
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు ఉదయం జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు చాతిలో నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు రాజు పీఆర్ అజిత్ సక్సేనా తెలిపాడు. వివరాలు... బుధవారం ఉదయం జిమ్‌లో ట్రెండ్‌మిల్‌పై ఆయన వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’
దీంతో ఆయన ట్రైనర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు రాజు పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన హెల్త్‌పై వైద్యులు అప్‌డేట్ ఇవ్వనున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఫిట్‌నెస్ కోసం సినీ నటీనటులు జిమ్‌లో గంటలు గంటలు కష్టడుతూ అతిగా కసరత్తులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే.