standup commedian
-
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Anu Vaidyanathan: సాహసాల నుంచి నవ్వుల వరకు
అనురాధ వైద్యనాథన్ ఇంజినీర్, ట్రయాథ్లెట్ (స్విమ్మింగ్, బైస్కిల్ రైడింగ్, రన్నింగ్), రైటర్, ఫిల్మ్ మేకర్. ఇప్పుడు స్టాండప్ కామెడీతో కూడా తన ప్రతిభను చాటుకుంటోంది. పిల్లలకు తల్లిగా తన అనుభవాలే ‘బిఫోర్ చిల్డ్రన్: ఆఫ్టర్ డైపర్స్’ (బీసి: ఏడీ). ఈ స్టాండప్ కామెడి షోతో నవ్వుల ప్రయాణాన్ని మొదలు పెట్టింది అను విశ్వనాథన్... దిల్లీలో పుట్టిన అను వైద్యనాథన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసింది. న్యూజిలాండ్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్ కాంటర్బరీ’లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేసింది. 2008లో ‘హాఫ్ ఐరన్‌మ్యాన్ 70.3 క్లియర్ వాటర్ వరల్డ్ ఛాంపియన్షిప్’ కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళగా, 2009లో ‘అల్ట్రామాన్కెనడా’ ఈవెంట్‌ను పూర్తి చేసిన మొదటి ఆసియా మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటీ రోపర్లలో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేసింది. తన సాహసాలకు ‘ఎనీ వేర్ బట్ హోమ్’ పేరుతో పుస్తక రూపం ఇచ్చింది. ఈ పుస్తకానికి మంచి స్పందన లభించింది. సినిమా అవకాశాలు వచ్చాయి. పిల్లల తల్లిగా తన అనుభవాలను ‘బిఫోర్ చిల్డ్రన్: ఆఫ్టర్ డైపర్స్’గా మలిచింది. ఈ స్టాండప్–కామెడీ షో ఘన విజయం సాధించింది. ►నవ్వించడం చాలా కష్టం’ అంటున్న అను అందుకోసం ‘కామిక్ పెర్ఫామెన్స్’ లో శిక్షణ తీసుకున్న తరువాతే స్టేజీ మీద అడుగు పెట్టింది. న్యూ మామ్స్‌లో సహజంగా ఉండే ఒత్తిడిని మాయం చేసి వారి మనసులను తేలిక చేయడంలో ఈ షో విజయం సాధించింది. ►తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో నుంచి కామెడీకి అవసరమైన ముడిసరుకు దొరుకుతుంది. మనం ఏదీ మరిచి΄ోవడం లేదుగానీ నవ్వును మాత్రం మరిచిపోతున్నాం. నవ్వు మనల్ని సంతోషంగానే కాదు చురుగ్గానూ ఉంచుతుంది. పిల్లలకు తల్లిగా నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. పేరెంట్‌గా ప్రతి రోజూ ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు కామెడీ షో కోసం ప్రయాణాలు చేస్తుంటాను. ఈ విషయంలో నా కుటుంబం నాకు అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది’ అంటుంది అను విశ్వనాథన్. -
లేడీ కమెడియన్ షాకింగ్ కామెంట్స్.. వ్యభిచారం కూల్ అంటూ!
ఒకప్పుడు కామెడీ అంటే నవ్వుకోవడం మాత్రమే. కానీ ఇప్పుడేమో కామెడీ అంటే ప్రతిదీ డబుల్ మీనింగ్ లేదంటే బూతు అన్నట్లు మారిపోయింది. టీవీ షోల్లోనూ మహిళల్ని కించపరిచేలా కామెడీ పేరుతో పంచులు వేస్తూనే ఉండటం మీరు చూసే ఉంటారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ కూడా వ్యభిచారంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కూల్ ప్రొఫెషన్ అని చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) సోషల్ మీడియా పుణ్యమా అని గత కొన్నాళ్ల నుంచి స్టాండప్ కమెడియన్స్ డిమాండ్ పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో ఆయా కమెడియన్స్ ఫేమస్ అయిపోతున్నారు. అయితే తమకు వస్తున్న ఆదరణ చూసి కొన్నిసార్లు నోరు జారేస్తున్నారు. తాజాగా ఓ లేడీ స్టాండప్ కమెడియన్ అలానే అనేసింది. 'వ్యభిచారం చాలా కూల్ ప్రొఫెషన్. వేరు చూసి చూడటం లాంటి ఏం ఉండవు. ఫ్రెషర్స్ కి కూడా అందులో జాబ్స్ దొరుకుతాయి' అని చెప్పుకొచ్చింది. అయితే ఈమె వ్యాఖ్యలపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది అని విదూషిని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) View this post on Instagram A post shared by Vidushi Swaroop (@vidushiswaroop) -
హైదరాబాద్‌లో వీర్‌దాస్ స్టాండప్ కామెడీ షో.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: నగరానికి మరో స్టాండప్ కమెడియన్ రాక ఖాయమైంది. డెహ్రాడూన్‌కి చెందిన వీర్‌దాస్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీ షోలకు ప్రసిద్ధి చెందారు. అయితే చాలా మంది కమెడియన్లకు భిన్నంగా ఆయన అటు కమెడియన్‌గా ఇటు నటుడిగా కూడా రాణిస్తున్నారు. గతంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇటీవల వరుసగా కొన్ని షోస్‌లో ఆయన హాస్యంపై సంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 10న బెంగళూరులో ఆయన ప్రదర్శన రద్దయింది. అనంతరం తమ నగరంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వాంటెడ్ టూర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నగరానికి వచ్చి మాదాపూర్ శిల్పకళావేదికలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ప్రదర్శనకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. (క్లిక్: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!) -
విషమంగా నటుడి ఆరోగ్యం, వెంటిలేటర్‌పైనే చికిత్స
జిమ్ చేస్తూ ఇటీవల గుండెపోటుకు గురైన హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన మెదడు కూడా దెబ్బతిందని తాజా పరీక్షల్లో తేలినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. చదవండి: రిషబ్‌పై ఊర్వశి రీకౌంటర్, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తుండగా శ్రీవాస్తవ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన జిమ్ ట్రెయినర్ వెంటనే శ్రీవాస్తవను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ బుధవారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. రాజు శ్రీవాస్తవకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు ప్రస్తుతం ఆయన వెంటిలెటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన నిన్న ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ట్రెడ్‌మిల్‌పై వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయన ట్రైనర్ రెండుసార్లు సీపీఆర్ చేసి ఆనంతరం ఆస్పత్రికి తరలించినట్లు శ్రీవాస్తవ పీఆర్ అజిత్ సక్సేనా తెలిపారు. -
జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు!
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు ఉదయం జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు చాతిలో నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు రాజు పీఆర్ అజిత్ సక్సేనా తెలిపాడు. వివరాలు... బుధవారం ఉదయం జిమ్‌లో ట్రెండ్మిల్పై ఆయన వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ దీంతో ఆయన ట్రైనర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు రాజు పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన హెల్త్‌పై వైద్యులు అప్డేట్ ఇవ్వనున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఫిట్నెస్ కోసం సినీ నటీనటులు జిమ్‌లో గంటలు గంటలు కష్టడుతూ అతిగా కసరత్తులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. -
షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన వివాదాస్పద కమెడియన్
తరచూ వివాదాల్లో నానుతూ ఉండే స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ. ప్రస్తుతం ఇతడు కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న లాకప్ షోలో ఓ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఈ మధ్యే తోటి కంటెస్టెంట్ అంజలి అరోరా ఇతడికి ఐ లవ్యూ చెప్పగా తెగ సిగ్గుపడిపోయాడు మునావర్. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందో లేదో అప్పుడే పెద్ద బాంబు పేల్చాడు కమెడియన్. స్క్రీన్‌పై బ్లర్ ఫొటో పెట్టి దాని గురించి నిజాలు చెప్పమంటూ కంగనా అడగ్గా తనగురించి ఎవరికీ తెలియని ఓ షాకింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు. తనకు ఇదివరకే పెళ్లైందన్న విషయాన్ని వెల్లడించాడు. భార్యతో పాటు ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలిపాడు. కాకపోతే తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నానని తన కొడుకు కోసమే ఈ షోకు వచ్చానన్నాడు. కాగా గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన వివాదాస్పద స్టాండప్ ఆర్టిస్ట్. హాస్య ప్రదర్శనల్లో మునావర్ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేశాడితడు. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. గతంలో ఎన్ఆర్సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గతేడాది జనవరి 1న ఇండోర్ పోలీసులు మునావర్‌ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలబ్రిటీ అయ్యాడు. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) u can remove ur emotions frm ur face,hide it through expression. Bt u nvr remove or hide any emotions frm ur precious eyes We are with you always @munawar0018 No matter what happened in ur past, Or wht will b the consequences. We'll be always with u MUNAWAR OWNING LOCKUPP pic.twitter.com/FNxJteuY9K — 💜MOMO⁷💜 (@MOMO_love_lov) April 10, 2022 The same picture shown in a #LockUpp How blindly fans were saying tht she's his sister, but #munawarfaruqui accepted tat she's his wife n kid Now who's news is fake? I feel munawar faked his personality in #LockUpp & his fans are blind pic.twitter.com/sSEgSmnUje — Chetana🌼No Diplomacy (@Chetana_CND) April 9, 2022 చదవండి: బ్రహ్మాస్త్ర లవ్ పోస్టర్.. అలియా-రణ్‌బీర్‌ల పెళ్లికి హింట్ ! అదో పెద్ద స్కామ్.. హృతిక్‌పై కంగనా సంచలన కామెంట్స్! -
వినోదాత్మకంగా రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' ట్రైలర్..
Raj Tarun Starrer Stand Up Rahul Movie Trailer Out: 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాజ్ తరుణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'అనుభవించు రాజా' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా శాంటో మోహన్ వీరంకి దర్శకత్వంలో 'స్టాండప్ రాహుల్' సినిమాలో నటిస్తున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాకు కూర్చుంది చాలు అనేది క్యాప్షన్. శుక్రవారం మార్చి 4న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ డైలాగ్‌ను స్టాండప్ కమెడియన్‌గా రాజ్ తరుణ్ పలకడం వినోదాత్మకంగా ఉంది. ఆద్యంతం కామెడీ, భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పలు సంభాషణలు బాగా అకట్టుకుంటున్నాయి. ఇందులో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ట్రైలర్లో ప్రకటించారు. -
హైదరాబాద్‌లో స్టాండప్ కమెడియన్ మునావర్ షో.. తగ్గేదెవరో.. నెగ్గేదెవరో?
Munawar Faruqui Hyderabad Show: నూతన సంవత్సరం మొదలవక ముందే కొత్త వివాదాన్ని వెంటబెట్టుకు వస్తోంది. జనవరి 9న నగరంలో జరగనున్న కామెడీ షో... సెంటరాఫ్ పాలిటిక్స్‌గా మారి సీరియస్ రంగు పులుముకుంది. వివాదాలకు కేరాఫ్ లాంటి ఆ స్టాండప్ కమెడియన్ సిటిజనులను నవ్విస్తాడా.. గొడవలకు తావిస్తాడా? అనేది తేలాల్సిందే. - సాక్షి, హైదరాబాద్: ‘సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనుమతించినా.. విధ్వంసమే గెలిచింది. కళాకారుడు ఓడిపోయాడు. ఇక సెలవు’ అంటూ పోస్ట్ చేశాడు స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ. తాజాగా తన బెంగళూర్ షో రద్దయిన తర్వాత అతని స్పందన ఇది. ఈ స్పందనే అతడిని హైదరాబాద్‌లోని కొందరికి చేరువ చేసింది. నగరానికి రా రమ్మంటూ ఆహ్వానించేలా పురిగొల్పింది. నవ్వులా... నువ్వు రా.. తన షో రద్దవడంపై ఫారూఖీ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో హైదరాబాద్ రావాలంటూ నెటిజనులు అతడిని ఆహ్వానించారు. అదే సమయంలో కామెడీ షోలను సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదనీ, రాజకీయ కారణాల వల్ల మేం మునావర్ షో వంటివి క్యాన్సిల్ చేయలేమని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వంపై ఎవరు చేసే విమర్శలనైనా స్వాగతిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌కు రావాలనీ తమది అచ్చమైన కాస్మొపాలిటన్ సిటీ అని స్పష్టం చేశారు. దీంతో మునావర్ సిటీలో షో నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. బెంగళూర్‌లో ముగిసిన వివాదం నగరంలో మొదలైంది. చదవండి: కేటీఆర్ కౌంటర్ ట్వీట్ కామెడీ నుంచి కాంట్రావర్సియల్ దాకా.. గుజరాత్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ... దేశంలోనే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చిన అత్యంత వివాదాస్పద స్టాండప్ ఆర్టిస్ట్. హాస్య ప్రదర్శనల్లో మునావర్ ఎంచుకునే అంశాలన్నీ రాజకీయ సమకాలీన అంశాల చుట్టే ఉంటాయి. గుజరాత్ అల్లర్ల సమయంలో తన కుటుంబం పడిన ఇబ్బందుల్ని కూడా కామెడీగా మార్చి బీజేపీపై సెటైర్లు వేస్తాడితడు. గతంలో ఎన్ఆర్సీ, ఢిల్లీ గొడవలపై ఆయన చేసిన కామెడీ సాంగ్ కూడా వివాదాస్పదమైంది. హిందూ దేవతలపై, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడని గత జనవరి 1న ఇండోర్ పోలీసులు మునావర్‌ని అరెస్ట్ చేశారు. నెల రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. తన షోస్‌లో కుబేరులైన అంబానీ, అదానీపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. జర్నలిస్టుల్నీ వదలని మునావర్.. సుశాంత్ రాజ్‌పుత్ కేసులో రిపబ్లిక్ టీవీ కథనాలపై, అర్నాబ్ గోస్వామిపైనా సెటైర్లు వేశాడు. ఈ నేపథ్యంలో హిందూ దేవతల్ని బీజేపీ నాయకుల్ని కించపరుస్తున్నాడని ఆ పార్టీ అనుబంధ సంస్థలు దండెత్తడంతో.. గడిచిన 2 నెలల్లో 12 కామెడీ షోలు రద్దయ్యాయి. గతంలోనూ సిటీలో షో మునావర్ గతంలో కూడా నగరానికి వచ్చాడు. తన హాస్య ప్రదర్శనల ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చివరి సారిగా గత డిసెంబర్ 20న మునావర్ నగరంలో షో నిర్వహించాడు. ఆ షో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇండోర్‌లో షో నిర్వహించిన మునావర్... అక్కడ అరెస్ట్ అయి నెల రోజులు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత అతను మరింత వివాదాస్పద సెలెబ్రిటీ అయ్యాడు. తాజాగా బెంగళూరు షో క్యాన్సిల్ అయిన తర్వాత తీవ్ర నిర్వేదానికి లోనైన మునావర్ ఇక తాను స్టాండప్ కామెడీకి గుడ్ బై చెప్తున్నా అని ప్రకటించాడు. అయితే నగరంలోని అభిమానుల నుంచి వెల్లువెత్తిన మద్దతు మరీ ముఖ్యంగా కేటీఆర్ ప్రసంగం మునావర్‌ను సిటీలో కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు స్పూర్తినిచ్చాయి. అగ్గి ‘రాజ’కుంది.. గుజరాత్లో పొమ్మంటే మునావర్ ఇక్కడకి వస్తున్నాడు అన్నారు సిటీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే తాము అతడిని తరిమికొట్టడానికైనా రెడీ అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్పందించారు. హిందూ వ్యతిరేకులను తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమన్నారు. తమ యువమోర్చా కార్యకర్తలు మునావర్‌ని అడ్డుకుని తీరతారని స్పష్టం చేశారు. ఓ వైపు ప్రభుత్వం షో నిర్వహణకు అనుకూలంగా ఉంటే, మరోవైపు ప్రతిపక్షం అడ్డుకుంటామంటున్న నేపథ్యంలో నిరసనలకు తలొగ్గి మునావర్ వెనుకంజ వేస్తాడా? లేక నగరంలో షో చూపిస్తాడా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా... నగరంలో ఈ నవ్వుల ప్రదర్శన సృష్టించిన వివాదం ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా ముగిసిపోవాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు. వాస్తవంలోనుంచే హాస్యం.. ట్రూత్ అనే ఆంగ్ల పదంలో ఉండే హెచ్ అక్షరం హ్యూమర్‌ని ప్రతిబింబిస్తుంది. చుట్టూ జరుగుతున్న వాస్తవిక సంఘటనల నుంచే హాస్యం పుడుతుంది. కళను కళగానే చూడాలి. హైదరాబాద్ నుంచి వెళ్లి, ఇండోర్‌లోని మా సొంత ఊరిలో రెండో ప్రదర్శన నిర్వహించిన రోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మేం కూడా కొంత టెన్షన్ పడ్డాం. ఇలాంటి భయాందోళనలు కళకు, కళాకారులకు మంచిది కాదు. క్యాస్టిజమ్, సెక్సిజమ్, బాడీ షేమింగ్, వెర్బల్ వయొలెన్స్, హోమో ఫోబియా, ట్రాన్స్ ఫోబియా తదితర సంకెళ్ల నుంచి కళను విముక్తం చేయాలి. – శశి అండ్ మాన్సి (స్టాండప్ కామెడీ కళాకారులు) -
అందుకోసం చాలా కష్టపడ్డాను, అయినప్పటికీ: పూజా హెగ్డే
‘‘స్టాండప్ కమెడియన్‌గా చేయడం అంత సులువేం కాదు’’ అంటున్నారు పూజా హెగ్డే. అఖిల్ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో స్టాండప్ కమెడియన్ వైభ పాత్రలో నటించారు పూజా హెగ్డే. ఈ పాత్ర చేయడానికి ఎలాంటి కృషి చేశారో పూజా హెగ్డే చెబుతూ – ‘‘రోజుల తరబడి చేసిన సాధనను ఒక గంటలోనో, అరగంటలోనో వేదికపై స్టాండప్ కమెడియన్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. పంచ్ లైన్స్‌తో వీక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం స్టాండప్ కామేడీ బేస్ మీద తీస్తున్నది కాదు. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. ఈ సినిమాలో నా పాత్ర స్టాండప్ కమెడియన్. సన్నివేశాలకు అవసరమైనంతవరకు మాత్రమే నా స్టాండప్ కామెడీ స్కిల్స్‌ను చూపించాలి. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాను. ముఖ్యంగా చాలామంది స్టాండప్ కమెడియన్స్‌ని కలిసి మాట్లాడాను. స్టేజ్‌పై వారు సందర్భానుసారంగా విసిరే పంచ్‌లు, వ్యూయర్స్‌కి తగ్గ రియాక్షన్స్ ఇవ్వడం వంటి వాటి గురించి వారితో చర్చించాను. అందుకే బాగా నటించగలిగాను. అయితే నటించడం మొదలుపెట్టాక స్టాండప్ కమెడియన్ రోల్ చేయడం నేననుకున్నంత సులువేం కాదని అర్థమయింది’’ అని పేర్కొన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో మరో ఇద్దరు లేడీ స్టాండప్ కమేడియన్స్ కోసం దాదాపు వందమందిని ఆడిషన్ చేశారట. ఈ చిత్రం జూన్ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: రెమ్యునరేషన్ పెంచిన తమన్.. ఒక్కో మూవీకి ఎంతంటే.. -
బెదిరింపులు చెల్లవ్
మగాళ్లనైతే చంపుతామంటారు. స్త్రీలను?... రేప్ చేస్తామంటారు. స్త్రీలు స్వేచ్ఛను కోరినా, స్వతంత్రాన్ని సాధించుకున్నా, నిరసన వ్యక్తం చేసినా, అన్యాయంపై గళమెత్తినా, కొత్తమార్గం చేపట్టినా, ఒక అభిప్రాయాన్ని ప్రకటించినా నచ్చని వారి నుంచి వచ్చే ఒకే ఒక బెదిరింపు ‘రేప్ చేస్తాం’. ఈ మాటతో బెదిరించవచ్చని, దీనికి ఆమోదం ఉందని అనుకునేవారు మన దేశంలో ఉన్నారు. కాని ఇలా నోరు పెగలితే లాకప్‌లోకి వెళ్లాల్సుంటుందని తాజా ఉదంతం చెబుతోంది. మనుషులు ఒక్కోసారి నచ్చనిది మాట్లాడతారు. ఒక్కోసారి హేళన కొద్దీ మాట్లాడతారు. ఒక్కోసారి పొరపాటుగా మాట్లాడతారు. మరోసారి అనాలోచితంగా మాట్లాడతారు. ప్రతిసారీ అందరూ అన్ని మాటలను ‘నమ్మి’ మాట్లాడకపోవచ్చు. తర్వాత చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు. క్షమాపణలు కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో పురుషులను ‘శారీరకంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తుంటాయి. స్త్రీలకు మాత్రం ‘లైంగికంగా హింసిస్తాం’ అని బెదిరింపులు వస్తాయి. స్త్రీలను లైంగికంగా హింసించే అనుమతి ఉందని అనుకోవడం అల్పమైన పురుష భావజాలం. దీనిని సరి చేయడానికి స్త్రీ, పురుష ఆలోచనాపరులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ భావజాలం మారాల్సి ఉంది. తాజాగా స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా ఉదంతం పురుషులు మాట్లాడే ‘బెదిరింపు భాష’ను సరి చేయించాల్సిన అవసరాన్ని తెలియ చేసింది. ఆమెను వడోదరాకు చెందిన శుభమ్ మిశ్రా అనే వ్యక్తి ‘రేప్ చేస్తానని’ బెదిరించాడు. ఆమె చేసిన పనితో అతనికి అసమ్మతి ఉండటం వల్ల అతడు ఇచ్చిన వార్నింగ్ ఇది. అగ్రిమా జాషువా ఏం చేసింది? పూణెకు చెందిన అగ్రిమా (28) ముంబైలో ఇంజినీరింగ్ చదువుతూ చివరి సంవత్సరంలో చదువు మానేసి స్టాండప్ కమెడియన్‌గా మారింది. ‘ఇదే తన అసలు సత్తా’ అని ఆమె నిశ్చయించుకొని తన తల్లితండ్రుల స్వరాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ మీద ‘ఉత్తర ప్రదేశ్ మన దేశపు టెక్సాస్’ అని ఒక వీడియో చేసింది. దానికి చాలా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఆమె చేసిన షోస్ అభిమానులు పెరిగారు. అయితే సంవత్సరం క్రితం ఒక షోలో ఆమె ముంబై సముద్ర తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన భారీ ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు శివాజీ గురించి కాకపోయినా రాజకీయ నాయకులను వెర్రిగా అభిమానించేవారి మూఢభక్తి గురించే అయినా అవి కొంతమంది మనోభావాలను గాయపరిచాయి. వెంటనే ఆ వీడియోను అగ్రిమా తొలగించింది. క్షమాపణలు చెప్పింది. తాజాగా మళ్లీ ఆ వీడియోను ఎవరో సర్క్యులేషన్లో పెట్టారు. మహారాష్ట్రకు చెందిన ఒక ఎం.ఎల్.ఏ అగ్రిమాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో మళ్లీ అందరి దృష్టి అగ్రిమాపై పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ధాక్రే దీనిపై పోలీసు విచారణకు ఆదేశించారు. కొందరు ఆమెను చంపుతామని బెదిరించారు. కాని వడోదరాకు చెందిన శుభమ్ మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను ‘రేప్ చేస్తానని’ బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశాడు. నిరసన అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని, కాని స్త్రీలను హెచ్చరించాల్సి వచ్చినప్పుడల్లా రేప్ భాషను ఎందుకు వాడతారని శుభమ్ మిశ్రా వీడియో దరిమిలా దేశవ్యాప్త స్త్రీలు నిరసన వ్యక్తం చేశారు. అయితే శుభమ్ మిశ్రా ఈ బెదిరింపుపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని వడోదరా పోలీసులు రంగంలోకి దిగి శుభమ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. శుభమ్ పెట్టిన వీడియోను ‘సు మోటో’గా తీసుకున్నామనీ అతనిపై ఐ.పి.సి 294, 354 (ఏ), 504, 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలియ చేసింది. మహిళా కమిషన్ విచారణ స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువాకు వచ్చిన రేప్ బెదిరింపు దృష్టికి రావడంతోటే జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ‘మహిళలకు ఆన్లైన్ స్పేస్ కల్పించడంలో, సైబర్ సెక్యూరిటీని ఇవ్వడంలో, వారు స్వేచ్ఛగా సైబర్ స్పేస్‌ను వాడుకునేలా చేయడంలో జాతీయ మహిళా కమిషన్ రక్షణగా ఉంటుంది’ అని దాని చైర్పర్సన్ రేఖా శర్మ గుజరాత్ డి.జి.పికి లేఖ రాశారు. మర్యాదగా వ్యవహరించాలి సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే విషయాలు అనేకం జరుగుతుంటాయి. భావోద్వేగాల తక్షణ స్పందనను కోరుతుంటాయి. ఆ సమయంలో సంయమనం పాటించాలి. ముఖ్యంగా స్త్రీల విషయంలో మాట్లాడే భాష ప్రజాస్వామికంగా, సమస్థాయిలో, చర్చకు యోగ్యంగా ఉండాలి. లేని పక్షంలో బాధితులు ఊరుకున్నా చట్టం ఊరుకోదని ఈ ఉదంతం తెలియచేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
సిటీకి ‘స్టాండప్’ స్టార్
సాక్షి, సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ ఆకాశ్ మెహతా తన ‘నాస్టీ’ ప్రదర్శన ద్వారా నగరంలోని హాస్యప్రియులకు నవ్వుల విందు అందించనున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహక సంస్థ కౌంటర్ కల్చర్ ప్రతినిధులు గురువారం తెలిపారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని మూన్‌షైన్ ప్రాజెక్టులో ఆదివారం జరుగనున్న లైవ్ కామెడీ షోలో ఆయన పాల్గొంటారని, సాయంత్రం 5గంటలకు షో ప్రారంభమవుతుందని చెప్పారు. -
కోర్టుకెక్కిన టాప్ కమెడియన్
స్టాండప్ కామెడీ షోలతో టీవీ ప్రేక్షకులకు బాగా చేరువైన కమెడియన్ కపిల్ శర్మ.. బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో తన అపార్టుమెంటు విషయంలో బీఎంసీ అధికారులు లంచం అడిగారంటూ ప్రధానమంత్రినే ట్యాగ్ చేసి ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారిగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. కపిల్ శర్మ అక్రమ కట్టడం కట్టారని, అందువల్ల దాన్ని కూల్చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిచెప్పారు. పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలంలో అక్కడ కట్టడాలు కట్టారని, అందువల్ల అది అక్రమ నిర్మాణమని అన్నారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మతో పాటు బిల్డర్ మీద కూడా బీఎంసీ అధికారులు కేసు పెట్టారు. అయితే అపార్టుమెంటులో కొంత భాగాన్ని కూల్చేయాలన్న బీఎంసీ అధికారుల ఆదేశాలను సవాలుచేస్తూ కపిల్ శర్మ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.