Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్‌ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా? | check the List of expensive cars owned by Deepika Padukone | Sakshi
Sakshi News home page

Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్‌ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?

Published Tue, May 28 2024 5:05 PM | Last Updated on Tue, May 28 2024 5:34 PM

 check the List of expensive cars owned by Deepika Padukone

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె.  రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో  భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. 

అంతేనా  మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది.  2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.

అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది.  స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్‌ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్‌వీర్‌ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ  కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్  కొలువుదీరిని  లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే  షాక్‌ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు.

 

దీపికా పదుకొణె కార్ కలెక్షన్..
ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలు
మెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లు
రేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లు
మినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలు
మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్- రూ. 1.60 కోట్లు
ఆడి A8 L- రూ. 1.20 కోట్లు
ఆడి A6- రూ. 55 లక్షలు
BMW 5 సిరీస్- రూ. 60 లక్షలు
పోర్షే కయెన్- రూ. 1 కోటి

ప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో  అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో  పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement