
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
అంతకుముందు ఫిట్‌నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్‌మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment