raju srivastava
-
Raju Srivastava: బంధువులు అవమానించినా.. అంతా మెచ్చుకునే స్థాయికి..
రాజు శ్రీవాత్సవ అలియాస్ గజోధార్ భయ్యా.. కామెడీ సర్క్యూట్లో ఈ పేరు ఎంతో పాపులర్. దశాబ్దాలుగా కోట్ల మందికి నవ్వులు పంచిన ఆయన అనారోగ్యంతో మరణించడం బాలీవుడ్ వర్గాల్లో విషాదం నింపింది. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి నుంచి దేశ ప్రధాని మోదీ దాకా.. అంతా మెచ్చిన మంచి మనిషి ఆయన. మైనే ప్యార్ కియా చిత్రంలో తళుక్కున మెరిసే క్యారెక్టర్ నుంచి.. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో పాల్గొనడం లాంటి ప్రస్థానంతో సాగింది రాజు శ్రీవాత్సవ జీవితం. డజను పైగా సినిమాలతో, పదుల సంఖ్యలో టీవీ షోలతో, వందల సంఖ్యలతో స్టేజ్ షోలతో నార్త్ అభిమానులను ఉర్రూతలూగించారాయన. భౌతికంగా ఆయన లేకున్నా.. ఆయన లెగసీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోతుందని నివాళులు అర్పిస్తున్నారు ఇప్పుడంతా. టీచర్లను ఇమిటేట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో 1963లో జన్మించారు రాజు శ్రీవాత్సవ. ప్రముఖ కవి రమేష్ చంద్ర శ్రీవాత్సవ తనయుడు ఈయన. చిన్నతనంలోనే మిమిక్రీ అలవాటు చేసుకుని.. తోటి విద్యార్థులను అలరించేవారు. ముఖ్యంగా టీచర్లను అనుకరిస్తూ ఆయన చేసే మిమిక్రీని.. ఆ టీచర్లు సైతం ఆస్వాదించేవారట. అయితే.. ► చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను 2020 ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు. బంధువులంతా ఆయన చేసే హాస్యాన్ని చాలా ఏళ్లపాటు అవమానంగా భావించేవారట. పిల్లలు చదువుకోవాల్సింది పోయి.. ఇతరులపై జోకులు వేస్తూ గడపడమేంటని శ్రీవాత్సవ తల్లిదండ్రులను బంధువులు మందలించేవాళ్లట. అంతేకాదు తన కామెడీ వల్ల కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని, ఆ పనిని ఆపించేయాలని ఒత్తిడి చేయించారట కూడా. కానీ, ఇవేవీ శ్రీవాత్సవను హస్య ప్రస్థానాన్ని ఆపలేకపోయాయి. ► 90వ దశకం కంటే ముందే.. వినోద రంగంలో రాజు శ్రీవాస్తవ ప్రయాణం మొదలైంది. 1988లో వచ్చిన అనిల్ కపూర్ తేజాబ్ చిత్రం ఆయన డెబ్యూ చిత్రం. ఆపై షారూక్, సల్మాన్, గోవిందా, హృతిక్ రోషన్ వంటి తారల చిత్రాల్లో నటించారు రాజు శ్రీవాస్తవ. అయితే ఆయనకు పేరుప్రఖ్యాతలు దక్కింది మాత్రం స్టేజ్ మీద పండించిన కామెడీతోనే. అదీ.. మరో బాలీవుడ్ హస్య దిగ్గజం జానీ లీవర్ గుర్తించిన తర్వాతే!. ► ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌లో పాల్గొన్న తర్వాతే రాజు శ్రీవాస్తవ జీవితం మరో మలుపు తిరిగింది. షో రన్నరప్‌గా నిలిచినా కూడా.. తన హాస్యంతో అశేష అభిమానం గెల్చుకున్నారాయన. ఆపై రాజు హాజిర్ హోం, కామెడీ కా మహా ముఖాబలా, లాఫ్ ఇండియా లాఫ్, కామెడీ నైట్స్ విత్ కపిల్, గ్యాంగ్ ఆఫ్ హసీపూర్ లాంటి షోలలో పాల్గొన్నారు. బిగ్‌బాస్-3లోనూ ఆయన కంటెస్టెంట్‌గా అలరించారు. అమితాబ్ కూడా వీరాభిమానే.. రాజు అమితంగా ఆరాధించే వ్యక్తి బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. చిన్నతనం నుంచి ఆయన గొంతును అనుకరిస్తూ హాస్యం పడించేవాడట ఆయన. ఈ క్రమంలో.. దీవార్ నుంచి డైహార్డ్ ఫ్యాన్ అయిపోయాడు శ్రీవాత్సవ. ఎంతలా అంటే.. సినిమా పోస్టర్లను తన ఇంట్లో అతికించుకునేంతలా. అమితాబ్ తరహాలో జుట్టు క్రాఫ్ చేయించుకుని.. మరీ మిమిక్రీ వేషాలు వేసేవాడట రాజు శ్రీవాత్సవ. ► రాజు శ్రీవాత్సవకు ఎలాగైతే అమితాబ్ అభిమాన నటుడో.. అలాగే అమితాబ్‌కు కూడా రాజు శ్రీవాత్సవ ఫేవరెట్ కమెడియన్ కూడా. చివరికి రాజు శ్రీవాత్సవ ఆస్పత్రి పాలైన తర్వాత ‘లే.. నీకు చాలా పని ఉంది’ అంటూ అమితాబ్ స్వయంగా వాయిస్ సందేశాలు పంపి.. రాజు శ్రీవాత్సవ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారంటే అర్థం చేసుకోవచ్చు అమితాబ్‌కు ఎంత అభిమానమో!. ► రాజు కేవలం.. బాలీవుడ్ ప్రముఖులను మాత్రమే ఇమిటేట్ చేస్తాడనుకుంటే పొరపాటే. రాజకీయ నేతలను కూడా భలేగా ఇమిటేట్ చేస్తారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున కాన్పూర్ నుంచి పోటీ చేయాలనుకుని టికెట్ తీసుకుని.. సరైన మద్దతు లేనందున టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారాయన. ఆపై బీజేపీలో చేరారు. ► భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజు శ్రీవాత్సవ కామెడీ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌కు ఈ కమెడియన్‌ను నామినేట్ చేశారు ప్రధాని మోదీ. దీంతో.. స్టేజ్ షోలు నిర్వహించి మరీ ఆ కార్యక్రమాన్ని ప్రచారం చేశారాయన. ► శ్రీవాత్సవ 1993లో షికాను వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతరా, ఆయుష్మాన్ అనే ఇద్దరు పిల్లలు. గతంలో.. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై జోకులు వేస్తుండడంతో చంపేస్తామంటూ పాక్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ► ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీన జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలిన ఆయన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సెప్టెంబర్ 21వ తేదీన కన్నుమూశారు. -
విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా గత నెల ఆగస్ట్‌లో జిమ్ చేస్తూ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో జిమ్ ట్రైయినర్ శ్రీవాత్సవను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా శ్రీవాత్సవ యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. -
15 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన కమెడియన్
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఎట్టకేలకు స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని నటుడి వ్యక్తిగత కార్యదర్శి గర్విత్ నారంగ్ గురువారం మీడియాకు వెల్లడించాడు. కాగా ఆగస్టు 10న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రాజు శ్రీవాస్తవకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని, అందరూ అతడి కోసం ప్రార్థించడంటూ ఇటీవల నటుడి సన్నిహితుడు సునీల్ పాల్ ఓ వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే! ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించి 15 రోజుల తర్వాత కమెడియన్ స్పృహలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Raju Srivastava gained consciousness today after 15 days, he's being monitored by doctors at AIIMS Delhi. His health condition is improving: Garvit Narang, his Personal Secy He was admitted here on Aug 10 after experiencing chest pain & collapsing while working out at the gym. pic.twitter.com/kmPfqRey1a — ANI (@ANI) August 25, 2022 చదవండి: బెడ్రూమ్లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్ సూర్య కొత్త సినిమాకు శ్రీకారం.. దర్శకుడిగా ఆ మాస్ డైరెక్టర్ -
కమెడియన్ పరిస్థితి విషమం, పని చేయని బ్రెయిన్!
జిమ్ చేస్తూ ఇటీవల గుండెపోటుకు గురైన కమెడియన్, నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స అందుకుంటున్న అతడి బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని, దయచేసి అందరూ అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండంటూ నటుడి సన్నిహితుడు సునీల్ పాల్ ఓ వీడియో షేర్ చేశాడు. కాగా రాజు శ్రీవాస్తవకు ఆగస్టు 10న గుండెపోటు రాగా అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Bollywood Celebrities (@bollycelebrities_) చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! భారీ ఆఫర్‌ను వదులుకున్నా.. ఎమోషనల్ అయిన ఛార్మి -
విషమంగా నటుడి ఆరోగ్యం, వెంటిలేటర్‌పైనే చికిత్స
జిమ్ చేస్తూ ఇటీవల గుండెపోటుకు గురైన హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన మెదడు కూడా దెబ్బతిందని తాజా పరీక్షల్లో తేలినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. చదవండి: రిషబ్‌పై ఊర్వశి రీకౌంటర్, ‘కౌగర్ హంటర్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తుండగా శ్రీవాస్తవ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన జిమ్ ట్రెయినర్ వెంటనే శ్రీవాస్తవను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
నటుడికి గుండెపోటు, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న వైద్యులు
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ బుధవారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. రాజు శ్రీవాస్తవకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు ప్రస్తుతం ఆయన వెంటిలెటర్‌పై ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన నిన్న ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ట్రెడ్‌మిల్‌పై వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయన ట్రైనర్ రెండుసార్లు సీపీఆర్ చేసి ఆనంతరం ఆస్పత్రికి తరలించినట్లు శ్రీవాస్తవ పీఆర్ అజిత్ సక్సేనా తెలిపారు. -
జిమ్ చేస్తుండగా నటుడికి గుండెపోటు!
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు ఉదయం జిమ్‌లో వ్యాయవం చేస్తుండగా ఆయనకు చాతిలో నొప్పి రావడంతో వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్‌కి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు రాజు పీఆర్ అజిత్ సక్సేనా తెలిపాడు. వివరాలు... బుధవారం ఉదయం జిమ్‌లో ట్రెండ్మిల్పై ఆయన వ్యాయమం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చదవండి: ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ దీంతో ఆయన ట్రైనర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు రాజు పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసియూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయన హెల్త్‌పై వైద్యులు అప్డేట్ ఇవ్వనున్నారట. దీంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు రాజు శ్రీవాస్తవ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా ఫిట్నెస్ కోసం సినీ నటీనటులు జిమ్‌లో గంటలు గంటలు కష్టడుతూ అతిగా కసరత్తులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. -
బీజేపీలోకి జగదాంబికా పాల్, రాజు శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిననాటి నుంచి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ నేత జగదాంబికా పాల్, ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ బుధవారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసిన జగదాం బికా పాల్ ఇటీవలే లోక్‌సభలో ఎంపీ పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీ నామా చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మూడుసార్లు ఎన్నికై, మంత్రి పదవులు కూడా సమర్థవంతంగా నిర్వహించిన ఈ సీనియర్ నేత పార్టీని వీడడం కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగానే రాజకీయ పండితులు చెప్పుకుంటున్నారు. ఇక హాస్యనటుడిగా అందరికీ పరిచయమున్న వ్యక్తిగా చెప్పుకునే రాజు శ్రీవాస్తవకు కాన్పూర్ టికెట్ ఇస్తామంటూ సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆయన మాత్రం ఆ పార్టీలో చేరడానికి ఆసక్తి కనబర్చలేదు. బీజేపీలో చేరేందుకే ఆసక్తి చూపారు. చివరకు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించిందో తెలియదుగానీ మొత్తానికి కమలం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో బుధవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరు బీజేపీలో చేరారు. భారత రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే: రాజు భారత రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉందని హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సమక్షంలో బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘దేశం కాంగ్రెస్ పార్టీకి దాదాపు 60 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చింది. 61 సంవత్సరం నుంచైనా బీజేపీ పార్టీకి ఇవ్వాలనుకుంటోందని నేను భావిస్తున్నా. దేశ రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే ముడిపడి ఉంది. మొదట సమాజ్‌వాదీ పార్టీలో చేరాలని భావించాను. అయితే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపించిందనిపించింది. అంతేకాకుండా ఆ పార్టీలో అందరి నుంచి నాకు సరైన మద్దతు లభించలేదు. అందుకే నా ఆలోచనను విరమించుకున్నాన’ని చెప్పారు. తేజాబ్, మైనే ప్యార్ కియా, బాజిగర్ వంటి హిట్ చిత్రాల్లో హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన రాజు కంటతడి పెట్టించే పాత్రల్లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవలే సతీమణితోసహా నాచ్ బలియే-6 టీవీ షోలో పాల్గొన్నారు. బిగ్‌బాస్, శక్తిమాన్, అదాలత్ వంటివాటిలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించారు.