ameerkhan
-
‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్ ఈవెంట్: చిరుతో కలిసి స్టెప్పులు వేసిన సాయిపల్లవి
-
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమీర్ ఖాన్, నాగచైతన్య
-
గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం
సాక్షి, పూణే: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకచోట ట్రాఫిక్ పోలీసులు కరోనా గురించి రోడ్డు మీద డాన్స్ వేస్తూ అవగాహన కల్పిస్తే మరో చోట చేతులు ఎలా కడుక్కోవాలో ట్రాఫిక్ పోలీసులు చూపించారు. ఇక సోషల్‌మీడియాలో సైతం విభిన్న మీమ్స్‌తో కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేవిధంగా ప్రస్తుతం పూణే పోలీసులు 2008 లో వచ్చిన గజిని ఫోటోతో కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. (కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’) 1. Wear a mask 2. Practice social distancing 3. Wash hands frequently You don’t need to cover your entire body with tattoos for that, do you?#OnGuardAgainstCorona pic.twitter.com/CbJmLB9KoB — PUNE POLICE (@PuneCityPolice) April 14, 2020 గజిని సినిమా మొదటిలో అమీర్‌ఖాన్‌కు షార్ట్‌టర్మ్ మెమరీ ఉండటంతో అన్ని విషయాలను తన ఒట్టిన మీద టాటులా వేసుకుంటాడు. ఇప్పుడు పూణే పోలీసుల ఆ టాటు ప్లేసులో ఒక స్టికర్లాంటిది వేసి అన్ని మర్చిపోండి, కానీ మాస్క్ పెట్టుకోవడం మార్చిపోవద్దు అని రాశారు. దాంతో పాటు ఆ ఫోటోలో కోపంతో ఉన్న అమీర్‌ఖాన్ ముఖానికి మాస్క్ కట్టి ఉంది. ఈ ఫోటోని పూణే పోలీసులు తమ అఫిషియల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 1. మాస్క్ ధరించండి. 2. సామాజిక దూరం పాటించండి. 3. చేతులు తరచూ కడక్కోండి అనే క్యాప్షన్‌ను పోలీసులు జోడించారు. దీనికి అదనంగా పోలీసులు ఇందుకోసం మీరు మీ శరీరం మీద టాటులు వేయించుకోవల్సిన పనిలేదు, మీరూ వేయించుకుంటారా? అని జోడించారు. పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సామాన్యులకు పోలీసువారికి మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మిగిలిన వారు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. (భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ) -
‘ఆ హీరో గెటప్ గుర్తుపట్టలేకపోతున్నాం’
ముంబై: తమ అభిమాన హీరో కొత్తగా నటించే సినిమాలో ఎలాంటి గెటప్‌లో ఉన్నా అభిమానులు గుర్తుపట్టేస్తారు. కానీ తాజాగా బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ నటిస్తున్న‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌లోని ఓ ఫోటో లీక్ అయి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అమీర్ సిక్కు సంప్రదాయంలో బారీ గెడ్డం, తలపాగ కట్టుకొని ఉన్నారు. దీంతో అమీర్ కొత్తగెటప్ను కొంత మంది నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ఈ లీకైన ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.‘నటుడు అంటే ఇలా ఉండాలి’అని ఒకరు. ‘వావ్.. అమీర్ హండ్సమ్ సర్దార్‌లా ఉన్నానరని..!’ మరొకరు కామెంట్ చేశారు.. మరికొంతమంది ‘అసలు అమీర్‌ను గుర్తుపట్టలేకపోతున్నాం’అని కామెంట్లు చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రంలో హిరోయిన్‌గా నటిస్తున్న కరీనాకపూర్ షూటింగ్ ఫోటోలు కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో కరీనా పింక్ రంగులో ఉన్న సాల్వార్ కమీజ్ ధరించి.. మేకప్ లేకుండా ఉన్నారు. అమీర్ ఇటీవల ఈ సినిమా విడుదల తేదిని వెల్లడించారు. లాల్‌సింగ్ చద్దా.. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ మూవీ అయన ‘లాల్‌సింగ్ చద్దా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నిజామాబాద్ /డిచ్పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. డిచ్పల్లి ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షారుక్‌ఖాన్(24), అమీర్‌ఖాన్‌లు ఇద్దరు అన్నదమ్ములు. యానంపల్లిలో కొత్తగా కట్టిన ఇంటికి రంగులు వేసి బైక్‌పై గాంధీనగర్ కాలనీకి వస్తున్నారు. సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు బైక్‌పై ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో షారుక్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా, అమీర్‌ఖాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రశాంత్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అం దుకున్న 108 అంబులెన్స్ పైలట్ కిషన్, ఈఎంటీ మహేందర్‌లు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరు కుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తండ్రి మహ బూబ్‌ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతితో గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. -
ఒక అమ్మాయి గళం
హీరోయిన్ని ఒక పాటకి, ఒక ఆటకి, స్కిన్‌షోకి పరిమితం చేస్తున్న కమర్షియల్ సినిమాట్రెండ్లో ..అమ్మాయిలోని ఇంటర్నల్ బ్యాటిల్‌ను.. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ను... మనసుకు హత్తుకునేలా చూపించిన కమర్షియల్ సినిమా! సీక్రెట్ సూపర్‌స్టార్ పాడే పాట అందరికీ నచ్చుతుంది... ఆమె గళమెత్తిన ప్రశ్నలు అందరినీ తాకుతాయి! అసోంలోని ‘నహీన్ అఫ్రిద్’ జీవితం ఈ సినిమాకు ప్రేరణ అనిపించింది! తెలుగు అనువాదం ఉంటే ఈ సినిమాను మనందరం చూడాలి.. అర్థంచేసుకోవాలి.. లేదా తెలుగు ప్రొడ్యూసర్లు ఇలాంటి సినిమాలు తీయాలి!! సీక్రెట్ సూపర్‌స్టార్.. డ్రీమ్ దేఖ్నాతో బేసిక్ హోతా హై అంటుంది. అంటే ఈ దేశంలో ఆడపిల్లలకు కలలు కనే హక్కు కూడా లేదని చెప్పకనే చెప్తోంది. అవును.. ఈ దేశంలో డ్రీమ్ దేఖ్నా మనా హై ఆడపిల్లలకు! ఈ సినిమా అంతా ఇదే పోరాటం! ఆడపిల్ల పోరాటం! తన కలను సాకారం చేసుకోవడానికి పోరాటం! గృహ హింస నుంచి విముక్తి పొందడానికి పోరాటాం! స్వేచ్ఛ కోసం పోరాటం! చివరకు తన ఉనికినే కాపాడు కోవడం కోసం పోరాటం! తండ్రి ఆంక్షలకు విరుద్ధంగా మంచి గాయని కావాలని అభిలషించే అమ్మాయి కథ.. ఇంత చిన్న లైనులో అంత సారం చూపించిన సినిమా! నేను, మీరు.. మన ఇరుగుపొరుగు.. కుల, మత, వర్గ, లింగ వివక్ష లేకుండా దేశం ఇంకా వీలైతే ప్రపంచమంతా తమను తాము చూసుకునే సినిమా ఇది! జెండర్ మీద.. జెండర్ డిస్క్రమినేషన్ గురించి ఇంత సున్నితంగా మనసుకు హత్తుకునేలా.. అంతే గట్టిగా చెంపపెట్టులా.. తెరకెక్కిన దృశ్యం ఇదేనేమో! గుజరాత్‌లోని బరోడా... ఈ కథకు ప్రదేశం. ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబం.. కథాంశం! పదిహేనేళ్ల అమ్మాయి, అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ.. ఒక ఫ్రెండ్.. ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్.. ముఖ్య భూమికలు. స్టుపిడ్ కాదు..: ఆ అమ్మాయి పేరు ఇన్సియా. ఈ అమ్మాయి కల చుట్టే అల్లుకున్న కథ ఇది. అసలు ఈ పాత్రకు ఇన్సియా అని పెట్టడంలోనే అర్థమవుతుంది ఈ సినిమా పరమార్థం! ఇన్సియా అంటే ఔరత్.. స్త్రీ! ఇన్సియా పదోతరగతి చదువుతుంటుంది. తండ్రి ఇంజనీర్. గల్ఫ్‌లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. పురుషహంకారి. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే అమ్మాయి సాధికారత సాధిస్తుంది అనే అభిప్రాయం కన్నా కట్టుకోబోయే వాడికి గౌరవం, సుఖం అనే అభిమతం ఉన్న మనిషి. అందుకే పిల్లతో.. ‘బాగా చదువుతున్నావా లేదా? నిన్ను ఇంత కష్టపడి చదివిస్తుంది ఎందుకు? చదువురాని మొద్దుని కట్టుకుని నేను బాధపడుతున్నట్టుగా నిన్ను కట్టుకునేవాడు ఇబ్బంది పడకూడదని’! అంటుంటాడు. ఇన్సియాకు గిటార్ అంటే ఇష్టం. పాట ప్రాణం. బాగా పాడి.. మంచి సింగర్‌గా ప్రపంచం చేత ప్రశంసలు పొందాలని.. పాపులర్ కావాలనే కల.. లక్ష్యం. ల్యాప్‌టాప్.. ఇంటర్నెట్.. యూ ట్యూబ్ ద్వారా సంగీత సాగరంలో తనూ ఒక అలై పోవాలనే ఆశ! కూతురి కోరిక తల్లికి తెలుసు. కాని అమ్మ మనసే బిడ్డకు తెలియదు. అర్థం కాదు. అందుకే అమ్మాయి దృష్టిలో ఆమె స్టుపిడ్. ‘మా అమ్మ ఏక్దమ్ స్టుపిడ్ హై. చిన్నపిల్ల మనస్తత్వం. తనకేం కావాలో తనకు తెలయదు. అన్నీ చెప్పాలి’ అని అమ్మ గురించి చెప్తుంది స్నేహితుడితో. ఆ స్టుపిడే.. తన తండ్రి ఇచ్చిన బంగారు గొలుసు అమ్మేసి కూతురికి ల్యాప్‌టాప్ కొనిపెడుతుంది. యూ ట్యూబ్‌లో తన మొహం కనిపించకుండా పాటను ఎలా వినిపించాలో సలహా ఇస్తూ బుర్హా చూపిస్తుంది. ఆ స్టుపిడ్ ఐడియానే యూ ట్యూబ్‌లో లక్షల వ్యూస్‌ను ఇచ్చి సీక్రెట్ సూపర్‌స్టార్‌ను చేస్తుంది. అదే తర్వాత ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శక్తికుమార్ దర్శకత్వంలో పాట పాడే చాన్స్నిప్పిస్తుంది. కాదు.. స్థితప్రజ్ఞురాలు: ముందు ఆ మ్యూజిక్ డైరెక్టర్ మీద, అతని ప్రవర్తన మీదా ఆ అమ్మాయికి సదాభిప్రాయం ఉండదు. అసలు అతని పాటలంటేనే ఏవగించుకుంటుంది. శక్తికుమార్ సాంగ్స్ అన్నీ తన ఒరిజినల్ ట్యూన్స్‌ను తానే రీమిక్స్ చేస్తున్నట్టుంటాయి అన్న తల్లి‘ స్టుపిడ్’ మాటలతో శక్తికుమార్ను కన్విన్స్ చేస్తుంది. మనసుతో కాదు బాడీతో పాట పాడు అన్న అతనే మనసు పెట్టే పాడే పాటను రికార్డ్ చేసేలా చేస్తుంది. తండ్రి పెట్టే హింసకు బలవుతున్న తల్లికి ఎలాగైనా సరే విడాకులు ఇప్పించాలని లాయర్‌తో మాట్లాడి దరఖాస్తూ తెస్తుంది. అమ్మకు ఇచ్చి సంతకం చేయమంటుంది. ‘ఏంటిది?’ అని అడుగుతుంది తల్లి. విడాకుల కోసం అప్లికేషన్. చదువుకొని సంతకం చెయ్.. మనం ఇక్కడ ఉండొద్దు.. వెళ్లిపోదాం అని తల్లికి భరోసా ఇస్తుంది. కూతురు ఒంటరిగా ఫ్లయిట్లో ముంబై వెళ్లి, పాట కూడా పాడి, లాయర్‌ను కలిసి అరిందాతనం చేసిందని తెలిసి చెంపచెళ్లుమనిపిస్తుంది. బిడ్డ భద్రత పట్ల తల్లడిల్లుతుంది. ఏ ఆధారమూ లేకుండా విడాకులిచ్చేసి ఎలా బతుకుతామని ఆందోళన పడుతుంది. ‘పెళ్లిచేసేటప్పుడు నా బిడ్డంకేం కావాలో అని మా నాన్నా అడగలేదు అప్పుడు... అమ్మకేం నచ్చుతుందో అని ఆలోచించకుండా కూతురు విడాకులిప్పిస్తోందిప్పుడు’ అని ఓ కామెంట్ పాస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తల్లి. స్టుపిడ్ అమ్మీ.. అని అమ్మ అజ్ఞానాన్ని తిట్టుకుంటుంది బిడ్డ. అప్పుడు.. సినిమా అంతా సనాతన సంప్రదాయ వాదిగా కనిపించే దాది(నానమ్మ) ‘నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు.. ఆడపిల్లవని కడుపులోనే చంపేయమన్నాడు మీ నాన్న. మీ అమ్మ వినలేదు. ఇక్కడే ఉంటే నిన్ను ఎక్కడ చంపేస్తాడో మీ నాన్న అని ఇంట్లోంచి వెళ్లిపోయి నిన్ను కన్నాక పొత్తిళ్లలో పెట్టుకొని వచ్చింది. ‘ఈసారికి వదిలేశా.. కాని ఇంకోసారి ఆడపిల్లను కంటే మాత్రం ఊరుకోను’ అని హెచ్చరించాడు మీ నాన్న. అలా నిన్ను బతికించుకుంది. అందుకే ఇన్సియా అని పేరుపెట్టుకుంది’ వాళ్లమ్మ కడుపులో దాచుకున్న రహస్యాన్ని మనవరాలికి చెప్తుంది. ఇన్సియా కళ్లల్లో నీళ్లు. అమ్మ స్టుపిడ్ కాదు. స్థితప్రజ్ఞురాలు అని అర్థ్థమవుతుంది. ఆమె స్థయిర్యం తెలుస్తుంది. పశ్చాత్తాప భారంతో అమ్మ దగ్గరకు వెళ్లబోతుంటే ఆపుతుంది దాది.. ఈ రహస్యం నీకు తెలిసినట్టుగా ఉండకు. నీకు తెలియకుండా ఉండాలని మీ అమ్మ కోరిక. నీకు తెలయకపోవడంలోనే ఆమె సంతోషం. నీకు తెలిస్తే నాకు తృప్తి’ అంటుంది. అప్పుడు గ్రహిస్తుంది దాదిలోని స్త్రీవాదిని ఆ మనవరాలు. ఆత్మగౌరవం తోడుగా..: తండ్రి ప్రయత్నాలు ఫలించి సౌదీలో ఉద్యోగం దొరుకుతుంది. కుటుంబమంతా సౌదీకి వలసవెళ్లాలని తండ్రి ప్లాన్. ఆ హింసను అక్కడా భరించడం ఎందుకు? మనం ఇక్కడే ఉందామని కూతురు మొండిపట్టు. మధ్యలో సతమతమవుతుంది తల్లి. దాది చెప్పిన మాట విన్నాక చివరకు అమ్మకు ఇబ్బంది కలగకుండా ఉండాలను కుంటుంది. అందుకే సౌదీ వెళ్లడానికి ఒప్పుకుంటుంది. అక్కడే ఇన్సియాకు సంబంధం కూడా చూస్తాడు తండ్రి. తల్లి మథన పడుతుంది. కాని ఇన్సియా ఒప్పుకుంటుంది. సౌదీ ప్రయాణానికి సన్నద్ధమవుతారు. ముంబై నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్. చెకిన్ వ్యవహారాలను చకచక చేస్తున్న కూతురి చొరవను, ధైర్యాన్ని చూసి అబ్బుర పడుతుంది తల్లి. ముంబైలో చెకిన్ లగేజ్ ఎక్కువైంది కాబట్టి నాలుగున్నవేలు అదనంగా కట్టాలని చెప్పడంతో కూతురి గిటార్‌ను తీసేసి ట్రాష్‌లో పడేసి రమ్మంటాడు తండ్రి. తల్లి సర్దిచెప్పబోతుంది. వినడు. బాధతో భారంగా గిటార్‌ను చెత్తబుట్టలో వేసేస్తుంది ఇన్సియా. అంతకుముందు.. చదువును నిర్లక్ష్యం చేస్తుందని గిటార్ తంత్రులను విరగొట్టేస్తాడు. అప్పుడూ నిస్సహాయంగానే ఉంటుంది. ల్యాప్‌టాప్‌ను బయటకు విసిరేయమంటాడు. అప్పుడూ ఆ కుటుంబ పెద్దకు ఎదురు చెప్పే సాహసం చేయరు ఎవరూ. కాని ఈసారి తల్లి ఊరుకోదల్చుకోదు. ఇన్సియా ముచ్చటపడుతోందని ఆ పిల్లకు ఆరేళ్లప్పుడు కొనిచ్చింది ఆ గిటార్‌ను. ఆట,పాట, చదువు, సంధ్య అన్నీ ఆ గిటారే ఆ బిడ్డకు. ఇన్సియా జీవితంలో అదో భాగం. కాదు అదే ఆ పిల్ల జీవితం. మొట్టమొదటిసారి భర్తకు ఎదురుతిరుగుతుంది. అహం దెబ్బతిన్న భర్త ఎయిర్పోర్ట్ అని కూడా చూడకుండా కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ‘చుట్టూ కెమెరాలున్నాయి.. గృహహింస కింద కేస్ పెడతాను జాగ్రత్త’ అని హెచ్చరిస్తుంది. ‘మమ్మల్ని, మా ఆశలు, ఆశయాలను గౌరవించలేని మనిషితో ఉండలేమ’ని చెప్తుంది. పెట్టెలో దాచుకున్న బిడ్డ తెచ్చిన విడాకుల అప్లికేషన్ మీద సంతకం చేస్తుంది. ఏంటిది అంటాడు భర్త. ‘చదువొచ్చిన మనిషి కదా మీరు.. చదువుకోండి’ అంటూ పిల్లలిద్దర్నీ తీసుకొని అత్తగారికీ వీడ్కోలు చెప్పి బయటకొచ్చేస్తుంది. ఈసారి అబ్బురంగా చూడ్డం ఇన్సియా వంతవుతుంది. భార్యాభర్తల ప్రాబ్లం: ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్, ఇన్సియాకు అవార్డు రావడం.. ఈ క్లైమాక్స్ అంతా రొటీన్. ఇన్సియా స్నేహితుడి పాత్ర.. మారుతున్న కాలానికి.. లేదా మారాల్సిన మగపిల్లల అభిప్రాయాలకు ప్రతీక. తల్లి, తండ్రి విడాకులను అమోదించలేని ఇష్యూగా కాకుండా.. భార్యభర్తల ప్రాబ్లంగా ఆ పిల్లాడు అర్థం చేసుకున్నట్టు, అదొక సాధారణ విషయంగా పరిగణిస్తున్నట్టు చూపించడం అభినందనీయం. ‘మా నాన్న చెడ్డవాడేం కాదు.. అమ్మకు, నాన్నకు అభిప్రాయభేదాలు అంతే’ అంటాడు. భార్యభర్తలు విడిపోయినా.. ఆ ఇద్దరిలో ఏ ఒకరిపట్లా ఇంకొకరు విషబీజాలు నాటొద్దు అనే హెచ్చరిక అది. సమాజం వినాల్సిన, సమాజానికి కావల్సిన హెచ్చరిక! ఇక ఇన్సియా తమ్ముడిగా నటించిన గుడ్డు (కబీర్) కూడా సూపర్బ్. ఆ ఇంటి యజమానిలా ఈ బుడతడు తయారు కావద్దని ఇంట్లోని ఆడవాళ్లంతా ప్రయత్నిస్తుంటారు. వాడిని తప్ప ఆ కుటుంబ పెద్ద ఎవరినీ ఇష్టపడడు. అయినా వాడు మనిషిలాగే పెరుగుతుంటుంటాడు. అమ్మను, అక్కను, దాదీని ప్రేమించే, గౌరవించే పిల్లాడిగా. దీనికి చిన్న ఉదాహరణ.. అక్కకు ఇష్టమైన ల్యాప్‌టాప్ తండ్రి కోపానికి బలై ఒకటో అంతస్తు నుంచి పడి.. విరిగి ముక్కలైతే... ఏరి అతికించి అక్కకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని పడే తాపత్రయం వాడిలో సున్నితత్వాన్ని చూపిస్తుంది. ఎక్స్టెండెడ్ కేమియో: లాస్ట్.. బట్ నాట్ లీస్ట్ ఆమిర్‌ఖాన్! ఏ హీరో చేయడానికి ఒప్పుకోని, సాహసం చేయని రోల్. ఎక్స్టెండెడ్ కేమియో. ఇంతకన్నా చెప్పలేం.. ఎందుకంటే ఎంత చెప్పినా అసంపూర్తిగానే అనిపిస్తుంది తప్ప చూస్తేకాని ఆ పాత్ర డెప్త్ తెలియదు. పాటలు.. అన్నీ బాగున్నా ఇన్సియా తల్లి కోసం యూ ట్యూబ్‌లో పాడిన పాట అద్భుతం. అది విన్న ప్రతి కూతురూ అమ్మ గురించి ఫీలయ్యే పాట. ఆమిర్‌ఖాన్ లాంటి స్టార్ ప్రొడక్షన్ సంస్థ కాబట్టి ఈ సినిమాకు మంచి మార్కులు వేయట్లేదు. ప్రస్తుత కాలానికి కావల్సిన విలువలను చూపించిన సినిమా.. కాబట్టే గుడ్ మార్క్స్. ఆ గట్స్ ఈ స్టార్ ప్రొడక్షన్ సంస్థకే ఉందని మళ్లీ నిరూపించింది ఈ సినిమా. కనుకే ఆమిర్ఖాన్కూ కుడోస్. అఫ్కోర్స్ కిరణ్ రావు! ఆమె అతని వెనక లేకపోతే అతను ఇన్‌కంప్లీట్ మ్యాన్.. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో తెలియన వెలితి ఉండేది. కాస్ట్ అండ్ క్య్రూ: ఇన్సియా.. జైరా వసిమ్ (దంగల్ ఫేమ్). నటన అద్భుతం. ఆమె తల్లి నజ్మాగా మెహెర్ విజ్ నటించారు. అనేకంటే జీవించారు అంటే బాగుంటుంది. ఇన్సియా తండ్రి ఫరూఖ్ మాలిక్‌గా రాజ్ అర్జున్ అభినయం సూపర్బ్. ఇక ఇన్సియా ఫ్రెండ్ చింతన్గా తీర్థ్ శర్మ, ఇన్సియా తమ్ముడిగా కబిర్ షేక్, నానమ్మగా ఫరూఖ్ జఫర్.. అందరూ ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ సినిమాను నడిపించిన కెప్టెన్ (దర్శకుడు) అద్వైత్ చందన్. – శరాది -
కట్టప్ప ఎందుకు చంపాడో నేనే తెలుసుకుంటా...
ఆమిర్ ఖాన్ ఓ సూపర్‌స్టార్. అందులో నో సీక్రెట్స్! ఆమిర్ నటించిన ఏ చిత్రమైనా సూపర్‌హిట్టే. అందులో నో డౌట్స్. కానీ, ఆయన్ను మించిన ఓ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఉన్నారని ఆమిర్ చెబుతున్నారు. ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆమిర్ మీడియాతో ముచ్చటించిన విశేషాలు.... ► ఇంతకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ తెలుగు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు! నిజమే. ‘మంచి కథ దొరికితే’ అని కూడా చెప్పాను కదా! తెలుగులో నటించడానికి నాకు ఎలాంటి సమస్యా లేదు. తెలుగు దర్శకులతో నా కోసం మంచి కథలు, క్యారెక్టర్లు రాయమని చెప్పండి. ఐ యామ్ రెడీ! ► ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలోనూ (డబ్బింగ్) మంచి హిట్టవుతున్నాయి. వాటిని మీరు చూస్తారా? టైమ్ దొరికినప్పుడు చూస్తుంటా! ‘బాహుబలి’ చూశా. ప్రభాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. అద్భుతంగా చేశాడు. తెలుగులో మంచి మంచి నటులు, దర్శకులు ఉన్నారు. మంచి సిన్మాలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ హిందీలో ‘దంగల్’ కంటే ఎక్కువ వసూలు చేసింది. కానీ, నేనింకా ఆ సినిమా చూడలేదు. ► అవునా!? పోనీ, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకున్నారా? తెలియదు. పొరపాటున కూడా ఆ సీక్రెట్ చెప్పవద్దు. నేనే తెలుసుకుంటా. త్వరలో ‘బాహుబలి–2’ చూస్తా. ► ఓకే! మీరేంటి? చెవులకు పోగులు, ముక్కుపుడక... ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సర్ప్రైజ్ లుక్‌లో కనిపిస్తారా? లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ కోసం! ‘సీక్రెట్ సూపర్‌స్టార్’లో సంగీత దర్శకుడు శక్తి కుమార్‌గా కనిపిస్తా. మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. సింగర్ కావాలనే ఓ 14 ఏళ్ల అమ్మాయి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుందనేది చిత్రకథ. ► ఈ సినిమాలో సీక్రెట్ సూపర్‌స్టార్ ఎవరు? చాలామంది ఉన్నారు. సింగర్ కావాలనే అమ్మాయిగా ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్, ఆమె తల్లిగా మెహర్ అద్భుతంగా నటించారు. వాళ్లిద్దరి కథే ఈ సినిమా. నేను స్టార్స్‌తోనే సినిమాలు చేయాలనుకోను. కథకు ఎవరు సూటైతే వాళ్లతో చేయాలనుకుంటా. ‘దంగల్’లో నలుగురు కొత్తమ్మాయిలు ఎంత బాగా చేశారో చూశారు కదా! కొత్త టాలెంట్‌ను ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ నాకు వస్తుండడం హ్యాపీగా ఉంది. ఈ సిన్మాతో దర్శకుడు అద్వైత్ చందన్, కొత్త సింగర్స్, పలువురు టెక్నిషియన్స్‌ని పరిచయం చేస్తున్నా. ► 2 వేల కోట్లు కలెక్ట్ చేసిన ‘దంగల్’ తర్వాత మీరు నటించిన చిత్రమిది. ప్రేక్షకుల్లో బోల్డన్ని అంచనాలు ఉన్నాయి. మీరేమో ఓ చిన్న సినిమా చేశారేంటి? ఇండియాలోనే కాదు... చైనా, హాంకాంగ్‌లతో పాటు పలు దేశాల్లో ‘దంగల్’ సూపర్‌హిట్. ఆ సినిమాపై ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. ‘దంగల్’ నచ్చినోళ్లకు కచ్చితంగా ఈ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ కూడా నచ్చుతుంది. ఇందులోనూ మనసుల్ని కదిలించే కథ, కథనాలు ఉన్నాయి. సమాజంలో కొందరు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం. ► ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ట్రైలర్లో ‘అవార్డులు తీసుకుని తీసుకుని విసుగొచ్చింది’ అనే డైలాగ్ చెప్పారు. మీరు అవార్డు వేడుకలకు అటెండ్ అవ్వరు కదా? అందుకే దర్శకుడు కథ చెప్పగానే.. ‘శక్తి కుమార్ పాత్రలో నాకు నేను కనిపించడం లేదు’ అన్నాను. అద్వైత్ మాత్రం నేనే నటిస్తే బాగుంటుందన్నాడు. ‘ఓ పని చేద్దాం. నేను ఆడిషన్ ఇస్తా. బాగుంటే చేద్దాం’ అన్నాను. చివరికి, నన్నే సెలక్ట్ చేశాడు. ► అవార్డుల గురించి వచ్చింది కాబట్టి... ఆస్కార్స్ వచ్చే ప్రతిసారి మన దర్శకులెవరికీ ఆ అవార్డు అందుకునే అర్హత లేదా? అనే ప్రస్తావన వస్తుంది. మీ దృష్టిలో ఆస్కార్స్ సాధించగల దర్శకుడు ఎవరు? ప్రపంచంలోనే అత్యుత్తమ దర్శకులు మన దగ్గరున్నారు. వెరీ టాలెంటెడ్. మంచి సినిమాలు తీస్తున్నారు. ఇండియాతో పాటు చైనా, హాంకాంగ్‌లలో భారీ హిటై్టన ‘దంగల్’ను తీసింది మన నితీశ్ తివారీనే కదా! వరల్డ్ క్లాస్ సినిమాలు మనమూ తీస్తున్నాం. సో, ఎవరో (అమెరికన్స్) ఇచ్చే అవార్డు కన్నా... ప్రేక్షకులు ఇచ్చే ప్రశంసలు, ఆదరణే ముఖ్యమని భావిస్తా. ► మీరు రొమాంటిక్ సిన్మా చేసి చాలా రోజులైంది. ఏ హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలనుంది? ఓ అమ్మాయితో రొమాన్స్ చేయాలనుంది. తను మంచి యాక్టర్. అందంగానూ ఉంటుంది. కానీ, నాతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. తన పేరు కిరణ్‌రావ్ (ఆమిర్ భార్య) అని నవ్వేశారు. -
పార్లమెంట్లో ‘దంగల్’ ప్రదర్శన
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ హీరోగా నిర్మించిన 'దంగల్' సినిమాను గురువారం లోక్‌సభలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. పార్లమెంట్ సభ్యులకు ‘దంగల్’ సినిమా చూపించనున్నారు. బుధవారం లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయం తెలిపారు. తన అభ్యర్థన మేరకు ఎగువ, దిగువ సభ సభ్యులందరికీ మార్చి 23వ తేదీన ప్రదర్శించనున్నారని వివరించారు. వినోదంతో పాటు మహిళా సాధికారిత, హక్కులపై సభ్యులను మరింత జాగృతులను చేసేందుకు ఈ సినిమా ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నానన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని సంక్షేమ విభాగం నేతృత్వంలో చేపట్టే ఈ కార్యక్రమానికి సభ్యులంతా తమ జీవిత భాగస్వాములతో కలసి రావాలని కోరారు. ఓ కుస్తీయోధుడు తన ఇద్దరు కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథం వైపు ఎలా నడిపించారనేది ఈ సినిమా కథ. కాగా గత ఏడాది 'చాణక్య' సినిమాను ప్రదర్శించారు. -
దంగల్ మరో ఘనవిజయం
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డీమానిటైజేషన్ ప్రతికూల ప్రభావంతో నష్టాలపాలైన థియేటర్ యజమానుల పాలిట వరప్రసాదంలా ఆదుకుంది ఈ చిత్రం. విలక్షణ చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అమీర్ తాజా చిత్రం దంగల్ రూ.375 కోట్ల వసూళ్లను అధిగమించింది. దీంతో థియేటర్ యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 5వ వారానికి మొత్తం రూ.376.14 కోట్లను ఆర్జించింది. ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకులు తరన్ ఆదర్శ్ దంగల్ వసూళ్ల పరంపరను ట్వీట్ చేశారు. క్రిస్మస్ బొనాంజాగా థియేటర్లను పలకరించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తాజా చిత్రం దంగల్ కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో గత రెండేళ్లుగా (2015,2016) నష్టాలను మూట గట్టుకుంటున్న సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు లాభాల పంట పడింది. సింగిల్ స్ర్కీన్ థియేటర్ల యజమానులు అమీర్ కు కృతజ్ఙతలు తెలుపుతూ లేఖ రాయడమే ఇందుకు నిదర్శనం. సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానుల భావోద్వేగ ఉత్తరంపై బాక్స్ ఆఫీస్ కింగ్ అమీర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రేమించే.. ఇష్టపడే పనిని చేసే అవకాశం అందరికీ రాదనీ, కానీ తనకు అలాంటి అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కెరీర్ లో అన్నీ అసాధారణ,మైన రిస్కీ మూవీలనే చేసానని చెప్పుకొచ్చారు. అందుకు తాజా ఉదాహరణ 'దంగల్' సినిమానే అన్నారు. కాగా 2016 కలెక్షన్ల పరంగా బోసిపోయిన బాలీవుడ్ కు దంగల్ కలెక్షన్ల వర్షం కురిపించింది. డిసెంబర్ 23 న విడుదల నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన దంగల్ ఇండియన్ బాక్స్ ఆఫీసులను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్రతిహతంగా కొనసాగుతున్న కలెక్షన్లు ఏకంగా రూ 523.47 కోట్లు వసూలు కావడం విశేషం. #Dangal [Week 4] Fri 1.94 cr, Sat 4.06 cr, Sun 4.24 cr, Mon 1.37 cr, Tue 1.27 cr, Wed 1.16 cr, Thu 1.04 cr. Total: ₹ 374.95 cr. India biz. — taran adarsh (@taran_adarsh) January 20, 2017 #Dangal crosses ₹ 375 cr mark... Creates HISTORY... [Week 5] Fri 1.19 cr. Total: ₹ 376.14 cr. India biz. ATBB. — taran adarsh (@taran_adarsh) January 21, 2017 #Dangal records Crossed ₹ 50 cr: Day 2 100 cr: Day 3 150 cr: Day 5 200 cr: Day 8 250 cr: Day 10 300 cr: Day 13 350 cr: Day 19 375 cr: Day 29 — taran adarsh (@taran_adarsh) January 21, 2017 #Dangal crosses $ 29 million internationally... OVERSEAS - Till 20 Jan: $ 29.04 million [₹ 197.70 cr]... USA-Canada crosses $ 12 million 👍👍👍 — taran adarsh (@taran_adarsh) January 21, 2017 -
నమ్మకాన్ని పెంచండి..భయాన్ని కాదు
ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని నా భార్య అడుగుతోందన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో దుమారం కొనసాగుతోంది. బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ అనుపమ్ ఖేర్ అమీర్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పవిత్ర భారతదేశం అసహన భారతదేశంగా ఎపుడు మారిపోయిందని ప్రశ్నించారు. ఏ దేశం వెళదామో మీ భార్య కిరణ్ చెప్పలేదా అంటూ ట్విట్ చేశారు. మరి ఏ దేశం మీకు అమీర్ ఖాన్ గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందో ఆమెకు తెలిపారా వ్యంగ్య బాణాలు విసిరారు. చాలా కష్టాల్లో ఉన్నపుడు ఈ దేశమే మిమ్మల్ని ఆదుకుందనే విషయాన్ని ఆమెకు చెప్పారా.. మరి దేశం విడిచి పోయే ఆలోచన అప్పుడెందుకు చేయలేదన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందన్న అమీర్ వ్యాఖ్యలను తప్పు బట్టిన ఆయన . దేశంలో అసహనం పెరుగుతోంటే, ప్రజలకు ఇలాంటి సలహానే ఇస్తారా అంటూ మండిపడ్డారు. పవిత్రమైన దేశంలో అల్లర్లు చెలరేగితే పరిస్థితులు చక్కబడేదాకా సంయమనం పాటించమని ప్రజలకు పిలుపునిస్తారా లేక దేశం విడిచి పారిపొమ్మంటారా అని ప్రశ్నించారు. దేశంలో పెరుగుతున్న అశాంతి గత ఏడెనిమిది నెలలునుంచే మీకు కనిపిస్తోందా అంటూ అమీర్ పై విరుచుకుపడ్డారు. సత్యమేవ జయతి ప్రజల్లో. నమ్మకాన్న ఆశావహదృక్పథాన్ని పెంపొందించాలి తప్ప భయాన్ని కాదని అనుపమ్ ఖేర్ హితవు చెప్పారు. కాగా దేశంలో రామ్‌నాథ్ గోయెంగా ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ దేశంలో అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన చిన్నారుల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరేదేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని చెప్పిన సంగతి తెలిసిందే. -
అమీర్ సంచలన వ్యాఖ్యలపై దుమారం
ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు. అమీర్ కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్విట్ చేశారు. ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు. ఎంత పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని అమీర్ కు ఆయన సూచన చేశారు. అమీర్ ప్రకటన షాక్‌కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. అయినా తనలాంటి అభిమానులు అమీర్ పై కురిపించిన ప్రేమ,ఆప్యాయతలు ఇక ముందు కూడా కొనసాగాలంటూ మనోజ్ తివారీ ఆకాంక్షించారు. కాగా దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యలు చేసిన అమీర్, తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. Aamir khan ne apne bayaan se desh ka mahaul bigaadne ki koshish ki. Hall me baithe saikdon logo ne bhartiya sehanshilta ka parichay diya... — Manoj Tiwari (@ManojTiwariMP) November 23, 2015 -
రెహమాన్ జీవితకథతో 'జయహో'
భారతీయ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ జీవితకథ ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. 90 నిమిషాల నిడివిగల ఈ డాక్యుమెంటరీ అక్టోబర్ 26న డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. తన జీవితకథను తెరకెక్కించడానికి రెహమాన్ ఒప్పుకోకపోయినా ప్రముఖ ఫిలిం మేకర్ ఉమేష్ అగర్వాల్ ఒత్తిడితో అంగీకరించాడు. అంతర్జాతీ స్ధాయిలో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ఫిలింలో రెహమాన్ ఇంటర్వ్యూతో పాటు, అమీర్ ఖాన్, డానీ బోయల్, మణిరత్నం, గుల్జార్, అశుతోష్ గోవరీకర్, శేఖర్ కపూర్ లాంటి సెలబ్రిటీలు రెహమాన్ గురించి చెప్పిన మాటలను టెలికాస్ట్ చేయనున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో రెహమాన్ ఎదుర్కొన్న కష్టాలు, ఆ తరువాత దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అతి కొద్ది కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకోవటం, బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్, అంతర్జాతీయ సినిమాలకు సంగీతం అందించటం లాంటి అంశాలతో పాటు ఆస్కార్ వేదికపై రెహమాన్ చెప్పిన మాటలను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.