షారుక్‌ఖాన్ మృతదేహం, గాయపడిన అమీర్‌ఖాన్
నిజామాబాద్ /డిచ్‌పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. డిచ్‌పల్లి ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షారుక్‌ఖాన్(24), అమీర్‌ఖాన్‌లు ఇద్దరు అన్నదమ్ములు. యానంపల్లిలో కొత్తగా కట్టిన ఇంటికి రంగులు వేసి బైక్‌పై గాంధీనగర్ కాలనీకి వస్తున్నారు. సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు బైక్‌పై ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టాడు.
ప్రమాదంలో షారుక్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా, అమీర్‌ఖాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రశాంత్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అం దుకున్న 108 అంబులెన్స్ పైలట్ కిషన్, ఈఎంటీ మహేందర్‌లు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరు కుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తండ్రి మహ బూబ్‌ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతితో గాంధీనగర్‌లో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment