పార్లమెంట్‌లో ‘దంగల్‌’ ప్రదర్శన | Film time in Parliament,Dangal to be screened for MPs tomorrow | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ‘దంగల్‌’ ప్రదర్శన

Published Wed, Mar 22 2017 2:35 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

పార్లమెంట్‌లో ‘దంగల్‌’ ప్రదర్శన

పార్లమెంట్‌లో ‘దంగల్‌’ ప్రదర్శన

న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్‌ హీరోగా నిర్మించిన 'దంగల్‌' సినిమాను గురువారం లోక్‌సభలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. పార్లమెంట్‌ సభ్యులకు ‘దంగల్‌’ సినిమా చూపించనున్నారు. బుధవారం లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ విషయం తెలిపారు. తన అభ్యర్థన మేరకు ఎగువ, దిగువ సభ సభ్యులందరికీ మార్చి 23వ తేదీన ప్రదర్శించనున్నారని వివరించారు. వినోదంతో పాటు మహిళా సాధికారిత, హక్కులపై సభ్యులను మరింత జాగృతులను చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానన్నారు.
 
లోక్‌సభ సెక్రటేరియట్‌లోని సంక్షేమ విభాగం నేతృత్వంలో చేపట్టే ఈ కార్యక్రమానికి సభ్యులంతా తమ జీవిత భాగస్వాములతో కలసి రావాలని కోరారు. ఓ కుస్తీయోధుడు తన ఇద్దరు కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథం వైపు ఎలా నడిపించారనేది ఈ సినిమా కథ. కాగా గత ఏడాది 'చాణక్య' సినిమాను ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement