ఐఏఎస్ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించేంత వరకు ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే..
1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినస్ట్రేటివ సర్వీస్(ఐఏఎస్ ) అధికారి ఉత్తరాఖండ్ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్‌బీర్ సింగ్ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్ రాట్రూయ్ నవంబర్ 2020లో ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) నుంచి ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక ఆమె తండ్రి కూడా సివిల్ సర్వెంట్‌గా పనిచేయడం విశేషం.
ఆమె ఎడ్యుకేషన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బొంబాయి ఎడిషన్‌లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్ సర్వీస్ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆపీసర్ ఉద్యోగాన్ని సాధించారు.
ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్‌ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్‌లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్‌లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. యూపీ కేడర్‌కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్ గుజరాత్‌లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్ అధికారిగా కెరియర్‌ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్‌గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment