Mohanty
-
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
ఈసీ ఫేవరేట్ మహంతి: ప్యామిలీలో ఐపీఎస్‌లు ఎందరో..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీ–1గా పనిచేస్తున్న 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారాయుడిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో నియమించే అధికారులకు సంబంధించి వచ్చిన జాబితాను పరిశీలించిన ఈసీ అభిషేక్ మహంతి పేరును ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఈసీ ఆయా అధికారులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి సమర్థతతో పాటు నిజాయతీ తదితరాలను చూసిన తర్వాతే ఖరారు చేస్తుంది. గత ఏడాదే తెలంగాణ కేడర్‌కు వచ్చిన అభిషేక్ మహంతి 2019లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు. 2019 నాటి ఏపీ ఎన్నికల సమయంలో ఈయన తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏపీలో పనిచేసిన ఎస్పీలపై ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వివిధ జిల్లాల వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కడప ఎస్పీగా అభి మహంతిని నియమించింది. ఆ కుటుంబంలో ఎన్నో ‘ఎన్నికల పోస్టింగ్స్’ అభిషేక్ మహంతితో పాటు ఆయన కుటుంబంలో కూడా ‘ఎన్నికల పోస్టింగ్స్’ సాధారణ అంశంగా మారడం గమనార్హం. అభిషేక్ తండ్రి అజిత్ కుమార్ మహంతి (ఏకే మహంతి) 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గానూ పని చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన ఈసీ ఆ స్థానంలో ఏకే మహంతిని నియమించింది. ఇక అభిషేక్ మహంతి సోదరుడు అవినాష్ మహంతి కూడా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం సైబరాబాద్‌లో పరిపాలన విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. అవినాష్ మహంతికి కూడా గతంలో ఇదేవిధంగా ఎన్నికల పోస్టింగ్ వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్‌లోని రేవంత్ ఇంటిపై పోలీసులు చేసిన దాడి తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ మహంతిని నియమించింది. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీసీఎస్‌కే తిరిగి వచ్చారు. మహంతి ఫ్యామిలీలో ఎందరో ఐపీఎస్‌లు ఏకే మహంతి మామ (భార్య తండ్రి) దామోదర్ చోట్రాయ్ తొలి సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అయిన 1948 బ్యాచ్ ఒడిషా కేడర్ అధికారి. డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఏకే మహంతి బావమరిది పీకే సేనాపతి 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఒడిషా కేడర్లోనే డీజీపీగా రిటైర్ అయ్యారు. -
రెండు రాష్ట్రాలకూ ప్రస్తుత చట్టాలే
కొత్త ప్రభుత్వాలు మార్పులు చేసుకునే వరకు వర్తింపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యే అపాయింటెడ్ డే కు ముందు రోజు వరకు ఉన్న చట్టాలే ఇరు రాష్ట్రాలకు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. విభజనకు పూర్వం చేసిన చట్టాలను రెండు రాష్ట్రాలు.. తమతమ చట్టసభల్లో ఏవైనా సవరణలు చేసుకోవడం లేదా వాటిని పూర్తిగా రద్దుచేయడం వంటివి చేసేవరకు ఇవే కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 2(ఎఫ్)లో పేర్కొన్న విధంగా చట్టాలు, ఆర్డినెన్స్‌లు, నియంత్రణ, ఆదేశాలు, బైలా, నిబంధనలు, పథకం, నోటిఫికేషన్ తదితరమైనవి ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతాయని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల చట్టం 1973కు సంబంధించి రాష్ట్రాల సరిహద్దులు మారుస్తూ.. రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు చేసేవరకు అదే చట్టం అమలవుతుందన్నారు. ప్రస్తుత చట్టాలకు కాలపరిమితి ఉన్నప్పుడు, ఆ కాలపరిమితి ముగియడానికి రెండేళ్ల ముందు వాటిని మార్చడం లేదా కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. కోర్టులు, ట్రిబ్యునల్స్, అథారిటీలకు సంబంధించిన చట్టాల్లో మార్పు చేసే సమయంలో స్థూల విషయం దెబ్బతినకుండా.. మార్పు చేయవచ్చన్నారు. చట్టాల మార్పుతో పాలన స్తంభించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని గతంలో సుప్రీంకోర్టు రెండు కేసుల్లో స్పష్టంచేసిన అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అపాయింటెడ్ డేకు ముందు ఉన్న చట్టాలు ఒకవేళ కాలం చెల్లినవైన పక్షంలో వాటిని మార్చుకోవడం, అవసరమైతే రద్దు చేసుకునే అధికారం కొత్తగా ఏర్పాటయ్యే శాసనసభలకు ఉంటుందని వివరించారు. -
విభజన ప్రతిపాదనలకు రేపు ఆమోదం!
కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన గవర్నర్ హాజరుకానున్న సలహాదారులు గురువారమే మరో రెండు కీలక సమావేశాలు హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి గురువారం మూడు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో రెండు సమావేశాలు హైదరాబాద్‌లో మరొకటి ఢిల్లీలో జరగనుంది. విభజనకు ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో సంబంధిత ప్రతిపాదనల ఆమోదం కోసం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్ అహ్మద్, ఎ.ఎన్.రాయ్ ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. పదో షెడ్యూల్లో చేర్చాల్సిన సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఈ భేటీలో అమోదం తెలుపనున్నారు. అలాగే పోలవరం ముంపు ప్రాంతాలను ఖమ్మం జిల్లా నుంచి సీమాంధ్ర జిల్లాలకు మార్చాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన మిగతా ప్రతిపాదనలన్నింటికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం మంగళవారం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో చివరి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని (ఎస్ఎల్బీసీ) సీఎస్ మహంతి గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ ప్రణాళిక అమలు పురోగతిని వివరించనున్నారు. అలాగే జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ రుణాల మంజూరుపై కూడా చర్చించాల్సిందిగా గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ బ్యాంకర్లు ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల రైతులకు వ్యవసాయ రుణాలను మంజూరు చేయాల్సిందిగా సీఎస్ కోరే అవకాశం ఉంది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉదయం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో సీఎస్ మహంతితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రుణంగా ఇచ్చిన రూ.17 వేల కోట్లను మాఫీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరనుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రత ల పరిరక్షణకు, ఇతర సందర్భాల్లో కేంద్ర పోలీసు బలగాలను పంపినందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.1,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. విభజన నేపథ్యంలో ఈ రూ.1,000 కోట్లను కూడా మాఫీ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల రెండు ఆర్థిక సంవత్సరాల పాటు రెండు రాష్ట్రాలకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర రాష్ట్రానికి, అలాగే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎంత మేరకు ఆర్థిక సాయం అందిస్తారనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. సీమాంధ్ర రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటులో ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందనే అంశంపైనా చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో కీలక భేటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై చర్చ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి ఏర్పాటైన రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్ కమలనాథన్తోపాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, కేంద్ర హోం, సిబ్బంది మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు బుధవారం ఉదయం ఢిల్లీలో 10 గంటలకు సమావేశం కానున్నారు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల ఖరారు అంశంలో భాగమైన రాష్ట్రపతి ఉత్తర్వులు, అధికరణ 371(డి), సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. తద్వారా స్థూలంగా ముసాయిదా మార్గదర్శకాలపై ఒక అవగాహనకు రానున్నారు. అనంతరం వీటిని ప్రజల ముందు చర్చకు పెడతారు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలకు రెండువారాల గడువిస్తారు. ఢిల్లీ సమావేశంలో పాల్గొనేందుకు కమలనాథన్, మహంతి, పీవీ రమేశ్, నాగిరెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పంపిణీ మార్గదర్శకాల ఖరారుకు ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ కూడా బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఇదిలా ఉండగా ఈ నెల 29, 30న ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ మహంతి మంగళవారం హైదరాబాద్‌లో తనను కలసిన ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె యథాతథం
హైదరాబాద్:విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వంతో సంప్రదింపులు సఫలీకృతం కాకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేసేందుకు నడుంబిగించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు అంగీకరించని విద్యుత్ జేఏసీ సమ్మెతోనే తగిన సమాధానం చెప్పాలని భావిస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐఆర్(మధ్యంతర భృతి) చెల్లిస్తేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామన్నారు. అంతకుముందు కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
-
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్
హైదరాబాద్:కొత్త ప్రభుత్వాలు ఏర్పడేంత వరకూ విద్యుత్ ఉద్యోగులు కాస్త ఓపిక పట్టాలని చీఫ్ సెక్రటరీ మహంతి స్పష్టం చేశారు. ప్రభుత్వాల ఏర్పాటుకు కొంత సమయం పట్టే ఆస్కారం ఉన్నందున అప్పటి వరకూ ఉద్యోగస్తులు ఆగాల్సి న అవశ్యం ఉందన్నారు. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో మాట్లాడిన మహంతి..కొత్త ముఖ్యమంత్రిల వద్దకు ఫైళ్లను పంపించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వాలు ఏర్పడే తరుణంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏప్రిల్ నెల నుంచే ఏరియర్స్ అందుతాయన్నారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాకే పే రివిజన్ కార్యక్రమం ఉంటుందన్నారు. పే రివిజన్ తో రూ. 1250 కోట్ల మేర అదనపు భారం పడుతుందన్నారు. ఒకవేళ సమ్మె చేస్తే ఆస్పత్రులు, రైల్వేలకు, తాగునీటికి పలు ఇబ్బందులు ఎదురవుతాయని మహంతి తెలిపారు. -
25న సీఎస్ మహంతికి ఐఏఎస్‌ల వీడ్కోలు సభ!
హైదరాబాద్: పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతికి వీడ్కోలు పలికేందుకు ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఈ వీడ్కోలు సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. జూన్ 2న అపాయింటెడ్ డే అయినందున విభజన పనుల్లో అధికారులు తీరికలేకుండా ఉన్నారు. ఈ క్రమంలో 25నే వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం -
మాజీ పోలీస్ బాస్‌లతో డీజీపీ ఆత్మీయ సమావేశం
అనుభవాలను పంచుకున్న తాజా, మాజీ అధికారులు హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం పలువురు మాజీ డీజీపీలతో తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కలయికలో 13 మంది పోలీసు మాజీ బాస్‌లకు ప్రసాదరావు విందు ఇచ్చారు. దీనికి ఆనందరామ్, ఆర్.ప్రభాకర్‌రావు, తాళ్లూరి సూర్యనారాయణ రావు, ఎంవీ భాస్కరరావు, రాగాల, ఎమ్మెస్ రాజు, విజయరామారావు, హెచ్‌జే దొర, పేర్వారం రాములు, స్వరణ్‌జిత్‌సేన్, అజిత్ కుమార్ మహంతి, కె.అరవిందరావు, దినేష్‌రెడ్డి వంటి మాజీ డీజీపీలు పలువురు హాజరయ్యారు. వీరు డీజీపీ ఆఫీసులోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, చాంబర్లను వీక్షించారు. పాత తరం అధికారులు కొత్త పరిజ్ఞానం పని విధానం తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. ఉల్లాసంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ బాస్‌లు తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి చివరి డీజీపీగా ప్రసాదరావు నిర్వహించిన పాత్ర, శాంతి భద్రతలను అదుపు చేయడంలో తీసుకున్న చర్యలను మాజీలు ప్రశంసించారు. ఈ సందర్భంలో పలువురు ఉన్నతాధికారులు కలిసి వారితో తమ గతానుభవాల్ని గుర్తుచేసుకున్నారు. -
టీచర్లకు ఆప్షన్ అవకాశమివ్వాలి: పీఆర్టీయూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో 20 శాతమే భర్తీ చేస్తున్నారని, 2000 సంవత్సరం వరకు డీఎస్సీల ద్వారా ఓపెన్ కేటగిరీలో 30 శాతం భర్తీ చేసినందున స్థానికేతరులు ఎక్కు వ మంది తెలంగాణ జిల్లాలకు వచ్చారని, వారు తమ సొంత జిల్లాలకు వెళ్లేలా ఆప్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి గురువారం సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ ఇస్తే దాదాపు మూడువేల మంది తెలంగాణ నుంచి తమ సొంత జిల్లాలకు వెళతారని, ఆ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. -
పెరిగిన విభజన వేగం
నేడు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి ఉన్నతస్థాయి సమీక్షలు రెండు రాష్ట్రాల చట్టసభలకు వేర్వేరు భవనాలు కౌన్సిల్, అసెంబ్లీలు ఒకేచోట ఉండేలా ఏర్పాట్లు పోలీసు విభజన ప్రక్రియపై హోం శాఖ సమీక్ష పోలీసు ఆఫీసులు 2 రాష్ట్రాలకూ వినియోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా ఏప్రిల్ నెలాఖరునాటికల్లా పూర్తి చేయాలని గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అన్ని విభాగాల్లోనూ విభజన పనులు ఊపందుకున్నాయి. మేలో ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చాక విభజన ప్రక్రియకు రాజకీయపరమైన ఆటంకాలు, ఒత్తిళ్లు వస్తాయని గవర్నర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నరసింహన్, మహంతి బుధవారం వేర్వేరుగా ఉన్నతస్థాయి సమీక్షలను నిర్వహించనున్నారు. - గవర్నర్ నరసింహన్ భౌతిక వసతులు, ఆస్తులు, ఆదాయ వనరుల సమీకరణ, సమగ్ర వ్యాపార, వాణిజ్య అంశాలు, సాగునీటి రంగాలపై సీఎస్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. - విభజనకు సంబంధించి తొమ్మిది కీలకాంశాలపై సీఎస్ మహంతి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని డి-బ్లాక్‌లో అన్ని శాఖల ఉన్నతాధికారులు, నోడల్ అధికారులతో సమీక్షించనున్నారు. - మార్చి 1వ తేదీవరకు ఉన్న ఫైళ్లు విభజన, రికార్డులు, డిస్పోజల్స్ విభజన, చరాస్తుల వివరాలు, ప్రభుత్వ వాహనాలు, అలాగే స్థిరాస్తుల వివరాలు, రాష్ట్ర, మల్టీ జోనల్ పోస్టులు, యూనిట్స్ గల ప్రాంతాలు, ప్రధానమైన చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు, కోర్టు కేసులు, కాంట్రాక్టుల వివరాలతో మిగతా అంశాలన్నింటిపై సీఎస్ సమీక్షించనున్నారు. - ప్రస్తుతం సచివాలయంలోని ప్రతి శాఖలో టేబుల్స్, కుర్చీలు, టీవీలు, కంప్యూటర్లు, తదితర సామగ్రికి నంబర్లు వేస్తున్నారు. వీటిని ఇరు రాష్ట్రాలకు నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయనున్నారు. చట్టసభలకు వేర్వేరు భవనాలు విభజనానంతరం రెండు రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవనాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్ సమక్షంలో మంగళవారం అసెంబ్లీ, శాసనమండలికి భవనాల కేటాయింపుపై చర్చ జరిగింది. - ప్రస్తుత అసెంబ్లీలోని కొత్త, పాత సమావేశపు హాళ్లను ఒక రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిళ్లకు కేటాయించాలని, పబ్లిక్‌గార్డెన్‌లోని కౌన్సిల్ భవనంతో పాటు మరో భవనాన్ని అసెంబ్లీ సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్ది మరో రాష్ట్రానికి కేటాయించాలన్న సూచన వచ్చింది. దీనివల్ల ఒకే ప్రాంగణంలో రెండు సభలు ఉంటాయి కనుక మంత్రులకు వీలుగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. - ఇపుడున్న పాత, కొత్త ఎమ్మెల్యేల వసతి గృహాలను రెండు రాష్ట్రాలకు యథాతథంగా లేదంటే వేర్వేరుగా కేటాయించినా ఫర్వాలేదన్న అభిప్రాయపడ్డారు. సలహాదారులుగా మహారాష్ట్ర రిటైర్డ్ డీజీపీ, రాజస్థాన్ రిటైర్డ్ సీఎస్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సలహాదారులుగా మహారాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారిని, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అయితే వారి పేర్లు మాత్రం తెలియలేదు. పోలీసు ఆఫీసులన్నీ వన్ బై టూ! రాష్ట్రాలుగా విడిపోయినా, సమన్వయంతో కలసి పనిచేయాలని రాష్ట్ర పోలీసు విభాగం నిర్ణయించుకుంది. మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా పోలీసు విభజన తీరు తెన్నుల్ని రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి టీపీ దాస్ సమీక్షించారు. ఇరు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలతో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్ఐబీ, సీఐ సెల్ ఒకే ప్రాంగణంలో ఉండాలని నిర్ణయించారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నన్ని రోజులూ ఇదే విధానం కొనసాగనుంది. ప్రస్తుతం ఈ విభాగాలు కొనసాగుతున్న చోటే కొన్ని అంతస్తులు/కొంత ప్రాంతాన్ని మరో రాష్ట్రానికి కేటాయించనున్నారు. రాష్ట్ర స్థాయి విభాగాల వద్ద ఉన్న ప్రతి ఫైల్‌కూ మరో రెండు నకళ్లు సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాలకూ చెరోటి ఇచ్చినా మరోటి కచ్చితంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని టీపీ దాస్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసు (ఏపీఎస్పీ)లో పనిచేస్తున్న అన్నిస్థాయిల వారికీ ఆప్షన్లు ఇవ్వాలని, తర్వాత అవసరమైన పక్షంలో నిర్దేశించిన నిష్పత్తిలో పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలో విభజన ప్రక్రియ ఆలస్యమౌతోందని పోలీసు అధికారులు హోం సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. విభజన సైతం కీలక ప్రాధాన్యం ఉన్న అంశం కావడంతో ఎట్టిపరిస్థితుల్లోనూ మే 15లోపు కసరత్తులన్నీ పూర్తి చేయాల్సిందేనని, అపాయింటెడ్ డే లోపు తుదిరూపు సంతరించుకోవడం, విభజన పూర్తి కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. -
‘ఫలితాల’కు ముందే పూర్తిచేయాలి
మే 15వ తేదీ కల్లా విభజన పని పూర్తి చేయాలి జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాల్లోనూ పథకాలు, కార్యక్రమాలు, సేవలు సజావుగా కొనసాగాలి అధికారులతో సమీక్షలో నరసింహన్ ఆదేశం హదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోను మే 15వ తేదీ కల్లా పూర్తి చేయాల్సిందిగా గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని, ఆ తరువాత విభజన ప్రక్రియ కొనసాగేందుకు రాజకీయ ఒత్తిడిలు వస్తాయని, ఉద్యోగులు కూడా దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. కాబట్టి విభజనకు సంబంధించిన అన్ని రకాల ప్రక్రియలను మే 15వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై గవర్నర్ శనివారం రాజభవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, విభజన అపెక్స్ కమిటీ చైర్మన్ ఎస్.పి.టక్కర్, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డి, పి.వి.రమేశ్, సాంబశివరావు, రామకృష్ణారావులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే జూన్ రెండో తేదీన.. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సేవలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు సరఫరా, వివిధ రకాల పింఛన్ల పంపిణీ, విత్తనాల సరఫరా రెండు రాష్ట్రాల్లో యధావిధిగా కొనసాగాలని.. ఇందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్, స్టాంపులు - రిజిస్ట్రేషన్లు, రవాణా, మద్యం, గనుల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాలకు సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం పేరుతో టిన్ నెంబర్లను తయారు చేయటంతో పాటు తెలంగాణ రాష్ట్రం పేరుతో రశీదులను, అవసరమైన నోటిఫికేషన్లను, రబ్బరు స్టాంపులను సిద్ధం చేయాలని గవర్నర్ సూచించారు. జూన్ రెండు నుంచి ఈ-సేవ, మీ-సేవలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో యధావిధిగా కొనసాగాలని, ఇందుకు అవసరమైన రశీదులను తెలంగాణ పేరుతో తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనలో ఆస్తులు, ఆప్పుల పంపిణీ పెద్ద సమస్య ఉండదని, అకౌంటెంట్ జనరల్ సూచన మేరకు ఇరు రాష్ట్రాల సంచిత నిధికి నిధులు జమ అవుతాయని ఆర్థికశాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన వివిధ కమిటీల పనితీరును అపెక్స్ కమిటీ చైర్మన్ టక్కర్ గవర్నర్‌కు వివరించారు. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించి కేంద్రం ఇంకా కమిటీని ఏర్పాటు చేయకపోవడం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్ల విభజనతో పాటు విభజను సంబంధించి ప్రతి పనినీ పద్ధతి ప్రకారం, పారదర్శకంగా మే రెండో వారానికల్లా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్, ఇతర సీనియర్ అధికారులకు గవర్నర్ సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సోమవారం ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, శిక్షణ సంస్థలు, ఇంధన రంగాలపై గవర్నర్ సమీక్షిస్తారని సీఎస్ మహంతి తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగం నుంచి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును తప్పించారు. కొత్తగా ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు చోటు కల్పించారు. ఈ విభాగానికి టక్కర్‌ను చైర్మన్‌గాను, సభ్యులుగా వి.నాగిరెడ్డి, పి.వి.రమేశ్, ఎన్. శివశంకర్, కౌముది, ఆర్.జి కలఘట్గిలను, కన్వీనర్‌గా జయేశ్ రంజన్ కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల పంపిణీ సున్నిత సమస్య ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ చాలా కీలకాంశంగా మారనుందనే అభిప్రాయం గవర్నర్ సమీక్షలో వ్యక్తమైంది. ఉద్యోగుల పంపిణీ, ఏ ప్రాంతానికి చెందిన రాష్ట్ర కేడర్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు, మార్గదర్శకాలు తదితర అంశాలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్ గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు 84,200 ఉండగా వాటిలో 56 వేల పోస్టుల్లో మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారని, మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించారు. తెలంగాణలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్య, అలాగే సీమాంధ్రలో పుట్టిపెరిగి తెలంగాణలో పనిచేస్తున్న వారి సంఖ్యను కూడా రమేశ్ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ జరగాల్సి ఉన్నప్పటికీ గతంలో ఏర్పడిన రాష్ట్రాల విభజన సందర్భంగా రెండు లేదా మూడేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగులు, అలాగే భార్య - భర్త కేసుల్లో ఉద్యోగులు ఇచ్చే ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుం దన్నారు. ఈ రెండు రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 45 శాతం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. లెక్కలను పరిశీలించిన గవర్నర్ కూడా ఇది చాలా సున్నితమైన, సమస్యాత్మక అంశంగా మారనుందని, ఈ విషయంలో లెక్కలను ఒకటికి రెండు సార్లు సరిచూడాలని నిర్దేశించారు. ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ రూపొందించే మార్గదర్శకాల ఆధారంగా చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో రాజీపడ రాదని స్పష్టంచేశారు. -
ఇద్దరు సీఎంలూ పక్కపక్కనే: నరసింహన్
* రెండు రాష్ట్రాల పాలనా సచివాలయం నుంచే * ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్ ఆదేశాలు * తెలంగాణ ముఖ్యమంత్రికి సీ బ్లాక్ * ఆంధ్రప్రదేశ్ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్ * రెండు ప్రభుత్వాల ఉద్యోగులకు బ్లాకుల విభజన * అమృత క్యాజిల్ గేటు నుంచి తెలంగాణ సీఎం * లుంబిని పార్కు కొత్త గేటు నుంచి ఏపీ సీఎం.. * సీఎం క్యాంపు కార్యాలయం తెలంగాణ సీఎంకు * ఏపీ సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్ * అసెంబ్లీలోనే రెండు శాసనసభల సమావేశాలు * హైదర్‌గూడ క్వార్టర్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు * ఆదర్శనగర్ క్వార్టర్లు తెలంగాణ ఎమ్మెల్యేలకు * నెలాఖరుకల్లా పూర్తి ప్రతిపాదనలకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రస్తుత సచివాలయం నుంచే పాలనా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై గవర్నర్ తొలిసారిగా దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచే పరిపాలన సాగించటానికి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులనే సమకూర్చాలని, ఎటువంటి కొత్త నిర్మాణాలను చేపట్టరాదని నిర్ణయించారు. ఎక్కడైనా అత్యవసరమైన పక్షంలో ఉన్న భవనాల్లోనే అదనపు వసతులను కల్పించాలని స్పష్టంచేశారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన చర్యలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ నిర్దేశించారు. ప్రాథమికంగా జరిగిన కసరత్తు, అధికారుల ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. * రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రస్తుతం ఉన్న సచివాలయం నుంచే తమ తమ రాష్ట్రాల పరిపాలన కొనసాగిస్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్‌లోని సీఎం కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తారు. మొన్నటి వరకు డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ హెచ్ బ్లాక్‌లోని మూడో అంతస్థుతో పాటు ఆ మ్తొతం బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయ అధికారులకు కేటాయిస్తారు. సౌత్ హెచ్ బ్లాక్‌లోనే సీఎస్ కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరాన్ని నిర్మిస్తారు. * ప్రస్తుతం సచివాలయానికి రాకపోకలకు రెండు వైపులా రెండేసి గేట్లు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు అమృత క్యాజల్ హోటల్ ఎదురుగా గల పాత గేటును ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు లుంబినీ పార్కు ఎదురుగా గల కొత్త గేటును ఉపయోగిస్తారు. * సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లను లేదా ఏ, బీ, సీ, ఎల్ బ్లాక్‌లను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జే, కే, ఎల్, హెచ్ బ్లాకులు రెండు కేటాయిస్తారు. ఎల్ బ్లాక్ కోసం తెలంగాణ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ బ్లాకును తెలంగాణకు కేటాయిస్తే డీ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయిస్తారు. * ప్రస్తుత అసెంబ్లీ ఆవరణలోనే ఇరు రాష్ట్రాల శాసనసభ సమావేశాలను నిర్వహిస్తారు. బహుశా పాత అసెంబ్లీ భవనంలో తెలంగాణ ప్రభుత్వ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా అదనపు సౌకర్యాలను కల్పిస్తారు. కొత్త అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత శాసన మండలిని తెలంగాణ శాసనమండలి సమావేశాలకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలకు అక్కడే అవసరమైతే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలా లేదా అనే విషయాన్ని ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. * ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంగా కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికార నివాసంగా గ్రీన్‌ల్యాండ్స్ అతిథి గృహాన్ని సిద్ధం చేస్తారు. అవసరమైన అదనపు వసతులను అక్కడ కల్పిస్తారు. * ప్రస్తుతం ఉన్న మంత్రుల క్వార్టర్లనే ఇరు రాష్ట్రాల మంత్రులకు కేటాయిస్తారు. ఇష్టం వచ్చినట్లు మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం లేనందున ప్రస్తుతానికి ఉన్న క్వార్టర్లే మంత్రులకు సరిపోతాయి. * ప్రస్తుతం హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయిస్తారు. * విద్యుత్ సౌధ, జలసౌధ, సంక్షేమ భవన్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌తో పాటు ఇతర అన్ని శాఖలు, డెరైక్టరేట్ కార్యాలయాలను జనాభా ప్రాతిపదికన లేదంటే వెసులుబాటు ప్రకారం రెండు రాష్ట్రాల ఉద్యోగులకు కేటాయిస్తారు. విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు ఆరు నెలలు సమయం ఉన్నందున తరువాత నిర్ణయం తీసుకుంటారు. -
1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?
-
సీఈవోకు ‘ఫైళ్ల’ తలనొప్పి!
' అనుమతికోసం ఇబ్బడి ముబ్బడిగా ఫైళ్లను పంపుతున్న అధికార యంత్రాంగం ' కోడ్ పరిధిలోకి వచ్చినా.. రాకున్నా సీఈవో కార్యాలయానికి.. ' అనుమతి వచ్చాకే తనకు పంపాలన్న సీఎస్ ' ఎన్నికల పనులు, ఫైళ్ల పరిశీలన మధ్య సీఈవో కార్యాలయ అధికారులు సతమతం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో తమ అనుమతి కోసం వచ్చిపడుతున్న ఫైళ్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం అధికారులకు కొత్త తలనొప్పి వచ్చింది. ఇన్ని రోజులుగా టెండర్లు, బదిలీల ఊసెత్తని పలు శాఖల అధికారులు.. ఒక్కసారిగా టెండర్లు పిలవడం, బదిలీలు చేపట్టడం కోసం అనుమతులు కోరుతూ ఫైళ్లు పంపడం ఇబ్బందిగా పరిణమించింది. రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడం.. గవర్నర్ పాలనలో అధికార యంత్రాంగానిదే రాజ్యం కావడాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగమే ఈ అకస్మాత్తు నిర్ణయాలనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఉరుకులు, పరుగుల మీద ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండడం గమనార్హం. - ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చాక ఇప్పుడు పలు జిల్లాల్లో రూ. 100 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లను పిలవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ ఫైలును సీఈవో అనుమతికి పంపారు. సీఈవో కార్యాలయం అధికారులు ఫైలును పరిశీలించి ఎటువంటి టెండర్లు పిలవరాదని స్పష్టం చేశారు. - అలాగే ఇన్ని రోజులుగా జంట నగరాల్లోని పార్కులను పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం.. ఇప్పుడు అత్యవసరంగా పార్కులను సుందరీకరించాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచేందుకు అనుమతి కోరుతూ సీఈవోకు ఫైలును పంపింది. దీనిని కూడా తిరస్కరిస్తూ సీఈవో కార్యాలయం సిఫారసు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పారామంలో పలు పనులు చేపట్టాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. - మరోవైపు ఎన్నికల బదిలీల ముసుగులో రవాణా శాఖ కమిషనర్లను బదిలీ చేసేందుకు తొలుత ఆ శాఖ మంత్రి ప్రయత్నం చేశారు. ఈ లోగా రాష్ట్రపతి పాలన రావడంతో మంత్రివర్గం రద్దయింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, ఎన్నికల బదిలీల పరిధిలోకి రవాణా కమిషనర్లు రాకున్నా... ఆ ముసుగులో బదిలీలు చేయడం కోసం ప్రయత్నించారు. కానీ, ఈ ఫైలును పరిశీలించిన సీఈవో కార్యాలయం బదిలీలను తిరస్కరిస్తూ సిఫార్సు చేసింది. - ఇలాంటి ఫైళ్లు పలు శాఖల నుంచి పెద్ద సంఖ్యలో సీఈవో కార్యాలయానికి వచ్చిపడుతున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ పనుల్లో తీరిక లేకుండా ఉంటే మధ్యలో ఈ ఫైళ్లతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఈవో కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. - ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే ఫైళ్లను మాత్రమే కమిషన్ అనుమతి కోసం పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్ని శాఖలకు ముందే సూచించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాత్రం ఫైళ్లన్నింటినీ తొలుత ఎన్నికల కమిషన్‌కు పంపాలని, అక్కడ లభించిన వాటినే తనకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. - దీంతో ప్రతి ఫైలును అధికారులు సీఈవో కార్యాలయానికి పంపిస్తున్నారు. సీఈవో కార్యాలయం తన పరిధిలో ఫైళ్లపై నిర్ణయాన్ని వెలుబుచ్చుతూ.. తమ పరిధిలోకి రానివాటిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనలను కోరుతోంది. -
1,12,600 మంది చిరుద్యోగులపై వేటు?
‘విభజన’తో వీధిపాలు... మే నెలాఖరుకల్లా ఊస్టింగ్ వీరి ఉద్యోగాలు పోయినట్టే?! కాంట్రాక్టు ఉద్యోగులు 54,598 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 36,952 ఎన్ఎంఆర్, ఇతరులు 21,050 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో లక్ష మందికి పైగా చిరుద్యోగుల కుటుంబాల జీవనోపాధి మీద దెబ్బపడుతోంది. రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా ఏ ఉద్యోగినీ తీసేయాలని చెప్పకపోయినా.. ఆ ముసుగులో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, సూపర్-న్యూమరరీ, అడ్హాక్ పోస్టుల్లోని ఉద్యోగులను వదిలించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఉద్యోగుల లెక్కల ప్రకారం ఆయా పోస్టులను తొలగించారు. విభజన లెక్కల్లో ఈ పోస్టులను పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టంచేశారు. తొలి నుంచి ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఏదోవిధంగా ఇంటికి పంపించాలని చూస్తున్న ఆర్థికశాఖకు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం సాకుగా దొరికింది. దీంతో ఒక్క కలం పోటుతో లక్షకు పైగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువులను రాష్ట్ర విభజన అమలులోకి వచ్చే తేదీకి రెండు రోజుల ముందుగానే అంటే మే నెలాఖరుకల్లా ఊడబీకాలని ఆర్థికశాఖ నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. దీంతో లక్ష మందికి పైగా చిరుద్యోగులు వీధినపడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? సాధారణంగా అయితే మరో మూడు నెలలు ఉద్యోగ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించారు. మూడు నెలలు పొడిగిస్తే జూన్ నెలాఖరు వరకు కొనసాగుతారని.. ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని అధికార వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా.. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల కొలువుల పొడిగింపు మే నెలాఖరు వరకే ఇవ్వాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాలకు సవాలక్ష సమస్యలు ఎదురుకానున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై దృష్టి సారించగలవా అనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం ప్రభుత్వం ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడే నడుస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో 4వ తరగతి ఉద్యోగుల భర్తీని నిలుపుదల చేయడంతో అవసరమైన చోటల్లా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నారు. నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే వారు సరిగా పనిచేయరని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకుంటే ఉద్యోగ అభద్రతాభావంతో పనిచేస్తారనే సిద్ధాంతాన్ని బాబు ప్రభుత్వం అమలు చేసింది. ఈ నేపథ్యంలోనే కిందిస్థాయి, మధ్యస్థాయిలో లక్షకుపైగా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంలో ఓ పేపర్ టైప్ చేయాలన్నా, ఫైలు ఓ చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా, కారులో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లాలన్నా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులే ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ వేతనాల్లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. రెగ్యులరైజ్ చేయాలి: ఉద్యోగుల సమాఖ్య లక్షలాది మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం మూడేసి నెలలు చొప్పున మాత్రమే పదవీ కాలాన్ని పెంచుతూ వారి జీవితాల్లో అభద్రతను నింపుతోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు, సొసైటీల్లో కలిపి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 5,47 లక్షల మంది ఉన్నారని ఆయన తెలిపారు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. -
గవర్నర్‌తో చర్చించాకే..
అధికార నివాసాలపై మహంతి నిర్ణయం ప్రస్తుత అసెంబ్లీలోనే ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం సమావేశాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఐఏఎస్ పి.వి.రమేశ్ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులకు అధికార నివాసాలు కేటాయింపు, ఢిల్లీలోని అంధ్రప్రదేశ్ భవనం, ఇద్దరు సీఎస్‌లకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలు కేటాయింపు సున్నితమైన అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై గవర్నర్ నరసింహన్‌తో చర్చించిన తరువాత ఆయన సలహాలు, సూచనలమేరకు వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసం, క్యాంపు కార్యాలయం ఉంది. దీన్ని ఇప్పుడు తెలంగాణ సీఎంకు కేటాయించాలో, సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించాలో అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సీఎంకి ఒక అధికార నివాసం, క్యాంపు కార్యాల యం ఉండాలని భావించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకంగా గ్రీన్‌ల్యాండ్స్‌లో వాటిని నిర్మిం చారు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎంకు గ్రీన్‌ల్యాండ్‌లోని అధికార నివాసం కేటాయిస్తే మరో రాష్ట్ర సీఎంకు అధికార నివాసంగా ఏది కేటాయించాలనేది సమస్యగా మారింది. అలాగే ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, ఇద్దరు డీజీపీలకు అధికార నివాసాలను, సచివాలయంలో ఇద్దరికీ అధికారిక కార్యాలయాలను కేటాయించాలి. ఉమ్మడి రాజధానిలో తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలను ప్రస్తుత అసెంబ్లీలోనే ఒకరు తరువాత ఒకరు నిర్వహించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నివేదికను సమర్పించారు. కాగా సచివాలయంలోని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం కన్వీనర్‌గా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి.వి.రమేశ్‌ను నియమించాలని సీఎస్ నిర్ణయించారు. ఈ విభాగంలో ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, బి.వెంకటేశం, జయేష్ రంజన్ పనిచేస్తారు. ఈ విభాగంలో డిప్యుటీ కార్యదర్శిగా ఎల్. సుబ్బారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
చర్చల తర్వాతే ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: వివాదాలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా సమగ్ర చర్చల తర్వాతే ఉద్యోగుల విభజనకు మార్గదర్శకలు రూపొం దించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయిం చింది. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలపై మంగళవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కమలనాథన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు బొర్రా వెంకటేశం, రామకృష్ణారావు సమావేశమై చర్చించారు. శాఖల వారీగా సిబ్బందిని ఎలా విభజించాలి? అప్రధానంగా ఉన్న అనుబంధ విభాగాలను ఎలా కలపాలి? అనే అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటికే పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు విభజించాలి. విభజన ప్రక్రియకు ముందే విలీనం చేయాల్సిన శాఖలను గుర్తించాలి. ఈ పని ఆయా శాఖలు, కార్పొరేషన్లకు అప్పగించాలి. శాఖలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత ఏయే శాఖలు, కార్పొరేషన్లకు ఎంత మంది సిబ్బంది అవసరమో నిర్ణయించాలని సమావేశంలో చర్చించారు. -
నెలాఖరు వరకు సెలవుల రద్దు
నేడు కూడా ఉద్యోగినులు విధులకు రావాల్సిందే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన పనుల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు ఆదివారం సహా అన్ని రకాల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. రెండో శనివారం, ఆదివారం కూడా కార్యాలయాలు తెరిచే ఉంచాలని ప్రభుత్వ కార్యదర్శి మహంతి అధికారులను ఆదేశించారు. ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని అన్ని శాఖల అధికారులకు శుక్రవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చే శారు. సచివాలయం, హైదరాబాద్‌లోని అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో విభజనకు సంబంధించిన పనులు వేగవంతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఈనెల 8) సందర్భంగా మహిళా ఉద్యోగులందరికీ సెలవు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఆ రోజున (శనివారం) సెలవు రద్దు చేయడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
విభజన, సమీక్షే పాలన..!
లక్షల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్ల జిరాక్స్‌లు మరోవైపు గవర్నర్ సమీక్షకోసం ఫైళ్లను సిద్ధం చేస్తున్న వైనం సాధారణ ఫైళ్ల గురించి పట్టించుకునే నాథుడే లేడు సాక్షి, హైదరాబాద్: రాష్టంలో పాలన పడకేసింది. సచివాలయం నుంచి సాధారణ ప్రభుత్వ కార్యాలయాల వరకు.. ఐఏఎస్ అధికారులనుంచి సాధారణ ఉద్యోగుల వరకూ అందరూ విభజన పనిలోనే మునిగితేలుతున్నారు. మరోవైపు గత రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ నర్సింహన్ సమీక్షించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గవర్నర్ సమీక్షకు ఎటువంటి ఫైళ్లు పంపాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సంబంధిత శాఖల ఐఏఎస్‌లకే అప్పజెప్పేశారు. దీంతో గత రెండు నెలల్లో తీసుకున్న నిర్ణయాల ఫైళ్లను అన్నింటినీ పంపించేయాలని ఆయా శాఖలకు చెందిన ఐఏఎస్‌లు భావిస్తున్నారు. ఫలితంగా ఆయా శాఖల్లో దీనికి సంబంధించిన కసరత్తు జోరుగా సాగుతోంది. దీంతో సాధారణ ఫైళ్లు అంగుళం కూడా కదలడంలేదు. - ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీరు. మున్సిపల్ వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. అన్ని శాఖల్లో కలిపి లక్షల సంఖ్యల్లో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో పేపర్లు ఉన్నాయి. ఈ ఫైళ్లను తెలంగాణ, సీమాంధ్ర వారీగా విభజించడంపైనే ఉద్యోగులందరూ పనిచేస్తున్నారు. ఫైళ్ల విభజన పూర్తి చేసిన తరువాత వాటిని జిరాక్స్‌లు లేదా స్కానింగ్ చేసే పనిని చేపట్టనున్నారు. - అత్యంత ప్రాధాన్యత విభజనేనని, అందరూ ఈ పనిలోనే నిమగ్నమవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో అన్ని శాఖలు ఈ పనిని తప్ప మరో పనిని చేపట్టడం లేదు. - ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటికీ సాధారణంగా జరగాల్సిన పనులను విభజన నేపథ్యంలో అధికార యంత్రాంగం పక్కన పెట్టేసింది. సచివాలయం సీ బ్లాకులోనే సలహాదారులు గవర్నర్‌కు పాలన అంశాల్లో సలహాదారులగా నియమితులయ్యే వారికి సచివాలయంలోని సీ బ్లాకు నాలుగో అంతస్తులో గతంలో సీఎం ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లాం ఉన్న పేషీని, అలాగే ఐదో అంతస్తులో గతంలో సీఎం కార్యదర్శి రావత్ ఉన్న పేషీని కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. వారు బస చేయడానికి లేక్‌వ్యూ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు. -
సీఎస్‌గా మహంతి కొనసాగింపు!
-
కొత్త సీఎస్ కృష్ణారావు?
-
కొత్త సీఎస్ కృష్ణారావు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎంపికకు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఫైలు పంపించారు. 1979, 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఏడుగురు పేర్లతో కూడిన ఫైలును సీఎస్ ముఖ్యమంత్రికి పంపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎస్ ఎంపిక ఫైలును చూడటానికి విముఖత వ్యక్తం చేసిన పక్షంలో ప్రస్తుతం సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తూ మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ప్రస్తుత సీఎస్ మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. సీనియారిటీ ప్రకారం 1979 ఐఏఎస్ బ్యాచ్, 1980 ఐఏఎస్ బ్యాచ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పేర్లను జాబితాలో సీఎస్ పేర్కొన్నారు. సీఎస్ జాబితాలో పేర్కొన్న వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1979 ఐఏఎస్ బ్యాచ్‌లో ఐ.వి.సుబ్బారావు (ప్రస్తుతం యునెస్కోలో పనిచేస్తున్నారు), సీసీఎల్‌గా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చందనాఖన్, సాధారణ పరిపాలన (ఆర్‌ఐఏడీ)లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జె. ఆర్. ఆనంద్, అలాగే 1980 బ్యాచ్‌కు చెందిన కేంద్ర సర్వీసులో ఉన్న సత్యనారాయణ మహంతి, రోడ్లు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న డి. లక్ష్మీపార్థసారథి, అశ్వనీకుమార్ పరీడాలతో కూడిన జాబితాను సీఎంకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఈ నెల 28వ తేదీతో పదవీ విరమణ అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) గౌరవ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం మహంతి ముందుగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత ఫైలు ఆమోదం పొందారు. 28వ తేదీ పదవీ విరమణకు ముందుగా సీసీజీ గౌరవ అధ్యక్షునిగా తనను నియమించుకుంటూ సీఎస్ హోదాలో మహంతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు, రాష్ట్ర విభజన ప్రక్రియ అంతా సీజీజీలోనే జరగనుంది. రాష్ట్ర విభజన సమాచారాన్ని కేంద్రానికి చేరవేయడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంలో మహంతితో పాటు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజన తరువాత పంపిణీలోనూ ఇరువురు కీలక భూమిక నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల: మహంతి
హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పరీక్ష ఫలితాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విడుదల చేశారు. ఈ ఫలితాల వివరాల జాబితాను ccla.cgg.gov.in వెబ్సైట్లో ఉంచామని ఆయన అన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష ఫలితాల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపించామని మహంతి చెప్పారు. అయితే ఈ నెల 2న జరిగిన ఈ పరీక్షలకు 14లక్షల మందిపైగా విద్యార్థులు హాజరైన సంగతి తెలిసిందే. వీఆర్ఓ పరీక్ష రాసిన అభ్యర్థులు 88,609 లక్షల మంది కాగా, వీఆర్ఏ పరీక్ష రాసిన అభ్యర్థులు 11.84 లక్షల మంది హాజరైనట్టు మహంతి తెలిపారు. ఈ నెల 27లోగా ఉత్తీర్ణులైన వారి ధృవీకరణ పత్రాలు పరీశీలించనున్నట్టు మహంతి పేర్కొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులలో నిలిచిన అభ్యర్ధుల వివరాలు.. వీఆర్వో ఫలితాల్లో... చిత్తూరు జిల్లాకు చెందిన నరేందర్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ రెడ్డికి రెండో ర్యాంకు, అనంతపురం జిల్లాకు చెందిన యోగానందరెడ్డి మూడో ర్యాంకు సాధించాడు. వీఆర్ఏ ఫలితాల్లో... అనంతపురం జిల్లాకు చెందిన ప్రభాకర్ మొదటి ర్యాంకు సాధించగా, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కృష్ణారావుకు రెండో ర్యాంకు, నిజామాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణ మూడో ర్యాంకు సాధించాడు. -
ఐఏఎస్‌లకు పదోన్నతి
ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిమ్మగడ్డ రమేశ్ సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వద్ద ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది. పదోన్నతిపై ఆయన రాజ్‌భవన్‌లోనే కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అణుశక్తి విభాగం(కేంద్ర సర్వీసు) అదనపు కార్యదర్శిగా ఉన్న ఏపీ కేడర్ అధికారి సీబీఎస్ వెంకటరమణకు కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి లభించింది. నిమ్మగడ్డ రమేశ్ గతంలో టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నప్పుడు ‘వ్యాట్’ అమలు చేశారు. గవర్నర్ ముఖ్యకార్యదర్శిగా బదిలీ కావడానికి ముందు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. 1989 బ్యాచ్ వారికి కూడా: 1989 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ అధికారులకు కూడా కార్యదర్శుల నుంచి ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వారు పనిచే స్తున్న చోటే పోస్టింగ్‌లు ఇచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ అదే స్థానంలో, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి కరికాల వలెవన్ ముఖ్య కార్యదర్శిగా అదే స్థానంలో కొనసాగనున్నారు. రాష్ట్ర ఆర్థికసంస్థ మేనేజింగ్ డెరైక్టర్ పి.సత్యనారాయణరావుకు పదోన్నతి కల్పించి అక్కడే నియమించారు. శాంతికుమారికి పదోన్నతి కల్పించినా ప్రస్తుతం సెలవులో ఉన్నందున పోస్టింగ్ ఇవ్వలేదు. ముగ్గురు ఐజీలకు అదనపు డీజీలుగా పదోన్నతి రాష్ట్ర పోలీసు విభాగంలో ఐజీలుగా పని చేస్తున్న 1989 బ్యాచ్ అధికారులకు అదనపు డీజీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు, ఉమేష్ షరాఫ్, సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ జాబితాలో ఉన్నారు. -
ఎన్నికల అధికారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయంలో అదనపు సీఈఓ, డిప్యూటీ ఎన్నికల అధికారులను నియమించారు. ప్రస్తుతం కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న ఎ.అశోక్ అదనపు సీఈఓగా, ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవసేన డిప్యుటీ ఎన్నికల అధికారిగా నియమతులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్‌గా పి.ఉషారాణిని నియమించారు. మెడికల్ రీయింబర్స్మెంట్, సర్వీసు నిబంధనలకు సంబంధించిన మినహాయింపుల పరిశీలన కమిటీ ైచె ర్మన్ ప్రభాకర్ థామస్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను నియమించారు. -
రూపాయితో రోమింగ్
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : ఒక్క రూపాయితో దేశంలో ఎక్కడనుంచి ఎక్కడికైనా ఎటువంటి అదనపు రోమింగ్ చార్జీలు లేకుండా బీఎస్ఎన్ఎల్ నుంచి కాల్ చేసుకోవచ్చని ఆ సంస్థ జనరల్ మేనేజర్ హెచ్.సీ.మహంతి తెలిపారు. శ్రీకాకుళంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త పథకాలను అమలు చేయడంలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ముందంజలో ఉందన్నారు. ఒకే జాతి, ఒకే నంబర్, ఒకే రూపాయి రోజుకు అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దీనికి రూ. 90 ఎస్టీవీ ఓచర్‌ను రీ ఛార్జి చేయాల్సి ఉంటుందని, దీని కాలపరిమితి 90 రోజులన్నారు. అన్లిమిటెడ్ ఇన్కమింగ్గా ఉండే ఈ పథకానికి ఔట్‌గోయింగ్ కాల్స్‌కు సెకండ్‌కు 1.5 పైసా చార్జి చేస్తారని తెలిపారు. ‘స్వాగతం’ ప్లాన్ ద్వారా రూ.20ఓచరుతో లోకల్, ఎస్టీడీ కాల్స్‌కు 2 సెకండ్లకు ఒక పైసా చొప్పున చార్జీ చేస్తారని, దీని కాలపరిమితి 60 రోజులని తెలిపారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు టాపప్ ఓచర్లు తీసుకున్నవారికి 20 శాతం అదనంగా యూసేజ్ వాల్యూ ఉంటుందన్నారు. మార్చి 31లోగా రూ.200 నుంచి రూ.990 టాప్ అప్ తీసుకున్న వారికి పూర్తి టాక్ టైమ్ ఉంటుందన్నారు. రూ.1000 నుంచి రూ.2999 వరకూ టాపప్ తీసుకున్న వారికి 10శాతం అదనంగా యూసేజ్ వాల్యూ వస్తుందన్నారు. జిల్లాలో శ్రీకాకుళం పట్టణం, ఆమదాలవలస, సోంపేట ప్రాంతాలలో 3 జీ సేవలు మెరుగుపరచడంతో పాటు నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, ప్రాంతాల్లో 3జీ సేవలను విస్తరించినట్లు తెలిపారు. అందులో ఐతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం 3జీ బీటీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 3జీ సేవల విస్తరణతో 2జీ సేవలతో పాటు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుందన్నారు. పస్తుతం జిల్లాలో 2జీ సెల్ టవర్లు 182, 3జీ సెల్‌టవర్లు 53 పనిచేస్తున్నాయన్నారు. ఫిబ్రవరి మాసాంతానికి మరో 9సెల్ టవర్లను (అల్లినగరం, అక్కులపేట, మండ్ల, లకందిడ్డి, బొద్దాం, చినుజ్జివాడ, బెజ్జిపురం, కొర్లాం, మెట్టూరు ప్రాంతాలలో) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సెల్వన్ వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని, గతంలో 2.85 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 3.20 లక్షలకు చేరిందని, వైమాక్స్ కనెక్షన్లు 73 నుంచి 88కి పెరిగిందన్నారు. రెవెన్యూ పరంగా రూ.26 కోట్లకు చేరింది. బీఎస్ఎన్ఎల్ సేవలు వినియోగించుకుని వినియోగదారులు మరింత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో డి.జి.ఎం.యోగీశ్వరరావు, సీఏవో నాగరాజు, ఏజీఎం(మార్కెటింగ్) మహేశ్వరరావు, టెక్నికల్ సూపర్వైజర్ ఆనంద్‌మోహన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
చర్చకు మరో రెండు వారాల గడువు!
-
చర్చకు మరో రెండు వారాల గడువు!
రాష్ట్రపతికి నివేదించిన కేంద్ర హోంశాఖ నేడో, రేపో గడువు పొడిగింపు సమాచారం సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పున ర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు మరో రెండు వారాల గడువు ఇచ్చేందుకు కేంద్ర హోం శాఖ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రపతి వాస్తవంగా ఇచ్చిన గడువు ఈ నెల 23తో ముగియనుండగా.. చర్చకు మరో నెల రోజులు సమయం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అరుుతే రెండు వారాలు మాత్రమే గడువు పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ హోం శాఖ సోమవారం రాష్ట్రపతికి నివేదించినట్లు రాష్ట్ర అధికారులకు సమాచారం అందింది. గడువు పొడిగించాలని కోరుతూ సీఎస్ రాసిన లేఖతో పాటు మరో అనుబంధ లేఖను కూడా రాష్ట్రపతికి పంపింది. గడువు పెంచుతూ మంగళ లేదా బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా.. మంగళవారం ఢిల్లీలో జరగనున్న సిబ్బంది శిక్షణ విభాగం సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎస్, ఆ సమావేశానంతరం గడువు అంశంపై హోంశాఖ ముఖ్య అధికారులతో సమావేశమవుతారని తెలిసింది. రాజ్యసభ ఎన్నికల కోసమేనా..! రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల గండాన్ని గట్టెక్కించుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్చ గడువు పొడిగించాలన్న ఆలోచన చేసినట్టు ఆపార్టీ నేతలు చెబుతున్నారు. బిల్లుపై చర్చకు గడువును 2 వారాలు పొడిగిస్తే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 6 వరకు కొనసాగే అవకాశాలున్నాయని సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురికంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉంటే వచ్చే నెల 7న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతల మద్దతు తప్పనిసరి. అందువల్లే వారు కోరిన విధంగా బిల్లుపై చర్చకు గడువు పొడిగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
మున్సిపల్ లీజునిబంధనలపై మంత్రుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: మంత్రుల కమిటీ మాటున మున్సిపల్ లీజు స్థలాలను ధారాదత్తం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నగరాల్లోని మున్సిపల్ స్థలాలు, దుకాణాల్లో తిష్టవేసిన వారికి ఆ స్థలాలను కట్టబెట్టడానికి ఓ మంత్రి చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ స్థలాలను ప్రస్తు తం ఉంటున్న వారికే 25 ఏళ్లకు పైబడి లీజు కు ఇవ్వాలని, లేనిపక్షంలో విక్రయించాలంటూ ఓ మంత్రి చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే 25 సంవత్సరాలకు మించి లీజు ఇవ్వడానికి లేదని, దానిపై హైకోర్టు తీర్పుతో పాటు పూర్తి మార్గదర్శకాలు ఉన్నాయని పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ నిబంధనలపై సమీక్షించి నివేదిక ఇవ్వాలం టూ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో రెవెన్యూ, మున్సిపల్, కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారని, వీరు లీజు విధానాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
హైదరాబాద్ సరిహద్దు జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం నుంచి సరిహద్దు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు ‘మహానగర సమీకృత రవాణా ప్రాధికార సంస్థ’ (యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం ‘ఉమ్టా’ అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ‘హెచ్ఎండీఏ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే’ అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ అధికారులు సీఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో రైలు మార్గాలకు ఇరువైపులా అర కిలోమీటరు వరకు బహుళ వినియోగ ప్రాంతం (మల్టీపుల్ యూజ్ జోన్)గా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. జన సాంద్రత ఆధారంగా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) ప్రోత్సాహకాలను పలు దేశాల్లోని నగరాల్లో అమలుచేస్తున్నారని.. ఆ పద్ధతిని పాటించడం వల్ల ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత పెరుగుతుందని, అలాంటి ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా హెచ్ఎండీఏ పరిధిలో 2041 సంవత్సరం వరకు రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే.. దాదాపు 1.29 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఏటా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ ఎలా చేయాలన్న అంశంపైనా చర్చించారు. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే జనసాంద్రత పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్ మహంతి అధికారులకు సూచించారు. కార్యాలయాలకు, పాఠశాలలకు నడిచి వెళ్లడానికి వీలుండే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, ప్రకృతి సంపద, వారసత్వ సంపదను కాపాడాలని అభిప్రాయపడ్డారు. జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులకు చేరుకోవడానికి వీలుగా బైపాస్ రహదారులు, ఇన్నర్ రింగ్‌రోడ్లు, సబ్ ఇన్నర్ రింగ్‌రోడ్లు, జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాలు, వ్యాపార ప్రాంతాలను ముందుగా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, ఐటీ, పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రాంతాల గుర్తింపు, ఐటీ సంస్థల ఏర్పాటు ప్రాంతాలను ప్రణాళికాపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు శైలేంద్ర కుమార్ జోషి, సమీర్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.