మల్టీ టాలెంట్
50 యాప్స్.. 1000 డిజైన్‌లు!
పిల్లల లోకంలో కార్టూన్‌లు, కార్టూన్‌ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్‌లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..
పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్‌టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్‌లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.
బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్‌డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్‌ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.
ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్‌లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్‌ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.
ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్‌లు..
ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్‌లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్‌లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్‌లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్‌లు, బ్రోచర్‌లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్‌లు తీసుకురానుంది ఎడోబ్.
Comments
Please login to add a commentAdd a comment