
25న సీఎస్ మహంతికి ఐఏఎస్‌ల వీడ్కోలు సభ!
పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతికి వీడ్కోలు పలికేందుకు ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారు.
హైదరాబాద్: పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతికి వీడ్కోలు పలికేందుకు ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఈ వీడ్కోలు సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. జూన్ 2న అపాయింటెడ్ డే అయినందున విభజన పనుల్లో అధికారులు తీరికలేకుండా ఉన్నారు. ఈ క్రమంలో 25నే వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం