రోల్ కోసం ఇంద్రజ సుక్కు చర్చలు జరిపాడట, దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ప్రస్తుతం ఫిలిం దూనియాలో ఈ వార్త గుప్పుమంటోంది. ఇక ఇదే కనుక నిజమైతే ఇంద్రజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. -
వన్నెతరగని అందంతో .. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ (ఫోటోలు)
-
సంతానం లేనివారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగిచుకోవాలి