చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు | It's official: Baahubali 2 is no longer the highest-earning Indian movie worldwide | Sakshi
Sakshi News home page

చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు

Published Fri, May 26 2017 2:10 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు

చెరిగిపోయిన బాహుబలి 2 రికార్డు

ముంబై: బాహుబలి 2, దంగల్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హోరాహోరీ తలపడుతున్నాయి. తాజాగా బాహుబలి 2 నెలకొల్పిన రికార్డును దంగల్‌ దాటేసింది. అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. చైనాలో సునామీ వసూళ్లుతో దూసుకుపోతున్న ఆమిర్‌ ఖాన్‌ సినిమా గ్రాస్‌ వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ సినిమా జర్నలిస్టు హరిచరణ్‌ పుడిపెద్ది తెలిపారు. బాహుబలి 2 సినిమా నాలుగు బాషల్లో (హిందీ తెలుగు, తమిళం, మలయాళం) రూ.1530 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు వెల్లడించారు. దంగల్‌ నాలుగు బాషల్లో(హిందీ, తమిళం, తెలుగు, మాండరిన్‌) రూ. 1743 గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు తెలిపారు.

మే 5న చైనాలో విడుదలైన దంగల్‌ ఇప్పటివరకు రూ. 810 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే దంగల్‌ రికార్డును బాహుబలి 2 అధిగమించే అవకాశాలున్నాయి. ఈ సినిమాను త్వరలోనే చైనాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దంగల్‌ భారీ విజయం సాధించడంతో బాహుబలి 2 సినిమాను కూడా అక్కడ విడుదల చేసే యోచనలో ఉన్నారని ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారని తెలిపారు. ఇంకా పలు దేశాల్లో ఈ చిత్రరాజన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement