
( ఫైల్ ఫోటో )
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా గత నెల ఆగస్ట్‌లో జిమ్ చేస్తూ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో జిమ్ ట్రైయినర్ శ్రీవాత్సవను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
చదవండి: సాఫ్ట్‌వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్
ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా శ్రీవాత్సవ యూపీ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment