సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయంలో అదనపు సీఈఓ, డిప్యూటీ ఎన్నికల అధికారులను నియమించారు.
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయంలో అదనపు సీఈఓ, డిప్యూటీ ఎన్నికల అధికారులను నియమించారు. ప్రస్తుతం కార్మిక శాఖ కమిషనర్‌గా ఉన్న ఎ.అశోక్ అదనపు సీఈఓగా, ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవసేన డిప్యుటీ ఎన్నికల అధికారిగా నియమతులయ్యారు.
ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్‌గా పి.ఉషారాణిని నియమించారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్, సర్వీసు నిబంధనలకు సంబంధించిన మినహాయింపుల పరిశీలన కమిటీ ైచె ర్మన్ ప్రభాకర్ థామస్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్‌ను నియమించారు.