Aamir Khan Is Going To Get Married To His Daughter's Age Fatima Sana Shaikh Soon? - Sakshi
Sakshi News home page

Aamir Khan : ఆ హీరోయిన్‌తో సన్నిహితంగా అమీర్‌ ఖాన్‌.. వీడియో లీక్‌, నెట్టింట వైరల్‌

Published Sun, May 28 2023 10:51 AM | Last Updated on Sun, May 28 2023 12:35 PM

Aamir Khan And Fatima Sana Shaikh To Get Married Soon Tweet Viral - Sakshi

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.

ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్‌ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్‌ కూతురు ఇరాఖాన్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది.

తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్‌ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్‌ బాల్‌ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్‌ ఖాన్‌ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.

దీనికి తోడు అమీర్‌ ఖాన్‌ త్వరలోనే దంగల్‌ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు ట్వీట్‌ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement