ముంబై: తమ అభిమాన హీరో కొత్తగా నటించే సినిమాలో ఎలాంటి గెటప్‌లో ఉన్నా అభిమానులు గుర్తుపట్టేస్తారు. కానీ తాజాగా బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ నటిస్తున్న‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌లోని ఓ ఫోటో లీక్ అయి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అమీర్ సిక్కు సంప్రదాయంలో బారీ గెడ్డం, తలపాగ కట్టుకొని ఉన్నారు. దీంతో అమీర్ కొత్తగెటప్‌ను కొంత మంది నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ఈ లీకైన ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.‘నటుడు అంటే ఇలా ఉండాలి’అని ఒకరు. ‘వావ్.. అమీర్ హండ్సమ్ సర్దార్‌లా ఉన్నానరని..!’ మరొకరు కామెంట్ చేశారు.. మరికొంతమంది ‘అసలు అమీర్‌ను గుర్తుపట్టలేకపోతున్నాం’అని కామెంట్లు చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రంలో హిరోయిన్‌గా నటిస్తున్న కరీనాకపూర్ షూటింగ్ ఫోటోలు కూడా లీకై సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఫోటోలో కరీనా పింక్ రంగులో ఉన్న సాల్వార్ కమీజ్ ధరించి.. మేకప్ లేకుండా ఉన్నారు. అమీర్ ఇటీవల ఈ సినిమా విడుదల తేదిని వెల్లడించారు. లాల్‌సింగ్ చద్దా.. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ మూవీ అయన ‘లాల్‌సింగ్ చద్దా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే.
‘ఆ హీరో గెటప్ గుర్తుపట్టలేకపోతున్నాం’
Published Mon, Nov 11 2019 8:26 PM | Last Updated on Thu, Nov 28 2019 2:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment