stand up commedian
-
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్‌వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో చక్కటి ఫాం హౌస్‌తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్‌తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్‌ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్‌లో అందమైన ఫామ్‌హౌస్‌ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్‌హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్‌తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్‌వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
అంతా పగలబడి నవ్వారు.. ఆ జోక్‌కు మూల్యం రూ.17 కోట్లు!
బీజింగ్: స్టాండప్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ విషయాలలో సైతం హ్యస్యాన్ని జోడించి అందరిని నవ్విస్తుంటారు. ప్రజలు కూడా ఈ షోలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే స్టాండప్ కమెడీయన్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఒక్కోసారి జోకులు హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ప్రేక్షకులను నవ్వించడానికి ఓ చైనా కమెడియన్ వేసిన జోక్ ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహానికి గురికావడంతో పాటు భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లోలీ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో హవోషి అనే స్టాండప్ కమెడియన్ తన ప్రదర్శన ఇచ్చాడు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఆ షో సాగుతోంది. అంతలో తాను షాంఘైకి వెళ్లిన సమయంలో వీధి కుక్కలను దత్తత తీసుకున్న కథనాన్ని వాళ్లకి వివరిస్తూ.. చైనా సైన్యం (పీఎల్ఏ) చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఈ జోక్‌కు విపరీతంగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ.. ఆ షో పూర్తన తర్వాత ఆ జోక్ అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు దానిపై అభ్యంతరాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఆ జోక్‌పై ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన సదరు కమెడియన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కమెడియన్ వేసిన జోక్ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందంటూ చైనా సాంస్కృతిక శాఖ పేర్కొంటూ సదరు కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల (సుమారు రూ.17కోట్లు) జరిమానా విధించింది. చదవండి: మీడియా అత్యుత్సాహం.. హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు.. కొద్దిలో తప్పిన రోడ్డు ప్రమాదం -
విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి
ప్రముఖ హాస్య నటుడు, స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటుకు గురైన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా గత నెల ఆగస్ట్‌లో జిమ్ చేస్తూ రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో జిమ్ ట్రైయినర్ శ్రీవాత్సవను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ ఆయన బ్రెయిన్ పని చేయడం ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా శ్రీవాత్సవ యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. -
ప్రేయసిని పెళ్లాడిన ప్రముఖ కమెడియన్, ఆకట్టుకుంటున్నపెళ్లి ఫొటోలు
ప్రముఖ స్టాండప్ కమెడియన్ బెన్నీ స్టెబస్టియన్ ఓ ఇంటి వాడయ్యాడు. అతడి చిరకాల స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్ ట్రాసి అలిసోన్తో ఆదివారం ఏడడుగులు వేశాడు. ఆదివారం కొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో వీరి వివాహ వేడుక జరిగింది. కాగా బెన్నీ స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోగా, ట్రాసి అలిసోన్ డెంటిస్ట్‌గా పని చేస్తుంది. కాగా గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. వీరి డ్రీమ్ వైట్ ప్రైవేటు వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ జంట స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. మిస్టర్ హ్యాండ్సమ్ సెబాస్టియన్ అంటూ కమెడియన్ ఆకాశ్ గుప్తా ఈ ఫొటోలను షేర్ చేశాడు. స్టెబాస్టియన్ వైట్ షూట్ ధరించగా, అతడి గర్ల్‌ఫ్రెండ్ వైట్ ఫ్రాంక్‌లో మెరిసిపోయారు. మరో ఫొటోలు హిందు సంప్రాదాయం ప్రకారం బెన్నీ శర్వానీ ధరించి కనిపించాడు. రెండు విభిన్న సంప్రదాయాల్లో జరిగివన ఈ జంట వెడ్డింగ్ ఫొటోలను నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by highonkennysebastian (@highonkennethsebastian) -
Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో..
చూడగానే ఆకర్షించే రూపం లేదు గానీ తను ఏడ్చినా, కోప్పడి కన్నెర్ర చేసినా చూసినవారు శెభాష్ అనకుండా ఉండలేరు. ఆకృతి కాస్త భారీగా ఉన్నప్పటికీ అనర్గళంగా మాట్లాడుతూ .. వీక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తు్తంది. హాస్యనటులు అనగానే దాదాపు పురుషుల పేర్లు వినపడే ఈ రోజుల్లో స్టాండప్ కామెడీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుని వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్‌తో కడుపుబ్బా నవ్విస్తోంది పుష్పవల్లి అలియాస్ సుముఖి సురేష్. సుముఖి సురేష్ కంటే పుష్పవల్లిగా బాగా పాపులర్ అయిన సుముఖి ప్రముఖ డిజిటల్ కమేడియన్. నాగపూర్‌లో పుట్టి పెరిగిన సుముఖి చెన్నైలోని ఎమ్ఓపీ వైష్ణవ్ కాలేజీ ఫర్ ఉమెన్స్‌లో మైక్రోబయాలజీ, ఫుడ్ సేఫ్టీలో డిగ్రీ చదివింది. డిగ్రీ అయ్యాక 2009లో బెంగుళూరు వెళ్లి అక్కడ పిల్లల లైబ్రరీలో కొన్నాళ్లు పనిచేసింది. తరువాత ఐటీసీ రాయల్ గార్డెనియాలో చెఫ్‌గా పనిచేసింది. ఫుడ్ లేబొరేటరీలో పనిచేస్తున్న సమయంలో జోక్స్ వేస్తూ అందరినీ అలరిస్తుండేది. నెలకు 30 వేలరూపాయల జీతం, ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పనివేళలతో జీవితం హాయిగానే సాగుతోంది. ఈ క్రమంలో సుముఖి అప్పుడప్పుడు సరదాగా యూ ట్యూబ్‌లో కామెడీ స్కెచెస్ చేసేది. వీటికి మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు చేస్తుండేది. అయితే ఒకపక్క ఉద్యోగం... మరోపక్క కామెడీ వీడియోలతో కష్టంగా ఉండేది. దీంతో ఉద్యోగం వదిలి కామెడీనే ఫుల్ టైమ్ కెరియర్‌గా మార్చుకుంది. స్టాండప్ కమేడియన్ సుముఖి తన మొత్తం సమయాన్ని హాస్యానికే కేటాయించి 2013 నుంచి పలు షోలలో కామెడీ చేయడం ప్రారంభించింది. తన టీమ్‌తో కలిసి బెంగళూరు, దుబాయ్, ముంబై, హైదరాబాద్, స్వీడన్లలో వంద షోలను చేసింది. ఇండియాలోనే తొలిసారి మాక్యుమెంటరీ యూట్యూబ్ సిరీస్‌ను ప్రారంభించిన ఎన్జీవో ‘‘బెటర్ లైఫ్ ఫౌండేషన్’’ నిర్వహించే.. షోలలో పాల్గొని అనేక ఎపిసోడ్లలో కామెడీని పండించి సుముఖి మంచి పాపులారిటీని పొందింది. దీని తరువాత ‘బేథీనాక్’ సిరీస్ బాగా పాపులర్ అయ్యింది. కామెడీని కెరియర్‌గా మార్చుకున్న సుముఖి అను ఆంటీ, సుముఖీ చావ్లా క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్పవల్లి బేథీనాక్, బెటర్ లైఫ్ ఫౌండేషన్ కామెడీ తరువాత తనే స్వయంగా ‘‘డిస్గస్ట్ మి’’ పేరిట స్టాండప్ కామెడీ షోను చేయడం ప్రారంభించింది. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘పుష్పవల్లి’ సీజన్ 1, 2లను సుముఖియే స్వయంగా రాసి, పుష్పవల్లి క్యారెక్టర్లో జీవించేయడంతో బాగా పాపులర్ అయ్యింది. సీజన్ వన్‌లో పుష్పవల్లి ప్రేమలో పడడం అది ఎలా బ్రేకప్ అయిందో ఉంటుంది. రెండో సీజన్లో పుష్పవల్లి తన లవర్‌పై పగతీర్చుకునే తీరును వర్ణించిన తీరు అద్భుతం. రెండు సీజన్లలో పుష్పవల్లి పాత్ర కనిపిస్తే చాలు నవ్వు ఆపుకోలేకపోయినంతగా ఆకట్టుకుంది. ఇదేగాకుండా కన్నడ సినిమా ‘హంబుల్ పొలిటీషియన్ నొగరాజ్లో కూడా నటించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన ‘‘బ్యూటీ అండ్ ది ఫీస్ట్’’, ‘‘బనాకే దిఖా’’, ‘‘లస్ట్ స్టోరీస్’’ వంటివాటిని క్రియేట్ చేసి దానిలో సుముఖి నటించింది. వీటితోపాటు అమెజాన్ ఒరిజినల్ ‘‘కామిక్‌స్థాన్’’లో అతిథిగా, జడ్జిగా పాల్గొంది. ఈ మధ్యకాలంలో ‘‘డోంట్ టెల్ అమ్మా’’ స్టాండప్ కామెడీని విడుదల చేసింది. ‘‘నోటరీ’ అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మిస్తోంది. అంతేగాక ‘ఇస్తాంబుల్ ఫిల్మ్ అవార్డ్స్’లో పుష్పవల్లి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది. ‘‘మనం అందంగా లేమని, మనం ఎవరికీ నచ్చమని బాధపడేకంటే మనకున్న గుణాలు, తెలివితేటలతో కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. కామెడీ ఎవరి సొంతం కాదు. వీక్షకులను హాస్యంతో ఆకట్టుకోవడమే ముఖ్యం’’ అని సుముఖి చెబుతోంది. ఇండియాలో ఉన్న ప్రముఖ కమేడియన్లలో ఫాలోవర్స్‌తోపాటు అధిక మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోన్న జాబితాలో ఆమె ఉండడం విశేషం. ఒకపక్క వెబ్‌సిరీస్‌లో కామెడీని పండిస్తూనే, మరోపక్క స్టాండప్ కామెడీ, యూ ట్యూబ్, ఇన్స్టాగామ్లలో కామెడీ వీడియోలతో లక్షల మందిని అలరిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్.. ఎక్కడంటే.. -
Stand Up Comedians: ఇదిగో నవ్వుల ఆక్సిజన్!
గాలిలో కానరాని గడుసు దెయ్యాలు... అడుగు తీసి అడుగు వేయాలంటే టెన్షన్! హాలో బాగున్నారా? అని ఆత్మీయంగా పలకరించడానికి దగ్గరికి వెళదామంటే ఏ వైపు నుంచి ఏ చెడు నీడ పడుతుందో అని టెన్షన్! ఇప్పుడు టెన్షన్ స్టేషన్లో బతుకు బండి భయంగా ఆగింది. ఆ బండి కాస్త ముందుకు కదలాలంటే మనకు తప్పనిసరిగా కావాలి... నవ్వుల ఆక్సిజన్!! స్టాండ్ అప్ కమెడియన్లుగా రాణిస్తున్న కొందరు మహిళలు తమ దగ్గర ఉన్న నవ్వుల మంత్రదండంతో టెన్షన్‌ను‘హాంఫట్’ అని మాయం చేసి ‘హ్హాహ్హా’ అని నవ్విస్తూ మనసు తేలిక పరుస్తున్నారు. ‘అనురాధ మెనన్ ఎవరండీ?’ అని అడిగితే చెప్పేవాళ్లు లేకపోవచ్చుగానీ ‘మిస్ లోలా కుట్టీ ఎవరు?’ అంటే జవాబు చెప్పడం చాలామందికి వీజీ. సాధారణంగా వీజేలు పోష్ పోష్ ఇంగ్లిష్ మాట్లాడేస్తుంటారు. లోలా కుట్టి మాత్రం మలయాళీ యాక్సెంట్‌తో ఇంగ్లిష్ గడగడా మాట్లాడుతూ ప్రేక్షకులను గలగలమని నవ్విస్తుంటుంది. నూనె రుద్దిన జుట్టు, జడలో పూలు, గాజులు, సోడా బుడ్డి కళ్లద్దాలతో ఆమె ఆహార్యమే నువ్వు తెప్పిస్తుంది. ‘చానల్ వి.లోలా’లో లోలా కుట్టి నవ్వుల తోటమాలి. ‘కామెడీ అనేది చాలా సీరియస్ విషయం’ అని బల్ల బాదీ మరీ చెబుతున్న జియా సేథి స్టాండప్– స్టార్ కమెడీయన్‌గా ‘రాణి’స్తోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కామెడీ స్టేజీ షోలు చేసిన జియా సేథి ఇప్పుడు జూమ్ వేదికగా నవ్వులు పండిస్తుంది. అంతేకాదు స్టాండప్–కామెడీ కోర్సు ప్రారంభించి ఎంతోమందిని కమెడియన్లుగా తీర్చిదిద్దుతుంది. చాలామందికి ‘నవ్వించడం’ అనేది హాబీ నుంచి ఉపాధి స్థాయికి వెళ్లడం విశేషం. ఇంతకీ స్టాండప్–కామెడీ కోర్స్‌లో ఏముంటాయి? జోక్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నవ్వు తెప్పిస్తాయి? సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు హాస్యం ఎలా సృష్టించాలి? పంచ్‌లైన్‌లను ఎలా రాసుకోవాలి? కామెడీ నాలెజ్డ్ అంటే ఏమిటి? చిన్న చిన్న జోక్స్‌ను ఆకట్టుకునే స్కిట్లా ఎలా మలుచుకోవచ్చు... మొదలైనవి కామెడి కోర్సులో పాఠాలుగా ఉంటాయి. రంగస్థల నటిగా పేరున్న కోమల్ భాటియా ‘ఆల్–ఉమెన్ స్టాండప్ కామెడీ నైట్స్’ పేరుతో ఢిల్లీ లో చేసిన షోకు అనూహ్యమైన ఆదరణ లభించడంతో దేశంలోని వేరే నగరాల్లో కూడా ఇలాంటి షోలు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన ప్రీతీ దేశాయ్ కేవలం ‘నవ్వు కోసమే నవ్వు’ అన్నట్లు కాకుండా కాస్తో కూస్తో సామాజిక స్పృహను ఆ నవ్వులకు జోడిస్తుంది. ‘కొందరు పురుష కమెడియన్లు ప్రేక్షకులను నవ్వించడానికి గర్ల్ఫ్రెండ్పైన, భార్యలపైనా వెకిలి హాస్యం సృష్టిస్తుంటారు. ఇది ఆరోగ్యకరమైన హాస్యధోరణి కాదు’ అంటున్న ప్రీతి నొచ్చుకునే హాస్యానికి కాకుండా అందరూ మెచ్చుకునే హాస్యానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇక నీతి పల్టా దగ్గరికి వద్దాం. ‘మనకు ఉండాల్సింది అతి విశ్వాసం కాదు ఆత్మవిశ్వాసం’ అంటున్న ఢిల్లీకి చెందిన నీతి పల్టా అరంగేట్రంలాంటి తొలి షో అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ షో లో ఆమె ఏవో జోక్స్ చెబుతూనే ఉంది, నవ్వించే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ ప్రేక్షక మహానుభావుల ఫేసుల్లో ఎలాంటి నవ్వూ మొలకెత్తలేదు. ఏదో ట్రాజెడీ సినిమాకు వచ్చినట్లుగా పెట్టారు ఫేస్. ‘ఇదేదో మనకు అచ్చిరాని వ్యవహారం’ అని దిగులుపడలేదు నీతి. ఇంటికి వెళ్లిన తరువాత తన కామెడీ షోను తానే సమీక్షించుకుంది. ‘నవ్వించడం అంటే మనం నవ్వడం కాదు... ప్రేక్షకులను నవ్వించడం’ అనే విషయాన్ని చాలా గట్టిగా నేర్చుకుంది. ఆ తరువాత చాలా ప్రాక్టీస్ చేసి గానీ స్టేజ్ ఎక్కలేదు. షో సూపర్ డూపర్ హిట్ అయింది. ‘ప్రేక్షకులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. నేను బాగానే పెర్ఫార్మ్ చేశాను’ అని ఆ రోజు ఆమె అనుకొని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకొని ఉంటే అక్కడే ఆగిపోయి ఉండేది. తన లోపాల నుంచి గుణ‘పాఠాలు’ నేర్చుకోవడం వల్లే నీతి పల్టా స్టార్–స్టాండప్ కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంటోంది. ‘నవ్వు’ అనే ఆరోగ్యకరమైన ఆక్సిజన్ కొరత తీర్చడానికి లోలా కుట్టీ నుంచి నీతి పల్టా వరకు ఎంతోమంది ఫిమేల్ స్టాండప్ కమెడియన్స్ రంగంలో ఉన్నారు. వారికి వందనాలు తెలియజేద్దాం. -
మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు
-
మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు
ముంబై : ప్రముఖ మహిళా కమెడియన్‌పై సోషల్ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ముంబైకు చెందిన స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న చత్రపతి శివాజీ విగ్రహం గురించి వీడియో రూపంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన ఏడాదికి కొంతమంది నెటిజన్లు ప్రస్తుతం ఆమెపై విమర్శల దాడికి దిగారు. మరాఠా పాలకుడు చత్రపతి శివాజీని అగ్రిమా అగౌరవపరించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను అసభ్య పదజాలంతో దూషించాడు. చత్రపతి శివాజీ గురించి అగ్రిమా మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్ధేశిస్తూ ఆమెను లైంగిక వేధింపులతో బెదిరిస్తూ మిశ్రా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోలను పోస్ట్ చేశాడు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్) దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. మిశ్రా వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖా శర్మా గుజరాత్ డీజీపీకి లేఖ రాశారు. మహిళలకు సోషల్ మీడియాలో సురక్షిత వాతావరణాన్ని, సైబర్ భద్రతను కల్పించేందుకు ఎన్సీడబ్ల్యూ కట్టుబడి ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక నిందితుడు మిశ్రాపై వడోదర పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుజరాత్ డీజీపీ శివానందర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా కమెడియన్ జాషువాపై విమర్శలు వెల్లువెత్తడంతో చత్రపతి శివాజీ అనుచరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె క్షమపణలు కోరారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోను డిలీట్ చేశారు. (నటుడు రాజన్ సెహగల్ కన్నుమూత) Vadodara City Police took suo moto action in respect of an abusive, threatening video which was uploaded and shared on Social media by Shubham Mishra. We have detained him and initiated legal process for registration of FIR against him under relevent section of IPC and IT act. pic.twitter.com/XM6J8y4nDx — Vadodara City Police (@Vadcitypolice) July 12, 2020 -
‘మగజాతికే తలవంపులు తెచ్చావు’
వరుణ్ గ్రోవర్ స్క్రీన్ రైటర్, పాటల రచయిత, థింకర్. వీటన్నిటినీ మించి హాస్య రసజ్ఞుడు. వయసు 40 దాకా ఉంటుంది. అయితే ఇప్పుడు హాస్యం కోసం అతడు ఈ పని చేయలేదు. ఏ పని?! వరుణ్ తన చేతి గోళ్లకు రెండు రకాల రంగును వేసుకుని ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దాన్ని చూసిన మగాళ్లంతా అతడిని ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ‘పురుషుడివి అయుండీ ఈ వేషాలు ఏంటి?’ అని అతడిపై గత ఇరవై నాలుగు గంటలుగా ఏకబిగిన సెటైర్లు వేస్తూనే ఉన్నారు. కొందరైతే ‘మగజాతికే తలవంపులు తెచ్చావు’ అని దుయ్యబడుతున్నారు. ఆ మాటలకు వరుణ్ బాధపడ్డాడు. ఆశ్చర్యపోయాడు. ఆవేదన చెందాడు. థింకర్ కదా.. తాత్వికంగా కూడా ఆలోచించే ఉంటాడు. చివరికి ఈ ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకు తనూ ఓ ప్రశ్న వేశాడు. ‘‘గోళ్ల రంగు వేసుకుంటే నా చెయ్యి నాకే చూడముచ్చటగా, అందంగా అనిపించింది. అందుకే షేర్ చేసుకున్నాను. దీన్నొక జెండర్ ఇష్యూగా చూస్తారెందుకు?’’ అన్నాడు. ‘నీకు చూడముచ్చటగా ఉంటే సరిపోయిందా..’ అని మళ్లీ ఆయనపై దాడి ప్రారంభమయింది. ఇప్పట్లో అది ముగిసేట్టు లేదు మరి. పేదరికంలో మరణించిన క్యాబరే క్వీన్ నలుపు, తెలుపు చిత్రాల కాలం నాటి ప్రేక్షకుల్ని రెప్ప వెయ్యనివ్వకుండా చేసిన తొలి బెంగాలీ క్యాబరే డ్యాన్సర్ ఆరితీదాస్ గురువారం కోల్‌కతాలో కన్ను మూశారు. ఆమె వయసు 77 ఏళ్లు. మిస్ షెఫాలీగా ప్రసిద్ధురాలైన ఆరతి.. డ్యాన్సర్ మాత్రమే కాదు. విలక్షణ నటి కూడా. సత్యజిత్ రే ‘ప్రతిధ్వని’, ‘సీమబద్ధ’ చిత్రాలలో ఆమె నటించారు. ఇటీవలే ఆమె ఆత్మకథ ‘సంధ్యా రతేర్ షెఫాలీ’.. పుస్తక రూపంలో విడుదలైంది. తూర్పు బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుంచి శరణార్థులుగా పశ్చిమ బెంగాల్ వచ్చిన కుటుంబంలోని ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆరతీదాస్ ఆఖరు అమ్మాయి. పన్నెండేళ్ల వయసులోనే ఇల్లు గడవడానికి అప్పట్లో ప్రముఖులు వచ్చిపోతుండే ‘ఫిర్పో’ రెస్టారెంట్లో డాన్స్ చేశారు ఆరతి. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లారు. పేదరికంలో జీవితాన్ని ప్రారంభించిన ఆరతి పేదరికంలోనే అంతిమశ్వాస వదిలారు. చివరి రోజుల్లో తన అనారోగ్య సమస్యలకు మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఆమె ఉన్నారని బెంగాలీ పత్రికలు రాశాయి. -
వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి
నటుడిగా, స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మంజునాథ్ నాయుడు (36) గుండె పోటుతో మృతి చెందారు. దుబాయ్‌లోని ఓ హోటల్లో పర్ఫామెన్స్ ఇస్తుండగా తీవ్ర గుండెపోటు రావటంతో వేదిక మీద కుప్పకూలిపోయారు. అయితే ప్రేక్షకులు, నిర్వాహకులు స్కిట్లో భాగంగానే అలా చేశారని భావించి ఆలస్యం చేయటంతో మంజునాథ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చెన్నైకి చెందిన మంజునాథ్ నాయుడు కొంత కాలంగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మంజునాథ్ పర్ఫామెన్స్ స్టార్ట్ చేశారు. కొద్ది సేపటికే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయను హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే మృతి చెందినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. -
కమెడియన్‌పై మండిపడిన శివసేన
బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. బయటి నుంచి వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. కపిల్ శర్మ స్వస్థలం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. ముందుగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను కపిల్ చదువుతున్నాడని రౌత్ అన్నారు. కపిల్ శర్మను లంచం అడిగింది ఎవరో చెప్పాల్సిందిగా తాము కోరినా.. ఆయన మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ అన్నారు. ఆయన చెబితే తాము వెంటనే విచారణ ప్రారంభించి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుంటుందని చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు.