
Raj Tarun Starrer Stand Up Rahul Movie Trailer Out: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది క్యాప్షన్. శుక్రవారం మార్చి 4న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్‌ను స్టాండప్ కమెడియన్‌గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి. ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment