Sharukhan
-
టాప్-10 హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే ఇండియన్ హీరోల లిస్ట్ ఇదే
-
సిగరెట్ తాగడం మానేస్తున్నా.. కానీ ఇప్పటికీ..: షారూఖ్
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సిగరెట్‌కు బానిస.. రోజుకు ఒకటీరెండు ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు సిగరెట్లు కాల్చేవాడు. ఇలా అస్తమానూ సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? అని అటు కుటుంబం, ఇటు అభిమానులు ఎంతో కంగారుపడేవాళ్లు. ఈ వ్యసనానికి దూరం కావాలని షారూఖ్ ఎన్నోసార్లు అనుకున్నాడు. చివరాఖరకు ఆ వ్యసనంపై విజయం సాధించానంటున్నాడు. నవంబర్ 2న బర్త్‌డే జరుపుకున్న ఇతడు అభిమానులను కలుసుకునేందుకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు.గుడ్ న్యూస్ఈ కార్యక్రమంలో షారూఖ్ మాట్లాడుతూ.. 'మీకో మంచి విషయం చెప్పబోతున్నాను. నేను సిగరెట్లు తాగడం ఆపేశాను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాససమస్యలు తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను' అన్నాడు. షారూఖ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు.తిండి కూడా మానేసి..కాగా 2011లో ఓ ఇంటర్వ్యూలో షారూఖ్.. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని బయటపెట్టాడు. తిండి, నీళ్లు అన్నీ మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడినన్నాడు. 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగి సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేశానన్నాడు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి. ఇకపోతే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా కనిపించనున్నాడు. “I am not smoking anymore guys.” - SRK at the #SRKDay event ❤️❤️ #HappyBirthdaySRK #SRK59 #King #ShahRukhKhan pic.twitter.com/b388Fbkyc4— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 3, 2024 చదవండి: హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ -
అడ్వాన్స్ ట్యాక్స్‌లో ‘కింగ్’ ఖాన్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిల్చారు. ఆయన రూ. 92 కోట్లు చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూ. 80 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023–24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చూన్ ఇండియా రూపొందించిన ’ది స్టార్ కాస్ట్’ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా రూ. 66 కోట్లు చెల్లించగా, ఎంఎస్ ధోని రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్..సౌరవ్ గంగూలీ వరుసగా రూ.28 కోట్లు, రూ. 23 కోట్లు చెల్లించారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్, మోహన్‌లాల్ చెరో రూ. 14 కోట్లు కట్టగా ఆమిర్ ఖాన్ రూ. 10 కోట్లు చెల్లించారు. -
షారుఖ్ ను వెనక్కి నెట్టేసిన ప్రభాస్..
-
షారూక్ ఖాన్ మెచ్చిన అరకు గిరిజన మహిళ
-
వామ్మో! షారుక్‌కు అంత రెమ్యునరేషన్ కావాలంట
బాలీవుడ్లో జయాపజయాలతో సంబంధం లేకుండా కింగ్ ఖాన్ షారుక్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రస్తుతం ఖాన్ ‘పఠాన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొన్నాయి. లీకుల బెడద కారణంగా రహస్యంగా ‘పఠాన్‘ చిత్రీకరణను జరుపుతున్నారు. అలాగే చిత్రానికి సంబంధించి టైటిల్ తప్ప ఇంకే సమాచారం అధికారికంగా ప్రకటించలేదు. మరో పక్క పఠాన్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి హైప్ ఉంది కనుకే షారుక్ కూడా భారీ మొత్తంలో తన రెమ్యునరేన్ అడిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 100 కోట్లు డిమాండ్ చేసినట్లు బీటౌన్‌లో టాక్. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయినా జీరో తర్వాత రెండేళ్లుగా ఖాన్ వెండితెరపై కనపడకపోవడం, చాల కాలం తర్వాత యాక్షన్ డ్రామాలో నటించడంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఇంత మొత్తాన్ని అడిగే అవకాశం లేకపోలేదు. పఠాన్ చిత్రం గతేడాది నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లింది . 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటించగా, జాన్ అబ్రహాం ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ‘వార్’ చిత్రదర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. సంగీత ద్వయంగా పేరున్న విశాల్-శేఖర్ పాటలు సమకూర్చనున్నారు. ఇందులో సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్న షారుక్ ముంబై రౌడీలను రఫ్ఫాడించబోతున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నిజామాబాద్ /డిచ్పల్లి : మండలంలోని సుద్దపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. డిచ్పల్లి ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నడిపల్లి పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షారుక్‌ఖాన్(24), అమీర్‌ఖాన్‌లు ఇద్దరు అన్నదమ్ములు. యానంపల్లిలో కొత్తగా కట్టిన ఇంటికి రంగులు వేసి బైక్‌పై గాంధీనగర్ కాలనీకి వస్తున్నారు. సుద్దపల్లి శివారులోని కంచెట్టి దాబా వద్ద అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు బైక్‌పై ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో షారుక్‌ఖాన్ అక్కడికక్కడే మృతి చెందగా, అమీర్‌ఖాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రశాంత్ స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అం దుకున్న 108 అంబులెన్స్ పైలట్ కిషన్, ఈఎంటీ మహేందర్‌లు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరు కుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అమీర్‌ఖాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తండ్రి మహ బూబ్‌ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతితో గాంధీనగర్‌లో విషాదం నెలకొంది. -
ఒకరికి మిస్సు...మరొకరికి ప్లస్సు..!
మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉండాలంటారు. అలాగే, ఏ పాత్ర ఎవరికి దక్కాలో కూడా ముందే రాసి ఉంటుందేమో. ఒక హీరో... ఫ్లాప్ అవుతుందని వదులుకున్న సినిమాలో మరో హీరో నటించి, హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉంటాయి. ‘డర్’... షారుక్ ఖాన్‌లోని మరో కోణం చూపించిన చిత్రం. ‘3 ఇడియట్స్’... ఆమిర్‌ఖాన్ కెరీర్లో మైలురాయిలాంటి సినిమా. కుడి ఎడమైతే అన్నట్లు.. వాస్తవానికి ‘డర్’లో ఆమిర్ నటించాల్సింది. కానీ, వర్కవుట్ కాదమోనని వదులుకున్నారు. ‘3 ఇడియట్స్’ మీద అదే ఫీలింగ్‌తో షారుక్ తిరస్కరించారు. ఇలాంటి సువర్ణావకాశాలను వదులుకున్న బాలీవుడ్ తారలు చాలామందే ఉన్నారు. వాళ్లల్లో ప్రధానంగా కొంతమంది గురించి చెప్పుకోవాలి. ఆ తారలు తిరస్కరించిన చిత్రాలేంటి? వాళ్లు వదులుకున్న కారణంగా లాభపడిన ఇతర తారలెవరు?... ఆ విషయాల్లోకి ఓ లుక్కేద్దాం... ఆమిర్‌కి భయం వేసింది! ‘డర్’ అంటే భయం అని అర్థం. బాలీవుడ్ అగ్రదర్శకుడు యశ్ చోప్రా సొంత సినిమా ఇది. ఇందులో నెగటివ్ షేడ్ ఉన్న లీడ్ రోల్‌కి ముందుగా ఆమిర్ ఖాన్నే తీసుకోవాలనుకున్నారు యశ్ చోప్రా. కానీ, ఈ పాత్ర తనకు సూట్ కాదనో లేక కథ మీద నమ్మకం కుదరకో ఆమిర్ తిరస్కరించారు. ఆయన అనుమానం, భయం షారుక్‌కి వరం అయ్యాయి. ఆమిర్ కాదనడంతో అప్పటికే ‘బాజీగర్’లో నెగటివ్ టచ్ ఉన్న కేరక్టర్ చేసిన షారుక్‌ని తీసుకున్నారు యశ్. ఈ సినిమా షారుక్ కెరీర్‌ని టర్న్ చేసింది. సో.. ఈ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ తప్పినందుకు ఆమిర్ తనని తాను నిందించుకునే ఉంటారు. షారుక్‌కి మూడు షాక్‌లు! ఆమిర్ వదులుకున్న ‘డర్’ని వదులుకుని, జడ్జిమెంట్ విషయంలో ఫుల్ మార్కులు కొట్టేసిన షారుక్ ఖాన్, మూడు సినిమాలను అంచనా వేయడంలో విఫలమవ్వడం విశేషం. భారతదేశం గర్వించదగ్గ చిత్రాల్లో ‘లగాన్’ ఒకటనడం అతిశయోక్తి కాదు. ఇందులో హీరోగా నటించే అవకాశం ముందు షారుక్‌నే వరించింది. చిత్రదర్శకుడు అశుతోష్ గోవార్కర్ కథ రాసుకున్నప్పుడే షారుక్‌ని అనుకున్నారట. కానీ, ఈ బాలీవుడ్ బాద్షాకి ‘లగాన్’ కథ మీద నమ్మకం కుదరక సినిమా చేయడం కుదరదన్నారు. దాంతో ఆమిర్‌ఖాన్‌ని కలిశారు. ఈ సినిమా తర్వాత మరో గోల్డెన్ చాన్స్‌ని కూడా వదులుకున్నారు షారుక్. అదే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’. సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం నవ్వుల పువ్వులు పూయించడంతో పాటు పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్ర దర్శక, నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, విదు వినోద్ చోప్రాలు ‘మున్నాభాయ్’గా షారుక్ బాగుంటారనుకున్నారు. కానీ, షారుక్ కాదనడంతో సంజయ్ దత్‌ని తీసుకున్నారు. ఆ సినిమా సాధించిన విజయానికి ఇతర భాషలవారి దృష్టి పడటం, తెలుగు, తమిళ్.. ఇలా పలు భాషల్లో రీమేక్ కావడం తెలిసిందే. లడ్డూలాంటి రెండు అవకాశాలను వదులుకున్న షారుక్ మిస్సయిన మూడో మంచి చాన్స్ ‘3 ఇడియట్స్’. ‘మున్నాభాయ్’ని కాదన్నప్పటికీ ఈసారి షారుక్ అంగీకరిస్తాడనే బలమైన నమ్మకంతో ‘3 ఇడియట్స్’ కథతో ఆయన్ని కలిశారు రాజ్‌కుమార్ హిరానీ. టైటిలే తేడాగా ఉంది... ఇదేం సినిమానో అనుకున్నారో ఏమో ఈ చిత్రాన్ని కూడా తిరస్కరించేశారు షారుక్. కట్ చేస్తే.. ఆమిర్ ఆ సినిమా చేయడం, 200 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ సినిమాగా రికార్డ్ సృష్టించడం జరిగింది. ఇక, షారుక్ బాధ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. షాహిద్ వల్ల ధనుష్‌కి లాభం చాక్లెట్ బోయ్ ఇమేజ్ ఉన్న షాహిద్ కపూర్ కారణంగా తమిళ హీరో దనుష్ చాలా లాభపడ్డారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ‘రాన్‌జనా’ చిత్రంలో షాహిదే నటించాల్సి ఉంది. షాహిద్‌కి ఆ చిత్రకథ, హీరో పాత్ర నచ్చాయి. కానీ, డేట్స్ లేకపోవడంతో ఆ సినిమా వదులుకున్నారు. సినిమాలో హీరో తమిళ కుర్రాడు కాబట్టి, తమిళ హీరోనే తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నారు ఆనంద్. మంచి మాస్ హీరోగా, నటుడిగా ధనుష్‌కి కోలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అందుకని తనని తీసుకున్నారు. మొత్తం బాలీవుడ్ అంతా విస్తుపోయేలా ధనుష్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఒకవేళ షాహిద్ అయినా ఆ పాత్ర బాగానే చేసి ఉంటారు. ప్చ్.. డేట్స్ లేక వదులుకున్నారు. ఇక, షాహిద్ వదులుకున్న మరో మంచి అవకాశం ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’. పరిణీతి చోప్రా, వాణీకపూర్ నాయికలుగా నటించారు. కొత్త నాయికల సరసన నటించడానికి ఇష్టపడక షాహిద్ ఈ చిత్రాన్ని వదులుకున్నారనే టాక్ ఉంది. ఆయన అయిష్టమే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి హెల్ప్ అయ్యింది. ‘కై పో చే’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన సుశాంత్ సింగ్‌కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోగలుగుతాడనే ఇమేజ్ తెచ్చింది. కరీనా వదులుకున్న ఆ నాలుగు సినిమాలు కల్ హో నా హో, హమ్ దిల్ దే చుకే సనమ్, క్వీన్, గోలియోన్ కీ రాసలీలా రామ్-లీలా... ఇలా కరీనా కపూర్ వదులుకున్న సూపర్ హిట్ చిత్రాల జాబితా చాలానే ఉంది. ఈ నాలుగు సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి.. సూపర్ హిట్ మూవీస్‌ని వదులుకున్నందుకు కరీనా ఫీలవుతారా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో.. ‘‘నేను ఓ సినిమా వదులుకున్నాననుకోండి.. వేరే హీరోయిన్‌కి అవకాశం ఇచ్చినట్లేగా. నా కారణంగా ఇతర నాయికలు లాభపడటం నాకు ఆనందమే’’ అని కరీనా చెప్పడం విశేషం. కంగనా జాతీయ అవార్డు మిస్సయిందా? రజ్జో, క్వీన్.. ఇలా ఇటీవల కంగనా రనౌత్ చేసిన సినిమాలు ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనలో మంచి నటి ఉందని నిరూపించాయి. ఒకవేళ ‘డర్టీ పిక్చర్’ చేసి ఉంటే, ఆమెలో మంచి నటి ఉందని కొంచెం ముందే ప్రేక్షకులకు తెలిసి ఉండేది. కానీ, ‘డర్టీ పిక్చర్’కి నిర్మాత ఏక్తా కపూర్ అడిగినప్పుడు, సంశయించారట కంగనా. కొన్ని రోజులు ఆలోచించుకుని, చివరికి ‘నో’ అనేశారట. ఆ తర్వాత హోమ్లీ ఇమేజ్ ఉన్న విద్యాబాలన్ ఈ చిత్రాన్ని అంగీకరించడం, నటనాపరంగా విజృంభించడం తెలిసిందే. ఈ సినిమా ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఒకవేళ కంగనా చేసి ఉంటే.. తనను ఆ అవార్డు వరించి ఉండేదేమో. ఇలా చెప్పుకుంటూ పోతే... మంచి సినిమాలను ‘మిస్’కొట్టిన తారల జాబితా చాలానే ఉంటుంది. ఎంతో నమ్మకంతో ఒప్పుకున్న సినిమాలు అపజయం పాలవ్వడం, ఏ అంచనాలూ లేకుండా చేసిన సిని మాలు ఘనవిజయం సాధించడం జరుగుతుంది. అందుకే అంటారు.. సినిమా అనేది ‘లాటరీ’లాంటిదని.