KareenaKapoor
-
Saif Ali Khan: రాజవంశం.. రూ.100 కోట్ల ఇల్లు.. రూ.800 కోట్ల ప్యాలెస్
-
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్‌మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
పర్పుల్ కలర్ డ్రెస్‌లో మరింత అందంగా కరీనా కపూర్ (ఫోటోలు)
-
‘ఆ హీరో గెటప్ గుర్తుపట్టలేకపోతున్నాం’
ముంబై: తమ అభిమాన హీరో కొత్తగా నటించే సినిమాలో ఎలాంటి గెటప్‌లో ఉన్నా అభిమానులు గుర్తుపట్టేస్తారు. కానీ తాజాగా బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ నటిస్తున్న‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌లోని ఓ ఫోటో లీక్ అయి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అమీర్ సిక్కు సంప్రదాయంలో బారీ గెడ్డం, తలపాగ కట్టుకొని ఉన్నారు. దీంతో అమీర్ కొత్తగెటప్ను కొంత మంది నెటిజన్లు గుర్తుపట్టలేకపోయారు. ఈ లీకైన ఫోటోలపై అభిమానులు, నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.‘నటుడు అంటే ఇలా ఉండాలి’అని ఒకరు. ‘వావ్.. అమీర్ హండ్సమ్ సర్దార్‌లా ఉన్నానరని..!’ మరొకరు కామెంట్ చేశారు.. మరికొంతమంది ‘అసలు అమీర్‌ను గుర్తుపట్టలేకపోతున్నాం’అని కామెంట్లు చేశారు. కాగా ఇటీవల ఈ చిత్రంలో హిరోయిన్‌గా నటిస్తున్న కరీనాకపూర్ షూటింగ్ ఫోటోలు కూడా లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలో కరీనా పింక్ రంగులో ఉన్న సాల్వార్ కమీజ్ ధరించి.. మేకప్ లేకుండా ఉన్నారు. అమీర్ ఇటీవల ఈ సినిమా విడుదల తేదిని వెల్లడించారు. లాల్‌సింగ్ చద్దా.. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్ ఖాన్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ మూవీ అయన ‘లాల్‌సింగ్ చద్దా’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్ గంప్’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే. -
తైముర్ అలీ వన్
తైముర్ అలీఖాన్ కదా.. తైముర్ అలీ వన్ అంటారేంటి అనుకుంటున్నారా? సైఫ్ అలీఖాన్–కరీనా కపూర్ల ముద్దుల తనయుడు తైముర్ అలీఖాన్ వన్ ఇయర్ బర్త్‌డే బుధవారం జరిగింది. అందుకే తైముర్ వన్ అన్నాం. ఇప్పుడు బీ టౌన్ స్టార్ కిడ్స్‌లో సెన్సేషన్ తైముర్. ఎయిర్‌పోర్ట్‌లో, హోటల్లో, ఇలా ఎక్కడ కనిపించినా మీడియాను తనవైపు తిప్పుకుంటున్నాడీ బుజ్జిగాడు. తనయుడి బర్త్‌డేని సైఫ్–కరీనా కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపారు. బర్త్‌డే గిఫ్ట్‌లు చాలా వచ్చినప్పటికీ ఒక్క గిఫ్ట్ మాత్రం మనందర్నీ ఆశ్చర్యపరచకమానదు. బాలీవుడ్ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ ఏకంగా ఒక అడవినే గిఫ్ట్‌గా ఇచ్చారు. మీరు విన్నది నిజమే. ‘తైముర్ అలీఖాన్ పటౌడి ఫారెస్ట్’ అని పేరు కూడా పెట్టారు. ‘‘కొన్ని పక్షులు ఇప్పటికే కనుమరుగయ్యాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటవి కూడా మాయమయ్యే ప్రమాదం ఉంది. తైముర్‌కి ఇవి తెలియాలని ఈ చిట్టి అడవిని బహుమతిగా ఇచ్చా’’ అని రుజుతా పేర్కొన్నారు. వెయ్యి చెదరపు అడుగుల్లో సుమారు వందకి పైగా మొక్కలను నాటారు. విశేషం ఏంటంటే అందులో సగానికి పైగా చెట్లు తైముర్ వయస్సువి. కొన్ని చెట్లు తైముర్ కంటే చిన్నవి. జామ, అరటి, ఉసిరి, పనస, మిర్చి, సీతాఫలం, వంటి రకరకాల మొక్కలతో నిండిపోయింది ఈ ఫారెస్ట్. -
వెరైటీ టైటిల్‌తో కీ అండ్ కా '
కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం ముంబై: బాలీవుడ్లో ఓ చిత్రమైన టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జెండర్ సమానత్వాన్ని ప్రబోధించే ఈ మూవీకి వెరైటీగా 'కీ అండ్ కా ' అని పేరుపెట్టారు దర్శకనిర్మాతలు. సినిమా విశేషాలను దర్శకుడు బాల్కీ వెల్లడించారు. హిందీలో భాషలో మనుషులతోపాటూ వస్తువులకు కూడా జెండర్ ఉందన్నారు. కానీ 'కీ అండ్ కా ' సినిమాకు లింవివక్ష లేదని, సినిమా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రభోదిస్తుందని తెలిపారు. విరుద్ధభావాలు కల అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీ 2016 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో కరీనా కపూర్ నటిస్తున్నారని చెప్పారు. మరోవైపు అర్జున్ కపూర్, కరీనాకపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధానపాత్రలో కనిపించనున్నారట. ఇంతకుముందు బాల్కి దర్శకత్వంలో చీనీ కం, పా, షమితాబ్ సినిమాల్లో నటించారు బిగ్ బి.