ప్రేయసిని పెళ్లాడిన ప్రముఖ కమెడియన్‌, ఆకట్టుకుంటున్నపెళ్లి ఫొటోలు | Comedian Kenny Sebastian Marries His Girlfriend Tracy Alison In Goa | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడిన ప్రముఖ కమెడియన్‌, ఆకట్టుకుంటున్న పెళ్లి ఫొటోలు

Jan 17 2022 2:03 PM | Updated on Jan 17 2022 2:59 PM

Comedian Kenny Sebastian Marries His Girlfriend Tracy Alison In Goa - Sakshi

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ బెన్నీ స్టెబస్టియన్‌ ఓ ఇంటి వాడయ్యాడు. అతడి చిరకాల స్నేహితురాలు, గర్ల్‌ఫ్రెండ్‌ ట్రాసి అలిసోన్‌తో ఆదివారం ఏడడుగులు వేశాడు. ఆదివారం కొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో వీరి వివాహ వేడుక జరిగింది. కాగా బెన్నీ స్టాండప్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోగా, ట్రాసి అలిసోన్‌ డెంటిస్ట్‌గా పని చేస్తుంది. కాగా గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో  సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది.

వీరి డ్రీమ్‌ వైట్‌ ప్రైవేటు వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఈ జంట స్నేహితులు, సన్నిహితులు సోషల్‌ మీడియాల్లో షేర్‌ చేస్తున్నారు. మిస్టర్‌ హ్యాండ్సమ్‌ సెబాస్టియన్‌ అంటూ కమెడియన్‌ ఆకాశ్‌ గుప్తా ఈ ఫొటోలను షేర్‌ చేశాడు. స్టెబాస్టియన్‌ వైట్‌ షూట్‌ ధరించగా, అతడి గర్ల్‌ఫ్రెండ్‌ వైట్‌ ఫ్రాంక్‌లో మెరిసిపోయారు. మరో ఫొటోలు హిందు సంప్రాదాయం ప్రకారం బెన్నీ శర్వానీ ధరించి కనిపించాడు. రెండు విభిన్న సంప్రదాయాల్లో జరిగివన ఈ జంట వెడ్డింగ్‌ ఫొటోలను నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement