Dangal Movie
-
‘దంగల్’ చూడండి ‘మాస్టారు’
‘మగ పిల్లాడు అయితేనే కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ తెస్తాడని ఆలోచిస్తూ ఉండేవాడిని..కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. కొడుకు తెచ్చిన, కూతురు తెచ్చిన గోల్డ్ గోల్డే కదా’.. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్ చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే అసలు కథంతా జరుగుతుంది. చివరికి తన కూతుర్ల ద్వారా మల్ల యుద్ధంలో బంగారు పతాకాలు సాధిస్తాడు. ఇది రియల్‌గా జరిగిన కథ. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజంలో చాలా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవాళ్లను మించి పోతున్నారు కూడా. అయినా కూడా కొన్ని చోట్ల లింగ వివక్ష కొనసాగుతుంది. వారసత్వం అంటే మగవాళ్లే అనే అపోహలు ఇంకా కొందరిలో ఉన్నాయి. అలాంటి వారికి బుద్ది చెప్పాల్సిన సినీ ‘పెద్ద’ చిరంజీవి(Chiranjeevi) కూడా ఇప్పుడు వారసత్వం కొనసాగించేందుకు కొడుకు కావాలంటున్నారు.కొడుకు ఉంటేనే వారసత్వమా? కూతురు లెగసీని కంటిన్యూ చేయలేదా? చిరంజీవికి సైతం ఈ వివక్ష ఎందుకు? ప్రపంచాన్ని పక్కకి పెట్టినా సరే.. ఆయన ఇంట్లోనే లెజండరీ లేడీస్ ఉన్నారు. కోడలు ఉపాసన వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. పెద్ద కూతురు నిర్మాతగా రాణిస్తోంది. తమ్ముడు కూతురు నిహారిక అటు యాక్టింగ్‌తో పాటు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. సొంత ఇంట్లోనే ఇంతమంది సక్సెస్ సాధించిన ఆడవాళ్లు ఉంటే.. ‘ఒక్క మగపిల్లాడిని కనరా?’ అని చరణ్‌ని కోరాల్సిన అవసరమేంటి?ఆచి తూచి మాట్లాడాల్సిందే..సెలెబ్రిటీలు చేసే పనులు, మాట్లాడే మాటలను సామాన్యులు అనుసరిస్తారు. మంచి చేస్తే మెచ్చుకోవడం..చెడు చేస్తే ‘ఛీ’అని తిట్టడం కామన్. అందుకే సెలెబ్రిటీలు ఆకర్షనీయంగా మాట్లాడడం కాదు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిరంజీవి లాగే అందరూ ట్రోల్ అవుతారు. వాస్తవానికి చిరంజీవి సరదగానే ఆ మాటలు అన్నాడు. అక్కడ విన్నవాళ్లు ఎవరీకి తప్పుగా అనిపించలేదు. కానీ నేషనల్ మీడియాలో సైతం చిరు వ్యాఖ్యలను తప్పుపట్టింది. పురుషాహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్స్ మెగాస్టార్‌పై ఫైర్ అయ్యారు. ఇక్కడ మీడియాను తప్పపట్టలేం. ఆయన అన్న మాటలనే వార్త రూపంలో ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలే సామాన్యులు అంటే పెద్దగా పట్టించుకోరు. చిరంజీవి లాంటి ప్రముఖుల నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా బాధాకరమే.మనవరాళ్లే మాణిక్యాలైతారేమో!చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు చరణ్ ఉన్నాడు. పెద్ద కూతురుకు సుష్మితాకు, చిన్న కూతురు శ్రీజకు ఇద్దరేసి చొప్పున కుమార్తెలు ఉన్నారు. ఇక చరణ్-ఉపాసన దంపతులకు కూడా కూతురే పుట్టింది. ఇంట్లో చరణ్ మినహా మిగతావాళ్లంతా ఆడ పిల్లలేకావడంతో చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ మెగాస్టార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనవారాళ్లు కూడా ఆయనను మించి రాణిస్తారేమో. దంగల్ సినిమా మాదిరే వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తారేమో. కొడుకు ఉంటే లెగసీ కంటిన్యూ అవుతుందనే అపోహ నుంచి ‘మాస్టారు’ బయటకు రావాలి. -
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
ఇదే జరిగితే దంగల్ రికార్డ్ క్రాస్.. 'పుష్ప' గాడి అసలైన టార్గెట్ ఇదే
'పుష్ప 2' చిత్రం వరుస రికార్డ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. రూ. 1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో పుష్ప ఉన్నాడు. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే, తాజాగా పుష్ప2 ( Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ దంగల్.. కేవలం మరో రూ. 200 కోట్ల మార్క్ అందుకుంటే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియన్ టాప్ వన్ సినిమాగా పుష్ప2 చేరిపోతుంది. అయితే, ఈ మార్క్‌ను అల్లు అర్జున్ (Allu Arjun) చాలా సులువుగా అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇండియాలో కలెక్షన్ల పరంగా టాప్ వన్ సినిమాగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో బాహుబలి-2 ఉండగా రీసెంట్గా పుష్ప దాటేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయ సినిమాల లిస్ట్‌లో బాలీవుడ్ హిట్ మూవీ దంగల్ టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ కూడా ఆ చిత్రంపైనే పడింది. దంగల్ సినిమా టాప్ వన్‌లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ (China Cinema Market ) అని చెప్పవచ్చు. ఈ మూవీ అక్కడ ఏకంగా రూ. 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టాప్ వన్‌లోకి దంగల్ చేరిపోయింది. దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. అక్కడ పుష్పగాడు నచ్చితే సులువుగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. దీంతో పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ రూ. 3వేల కోట్లకు చేరవచ్చు అని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా వాళ్లకు పుష్ప నచ్చుతాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.పుష్ప-2 టార్గెట్ చైనాపుష్ప2 చిత్రం చైనాలో కూడా విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చైనా బాక్సాఫీస్‌లో పుష్ప2 ఎంట్రీ ఇస్తే తప్పనిసరిగా దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో పుష్ప2 చిత్రానికి భారీ అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, జపాన్‌లో ఎర్రచందనాన్ని (Redwood) అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజలు నిత్యం చందనంతో తయారు అయిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఎర్రచందనంతో వాళ్లకు ఎక్కువ కనెక్షన్ ఉంది. ఈ అంశాలు పుష్ప2 విజయంలో కీలకంగా మారుతాయి. ఎర్రచందనం సరఫరా విషయంలో ఇంత డ్రామా ఉంటుందా అని వాళ్లు ఆశ్చర్యపడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో అక్కడ విడుదలైన భారతీయ సినిమాలు భారీగానే కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం మహారాజ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి వారు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నీ సానుకూలతలు పుష్ప2 చిత్రానికి ఉన్నాయి. పుష్ప-2 చైనాలో విడుదలైతే దంగల్ రికార్డ్ బద్దలు కావడం చాలా సులువు అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చైనాలో వరకట్నంగా ఎర్రచందనంఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు.మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. -
రూ.2000 కోట్లు వస్తే.. మాకు రూ.కోటి మాత్రమే ఇచ్చారు: బబిత
ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహావీర్ ఫొగాట్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.2000 కోట్లు వరకు వసూళ్లు వచ్చాయి. అయితే తమ కుటుంబానికి మాత్రం రూ.కోటి మాత్రమే ఇచ్చారనే విషయాన్ని బబిత ఫొగాట్ బయటపెట్టింది.న్యూస్ 24 ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బబిత మాట్లాడుతూ.. తమ కుటుంబానికి రూ.కోటి ఇచ్చిన విషయాన్ని బయటపెట్టింది. ప్రాజెక్ట్‌లోకి ఆమిర్ ఖాన్ రాకముందే ఈ ఒప్పందం జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇంత మొత్తమే వచ్చినందుకు తమకు ఎలాంటి బాధ లేదని, ఎందుకంటే తన తండ్రి మహావీర్ ఫొగాట్.. ప్రజల ప్రేమ దక్కిచే చాలని చెప్పినట్లు గుర్తు చేసుకుంది.(ఇదీ చదవండి: అవినాష్ సరదా.. నిజంగానే డోర్ తెరిచిన బిగ్‌బాస్)హర్యానాకు చెందిన మహావీర్ ఫొగాట్.. రెజ్లింగ్‌లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తనకు పుట్టే కొడుకుల్ని మంచి రెజ్లర్ చేద్దామని అనుకున్నారు. కూతుళ్లు పుట్టేసరికి తొలుత బాధపడ్డాడు గానీ తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొని మరీ వాళ్లని రెజ్లర్స్‌గా తీర్చిదిద్దాడు. అద్భుతమైన డ్రామా వర్కౌట్ అయిన ఈ మూవీ.. మన దేశంతో పాటు చైనా, జపాన్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది.మహావీర్ ఫొగాట్ రెండో కూతురే బబిత. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించింది. 2014లో బంగారం అందుకుంది. 2012లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్యం అందుకుంది. 2016 ఒలింపిక్స్‌లో పాల్గొంది గానీ పతకం కొట్టలేకపోయింది. 2019లో రెజ్లింగ్‌కి రిటైర్మెంట్ ఇచ్చేసి రాజకీయాల్లో చేరింది. ప్రస్తుతం బీజేపీలో ఉంది.(ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్ రూ. 25 కోట్లు చెల్లించాల్సిందే.. కోర్టుకెళ్లిన నిర్మాత)2000 करोड़ की फिल्म, फोगाट परिवार को मिला सिर्फ 1 करोड़◆ बबीता फोगाट का चाय वाला इंटरव्यू मानक गुप्ता के साथ ◆ पूरा इंटरव्यू: https://t.co/LPKn1lwMLb@ManakGupta #ManakKaRapidFire @BabitaPhogat | #ChaiWalaInterview pic.twitter.com/Fgt843zYE1— News24 (@news24tvchannel) October 22, 2024 -
సుహానీ భట్నాగర్ మృతిపై ఆమె తల్లి ఏం చెప్పారంటే..?
బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్ దంగల్ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ (19) మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమాలో బబితా కుమారీగా ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆమె చిన్న వయసులోనే మరణించడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు చింతించారు. సుహానీ మృతి పట్ల తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. 'సుహానీ ఈ వ్యాధితో చాల రోజులుగా ఇబ్బంది పడుతుంది. కానీ మేము ఎవరికీ చెప్పలేదు. సుహానీకి అమీర్ ఖాన్ చాలా సపోర్ట్‌గా ఉంటారు.. కానీ ఆయనకు కూడా తెలపలేదు. వాస్తవానికి మేము చర్మవ్యాధి అనుకున్నాం. అందువల్లనే చాలామంది డెర్మటాలజిస్ట్‌లను కలిశాం. ఎక్కడా ఆమెకు నయం కాలేదు. దీంతో చివరకు ఎయిమ్స్‌లో చేర్పించాము.. అక్కడే ఈ వ్యాధి (డెర్మటోమయోసైటీస్) గురించి మొదటిసారి చెప్పారు. ఈ వ్యాధికి వైద్యం లేదని తెలిసింది. ఆమె శరీరం ఎక్కువగా ఇన్ఫెక్షన్కు గురికావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో సుహానీ ప్రాణాలు విడిచింది.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సుహానీ తుదిశ్వాస విడిచిందన్న వార్త తమ మనసుల్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. ఆమె లేని 'దంగల్' అసంపూర్ణం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ వారు తెలిపారు. -
19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన 'దంగల్' నటి.. అదే కారణమా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గుర్తుందా? ఇందులో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో విషాదం నింపింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడంపై అందరూ షాక్‌కి గురవుతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) సుహానీ భట్నాగర్.. 'దంగల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. రెండో కూతురు బబిత కుమారి ఫోగట్ పాత్రలో ఆకట్టుకుంది. దీని తర్వాత 'బల్లే ట్రూప్' అనే మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టి చదువుకుంటోంది. తాజాగా ఈమెకు ప్రమాదం జరగ్గా కాలు విరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే ఈమె ఉపయోగించిన మెడిసన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, ఈ క్రమంలోనే దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతికి కారణాలు ఏంటనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మరీ 19 ఏళ్ల చిన్న వయసులోనే ఇలా నటి సుహానా ప్రాణాలు విడవటంతో పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’) Actor #SuhaniBhatnagar, who played #AamirKhan’s on-screen daughter in Dangal, passed away on Saturday morning at the age of 19 due to complications after an accident. She will be cremated at the Ajronda crematorium in Sector 15, Faridabad. pic.twitter.com/A7gGwam2F5 — Bollywood Buzz (@BollyTellyBuzz) February 17, 2024 -
త్వరలోనే అమీర్ ఖాన్ మూడో పెళ్లి? కూతురు వయసున్న ఆమెతో..
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు కామనే. పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. ప్రేమలో చాలాకాలం మునిగితేలి పెళ్లి చేసుకున్నాక విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం చెందడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆయన త్వరలోనే మూడో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ చెట్టాపట్టేసుకొని పలుమార్లు మీడియా కంట పడ్డారు. ఇటీవల అమీర్ కూతురు ఇరాఖాన్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ ఫాతిమా సందడి చేసింది. తాజాగా ఇద్దరూ కలిసి ఉన్న ఓ వీడియో నెట్టింట లీక్ అయ్యింది. ముంబైలో వీరిద్దరూ కలిసి పికిల్ బాల్ ఆడారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మరోసారి అమీర్ ఖాన్ పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. దీనికి తోడు అమీర్ ఖాన్ త్వరలోనే దంగల్ నటిని పెళ్లాడనున్నట్లు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. కాగా 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావును 2005లో పెళ్లి చేసుకోగా 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
దంగల్ను దాటేసిన పఠాన్.. నెం.1 మూవీగా రికార్డు
బాలీవుడ్ పని అయిపోయింది.. హిందీ స్టార్ హీరోలు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే! వాళ్ల సినిమాలకు కలెక్షన్లు రావడం ఇక కలే.. ఈ మాటలన్నింటికి పఠాన్‌తో సమాధానం చెప్పాడు షారుక్ ఖాన్. వందల కోట్లు కొల్లగొడుతూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్ నోరు మూయించాడు. తాజాగా మరో రికార్డు బద్ధలు కొట్టాడు షారుక్. ఇప్పటికే పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన హిందీ సినిమా దంగల్ను సైతం అధిగమించింది. రూ.729 కోట్లతో వరల్డ్‌వైడ్ భారీ వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా ప్రథమ స్థానంలో నిలిచింది. నిజానికి దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.2000 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కానీ ఇందులో అధిక వాటా చైనాదే! అక్కడ హిందీలో కాకుండా మాండరిన్ భాషలో రిలీజ్ చేయగా రూ.1200 కోట్ల పైనే రాబట్టింది. ఇక పఠాన్ విషయానికి వస్తే.. షారుక్ నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రమిది. ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సల్మాన్ అతిథి పాత్రలో మెరిశాడు. Action aur entertainment ka 💥 combo #Pathaan is getting love across the world!Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/5VPnM9mHTY — Yash Raj Films (@yrf) February 4, 2023 చదవండి: వాణి జయరామ్ పోస్ట్‌మార్టమ్ పూర్తి -
వసూళ్ల ఊచకోత.. మరో రికార్డు బద్ధలు కొట్టిన పఠాన్
బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కలెక్షన్స్ సాధిస్తోంది పఠాన్. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ బాలీవుడ్ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం రూ.417 కోట్ల గ్రాస్(రూ.348.50 కోట్ల నెట్) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.250 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రూ.667 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. కాగా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా దంగల్(రూ.374.53 కోట్లు), రెండో స్థానంలో టైగర్ జిందా హై(రూ.339 కోట్లు), మూడో స్థానంలో పీకే (రూ.337.72 కోట్లు) ఉండేది. కానీ తాజాగా పఠాన్ రూ.348 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడంతో పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. పఠాన్ దూకుడు చూస్తుంటే అతి త్వరలో దంగల్ను దాటేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ చిత్రంగా రికార్డు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. #Pathaan ki party continues 🎉🎉🎉 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/kc1FjITfRy — Yash Raj Films (@yrf) February 2, 2023 చదవండి: నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. నటి పెళ్లికి ఆ డ్రెస్‌లో వేస్తావా? వేరే దొరకలేదా?: కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్ -
హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్ 2, తొలి సినిమా ఏదో తెలుసా?
KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేజీయఫ్ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్లో అరుదైన ఘనతను సాధించింది. చదవండి: విరాట పర్యం రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే బిగ్స్క్రీన్పై సందడి విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్ 2 బి-టౌన్ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్ బాలా అనే మరో ట్రెడ్ అనలిస్ట్ నేటితో కేజీయఫ్ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు. చదవండి: ఉపాసన.. నా మైండ్లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే! దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్ సినిమాగా కేజీయఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రోల్ మోడల్ రీల్ ఫాదర్స్
బాలీవుడ్ రీల్ నాన్నల రోల్ మారింది. ఆడపిల్లను గడపదాటనివ్వొద్దనే సంప్రదాయపు ఆలోచన నుంచి తేరుకొని అమ్మాయి కోరుకుంటే చదువు కోసం విదేశాలకూ పంపాలనే ప్రాక్టికల్ థీమ్‌లోకి వచ్చింది. కాలం మారింది. కథలనూ మార్చాలి. లేదా మారిన కథలతో కాలాన్ని ప్రభావితం చేయాలి. అత్తింట్లో ఆడపిల్లకు గౌరవం దక్కాలంటే ముందు మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల తల్లికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విషయంలో కొడుకు, కూతురికి తండ్రే రోల్ మోడల్ అని గ్రహించింది. అందుకే ఇదిగో ఈ సినిమాలను తెరమీదకు తెచ్చింది. పిల్లలకు స్నేహాన్ని పంచే తండ్రులను పరిచయం చేస్తోంది. అంగ్రేజీ మీడియం చంపక్ బన్సల్ సాదాసీదా మనిషి. ఉదయ్‌పూర్‌లో స్వీట్‌షాప్ ఓనర్. కూతురే అతని లోకం. తల్లిలేని ఆ పిల్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కళ్లముందే పెట్టుకుంటాడు చంపక్. కానీ కూతురు తారికకు లండన్‌లో చదవాలనేది లక్ష్యం. ఇష్టంలేకపోయినా కన్నబిడ్డ కల కోసం తారికను లండన్‌కు పంపిస్తాడు. బతకడం నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. కష్టనష్టాల్లో అండగా నిలబడ్తాడు ఆ తండ్రి. థప్పడ్.. ‘నాక్కొంచెం ఊరట కావాలి నాన్నా.. ఇక్కడ కొన్నాళ్లుంటా’ అంటూ సూట్‌కేస్‌తో పుట్టింటికి చేరిన కూతురు అమృత (తాప్సీ) గుండెలో పొదువుకున్నాడు తండ్రి సచిన్ సంధు (కుముద్ మిశ్రా). ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా. ‘ఆ మనిషి మారేలా లేడు నాన్నా.. విడాకులు తీసుకుంటా’ అంటే ‘చిన్న చెంప దెబ్బకే విడాకుల దాకా ఎందుకమ్మా సర్దుకుపో’ అంటూ సలహా ఇవ్వలేదు. భార్యను తను గౌరవిస్తాడు కాబట్టి కూతురి బాధను అర్థం చేసుకున్నాడు. బిడ్డ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నానికి ఓ ఫ్రెండ్‌లా సపోర్ట్ చేస్తాడు. ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా బల్బీర్ చౌదరి (అనిల్ కపూర్) చాదస్తపు తండ్రి. షెఫ్ కావాలనుకున్న బల్బీర్‌ను అతని తల్లి ‘మగాడు వంట చేయడమేంటి అసహ్యంగా’ అని చీదరించుకొని గార్మెంట్స్ షాప్ ఓనర్ అయ్యేలా చేస్తుంది. అలా తల్లి నుంచే చాదస్తపు వాసనలు ఒంటబడ్తాయి బల్బీర్కు. అతని కూతురు స్వీటీ. ఓ పెళ్లిలో ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకొని తన సెక్సువల్ ఐడెంటిటీని బయటపెడుతుంది. అతను పెరిగిన తీరు అతణ్ణి షాక్‌కు గురిచేసినా.. కూతురి మానసిక సంఘర్షణ అతనిలో ఆలోచనను రేకెత్తిస్తుంది. ప్రిజుడీస్ను వదిలి బిడ్డను బిడ్డలా స్వీకరించే తండ్రిగా మారతాడు. కూతురు చేయి పట్టుకొని పెళ్లిమండపంలోకి తీసుకెళ్తాడు.. ఇంకో అమ్మాయితో పెళ్లి జరిపించడానికి. దంగల్ తల మీద కొంగు లేకుండా కనిపించకూడదని ఆడవాళ్ల మీద ఆంక్షలున్న చోట తన కూతుళ్లకు పెహల్వాన్లుగా తర్ఫీదునిస్తాడు కుస్తీ వీరుడైన తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్. వాళ్లు మహా యోధులుగా ప్రపంచ కీర్తిని సాధించి ఆ ప్రాంతంలోని తల మీద కొంగు సంప్రదాయానికి చెక్ పెడతారు. అలా రెజ్లింగ్ రింగ్స్ ఆడపిల్లలకు కాళ్ల పట్టీల్లాంటివనే కొత్త ఫ్యాషన్‌ను స్థిరపర్చాడు మహావీర్. అమ్మాయిల్లో ఆ క్రీడపట్ల ప్యాషన్‌ను డెవలప్ చేశాడా తండ్రి. -
తిరుగులేని సన్నీలియోన్, మళ్లీ..
భారత్‌లో ఈ యేడాది ఎక్కువ మంది జనాలు శృంగార తార సన్నీలియోన్ కోసం తెగ సెర్చ్ చేశారట. దీంతో మరోసారి అందరినీ వెనక్కి నెట్టి సన్నీ టాప్ ప్లేస్ దక్కించుకుంది. తాజాగా యాహూ నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం.. యాహూ మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ–2019గా సన్నీలియోన్‌తో పాటు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నిలిచారు. సల్మాన్‌ఖాన్ తర్వాత బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ కోసం నెటిజన్లు ఆన్లైన్లో గాలించారు. మరోవైపు బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునేలను వెనక్కు నెట్టి సన్నీలియోన్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. 2016, 2017లోనూ సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. తిరుగులేని దంగల్.. గడిచిన దశాబ్ధ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్‌ఖాన్ దంగల్ రూ.2వేల కోట్ల వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’, అమీర్‌ఖాన్ ‘పీకే’ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి తర్వాత సుల్తాన్, టైగర్ జిందగీ హై, ధూమ్3, సంజు, వార్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దబాంగ్ టాప్ టెన్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో చోటు సాధించుకున్నాయి. ఈ యేడాది మేల్ స్టైల్ ఐకాన్‌గా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నిలిచారు. మహిళా స్టైల్ ఐకాన్‌గా ముక్కుసూటిగా మాట్లాడే నటి సారా అలీ ఖాన్ ఉన్నారు. -
దంగల్ దర్శకుడికి షాక్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
దంగల్ దర్శకుడు నితీష్ తివారీకి స్వీట్ షాక్ ఇచ్చారు ఆమిర్ ఖాన్. ముందస్తు సమాచారం లేకుండా తివారీ ఇంటికెళ్లాడు. ఇందులో షాక్ ఏముందని అనుకుంటున్నారా? ఆమిర్ ఉండేది ముంబైలో. నితీష్ తివారీ ఉండేది ఢిల్లీలో. సడెన్‌గా తన ఇంటి ముందు ఆమిర్‌ను చూసిన నితీష్ తివారీ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆమిర్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నితీష్ తివారీ. దంగల్ తర్వాత వీరి కలయికలో చిచ్చోరే అనే టైటిల్‌తో సినిమా రాబోతోందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమిర్ సినిమా గురించి చర్చించడానికి వెళ్లాడా? లేక పలకరిద్దామని వెళ్లాడా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, ఆమిర్ ఖాన్ ప్రస్తుతం అద్వైత్ చందన్ దర్శకత్వంలో లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నాడు. -
దంగల్... రికార్డ్ కా బాప్
సాక్షి, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్ల సునామీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. భారత్ కంటే చైనాలోనే అత్యధిక వసూళ్లు ( సుమారు 1200 కోట్లు) రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు హాంకాంగ్‌లో తన ప్రభంజనం కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా 23.45 మిలియన్ హాంకాంగ్ డాలర్ల (దాదాపు రూ.19.5 కోట్లు) వసూలుతో రికార్డులు బ్రేక్ చేసింది. గతంలో అమీర్ ఖాన్ చిత్రం త్రీ ఇడియట్స్ (2009) 23.41 మిలియన్ హాంకాంగ్ డాలర్లు వసూలు చేయగా ఇప్పుడు దంగల్ దానిని అధిగమించింది. తద్వారా తన రికార్డును తానే అమీర్ బద్ధలు కొట్టుకున్నాడు. హాంకాంగ్, మకావోలలో మొత్తం 46 స్క్రీన్లలలో దంగల్ సినిమా విడుదలైంది. మాములుగా బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యే దానికి నాలుగు రెట్లు అధికమని డిస్నీ ఇండియా ఉపాధ్యక్షుడు అమృతపాండే ప్రకటించారు. కేవలం విదేశాల్లోనే ఇప్పటిదాకా 217.17 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, భారత్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. నితేశ్ తివారీ డైరెక్షన్ వహించిన మల్లవీరుడు మహావీర్ ఫోగట్ బయోపిక్ గతేడాది డిసెంబర్లో విడుదలై భారత బాక్సాఫీస్ వద్ద 375 కోట్ల వసూళ్లు రాబట్టింది. -
చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు
ముంబై: బాహుబలి 2, దంగల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ తలపడుతున్నాయి. తాజాగా బాహుబలి 2 నెలకొల్పిన రికార్డును దంగల్ దాటేసింది. అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. చైనాలో సునామీ వసూళ్లుతో దూసుకుపోతున్న ఆమిర్ ఖాన్ సినిమా గ్రాస్ వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ సినిమా జర్నలిస్టు హరిచరణ్ పుడిపెద్ది తెలిపారు. బాహుబలి 2 సినిమా నాలుగు బాషల్లో (హిందీ తెలుగు, తమిళం, మలయాళం) రూ.1530 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు వెల్లడించారు. దంగల్ నాలుగు బాషల్లో(హిందీ, తమిళం, తెలుగు, మాండరిన్) రూ. 1743 గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలిపారు. మే 5న చైనాలో విడుదలైన దంగల్ ఇప్పటివరకు రూ. 810 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే దంగల్ రికార్డును బాహుబలి 2 అధిగమించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను త్వరలోనే చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దంగల్ భారీ విజయం సాధించడంతో బాహుబలి 2 సినిమాను కూడా అక్కడ విడుదల చేసే యోచనలో ఉన్నారని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారని తెలిపారు. ఇంకా పలు దేశాల్లో ఈ చిత్రరాజన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. With its WW gross collections, #AamirKhan's #Dangal has officially beaten #Baahubali2 at the box-office. Well deserved success pic.twitter.com/R7b8cUZxc7 — Haricharan Pudipeddi (@pudiharicharan) 25 May 2017 -
బాహుబలి-2 రికార్డుకు దంగల్ ఎసరు!
⇒ చైనాలో రూ.650 కోట్ల వసూళ్లు హైదరాబాద్: భారత్‌లో రికార్డులు తిరగరాసిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో ప్రభంజనం సృష్టిస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ మూడో వారాంతానికి వంద మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 649.03 కోట్లు) మార్క్‌ను చేరుకుంది. తద్వారా చైనాలో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారత తొలి సినిమాగానూ నిలిచింది. దీనిపై బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మూడో వారాంతానికి చైనాలో దంగల్ మూవీ వంద మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందని ట్వీట్లో పేర్కొన్నాడు. గత శుక్రవారం 6.02 మిలియన్ డాలర్లు, శనివారం రూ.16.16 మిలియన్ డాలర్లు రాబట్టింది. తద్వారా 100.69 మిలియన్ డాలర్ల (రూ.649.03 కోట్లు) మైలురాయిని సాధించింది. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘బాహుబలి 2’ విడుదలకు ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొనసాగించింది. భారత్ కంటే చైనాలోనే దంగల్ మూవీ అధిక కలెక్షన్లు వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన రెండో మూవీగా నిలిచిన 'దంగల్' చైనాలో రికార్డు వసూళ్లతో 1500 కోట్ల క్లబ్లో చేరుతుంది. దంగల్ హవా ఇలాగే కొనసాగితే బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. #Dangal crosses $ 100 million in China... Week 3: Fri: $ 6.02 mn Sat: $ 16.16 mn Total: $ 100.69 million [₹ 649.03 cr] HUMONGOUS ACHIEVEMENT — taran adarsh (@taran_adarsh) 21 May 2017 -
రూ.1000 కోట్ల క్లబ్లో మరో సినిమా
ముంబయి: ‘బాహుబలి 2’ తర్వాత మరో భారతీయ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఆమిర్ ఖాన్ నటించిన ’దంగల్’ ఈ సినిమా ఈ ఘనత సాధించింది. ‘బాహుబలి 2’ తర్వాత రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఈ నెల 5న చైనాలో విడుదల చేయడంతో ‘దంగల్’ కలెక్షన్లు మెరుగుపడ్డాయి. ఈ సినిమాకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురుస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగానూ నిలిచింది. హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనూ ఘన విజయం సాధించింది. ‘బాహుబలి 2’ విడుదల ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొనసాగించింది. ‘బాహుబలి 2’ వచ్చిన తర్వాత దంగల్ రెండో స్థానానికి పరిమితమైంది. -
చైనాలో 'దంగల్' రికార్డు వసూళ్లు
ముంబయి: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’ మూవీ భారత్‌లోనే కాదు చైనాలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తొలి వారం రోజుల్లో ఊహించని వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తొలి వారంలో రూ. 187.42 కోట్లతో దంగల్ హవా కొనసాగిస్తోంది. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగానూ దంగల్ నిలిచింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్లో వెల్లడించారు. కళ్లు చెదిరే కలెక్షన్లతో మూవీ ఆడుతుందని హర్షం వ్యక్తంచేశారు. హరియాణాకి చెందిన రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం చైనాలోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 120 కోట్లు రాబట్టిన దంగల్ తొలి వారాంతానికి రూ.187.42 కోట్ల వసూళ్లు సాధించింది. గతంలో ఆమీర్ పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. చైనాలో దంగల్ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించడం మూవీగా కలిసొచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమిర్, దర్శకుడు నితీశ్ తివారీలు చైనా ప్రేక్షకుల అభిమానంపై హర్షం వ్యక్తంచేశారు. #Dangal ends *Week 1* on a PHENOMENAL note... Collects an ASTONISHING $ 29.13 million [₹ 187.42 cr] in China... MIND-BOGGLING! — taran adarsh (@taran_adarsh) 12 May 2017 -
చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్
ముంబయి: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’ చిత్రం చైనాలో రికార్డుల మోత మోగిస్తోంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. గతంలో ఆమీర్ పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కలెక్షన్లను ఇప్పడు దంగల్ దాటేసి, రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఆమిర్, దర్శకుడు నితీశ్ తివారీ చైనా ప్రేక్షకులకు సోషల్‌మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. చైనీస్ సోషల్ మీడియా వెబ్సైట్లతో పాటు రాసిన వార్తలను ట్రాన్స్లేషన్ ద్వారా ఎప్పటికప్పుడు రియాక్షన్స్ తెలుసుకుంటునే ఉన్నామని ఆమీర్ తెలిపారు. హరియాణాకి చెందిన మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫొగట్ జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా చైనాలో దంగల్ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. -
చైనాలో రికార్డుల మోత మోగిస్తున్న దంగల్
-
చైనాలో సంచలనం.. తొలిరోజే రూ. 15 కోట్లు!
చైనాలో భారతీయ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటుంది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా దంగల్ మళ్లీ నిరూపించింది. అక్కడ విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించింది. 3 ఇడియట్స్ సినిమాను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేసినప్పటి నుంచి ఆమిర్ ఖాన్ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ కనిపిస్తోంది. పీకే సినిమా కూడా కేవలం చైనా బాక్సాఫీసులోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. దాంతో దంగల్ ఎప్పుడు వస్తుందా అని అక్కడ జనాలు బాగా ఎదురు చూసినట్లుంది. చైనాలోని అతిపెద్ద సినిమా ఆపరేటర్ 'వాండా' ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించినా.. 7వేల స్క్రీన్లలో దంగల్ సినిమా రిలీజైంది. సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించే చైనా మార్కెట్లో బాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటాయని ఆమిర్ ఇప్పటికే నిరూపించారు. దానికి తోడు ఇటీవలే చైనా కూడా అక్కడ ఏడాదికి ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది. చైనా కొత్త సంవత్సరం సమయంలో వచ్చిన జాయింట్ ప్రొడక్షన్ సినిమాలు కుంగ్‌ఫూ యోగా, బడ్డీస్ ఇన్ ఇండియా లాంటి సినిమాలకు కూడా అక్కడ మంచి ఆదరణ కనిపించింది. జాకీచాన్‌తో పాటు సోనూసూద్ లాంటి కొందరు భారతీయ నటులు కలిసి చేసిన కుంగ్‌ఫూ యోగా ఇక్కడ పెద్ద హిట్ కాకపోయినా, అక్కడ మాత్రం బాగానే వసూలుచేసింది. చైనాలో ఏడాదికి 34 విదేశీ సినిమాలు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంది. అందులో భారతీయ సినిమాల కోటాను చాలా ఏళ్ల పాటు రెండుకే పరిమితం చేశారు. ఈమధ్యే దాన్ని డబుల్ చేశారు. చాలావరకు కోటా హాలీవుడ్ సినిమాలకే వెళ్తుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ సినిమాలను చైనాలో నేరుగా విడుదల చేయడానికి వీల్లేదు. పీకే సినిమాకు మంచి వసూళ్లు వచ్చినప్పటి నుంచి చైనా మార్కెట్లో మన సినిమాలను విడుదల చేయడానికి భారతీయ నిర్మాతలు మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. -
నా సినిమా పాక్‌లో విడుదల చేయను
దంగల్ సినిమా చూశారా.. అందులో పతాక సన్నివేశం చాలా కీలకమైనది. ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు ఆమిర్‌ఖాన్‌ను ఒక కోచ్ గదిలో పెట్టి బంధిస్తాడు. దాంతో తన కూతురు అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తోందోనన్న ఆందోళనతో ఆమిర్ కలవరపడుతుంటాడు. అంతలో బౌట్ ముగిసిన తర్వాత భారత జాతీయగీతం వినిపిస్తుంది. కిటికీ లోంచి బయటకు చూస్తే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ పైన కనిపిస్తుంది. దాంతో తన కూతురు స్వర్ణపతకం సాధించిందన్న విషయం ఆమిర్‌కు తెలుస్తుంది. ఇది చాలా ఉద్వేగభరితంగా ఉండే సీన్. అయితే ఇందులో భారత జాతీయగీతంతో పాటు త్రివర్ణ పతాకం కనిపిస్తుందన్న కారణంతో ఆ సీన్ కట్ చేస్తేనే పాకిస్తాన్లో విడుదల చేయనిస్తామని అక్కడి సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. అందులో పాకిస్తాన్‌ను కించపరిచేలా ఎలాంటి సన్నివేశం లేదని, పైగా అది సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశం కాబట్టి దాన్ని తొలగించే ప్రసక్తి లేదని సినిమాకు నిర్మాత కూడా అయిన ఆమిర్ స్పష్టం చేశాడు. అంతేకాదు.. అసలు తన సినిమాను పాకిస్తాన్లో విడుదల చేసేదే లేదని చెప్పేశాడు. ఉడీ ఉగ్రదాడుల తర్వాత భారత్ - పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో పాకిస్తాన్లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వలేదు. అలాగే పాక్ నటులు భారతీయ సినిమాల్లో నటిస్తే వాటిని విడుదల కానిచ్చేది లేదని శివసేన, ఎంఎన్ఎస్లు పట్టుబట్టాయి. చివరకు కొన్నాళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడి సినిమాలు అక్కడ విడుదల కావడం మొదలైంది. అలాగే అక్కడి నటీనటులు ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ దంగల్ విషయంలో పాక్ సెన్సార్ బోర్డు ఈ సరికొత్త డిమాండ్ తీసుకురావడంతో ఆమీర్‌కు ఒళ్లు మండింది. సినిమాను అక్కడ విడుదల చేసేందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉండి తమను సంప్రదిస్తున్నారని, కానీ ఆమిర్ మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయం తర్వాత అసలు సినిమాను పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. దంగల్ సినిమాకు ఇప్పటికే రూ. 385 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. పాక్‌లో విడుదల చేస్తే మహా అయితే మరో 10-12 కోట్లు వస్తాయని, అయినా ఇప్పటికే అక్కడ పైరసీ సీడీలు వచ్చేశాయని.. అందువల్ల ఇక అక్కడ విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రతినిధి తెలిపారు. -
పార్లమెంట్లో ‘దంగల్’ ప్రదర్శన
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నిర్మించిన 'దంగల్' సినిమాను గురువారం లోక్‌సభలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. పార్లమెంట్ సభ్యులకు ‘దంగల్’ సినిమా చూపించనున్నారు. బుధవారం లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయం తెలిపారు. తన అభ్యర్థన మేరకు ఎగువ, దిగువ సభ సభ్యులందరికీ మార్చి 23వ తేదీన ప్రదర్శించనున్నారని వివరించారు. వినోదంతో పాటు మహిళా సాధికారిత, హక్కులపై సభ్యులను మరింత జాగృతులను చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని సంక్షేమ విభాగం నేతృత్వంలో చేపట్టే ఈ కార్యక్రమానికి సభ్యులంతా తమ జీవిత భాగస్వాములతో కలసి రావాలని కోరారు. ఓ కుస్తీయోధుడు తన ఇద్దరు కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథం వైపు ఎలా నడిపించారనేది ఈ సినిమా కథ. కాగా గత ఏడాది 'చాణక్య' సినిమాను ప్రదర్శించారు. -
హయ్యస్ట్ పెయిడ్ హీరో అతడే!
ముంబై: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తుంటాయి. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఎక్కువ అతడివే ఉంటాయి. సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు వ్యక్తిగత రెమ్యునరేషన్ లోనూ 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందున్నాడు. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్'తో అతడు రూ.175 కోట్లు ఆర్జించినట్టు 'డీఎన్ఏ' పత్రిక వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది. 'దంగల్ సినిమా ద్వారా ఆమిర్ ఖాన్ దాదాపు రూ. 175 కోట్లు ఆర్జించాడు. పారితోషికంగా కింద రూ. 35 కోట్లు తీసుకున్నాడు. సినిమా కలెక్షన్లలో 33 శాతం ఆమిర్ తీసుకుంటాడు. అంతకాదు తన సినిమా భవిష్యత్ వసూళ్లలోనూ రాయల్టీ కింద 33 శాతం తీసుకుంటాడ'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఆమిర్ ఖాన్ గుర్తింపు పొందాడు. దంగల్ నటి జైరా వసీం ప్రధానపాత్రలో నటించిన 'సీక్రెట్ స్టార్' సినిమాలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. -
హీరోయిన్ లేఖ చూసి.. కన్నీరు పెట్టిన హీరో
మిస్టర్ పెర్ఫక్షనిస్టు ఆమిర్ ఖాన్‌కు ఒక హీరోయిన్ లేఖ రాశారు. ఆ లేఖ చదివి ఒక్కసారిగా ఆయన కన్నీరు పెట్టేశారు. ఇంతకీ ఆ లేఖ రాసింది ఎవరో తెలుసా.. అలనాటి అందాల నటి రేఖ. దంగల్ సినిమాలో ఆమిర్ నటన చూసి ఫిదా అయిపోయిన రేఖ.. ఆమిర్‌ను ప్రశంసిస్తూ తనదైన స్టైల్లో ఒక లేఖ రాశారు. ఆ లేఖ చదివిన ఆమిర్ ఖాన్.. ఒక్కసారిగా వలవలా ఏడ్చేశాడు. ఆ లేఖకు తన హృదయంలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని కూడా చెప్పాడు. సినిమా విజయం సందర్భంగా ఏర్పాటుచేసిన పార్టీకి వచ్చిన రేఖ ఆ లేఖను ఇచ్చిన వెంటనే చదివేసిన ఆమిర్.. ఒక్కసారిగా కదిలిపోయాడు. ఆ సినిమా తనకెంతో స్పెషల్ అని రేఖ చెప్పారట. ఆమిర్ ఖాన్ తన సినిమాల్లో పెర్ఫెక్షన్ తీసుకురావడమే కాదు.. అన్ని సినిమాలనూ పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తాడు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయీజాన్ సినిమా చూసినప్పుడు కూడా ఇలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడు. దంగల్ ట్రైలర్ చూసినంతసేపు కూడా ఆమిర్ కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. దంగల్ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టింది. భారతదేశంలోనే ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం సందర్భంగానే ఆమిర్ ఈనెల ఐదోతేదీన ముంబైలో ఒక పార్టీ ఏర్పాటుచేసి, బాలీవుడ్‌కు సంబంధించిన అందరినీ దానికి పిలిచాడు. సాధారణంగా పార్టీలకు దూరంగా ఉండే రేఖ.. దీనికి మాత్రం తన ట్రేడ్ మార్కు కాంజీవరం పట్టుచీర కట్టుకుని వచ్చారు. -
దంగల్ అమ్మాయిలకు కోచ్ ఎవరో తెలుసా?
-
దంగల్ అమ్మాయిలకు కోచ్ ఎవరో తెలుసా?
దంగల్ సినిమాలో గీతా కుమారి ఫొగాట్ పాత్రలో నటించిన అమ్మాయి ఫాతిమా సనా షేక్. కామన్వెల్త్ క్రీడల ఫైనల్లో దాదాపు ఓడిపోయిన పరిస్థితుల్లో ఒకే ఒక్క మూవ్‌తో ఐదు పాయింట్లు సాధించి బంగారు పతకం సాధించిన వైనాన్ని అద్భుతంగా చూపించింది. అందుకు ఆమె కూడా రెజ్లింగ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆమెతో పాటు మరికొందరు అమ్మాయిలకు కూడా రెజ్లింగ్ నేర్చుకోక తప్పలేదు. వీళ్లందరికీ రెజ్లింగ్ పాఠాలు నేర్పించింది ఎవరో తెలుసా.. తెరమీద అయితే అమీర్ ఖానే గానీ, తెర వెనుక నిజంగానే ఒక ఫేమస్ రెజ్లర్ వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనెవరో కాదు.. 2005 కామన్వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ అంశంలో భారతదేశానికి స్వర్ణపతకాలు సాధించిన కృపా శంకర్. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఆయన ఈ సినిమా కోసం బూట్లు వేసుకుని.. రెజ్లింగ్‌లోకి దిగారు. ఇండోర్‌కు చెందిన కృపా శంకర్ అర్జున అవార్డు గ్రహీత. ఆయనే అమీర్‌ఖాన్‌తో పాటు ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ భట్నాగర్.. వీళ్లందరికీ రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చారు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొత్తం భారత మాజీ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవిత చరిత్రకు సంబంధించి ఉంటుంది. నిజజీవితంలో ఆయనతో పాటు ఆయన కుమార్తెలు గీతా కుమారి ఫొగాట్, బబితా కుమారి ఫొగాట్ కూడా రెజ్లర్లే. స్వయంగా ఆయనే వారికి శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు సినిమాలో నటించిన అమ్మాయిలకు ఎలా శిక్షణ ఇచ్చామన్న విషయమై యూటీవీ మోషన్ పిక్చర్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో అమీర్‌ఖాన్, దర్శకుడు నితేష్ తివారీ, శిక్షకుడు కృపాశంకర్ బిష్ణోయ్, నటించిన అమ్మాయిలు అంతా తమ అనుభవాలను పంచుకున్నారు. సినిమాలలో నటించడం నుంచి నిజమైన రెజ్లింగ్ చేసేవరకు తమను కోచ్ ఎలా మార్చారో వివరించారు. -
రజనీకి ఆ పాత్ర పులి మీద స్వారీలాంటిది!
చెన్నై: ప్రముఖ హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న మూవీ 'దంగల్'. ఈ మూవీలో మహావీర్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ నటిస్తున్నాడు. హిందీ వెర్షన్లో తాను పోషించిన పాత్రను తమిళంలో చేయాలని సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఆమిర్ కోరాడు. అయితే ఈ ఆఫర్‌ను రజనీ సున్నితంగా తిరస్కరించారని తలైవా సన్నిహితులు జాతీయ మీడియాకు తెలిపారు. ఈ మూవీపై ఆమిర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గతంలో ఏ మూవీకి రాని హిట్స్ ఈ మూవీ ట్రైలర్ సొంతం చేసుకుంది. నిజానికి ఆమిర్ పోషిస్తున్న పాత్ర చాలా కష్టంతో కూడుకున్నదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమిర్ ఈ మూవీ కోసం 25 కేజీలకు పైగా బరువు పెరిగాడు. ఇలాంటి రోల్ పోషించడమంటే రజనికీ పులి మీద స్వారీ చేయడం లాంటిదే. బరువు పెరగడం, తగ్గడం లాంటివి రజనీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, గత కొన్ని మూవీల సందర్భంగా రజనీ అనారోగ్యం పాలైన విషయాన్ని సూపర్ స్టార్ ప్రస్తావించారు. దంగల్ మూవీలో మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించడాన్ని తెరపై చూడవచ్చు. -
ఆమిర్ పిచ్చోడు.. ఇడియట్: దర్శకుడి వ్యాఖ్యలు
''ఇలాంటి సినిమాలను పిచ్చోళ్లు మాత్రమే చేస్తారు.. అసలు గట్టిగా మాట్లాడితే ఆమిర్ ఖాన్ ఒక 'ఇడియట్'...'' అని ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు అన్నారంటే, 'దంగల్' సినిమా చేసినందుకు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన దంగల్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఆ కోవలోనే విధువినోద్ చోప్రా కూడా స్పందించారు. ఆమిర్ ఖాన్‌కు సినిమాలంటే పిచ్చి అని, అతడు 'త్రీ ఇడియట్స్'లో చేసినప్పటి నుంచి తాము ముద్దుగా ఇడియట్ అని పిలుచుకుంటామని ఆయన అన్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించి తర్వాత మరణించినా మన గురించి ఎవరూ గుర్తుపెట్టుకోరు గానీ.. ఇలా ఒక ప్యాషన్‌తో పనిచేస్తే మాత్రం ఎన్ని తరాలైనా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు. ఇలాంటి సినిమాలు తీయడానికి దమ్ము ఉండాలని, అందులోనూ 51 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ రెజ్లర్ పాత్రలో నటించాలంటే చిన్నవిషయం కాదని ఆయన అన్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించారు. వాళ్లిద్దరూ రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ గతంలో నటించిన పీకే, 3 ఇడియట్స్ సినిమాలకు విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. -
దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తాజా సినిమా 'దంగల్' ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్మురేపుతోంది. గురువారం విడుదలైన ట్రైలర్ కు ఆన్ లైన్ లో భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటివరకు 89 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రొటీన్ సినిమాకు భిన్నంగా ట్రైలర్ ఉందని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార చిత్రం ప్రేరణ ఇచ్చేలా ఉందంటున్నారు. ఈ సినిమా ఆమిర్ ఖాన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. తన ఆశయాన్ని కూతుళ్ల ద్వారా సాధించాలనుకునే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. యువ మహావీర్ గా కూడా అతడు కనిపించనున్నాడు. అతడు పడిన కష్టం అంతా దంగల్ ట్రైలర్ గా స్పష్టంగా కనపడింది. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది. -
కశ్మీర్ స్కూల్ కు కిరణ్ రావు థ్యాంక్స్
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): బాలనటి జైరా వాసిం చదువుతున్న సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు సందర్శించారు. జైరాను తమ సినిమా 'దంగల్'లో నటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. జైరాకు సెలవులు మంజూరు చేయడమే కాకుండా, ఆమెకు చదువుకోసం పర్సనల్ ట్యూటర్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు కిరణ్ రావుకు పాఠశాల విద్యార్థులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. 'దంగల్' సినిమాలో గీతా పొగట్ చిన్ననాటి పాత్రలో జైరా నటిస్తోంది. యూటీవీ మోషన్స్, ఆమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్ మస్ కు ఈ సినిమా విడుదలకానుంది. -
'అభిమానులు ఆందోళన చెందొద్దు'
ముంబై: తాను క్షేమంగా ఉన్నానని, అభిమానులు ఆందోళన పడొద్దని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపాడు. తనకు పెద్ద గాయమేమీ కాలేదని, వారం రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని ట్విటర్ ద్వారా వెల్లడించాడు. 50 ఏళ్ల ఆమిర్ ఖాన్ ప్రస్తుతం 'దంగల్' సినిమాలో నటిస్తున్నాడు. మల్లయోధుడు మహవీర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ పంజాబ్ లోని లూథియానాలో జరుగుతుండగా కండరాలు పట్టేయడంతో ఆమిర్ ఖాన్ ఇబ్బంది పడ్డాడు. రెజ్లింగ్ సీన్ లో నటిస్తుండగా భుజం కండరాలు పట్టేశాయి. వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ఆమిర్- ముంబైకి తిరిగివచ్చాడు. 'దంగల్' సినిమాకు నితేశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు.