Chief secretary
-
సీఎస్‌గా రామకృష్ణారావు !
సాక్షి, హైదరాబాద్: తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును ప్రభుత్వం ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఏప్రిల్ చివరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వవర్గాల కథనం. ఇంకా నెలరోజులకు పైగా సమయమున్న నేపథ్యంలో మరో ముగ్గురు ప్రత్యేక ప్రధానకార్యదర్శులు కూడా సీఎస్ పోస్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండడం గమనార్హం.రామకృష్ణారావు కాకుండా సీఎస్ కోసం పోటీ పడుతున్న వారిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ శశాంక్‌గోయల్(1990బ్యాచ్), 1992 బ్యాచ్ ఐఏఎస్‌లలో పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉన్నారు. వీరి బ్యాచ్‌కు చెందిన సంజయ్‌జాజు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖల కార్యదర్శిగా ఉన్నారు. ఆయన రాష్ట్ర సర్వీసులోకి రావడానికి అయిష్టత వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రకృతి విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌కుమార్ కూడా రామకృష్ణారావు బ్యాచ్‌కు చెందినవారే. అయితే ఆయన ఫార్ములా ఈ –రేసు కేసుల్లో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. అదీకాక ఓఆర్ఆర్ టోల్ వసూళ్లను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన అంశంలో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు ఆరోపణలు చేస్తే.. ఆ సమయంలో రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా పరువునష్టం దావా వేశారు. రేవంత్‌రెడ్డి సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత అర్వింద్‌కుమార్‌ను పురపాలక శాఖ నుంచి అప్రాధాన్యమైన ప్రకృత్తి విపత్తుల నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. శాంతికుమారి ఉద్యోగ విరమణ తర్వాత ఒకవేళ రామకృష్ణారావు సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించినా, నాలుగు నెలలపాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు. ఒకవేళ ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగింపు ఇచ్చే పక్షంలో నవంబర్ చివరి వరకు సీఎస్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతికుమారిని తప్పించి.. రామకృష్ణారావుకు సీఎస్ బాధ్యతలు అప్పగిస్తారని భావించినా, సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి మార్పు చేయకుండానే ఆమెను కొనసాగిస్తూ వచ్చారు. వచ్చే ఏప్రిల్‌లో ఆమె పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు(1991 బ్యాచ్)ను నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి రామకృష్ణారావు కంటే ఒక సంవత్సరం సీనియర్ 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శశాంక్‌గోయల్ వచ్చే సంవత్సరం సెపె్టంబర్లో ఉద్యోగ విరమణ చేస్తారు. కాగా జయేశ్‌రంజన్ ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖునితో సీఎస్ పదవి కోసం యత్నిస్తున్నట్టు తెలియడంతో... ఓ ఉన్నతాధికారి ఇటీవల జయేశ్‌రంజన్‌కు వ్యతిరేకంగా విజిలెన్స్ నివేదికను బయట పెట్టినట్లు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. శశాంక్‌గోయల్ 2026 సెపె్టంబర్లో, అర్వింద్‌కుమార్ 2026 అక్టోబర్‌లో, జయేశ్‌రంజన్ 2027 సెప్టెంబర్‌లో, వికాస్‌రాజ్ 2028 మార్చిలో, అదే సంజయ్ జాజు 2029 ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేస్తారు. -
ఏపీ కార్మికశాఖ ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ కు కారు ప్రమాదం...
-
కేరళ చీఫ్ సెక్రటరీగా భర్త తర్వాత భార్య
తిరువనంతపురం: దక్షిణ భారతదేశంలో నెల వ్యవధిలోనే అరుదైన రికార్డు పునరావృతమైంది. కేరళ నూతన ప్రధాన కార్యదర్శిగా శారదా మురళీధరన్ బుధవారం నియమితులయ్యారు. ఆమె తన భర్త, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వి.వేణు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. వేణు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. ప్రణాళిక విభాగంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ ఐఏఎస్ శారదను తదుపరి సీఎస్‌గా ఎంపిక చేస్తూ కేరళ కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కర్నాటకలోనూ ఆగస్టు 1న శాలినీ రజనీష్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. భర్త రజనీష్ గోయెల్ రిటైరయ్యాక ఆయన స్థానంలో శాలినీ సీఎస్ అయ్యారు. -
భర్త తర్వాత భార్య
బెంగళూరు: ఒక రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేయడమంటే.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అన్నీ తానై వ్యవహరించడం. కర్నాటకలో ఈ కీలక పోస్టును భర్త తర్వాత భార్య చేపట్టే అరుదైన రికార్డును రజనీష్ గోయల్, శాలినీ రజనీష్ లు దక్కించుకున్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న రజనీష్ గోయల్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో నూతన ప్రధాన కార్యదర్శిగా శాలినిని నియమిస్తూ కర్నాటక ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 1989 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ అయిన శాలిని గ్రామీణాభివృద్ధిలో పీహెచ్డీ చేశారు. మేనేజ్మెంట్, వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారికతలపై పలు పుస్తకాలు రచించారు. రజనీష్ దంపతులకంటే ముందు కర్నాటకలో మరో జంట కూడా ప్రధాన కార్యదర్శులుగా పని చేసింది. 20 ఏళ్ల కిందట బి.కె.భట్టాచార్య, ఆయన భార్య థెరెసా భట్టాచార్యలు ఇద్దరూ సీఎస్‌లుగా చేశారు. -
మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్ రికార్డు
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్
-
గవర్నర్‌ను కలిసిన ఏపీ కొత్త సీఎస్ నీరభ్‌కుమార్
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌కు నూతన ప్రభుత్వ కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, గవర్నర్‌ను కలిశారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్లిన సీఎస్ నీరభ్.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో కాసేపు భేటీ అయ్యారు. సీఎస్‌గా నియమితులైన వేళ.. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీగా తెలుస్తోంది. సంబంధిత వార్త: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
-
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి బదిలీ అయ్యారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నీరబ్‌కుమార్ ప్రసాద్.. ప్రస్తుతం అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
ఈసీ ముందుకు ఏపీ సీఎస్, డీజీపీ
సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.కాగా, పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొంత మంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారని కేంద్ర పరిశీలకులు ఈసీకి నివేదిక ఇచ్చారు.సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాట్లు చేసినా అక్కడ పోలీసు ఉన్నతాధికారులను ఈసీ హఠాత్తుగా బదిలీ చేయడంతోనే సమస్యలు ఉత్పన్నమైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. కొత్త అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. -
AP: ఎన్నికల నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలి: సీఎస్
సాక్షి, విజయవాడ: లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. అలాగే వివిధ పబ్లిక్ ఆస్తులైన బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే,రోడ్డు వంతెనలు,ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు,మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన యాడ్లు, వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యాడ్లను నిలిపి వేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం వినియోగించరాదని సీఎస్ స్పష్టం చేశారు. మంత్రుల ఎన్ని కల పర్యటనలకు ప్రభుత్వ అతిథి గృహాలను కేటాయించరాదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలు ఉండ రాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదన్నారు. అదే విధంగా మంత్రులు అధికారుల మధ్య ఎటువంటి వీడియో సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక ప్రభుత్వ అధికారులు ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీలు లేదని సీఎస్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయడానికి వీలులేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్దిలు పొందినా అలాంటి వారిపై సీసీఏ నిబంధనలు ప్రకారం ఐపీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123,129,134,134 ఏ నిబంధనలు ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాల మంజూరు, కన్సిజన్లు, గ్రాంట్లు, హామీలు, శంకుస్థాపనలు పూర్తి నిషేధమని సీఎస్ స్పష్టం చేశారు. వర్క్ఆర్డర్ ఉన్న కేత్ర స్థాయిలో మొదలు కాని పనులు చేపట్ట కూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. అలాగే పీఎం,సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వీడియో సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
నాడు జర్నలిస్ట్ నేడు ప్రధాన కార్యదర్శిగా..!
ఐఏఎస్ సాధించడం చాలామంది కల. అందుకోసం ఏళ్లుగా ఓ తపస్సులా కృషి చేస్తారు. తాము అనుకున్న ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సాధించేంత వరకు ప్రయత్నాలు సాగిస్తున్నే ఉంటారు. కానీ రాధ రాటూరి చేసిన సివిల్స్ ప్రయత్నాల్లో ప్రతీ ప్రయత్నం విజయవంతంగా గెలిచి అందర్నీ ఆశ్చర్యపర్చింది. చివరికి ఆమె కోరుక్నుట్లుగా ఐఏఎస్ అయ్యారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆమె విజయ ప్రస్థానం ఎలా సాగిందంటే.. 1988 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ అడ్మినస్ట్రేటివ సర్వీస్(ఐఏఎస్ ) అధికారి ఉత్తరాఖండ్ తొలి మహిళా కార్యదర్శిగా గత వారమే నియమితులయ్యారు. జనవరి 31తో సుఖ్బీర్ సింగ్ సంధు పదవీకాలం ముగియడంతో అతని స్థానంలో సీనియర్ అధికారిణి రాధ రాటూరిని బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. ఆమె భర్త అనిల్ రాట్రూయ్ నవంబర్ 2020లో ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) నుంచి ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక ఆమె తండ్రి కూడా సివిల్ సర్వెంట్‌గా పనిచేయడం విశేషం. ఆమె ఎడ్యుకేషన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..1985లో ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్లో ఎంఏ చేసింది. అనంతరం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బొంబాయి ఎడిషన్‌లో జర్నలిస్టుగా ఉద్యోగం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం ఇండియా టు డేలో కూడా జర్నలిస్టుగా పనిచేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై మక్కువతో సివిల్ సర్వీస్ వైపుకి రావడం జరిగింది. ఐతే తొలి ప్రయత్నంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆపీసర్ ఉద్యోగాన్ని సాధించారు. ఆ తర్వాత మరో ప్రయత్నంలో ఐపీఎస్‌ని కూడా సాధించారు. అక్కడితో ఆగక మూడో ప్రయత్నంలో ఆమె కోరుకున్నట్లుగా ఐఏఎస్‌లో చేరాలన్న లక్ష్యాన్ని సాధించారు. ఇలా సివిల్స్‌లో వరుస ప్రయత్నాల్లో ఏదో ఒక క్యాడర్ సాధిస్తూ.. పోయిన వ్యక్తిగా రాధ రాటూరి నిలవడం విశేషం. తొలుత ఆమెను మధ్యప్రదేశ్ కేడర్‌కు కేటాయించినా.. యూపీ కేడర్‌కు బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థన మేరకు తొలి పోస్టింగ్ గుజరాత్‌లోని టెహ్రీ ఇచ్చారు. అక్కడ నుంచి ఐఏఎస్ అధికారిగా కెరియర్ని ప్రారంభించి.. అలా పదేళ్ల పాటు ఉత్తరాఖండ్ ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత రాధ రాటూరి అదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫిసర్‌గా నియమితులయ్యారు. అంతేగాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ పదవిని అలంకరించిన తొలి మహిళగా కూడా రాధ నిలిచారు. (చదవండి: ఒకపుడు చనిపోవాలనుకుంది.. ఇపుడు ఐఏఎస్ అధికారిగా!) -
రంగంలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు..
-
MP: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీర రాణా.. రెండో మహిళగా రికార్డ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వీర రాణా నియమితులయ్యారు. రాష్ట్ర సీఎస్‌గా గురువారం ఆమె అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. వీర రాణా ప్రస్తుతం మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు సార్లు పొడిగింపుల తర్వాత పదవీ విరమణ చేయనున్న అవుట్గోయింగ్ సీఎస్ ఇక్బాల్ సింగ్ బెయిన్స్ స్థానంలో 1988 బ్యాచ్‌కు చెందిన వీర రాణా నియమితులయ్యారు. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన బెయిన్స్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2022 డిసెంబర్ 1 నుంచి 2023 మే 31 వరకూ మొదటిసారి పదవీ కాలాన్ని పొడిగించగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2023 జూన్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు మరోసారి పొడిగించారు. రెండో మహిళగా రికార్డ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో మహిళగా వీర రాణా రికార్డు సృష్టించారు. 1990వ దశకం ప్రారంభంలో మధ్యప్రదేశ్‌కు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారిణి నిర్మలా బుచ్ నియమితులయ్యారు. ఈమె ఈ ఏడాది జూలైలో కన్నుమూశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం బెయిన్స్‌కు వీడ్కోలు పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
‘చీఫ్ సెక్రటరీ’ వివాదానికి సుప్రీం పరిష్కారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకంపై కేంద్రం, ఆప్ ప్రభుత్వం మధ్య నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ఒక పరిష్కారమార్గం చూపింది. చీఫ్ సెక్రటరీ హోదాకు అర్హులైన అయిదుగురు సీనియర్ పరిపాలనాధికారుల పేర్లను ఈనెల 28న ఉదయం 10.30 గంటల్లోగా సూచించాలని కేంద్రాన్ని కోరింది. అందులో నుంచి ఒకరి పేరును అదే రోజు ఎంపిక చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కొత్తగా చీఫ్ సెక్రటరీని కేంద్రం నియమించ జాలదంటూ ఢిల్లీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ సూచనలు చేసింది. అంతకుముందు, కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ సర్కార్ చీఫ్ సెక్రటరీ నియామకం విషయంలో పోటాపోటీగా వాదనలు వినిపించాయి. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
AP: ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు. అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
వంద శాతం జనన, మరణాల వివరాల నమోదు జరగాలి: ఏపీ సీఎస్
-
సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సై జ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్ ఈ శాఖలను పర్యవేక్షించేవారు. కొత్త సీఎస్‌గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ రెండు శాఖల బాధ్యతలు ఆమె తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది. చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్? -
ఏపీ సీఎస్‌పై కథనాలు అవాస్తవం: ఐఏఎస్ అసోసియేషన్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిపై వచ్చిన కథనాలు పూర్తి అవాస్తమని, తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అసోసియేషన్ తెలిపింది. సీఎస్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలు రాయడం సరికాదన్నారు. తప్పుడు కథనాలపై ఐఏఎస్ అసోసియేషన్‌లో చర్చించాం. ఇలాంటి కథనాలపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి కడపలో పర్యటించారని ప్రవీణ్ వివరణ ఇచ్చారు. సీనియర్ అధికారిపై తప్పుడు వార్తలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. చదవండి: ‘లోకేష్ పప్పు కాబట్టే.. చంద్రబాబు అలా చేశారు’ -
AP: సీఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజీ ఇన్సెంటివ్‌లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది. అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు, ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా సీఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. అలాగే ఈసమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమిషనర్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఇవో షన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం
అమరావతి: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లపై సీఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియాపై మండిపడ్డారు. ఈ సంస్థలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 'సీఎస్‌తో కలిసివెళ్లిన ఓఎస్డీ అంటూ రాసిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కడప జిల్లాలోని సింహాద్రిపురం, మద్దూనూరులో 3న పర్యటించా. నేను, ఓఎస్డీ కృష్ణమోహన్ కలిసి ఇద్దరం ఒకే వాహనంలో ప్రయాణించామని తప్పుడు కథనం ప్రచారం చేశారు. నాతో కలిసి ఓఎస్డీ వచ్చారన్న కథనం ఊహాజనితం, దారుణమైన అబద్ధం. ఉద్యోగులందరికీ అధినేత అయిన సీఎస్‌ను చులకన చేసేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. కుట్రపూరితంగా కట్టు కథను అల్లి అజెండా ప్రకారం తప్పుడు ప్రచారం చేశారు. గౌరవ ప్రదమైన ప్రభుత్వ కార్యదర్శి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ జర్నలిజం విలువల ఆధారంగా చేస్తున్నారు. నేను కోరిన విధంగా ఖండన ప్రచురించకపోతే చట్టపరంగా చర్యలుంటాయి.' అని సీఎస్ జవహర్ రెడ్డి హెచ్చరించారు. చదవండి: పవన్ కల్యాణ్‌కు పంపబోయిన లేఖ నాకు పంపారా? హరిరామ జోగయ్యకు అమర్నాథ్ కౌంటర్.. -
గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు. కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు. టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్‌గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్‌గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా వ్యవహరించారు. -
ఐఏఎస్ అధికారిగా మొదటి పోస్టింగ్ భువనగిరిలోనే
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి గతంలో భువనగిరి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఐఏఎస్ అధికారిగా ఆమె మొదటగా భువనగిరి సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 1992 ఆగస్టు 25 నుంచి 1993 జూన్ 14 వరకు భువనగిరి డివిజన్లో విధులు నిర్వహించారు. సమస్య ఉన్నచోటుకు వెళ్లి పరిష్కరించే అధికారిగా ఆమెకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. భువనగిరిలో ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి విడిపించారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని టీఎన్జీవో భవనానికి కేటాయించారు. వలిగొండ మండలంలోని ఎం.తుర్కపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూమస్యను అప్పట్లో క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు భువనగిరి డివిజన్లో పీపుల్స్‌వార్ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో.. సబ్ కలెక్టర్‌గా శాంతికుమారి ప్రభుత్వ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగించారు. ప్రధానంగా చదువు–వెలుగు కార్యక్రమం భువనగిరి డివిజన్లో విజయవంతం కావడం కోసం రాత్రి పూట గ్రామాలను తిరిగి నిరక్షరాస్యులైన మహిళలకు చదువు చెప్పించారు. అలాగే యువజన, సేవా, వైద్య బిరాలకు విస్త్రతంగా హాజరయ్యేవారు. మొత్తంగా సుమారు 10 నెలల కాలంలో శాంతికుమారి సబ్ కలెక్టర్‌గా అందించిన సేవలు భువనగిరిలో ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సేవలు అందించిన అధికారి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా నియమితులు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీతో సంబంధం లేకుండా.. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి సీఎస్ నియామకం? పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. -
తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని.. మాజీ సీఎస్‌ను నమ్మించి..
బంజారాహిల్స్(హైదరాబాద్): త్రిపుర రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఉసురుపాటి వెంకటేశ్వర్లును మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... మాజీ చీఫ్ సెక్రటరీ వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్‌లోని ప్రశాషన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు నానక్‌రాంగూడలో నివాసం ఉండే కొండ రవిగౌడ్ అనే వ్యక్తి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. పరిచయం అయిన మొదటి రోజు నుంచి రవి గౌడ్ పూర్తిగా అతడిని నమ్మించాడు. అయితే తన భార్య గోల్డ్ తాకట్టులో ఉందని, దాన్ని విడిపించడం కోసం అర్జెంటుగా రూ. 21 లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. 2020 జనవరి 21న తన కుమార్తె పుట్టిన రోజు ఉందని ఫంక్షన్ అవ్వాగానే విడిపించిన బంగారాన్ని తిరిగి కుదువ బెట్టి, ఆ మొత్తాన్ని 3 నెలల్లో తిరిగి ఇస్తానని మాట ఇచ్చాడు. అతని మాటలు నమ్మి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా రూ. 21 లక్షలు అతని అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటి నుంచి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా కలిసి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మోసపోయానని భావించిన వెంకటేశ్వర్లు రవిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. నిందితులకు బెయిలిచ్చినా.. -
ఏపీ నూతన సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియామకమయ్యారు. కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్ వరకు ఆయన ఈ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా కె.ఎస్ జవహర్ రెడ్డిని ఎంపిక చేసింది ప్రభుత్వం. ముందుగా సీఎస్ రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చినా.. జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ జవహర్‌రెడ్డి.. ప్రస్తుతం సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇదీ చదవండి: సుప్రీం తీర్పు తర్వాత టీడీపీ నేతలు మాట్లాడలేదేం?: సజ్జల -
అత్యాచార ఆరోపణలు.. అండమాన్ మాజీ సీఎస్ అరెస్ట్
సామూహిక అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అండమాన్ నికోబార్ మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్‌ను అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జితేంద్రకు సమన్లు జారీ చేశారు. పోర్ట్ బ్లెయిర్‌లో గురువారం విచారణకు హాజరైన అయన్ను అక్కడే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. క అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జితేంద్ర నరైన్.. మరికొందరితో కలిసి ఒ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై విచారణకు ఆదేశించడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. తమ నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. దాంతో నరైన్‌ను అక్టోబర్ నెలలో హోంశాఖ సస్పెండ్ చేసింది. నరైన్ తన అధికారాన్ని దుర్వినియోగపరిచారని, మున్ముందు కూడా దుర్వినియోగపరిచే అవకాశాలు ఉన్నాయని పోలీసులు శాఖ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసును అండమాన్ నికోబార్ పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం విడివిడిగా దర్యాప్తు చేస్తోంది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఏమాత్రం సహించమని.. నిందితుల స్థాయి, హోదాతో సంబంధం లేకుండా క్రమశిక్షణా రహిత చర్యలు తీసుకుంటామని నరైన్ సస్పెన్షన్ నోట్లో హోం మంత్రిత్వశాఖ పేర్కొంది. -
ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో సీఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు.. అంటే నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటారు. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై ఉత్తర్వులు విడుదల చేసింది డీవోపీటీ(Department of Personnel and Training). గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం. -
AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చదవండి: AP: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జీతం కట్.. జాగ్రత్త!.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, చెన్నై : ఈనెల 28, 29 తేదీల్లో వర్తక సంఘాలు నిర్వహించనున్న జాతీయస్థాయి ఆందోళననలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు హెచ్చరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన సర్క్యులర్ జారీచేశారు. అందులోని వివరాలు.. అఖిలభారత స్థాయిలోని కొన్ని వర్తక సంఘాలు డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా జాతీయస్థాయిలో ఈనెల 28, 29 తేదీల్లో పోరాటానికి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఈ పోరాటంలో రాష్ట్రంలోని కొన్ని గుర్తింపు పొందని సంఘాల సభ్యులు కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, పాల్గొనేలా ఇతర ఉద్యోగులను భయాందోళనలకు గురిచేయడం, ఆ పోరాటానికి మద్దతు పలికేలా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని ఆయన అన్నారు. దైనందిన ప్రభుత్వ కార్యాలయ విధులకు ఇబ్బంది కలిగించినా.. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలను అతిక్రమించినట్లు పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ఆ రెండు రోజుల్లో ఎవరైనా కార్యాలయానికి హాజరుకాకుంటే అనుమతి లేకుండా సెలవు తీసుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేగాక “పనిచేయలేదు..జీతం లేదు’ అనే విధానం కింద ఆ రెండు రోజులు శాలరీ కట్ చేస్తామని చెప్పారు. 28, 29 తేదీల్లో మెడికల్ లీవు తప్ప మరేరకమైన సెలవు ఇవ్వరాదని ఆదేశించారు. అన్ని శాఖల అధిపతులు 28, 29 తేదీల్లో తమ కింది సిబ్బంది హాజరుపై ఉదయం 10.15 గంటల కల్లా నివేదికను సమర్పించాలని సూచించారు. చెన్నై సచివాలయంలోని అధికారులు సైతం ఉదయం 10.30 గంటలకల్లా హెచ్ఆర్ డిపార్టుమెంట్‌కు ఇదే నివేదికను అందజేయాలని ఆదేశించారు. -
స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా అధర్‌సిన్హా బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా అధర్‌సిన్హా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ
-
కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని.. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని వివరించారు. కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని.. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని.. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని.. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు. విభజనే వల్ల హైదరాబాద్‌ను కోల్పోయామని దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అన్నారు. ఇంకా రూ. 33,490 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని.. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని వెల్లడించారు. ఐఆర్ రూపంలో రూ. 17,918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్వాడీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్ వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తున్నామని రావత్ తెలిపారు. చదవండి: రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం.. -
పోస్టింగ్‌లు లేకుండా జీతాలా? తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో విధులు నిర్వహిస్తున్న పదుల సంఖ్యలో ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులివ్వకుండా వేధిస్తున్నా రంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 10 నెలలైనా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని, సీఎస్సే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించింది. మార్చి 14లోగా కౌంటర్ దా ఖలు చేయాలని, లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏయే విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్ లేకుండా జీతాలిస్తున్నారు? తదితర వివరాలు సమర్పించాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది ప్రజాధన దుర్వినియోగమే.. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగా ల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారుల కు నెలల తరబడి పో స్టింగులు ఇవ్వడం లేదని, విధులు నిర్వహించకపోయినా వారికి వేతనాలు ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి. నాగధర్‌సింగ్ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పోస్టిం గ్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ విభా గం ఉన్నతాధికారి నుంచి ఆ ఉద్యోగికి చెల్లించిన జీతభత్యాలను వసూలు చేయాలి. క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి’అని కోరారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషన్‌పై సీఎస్ ఇంకా కౌంటర్ వేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలుకు మరో 4 వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమంటూ విచారణను వాయిదా వేసింది. -
సీఎం జగన్‌కు పీఆర్సీ నివేదిక అందజేసిన కమిటీ
AP PRC Report 2021: సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ ప్రస్తావించింది. చదవండి: Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్’ బ్లో అవుట్.. రాజీనామాల బాట ‘‘2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతం.. 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని’’ కమిటీ పేర్కొంది. ‘‘రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో కేవలం రూ.1,70,215 మాత్రమే. రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాలి. రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు కేంద్రం ఇవ్వాలి. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా రూ.20వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2019, జులై 1న 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐఆర్ రూపేణా ఉద్యోగులకు రూ.11,270 కోట్లు, పెన్షన్లకు రూ.రూ.4,569 కోట్లు చెల్లించాం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు సహా వివిధ కేటగీరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచాం. 3,01,021 ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. జీతాల రూపంలో ప్రభుత్వ ఖర్చు రూ.1198 కోట్ల నుంచి రూ.3187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల పరిహారం అమలు చేస్తోంది. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 2020, జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు ప్రభుత్వంపై రూ.5380 కోట్ల పడిందని’’ కమిటీ పేర్కొంది. పరిపాలనా సంస్కరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ.2300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. దీని వల్ల అదనంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ.820 కోట్ల భారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్‌ను ప్రారంభించారు. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2040 కోట్ల భారం పడిందని’’ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వంపై 8వేల నుంచి 10వేల కోట్లు భారం: సీఎస్ ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. అనేక అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్ తెలిపారు. -
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తదుపరి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ
-
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తదుపరి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తదుపరి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్ధానంలో సీఎస్‌గా డాక్టర్ సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 48 గంటల్లో మా భూమిని మాకు అప్పగించారు -
వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. హన్మకొండ జిల్లా స్వరూపం... వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ రెవెన్యూ డివిజన్లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా స్వరూపం..: వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్ జిల్లా ఏర్పాటైంది. -
కేంద్రానిక్ షాక్.. పంతం నెగ్గించుకున్న మమత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్ బందోపాధ్యాయను బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారం ఆలాపన్ బందోపాధ్యాయ బెంగాల్ సీఎస్ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు. కాగా, ఇటీవల యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా.. సీఎస్‌తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్ ఆలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆయనను వెనక్కి పంపించేది లేదని మమతా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన పంతం నెగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి :చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ -
చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ
కోల్‌కతా: కేంద్రం, బెంగాల్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. బెంగాల్ ముఖ్యకార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను రిలీవ్ చేయలేమని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తేల్చిచెప్పారు. సీఎస్‌ను కేంద్రానికి రిపోర్ట్ చేయాలని వెలువడిన ఏకపక్ష ఉత్తర్వు తనను షాక్‌కు గురిచేసిందని మమత పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో సీఎస్‌ను రిలీవ్ చేయలేమని.. కేంద్రం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీగా బందోపాధ్యాయను కొనసాగించాలని మమతాబెనర్జీ పీఎం మోదీకి రాసిన లేఖలో కోరారు. కాగా ఇటీవల యాస్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా . సీఎస్‌తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్‌ను అలపన్ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్ ప్రభుత్వానికి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. చదవండి: మోదీ వర్సెస్ దీదీ: భారీ హైడ్రామా.. ట్విస్టులు -
సీఎం వెంట నిత్యం ఉండే ప్రభుత్వ ప్రతినిధే కరోనాకు బలి
పాట్నా: బిహార్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండగా భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కరోనా బారిన పడి చనిపోవడం కలకలం రేపుతోంది. నిత్యం ముఖ్యమంత్రి వెంట ఉండే వ్యక్తి.. ప్రభుత్వానికి పెద్ద దిక్కుగా ఉండే కీలక పాలనాధికారి మృతి చెందడంతో బిహార్‌లో ఆందోళన రేకెత్తుతోంది. 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్‌కుమార్ సింగ్. బిహార్‌లో ఎన్నికలు ముగిసిన అనంతరం మరొకసారి నితీశ్ కుమార్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అరుణ్‌కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఫిబ్రవరిలో ఆయన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. అరుణ్‌కుమార్ సింగ్ మృతిపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గొప్ప వ్యక్తి అని, పలు హోదాల్లో పని చేశారని.. ఆయన మరణం పరిపాలన రంగానికి తీరని లోటు అంటూ నితీశ్ ట్వీట్ చేశారు. చదవండి: తీరని విషాదం.. తొక్కిసలాటలో 44 మంది మృతి చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి मुख्य सचिव अरुण कुमार सिंह जी की कोरोना संक्रमण से हुई मौत अत्यंत दुःखद है। अरुण कुमार सिंह वर्ष 1985 बैच के बिहार कैडर के आईएएस अधिकारी थे। वे भारतीय प्रशासनिक सेवा के एक कुशल प्रशासक थे। वे एक मिलनसार व्यक्ति थे। (1/2) — Nitish Kumar (@NitishKumar) April 30, 2021 -
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఛీప్ సెక్రటరీగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ‘ఆ వాహనాలు.. ముంబై తర్వాత ఏపీలోనే..’) అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అధికారులంతా పనిచేస్తామని సీఎస్ ఆదిత్యనాథ దాస్ తెలిపారు.(చదవండి: ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ) సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఆదిత్యానాథ్ దాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏపీ చీఫ్ సెక్రటరీ అదిత్యానాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మాజీ సీఎస్ నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులయిన సంగతి తెలిసిందే. -
సీఎస్ నీలం సాహ్నికి సత్కారం..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని ఈనెల అఖరికి తన పదవికి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సాహ్నిని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా సత్కరించారు. కేబినెట్ సమావేశంలో సీఎం జగన్‌తోపాటు మంత్రి మండలి సభ్యులు ఆమెను సత్కరించారు. కాగా 2019 నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. సాహ్ని 2018 నుంచి ఇప్పటివరకూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు. చదవండి: జస్టిస్ రాకేష్ కుమార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు -
ఎలాంటి ఆపద ఉన్నా కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 040–23450624కు కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సూచించారు. -
సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ నీలం సాహ్ని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ సీఎస్ సర్వీస్‌లో కొనసాగనున్నారు. (పటిష్టంగా కేంద్ర ప్యాకేజీ అమలు) -
సీఎస్‌గా నీలం సాహ్ని కొనసాగింపు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్నిని మరో ఆరు నెలలు కొనసాగించేందుకు అనుమతించాల్సిందిగా ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు సీఎం ఇటీవల ప్రధానికి లేఖ రాసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నీలం సాహ్ని జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున పదవీ కాలం పొడిగించాలని కోరినట్లు సమాచారం. (ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు) ఎస్ఈబీకి 11 మంది ఏఎస్పీల బదిలీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో(ఎస్ఈబీ–లిక్కర్ అండ్ శాండ్)కు పదకొండు మంది ఏఎస్పీలు బదిలీ అయ్యారు. ఆ ఐపీఎస్‌లకు పలు జిల్లాల్లో కొత్తగా ఎస్ఈబీ పోస్టును ఏర్పాటు చేసి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నో ‘సివిల్ వర్క్స్’!
సాక్షి, హైదరాబాద్: మూలధన వ్యయంతో చేపట్టే సివిల్ పనులకు వరుసగా రెండో ఏడాది కూడా బడ్జెట్లో స్థానం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పనుల విషయంలో పారదర్శకత అవసరమని, కచ్చితంగా ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే సివిల్ ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుందని, అప్పుడే నిధులు మంజూరవుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020–2021 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శని వారం అన్ని శాఖల విభాగాధిపతులతో సమా వేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధికారులకు వివరించారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో సివిల్ పనులకు ప్రతిపాదనలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది. ఏ అంశమైనా ఆ కార్యక్రమాల తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకే బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యత ఉండాలని, మిగి లిన ఏ అంశమైనా ఈ కార్యక్రమాల తర్వాతేనని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని, ఈ ప్రభావం కొన్నాళ్ల పాటు రాష్ట్రంపై కూడా ఉండే నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ఇతర ఖర్చులను సమన్వయం చేసుకుంటూ నిర్వహణ పద్దులు ప్రతిపాదించాలని కోరారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో మితిమీరిన అంచనాలకు వెళ్లవద్దని సోమేశ్ సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత లేదని, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో కూడా కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయన్నది స్పష్టంగా చెప్పలేదని వివరించారు. నిర్వహణ ఖర్చులు తగ్గించండి.. ఇక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగ్ ఉండడంతో వీటి పరిష్కారంతో పాటు వచ్చే ఏడాది అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖలకు సీఎస్ సూచించినట్లు తెలిసింది. అలాగే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు రెగ్యులర్ ప్రతిపాదనలు ఇవ్వాలని పేర్కొంటూ.. నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉండగా.. వీటికి ఏటా మరమ్మతులు, మౌలిక వసతుల కింద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. వీటిని భారీగా కుదించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న వాటికి మాత్రం బిల్లులు చెల్లించాలని, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడాలని సూచించినట్లు సమాచారం. ఇటు కార్యాలయాల నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని స్పష్టం చేసిన నేప«థ్యంలో బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై సంక్షేమ శాఖలు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నాయి. ముందుగా ప్రాధాన్యతల వారీగా అవసరాలను గుర్తించిన తర్వాత ప్రతిపాదనలు చేపట్టాలని, ఈమేరకు ఒకట్రెండు రోజుల్లో జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులపై ఆశల్లేవు.. ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం తో పాటు వచ్చే ఏడాది తొలి త్రైమాసికం కూడా కేంద్ర నిధులపై అంచనాలు పెట్టుకోవద్దని సీఎస్ తెలిపారు. రాష్ట్రం లోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల కరెంటు బిల్లులు ఆయా సంస్థలే కట్టుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎస్ఎఫ్సీ నిధులు ఇస్తున్నందున కరెంటు బిల్లుల ఖర్చులను కూడా ఆయా శాఖల బడ్జెట్లోనే పొందుపర్చాలని సూచిం చారు. మొత్తంమీద ప్రభుత్వ పథకాలు సజావుగా అమలు జరగడంతో పాటు ఆస్తుల కల్పన దిశలో మూలధన వ్యయం జరిగేలా అన్ని శాఖలు జాగ్రత్తగా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం అనుబంధ శాఖల వారీగా మరోసారి భేటీ అవుతామని తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ నీలం సహానీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మళ్లీ విధులు నిర్వర్తిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆమె మాట్లాడుతూ... గతంలో కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. నేడు ప్రభుత్వ సీఎస్‌గా నియమితులైన వేళ ఆ ఙ్ఞాపకాలన్నీ గుర్తుకువస్తున్నాయని పేర్కొన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నీలం సహానీ... తాడేపల్లిలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా జూన్ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఏపీ కేడర్ అధికారి. గతంలో డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఏపీ సర్కారు నియమించింది. -
ఏపీ సీఎస్‌గా నీలం సహాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నీలం సహానిని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీసీఏల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సహాని ఏపీ కేడర్ అధికారి. డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సహానిని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సోమవారం ఆ విధుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విదితమే. రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లలో సీనియర్ అయిన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర సర్కారు నియమించింది. జూన్ 20, 1960న జన్మించిన నీలం సహాని వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఓ మహిళా ఐఏఎస్ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడం ఇదే తొలిసారి. -
ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం.. ఇక రాజభవన్
సాక్షి, అమరావతి : విజయవాడలోని సూర్యారావుపేట పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఉన్న ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం..ఇక రాజభవన్‌గా వెలుగొందనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం గతంలో మాజీ సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నర్సింహన్ వ్యవహరించారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ గత చంద్రబాబు సర్కారు గవర్నర్ కోసం రాజభవన్ను కూడా నిర్మించకపోవడంతో..గవర్నర్ విజయవాడకు వచ్చినప్పుడల్లా ప్రైవేట్ హోటల్లో బస చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ నియామకం జరగడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని రాజభవన్‌గా ప్రకటించడమే కాకుండా అందుకనుగుణంగా ఆ కార్యాలయాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. -
ఒకే ఇంటి నుంచి ముగ్గురు చీఫ్ సెక్రెటరీలు
దేశంలో అనేక చోట్ల సరస్వతీ నిలయాలు ఉన్నాయి. అయితే హర్యానాలోని ఒక ‘సరస్వతీ నిలయం’ వాటికి భిన్నమైనది. ఆ నిలయం నుంచి ఆదివారం నాడు హర్యానా ప్రభుత్వం మరొక మహిళను తన కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంది. ఆ మహిళ పేరు కేశిని ఆనంద్ ఆరోరా. అంతకుముందు అదే ఇంటినుంచి మీనాక్షీ ఆనంద్ చౌదరి (2005–06), ఊర్వశీ గులాటి (2009–12) ఆ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శులు అయ్యారు. ఈ ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. పెద్దమ్మాయి మీనాక్షి, రెండో అమ్మాయి ఊర్వశి. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయిన కేశిని మూడో అమ్మాయి. ఆ ఇంటిలో అంతా చక్కగా చదువుకుని, ముఖ్యంగా ఆ ఇంట్లోని అమ్మాయిలు ముగ్గురూ సరస్వతీ పుత్రికలై ఉన్నత పదవిని అలంకరించారు కనుకనే ఆ ఇంటిని సరస్వతీ నిలయం అనడం. కేశిని ఆనంద్ అరోరా 1983 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి. నాలుగేళ్లుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి.ఎస్.దేశి పదవీ విరమణతో ఆయన స్థానంలోకి వచ్చారు కేశిని. హర్యానాలో ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఈ హోదాలో పని చేశారు. ఊర్వశి తర్వాత (వెనువెంటనే కాదు) ప్రమీలా ఇస్సార్ అనే మహిళ కొంతకాలం ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన కేశిని.. హర్యానాలో సీనియర్ మోస్ట్ ఐఏఎస్. మరో పద్నాలుగు నెలలు మాత్రమే సర్వీస్ మిగిలి ఉన్న కేశిని.. సాధారణ పరిపాలన, సిబ్బంది వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శిక్షణ, పాలనా సంస్కరణ శాఖలను చూస్తారు. కేశినీ ఆనంద్ గురించి మరికొంత హర్యానా ప్రభుత్వ తొలి మహిళా డిప్యూటీ కమిషనర్ ఆస్ట్రేలియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీ’ నుంచి ఎంబీఏ డిగ్రీ వయోజన విద్యావ్యాప్తికి కృషి మండల్ కమిషన్ అల్లర్లు, అలజడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ ఉడాయ్ (ఆధార్) ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆన్లైన్లో టీచర్ల బదలీ విధానానికి రూపకర్త నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు -
ఈసీ అనుమతి తర్వాతే కేబినెట్ భేటీ: ఎల్వీ
-
కేబినెట్ భేటీ.. స్పందించిన సీఎస్
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలన్న సీఎం చంద్రబాబునాయుడి నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కేబినెట్ భేటీకి సంబంధించి నోట్ తనకు వచ్చిందని ఆయన తెలిపారు. కేబినెట్ భేటీలో ఏయే అంశాలపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలని సీఎంను కోరినట్టు ఆయన తెలిపారు. ఈసీ నిబంధనలను సీఎం చంద్రబాబుకు వివరించాల్సిందిగా ఆయన సెక్రటరీకి సూచించినట్టు వెల్లడించారు. కేబినెట్ అజెండాను పరిశీలించి.. ఎన్నికల సంఘానికి పంపుతామని, ఆ అజెండాను ఈసీ ఆమోదించాకే కేబినెట్ భేటీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అజెండాను పంపించిన తర్వాత.. దానిని పరిశీలించేదుకు ఈసీ కనీసం 48 గంటల సమయం కోరుతోందని, ఈ విషయంలో సీఎం అభిప్రాయం తీసుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. చదవండి: బాబు కేబినెట్ భేటీ.. సీఎస్ సమాలోచనలు! మళ్లీ ‘కోడ్’ పందెం -
సీఎస్ సమీక్షలు.. యనమల వితండవాదం!
సాక్షి, అమరావతి : చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తోన్న సమీక్షలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే ఎల్లో మీడియాలోనూ అభ్యంతరకరంగా వార్తలు వచ్చాయి. ఇవ్వాళ మరోసారి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియా ముందుకొచ్చి చీఫ్ సెక్రటరీ సమీక్షలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సమీక్ష చేసే అధికారమే లేదంటూ ఓ వితండ వాదం వినిపించారు. ఎన్నికల ప్రక్రియతో చీఫ్ సెక్రటరీకి అసలు సంబంధమే లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే యనమల వ్యాఖ్యలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ అధికారాలను తగ్గించే పనిలో టీడీపీ నేతలున్నారని ధ్వజమెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలతోపాటు అన్ని అంశాలపై సమీక్ష చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉందని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కార్యనిర్వాహక విధులన్నీ చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీదేనని వారు స్పష్టం చేశారు. -
బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త సీఎస్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కీలకమైన సమయం అన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా పాలన ఉంటుందని స్పష్టం చేశారు. 36 ఏళ్ల సర్వీస్‌లో ఇదో కొనసాగింపు మాత్రమేనని.. ఎలాంటి ఒత్తిడికి గురి కావడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. -
వివాదాస్పదంగా మారిన ఏపీ సీఎస్ నియామకం
-
వివాదాస్పదంగా మారిన ఏపీ సీఎస్ నియామకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా అనిల్ చంద్ర పునేత నియామకం వివాదాస్పదంగా మారింది. సీనియరిటీని పక్కకుపెట్టి ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌లలో 1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రమణ్యం అందరికంటే సీనియర్ అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు సీఎస్‌గా అవకాశం ఇవ్వలేదు. ఆయనను కాదని.. 1984 బ్యాచ్‌కు చెందిన అనిల్ చంద్రను సీఎస్‌గా నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కూడా చంద్రబాబు ఎల్వీ సుబ్రమణ్యంకు అవకాశం ఇవ్వలేదు. ఈ విధంగా సీనియర్ అధికారులను అవమానించడంపై ఏపీలోని ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాగా, ఆదివారం ఏపీ నూతన సీఎస్‌గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. అనిల్ చంద్ర 2019 మే 31వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన పునేత
సాక్షి, అమరావతి : ఆంధ్రపదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా అనిల్ చంద్ర పునేత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం మాజీ సీఎస్ దినేష్‌కుమార్ చేతులు మీదుగా ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు సీఎస్‌ను కలిసి అభినందనలను తెలిపారు. తిరుమల, శ్రీశైలం, దుర్గ గుడి వేదపండితులు పునేతను ఆశ్వీరదించారు. ప్రజల సంతోషం, ఆర్థిక స్థితిగతుల పెంపుదల కోసం కృషి చేస్తాననని పునేత చెప్పారు. టీం వర్క్‌తో ముందుకు వెళ్తు ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. 2019 మే 31వరకు అనిల్ చంద్ర పునేత సీఎస్‌గా కొనసాగనున్నారు. -
పనికి చివరి రోజు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీని రద్దు చేయనుందన్న ఊహాగానాల నేపథ్యంలో పెండింగ్ పనుల పూర్తికి ‘చివరి రోజు’గా భావించి పెద్ద సంఖ్యలో సందర్శకులు బుధవారం రాష్ట్ర సచివాలయానికి తరలివచ్చారు. పెండింగ్ ఫైళ్ల పరష్కారానికి ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, జిల్లా అధికారులు, ప్రైవేటు వ్యక్తులు పెద్ద సంఖ్యలో సంబందిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులను కలిశారు. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులను కలసి తమ పెండింగ్ పనులను చేయించుకున్నారు. వాస్తు దోషం కారణం గా సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో చాలా అరుదుగా సచివాలయానికి వచ్చి వెళ్లారు. అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచే ఆయన పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బిజీబిజీగా సీఎస్.. అసెంబీ రద్దు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం సచివాలయానికి సందర్శుకుల తాకిడి పెరిగింది. సీఎస్ జోషి సైతం సాధారణ సందర్శకుల సందర్శన సమయాన్ని రద్దు చేసుకుని నీటిపారుదల, పోలీసు, సాధారణ పరిపాలన, విద్య, వైద్యం తదితర శాఖ పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడంలో తీరిక లేకుండా గడిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి రెండు త్రైమాసికాలకు సంబంధించి నియోజకవర్గాల అభివృద్ధి నిధి మంజూరు ఫైళ్ల కియరెన్స్ కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి సీఎం కార్యాలయ కార్యదర్శులను కలిశారు. గురువారంలోగా పెండింగ్ పైళ్లన్నింటినీ పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశించింది. పెండింగ్ ఫైళ్లకు సంబంధించిన స్థితిగతులను ఆయా శాఖల అధికారులు సీఎస్‌కు నివేదించి ఆన్లైన్లో సత్వర ఆమోదం పొందుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి వాటికి నిధు లు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్లు సైతం పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావుకు ప్రతిపాదనలు పంపారు. -
ప్రమాదంలో ఢిల్లీ పాలన?
సాక్షి, న్యూఢిల్లీ : అర్ధరాత్రి హైడ్రామాగా మొదలైన ప్రభుత్వ కార్యదర్శిపై ఎమ్మెల్యేల దాడి వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో పెను కలకలం రేపుతోంది. పరిపాలనకు కేంద్రబిందువైన వ్యక్తిపైనే దాడి చోటు చేసుకోవటంతో అధికారుల సంఘం నిరసనకు దిగగా... పోటీగా ఇప్పుడు ప్రభుత్వం ధర్నా చేపట్టం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ మూలంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతాన్ని ఓసారి పరిశీలిస్తే... పాలనాపరమైన నిర్ణయాల్లో మొదటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండిస్తూనే ఉన్నారు. ఎల్జీ పదవిని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం(బీజేపీ) పాలనకు అడ్డుతలుగుతుందని గతంలో ఆయన ఆరోపణలు గుప్పించారు కూడా. ఒకానోక టైంలో గత ఎల్జీ నజీబ్‌జంగ్ తో ఆయన వివాదం తారాస్థాయికి చేరి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, ముఖ్యమంత్రికి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నప్పటికీ... దానికి పరిపాలనాధికారి లెఫ్ట్‌నెంట్ గవర్నరే(ఎల్జీ)నని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆపై కొంత కాలం పరిస్థితులు మాములుగానే గడిచిపోయాయి. తర్వాత నజీబ్ స్థానంలోకి వచ్చిన అనిల్ బైజాల్ కూడా ఆ పంథానే కొనసాగించగా.. ఎల్జీ తీరు పట్ల కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించి ప్రభుత్వ సేవలు ఇంటి గుమ్మం వద్దకే అన్న పథకం ప్రవేశపెడితే.. దానికి ఎల్జీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే హోం డెలివరీ సర్వీసెస్ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకించడం లేదని, మరోసారి సాధ్యాసాద్యాలు పరిశీలించాలని మాత్రమే కోరారని అధికారులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన భేటీలో ఎల్జీ నిర్ణయమే శిరోధార్యమని సీఎస్ అన్షు ప్రకాశ్ వ్యాఖ్యానించటం.. తట్టుకోలేని ఆప్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ జార్వాల్, అమాన్ తుల్లా ఖాన్ సీఎస్‌పై దాడి చేయటం.. ఎమ్మెల్యేల అరెస్టులు.. పోటాపోటీగా ప్రభుత్వం ధర్నా చేపట్టం... ఇలా ఢిల్లీ రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. కేంద్రం జోక్యం సంగతి పక్కనపెడితే గత కొంతకాలంగా కీలక నిర్ణయాలేవీ అమలు కాకుండా పోవటంతో పాలన కుంటుపడింది. దీనికితోడు ప్రస్తుత పరిణామాలు, వాటి మూలంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సమీప భవిష్యత్తులో ఢిల్లీ పరిపాలనకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని సీనియర్ బ్యూరోక్రట్లు వ్యక్తం చేస్తున్నారు. -
మౌనం దాల్చిన ముఖ్యమంత్రి!
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పందించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిరాకరించారు. ఈ విషయమై విలేకరులు ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరోవైపు ఈ దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ మండిపడుతోంది. దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తోంది. సోమవారం రాత్రి తనపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారని సీఎస్ అన్షు ప్రకాశ్ ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. ఆప్ ప్రభుత్వ మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కొన్ని ప్రచార కార్యక్రమాలు, ప్రకటనల గురించి మాట్లాడేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. నేను సీఎం నివాసానికి వెళ్లేటప్పటికి అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాతోపాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. నేను వెళ్లాక తలుపులు మూసి నన్ను ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మరో ఎమ్మెల్యే మధ్య కూర్చోబెట్టారు. ప్రచార ప్రకటనల విడుదలకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందిగా సీఎం నన్ను ఆదేశించారు. నేను నిరాకరించడంతో నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని ఎమ్మెల్యేలు బెదిరించారు. నాకు ఇరువైపులా కూర్చున్న ఎమ్మెల్యేలు అకారణంగా నా తలపై కొట్టారు. నా కళ్లద్దాలు కూడా కింద పడిపోయాయి. నేను ఎలాగోలా అక్కడ నుంచి బయటపడగలిగాను’ అని సీఎస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ ముందుగానే కుట్ర పన్ని, పక్కా ప్రణాళికతో తనపై దాడి చేశారనీ, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలసి ఈ విషయం ఆయనకు చెప్పానన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కార్యాలయం, ఆప్ ఖండించింది. తమ ప్రభుత్వంపై నిరాధారమైన, విపరీత నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో రేషన్ సరుకులు సరిగ్గా అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో దానిపై మాట్లాడేందుకే సీఎస్‌ను పిలిచామంది. ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడేందుకు ఆయనను పిలిచామనడం అబద్ధమని ఆప్ అంటోంది. -
సీఎస్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడి
-
‘ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన కార్యదర్శిపై దాడికి పాల్పడిన ఆప్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ‘నిధుల ఖర్చుల విషయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుంది. దానిని సీఎస్ ప్రశ్నించినందుకే ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు’ అని వారు వివరించారు. ఆప్ ఎమ్మెల్యేలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని.. రాష్ట్రంలో అధికారులకు రక్షణే లేకుండా పోయిందంటూ వారు ఎల్జీ వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యే చెయ్యి చేసుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సీఓం కేజ్రీవాల్ నివాసంలో ఇంటింటికి సేవలు పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ అన్షు ప్రకాశ్, కొందరు ఉన్నతాధికారులు, ఆప్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశం కొనసాగుతుండగా ఒక్కసారిగా వాగ్వాదం మొదలైంది. ఇంతలో ఎమ్మెల్యే అమనాతుల్లా ఆగ్రహంతో ఊగిపోతూ అన్షు చెంప చెల్లుమనిపించారు. ఆపై దుర్భాషలాడుతుండగా.. అధికారులు ఎమ్మెల్యేని అదుపు చేశారు. దాడిలో మరో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదంతా కేజ్రీవాల్ సమక్షంలోనే చోటు చేసుకోవటం విశేషం. కాగా, అమనాతుల్లా కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. మరోవైపు ఎల్జీని కలిసిన అనంరతం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అసోషియేషన్ ఈ మధ్యాహ్నం భేటీ కానుంది. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసే విషయం.. తదుపరి చర్యలపై వారు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తే తెలుస్తుంది కాగా, సీఎస్‌పై దాడి జరిగిందన్న వార్తలపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఆయనపై ఎమ్మెల్యేలెవరూ దాడి చేయలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. సమావేశంలో అన్షునే ఎమ్మెల్యేలను దుర్భాషలాడారని.. తాను కేవలం లెఫ్టినెంట్ గవర్నర్‌కు మాత్రమే జవాబుదారీనంటూ సీఎస్ సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయినట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఇక బీజేపీ విమర్శలకు ఆప్ స్పందించింది. సీఎస్ కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడని.. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అన్షు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వల్, సంగమ్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కొత్త సీఎస్ ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. సికింద్రాబాద్‌లోనే ‘రైల్వే’శిక్షణ 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. సివిల్స్‌కు ఎంపిక కాకముందు ఎనిమిది నెలలపాటు రైల్వేలో పని చేశారు. సికింద్రాబాద్‌లోనే శిక్షణ పొందారు. అప్పట్నుంచే తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉంది. జోషి సివిల్ సర్వీసెస్ అధికారిగా మొదట నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత తెనాలి, వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఐటీ, నీటిపారుదల, ఇంధన శాఖ, రెవెన్యూ, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల కార్యదర్శి, ముఖ్యకార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పట్నుంచీ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లో రెండు దఫాలుగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. జర్మనీ, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మన దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. మేనేజ్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌బౌండరీ వాటర్ రీసోర్సెస్ అనే పుస్తకాన్ని రచించారు. మధ్యాహ్నమే బాధ్యతలు కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి బుధవారం మధ్యాహ్నమే బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం చంద్ర గ్రహణం మొదలవటంతో అంతకుముందే 3 గంటల సమయంలో బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని సమత బ్లాక్‌లో సీఎస్ ఎస్పీ సింగ్ తన బాధ్యతలను జోషికి అప్పగించారు. ఈ సందర్భంగా జోషి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు జోషికి అభినందనలు తెలిపారు. సీ బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు వీడ్కోలు పలికారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మంచి పేరు తెలంగాణ ఏర్పడినప్పట్నుంచీ జోషి అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ మొదలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని పట్టాలెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నీటి పారుదల శాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను సైతం ఆయనకే అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ అధీనంలో ఉన్న సీసీఎల్ఏ అదనపు బాధ్యతలను రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి అప్పగించారు. సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. -
తెలంగాణ నూతన సీఎస్‌గా ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) పదవీకాలం నేటితో ముగియనుంది. ఎస్పీ సింగ్ పదవీకాలాన్ని పొడగించాలని కేంద్రాన్ని కోరినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో నూతన సీఎస్ నియామకం అనివార్యమైంది. 984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శైలేంద్ర కుమార్ జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఆయన స్వస్థలం. ఢిల్లీ ఐఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం సివిల్స్ ర్యాంకు సాధించారు. రాజీవ్ శర్మ, ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్‌ల తర్వాత తెలంగాణకు నాలుగో సీఎస్ ఎస్కే జోషి. సీఎస్ నియామక ఉత్తర్వులు -
తదుపరి సీఎస్ ఎవరు..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీ నియామకం పూర్తయింది. రెండు నెలల ముందుగానే తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీ కాలం జనవరి 31తో ముగుస్తుంది. 2 నెలల ముందుగానే ఎస్పీ సింగ్ తర్వాత సీఎస్ ఎవరవుతారనే చర్చ ఐఏఎస్ వర్గాల్లో ప్రధానంగా జరుగుతోంది. సాధారణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌లను సీఎస్ పోస్టుకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ హోదాలో 8 మంది అధికారులు ఉన్నారు. రాజీవ్ ఆర్ ఆచార్య, ఎస్ కే జోషి, బీపీ ఆచార్య, అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, సురేశ్ చందా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నారు. వీరు కాకుండా బినయ్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరందరూ సీఎస్ రేసులో ఉన్నట్లేనని అర్థమవుతోంది. విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఆరు నెలల్లోపు రిటైర్ కానున్నారు. ఎస్పీ సింగ్ కన్నా ముందే బినయ్ కుమార్ ఈ పోస్టును ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ బినయ్ కుమార్‌పై ఆసక్తి చూపలేదనే ప్రచారం జరిగింది. దీంతో రంజీవ్ ఆర్ ఆచార్య, బినయ్ కుమార్‌లకు అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ప్రస్తుతమున్న సీఎస్ ఎస్పీ సింగ్ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆయన పదవీకాలాన్ని కొంత కాలం పొడిగించే అవకాశాలూ లేకపోలేదని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
సినిమా టికెట్ ధరలపై సీఎస్ సమీక్ష
అమరావతి: సినిమా థియేటర్లలో తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించే అంశంపై కఠినంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరల పెంపు అంశంపై గురువారం అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల థియేటర్లు, ఏసీ, నాన్ ఏసీ సౌకర్యాలను అనుసరించి ధరల పెంపు అంశంపై చర్చించారు. టికెట్ ధరల పెంపు అంశంపై నివేదిక ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. -
మహాసమాధిని దర్శించుకున్న పూనం మాలకొండయ్య
పుట్టపర్తి టౌన్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. శనివారం ప్రత్యేక వాహనంలో రోడ్డుమార్గాన ప్రశాంతి నిలయం చేరుకున్న ఆమెకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ప్రసాద్‌రావు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గురుమూర్తి, తహసీల్దార్ సత్యనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు. శాంతిభవన్ అథితి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమె సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించి అక్కడి వైద్యసేవలను పరిశీలించనున్నారు. -
రైతుల్ని ఆదుకోండి: పొన్నాల
హైదరాబాద్‌సిటీ: రాజకీయ కోణంలో చూడకుండా రైతులను ఆదుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఇతర కాంగ్రెస్ నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి రైతుల సమస్యలను వివరించారు. కష్టాల్లో ఉన్నరైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై కలవటానికి కూడా సీఎం అవకాశం ఇవ్వటం లేదని విమర్శించారు. మార్కెట్ యార్డులో మిర్చిని రైతులు కలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కందుల ధర భారీగా పడిపోయిందని, మార్కెట్ యార్డులో కనీసం గొనె సంచులు లేవని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పొన్నాల విమర్శించారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ‘కల్లం’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఎస్‌గా వ్యవహరించిన సత్యప్రకాష్ టక్కర్ విధుల నుంచి రిలీవ్ అవుతూ కల్లంకు బాధ్యతలు అప్పగించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కల్లంతో పాటు మరో నెలరోజుల్లో కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్న దినేశ్‌కుమార్‌ను, రిటైరైన ఎస్పీ టక్కర్‌ను సీఎం చంద్రబాబు సత్కరించారు. 1983 బ్యాచ్‌కు చెందిన కల్లం ఆర్థిక, రెవెన్యూశాఖలతో పాటు పలు కీలకశాఖల్లో పనిచేశారు. మార్చి నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన అనంతరం అదే బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న దినేశ్‌కుమార్ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టేలా ప్రభుత్వం జీవో జారీచేసిన సంగతి తెల్సిందే. కాగా, సీఎస్‌గా బా«ధ్యతలు చేపట్టిన అజేయ కల్లంకు మరో ఆరునెలలు గడువు పొడిగించేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద టక్కర్, కల్లంలకు సచివాలయ ఉద్యోగులు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన కల్లం
-
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం
-
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌గా అజేయ కల్లం
⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ⇒ నేడు బాధ్యతలు స్వీకరణ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం అజేయ కల్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఆయన మార్చి నెలాఖరునే పదవీ విరమణ చేయనున్నారు. అజేయ కల్లం రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో పనిచేశారు. సమర్థ్ధవంతమైన అధికారిగా, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని పేరుంది. అయితే తొలుత అజేయ కల్లంకు సీఎస్‌గా నియమించిన తర్వాత 3 నెలలు చొప్పున రెండు సార్లు పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం అదే జీవోలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సీఎస్‌గా దినేశ్ కుమార్‌ను నియమిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినేశ్ కుమార్ 1983వ బ్యాచ్‌కు చెందిన వారు. -
సీఎస్‌పై ఉత్కంఠకు తెర
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ కొత్త కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 1983 బ్యాచ్ కు చెందిన అజయ్ కల్లం ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మార్చి 31వ తేదీతో అజేయ కల్లం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో కొంత ఆసక్తి ఏర్పడింది. అయితే, అజేయ కల్లంనే సీఎస్‌గా నియమించేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అజేయ కల్లం పదవీ కాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. -
కొత్త సీఎస్ వచ్చేశారు
-
కొత్త సీఎస్ వచ్చేశారు
తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగి, ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత గిరిజా వైద్యనాథన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు రామ్మోహనరావు, ఆయన కుమారుడు వివేక్ రావు, మరికొందరి ఇళ్ల నుంచి మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రామ్మోహనరావు విజిలెన్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో పాటు పాలనా సంస్కరణల కమిషనర్‌గా కూడా వ్యవహరించేవారు. ఆయన స్థానంలో 1981 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. -
తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
-
తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ నియమితులయ్యారు. తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ముఖ్య అధికారుల సమావేశానంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శివదాస్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు కేడర్(1981 బ్యాచ్)కు చెందిన గిరిజా వైద్యనాథన్ చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఐఐటీలో పట్టభద్రురాలైన ఆమె.. ‘సంక్షేమం –ఆర్థిక ప్రగతి’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆరోగ్య శాఖలో ఎక్కువ కాలం పని చేశారు. మాతా, శిశు సంక్షేమ పథకం అమల్లో ఆమె సేవలు ప్రశంసనీయం. అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమెను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
ఎవరీ చీఫ్ సెక్రటరీ? ఏమా కథ?
సరిగ్గా ఐదేళ్ల కిందటి ముచ్చట ఇది. 2011 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు చేపట్టారు. ఆ వెంటనే పీ రామ్మోహనరావు ఆమె కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల తర్వాత జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆయన ఏకంగా యావత్ అధికార వర్గాలను విస్మయపరుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా అత్యంత కీలక పగ్గాలు చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం యంత్రాంగ పరంగానే కాదు అధికార కేంద్రపరంగానూ ఆయనను అత్యంత కీలక వ్యక్తిగా భావిస్తారు. జయలలిత మరణం తర్వాత ఆమె పాదాల వద్ద కీలకంగా ప్రముఖంగా కనిపించింది కూడా రామ్మోహనరావే. ఈ నేపథ్యంలో సహజంగానే రామ్మోహనరావు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నిజానికి మరో ఏడు నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ నల్లధనంతో పట్టుబడ్డ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రామ్మోహనరావు ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ప్రకంపనలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహనరావు 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో ఆయన తొలిసారి సబ్ కలెక్టర్‌గా సర్వీసులో చేరారు. గత జూలై 8న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. జయలలిత పార్టీ అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అప్పటి సీఎస్ కే జ్ఞానదేశికన్‌ను అర్ధంతరంగా తొలగించి.. రామ్మోహనరావును సీస్‌గా నియమించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన ఎప్పుడు కేంద్ర సర్వీసులలోకి డిప్యూటేషన్ మీద వెళ్లలేదు కానీ, 2001-03 మధ్యకాలంలో గుజరాత్ మారిటైమ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టేందుకు డిప్యూటేషన్ మీద వెళ్లారు. ఐఏఎస్ అధికారిగా పలు హోదాల్లో సేవలు అందించిన ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె నెచ్చెలి శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారని చెప్తారు. -
సీఎస్ ఇంటిపై ఐటీ దాడులు!
-
తిరుమలలో చీఫ్ సెక్రటరీ టక్కర్
తిరుమల (అలిపిరి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ మంగళవారం తిరుమలకు వచ్చారు. ఇక్కడి పద్మావతి అతిథి గహాల వద్దకు చేరుకున్న ఆయకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. -
మొక్కలకు రక్షణ కల్పించాలి
హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయండి కలెక్టర్లకు ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశం జిల్లాలో లక్ష్యానికి మించి మొక్కలు నాటుతామని కలెక్టర్ యోగితా రాణా వెల్లడి ఇందూరు : హరితహారం కార్యక్రమంలో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసి, మొక్కల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో హరితహారం కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారంపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, లక్ష్యానికి చేరువలో ఉన్న జిల్లాలను అభినందిస్తూనే, 40–45 శాతమే పూర్తి చేసిన విషయంలో బాగోలేదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. వచ్చే సంవత్సరంలో మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంకా మొక్కలు కావాలని అడిగిన వారికి సరఫరా చేయడానికి తక్కువగా ఉన్న మొక్కలను మార్కెట్లో కొనుగోలు చేసి తెప్పించుకోవాలన్నారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి లబ్ధిదారులకు చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు. 82శాతం పూర్తి : కలెక్టర్ జిల్లాలో 3.35 కోట్ల మొక్కటు నాటే లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 82 శాతం 2.76 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ యోగితా రాణా సీఎస్‌కు వివరించారు. మూడు రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉన్నామని, అంతే గాక వాటి రక్షణకు, నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే టేకు మొక్కలకు ఉపాధిహామీలో నీటిని అందించడానికి సదుపాయాలు లేనందున రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఉపాధిహామీ ద్వార నాటిన మొక్కలకు ముళ్ల కంచె ఏర్పాటు చేస్తున్నామని, 10 లక్షల ట్రీ గార్డులు అవసరమని తెలిపారు. 15 రోజుల్లో ఫెన్సింగ్ పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. లక్ష్యాన్ని మించి మరిన్ని మొక్కలను నాటడానికి చర్యలు తీసుకుంటున్నామని, రెండవ వారంలో ఇందు కోసం కార్యచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ విశ్వ ప్రసాద్, జేసీ రవీందర్ రెడ్డి, డీఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి కేటీఆర్ భేటీ
హైదరాబాద్ నగరంలో 30వేల మంది నిరుపేదల గృహ నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలపై పరిశ్రమలు, పురపాలన శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు.. పెండింగులో వున్న వాంబే, జెఎన్ఎన్యూఆర్ఎం పథకాల నిధులపై చర్చించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినా.. భవనాల ఎత్తు, యూనిట్ ధరకు సంబంధించిన ప్రత్యేక మినహాయింపులపై స్పష్టత ఇవ్వాల్సి వుందని కేటీఆర్ ప్రస్తావించారు. మినహాయింపులపై త్వరలో సీఎంతో చర్చించి మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎస్ వెల్లడించారు. మెట్రో రైలు పనుల పురోగతిపై చర్చిస్తూ.. మెట్రోకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని వారంలోగా విడుదల చేయాలని ఆర్దిక శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. మున్సిపల్ విభాగంలోని పలు పథకాలకు హడ్కో తదితర ఆర్దిక సంస్థల నుంచి ఆర్దిక సహాయం కోరడంపై మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. -
తెలంగాణ సీఎస్ పదవీకాలం పోడగింపు
-
అక్కడ నివాసం ఉంటేనే స్థానికత
- ఎమ్మార్వో సర్టిఫికెట్ ఇస్తారు - సీఎస్‌కు చేరిన ఫైలు - నేడో రేపో మార్గదర్శకాలు హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లి అక్కడ నివాసం ఉంటేనే స్థానికత కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలతో కూడిన ఫైలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. స్థానికతకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి అంటే 2014 సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి 2017 సంవత్సరం జూన్ 2వ తేదీలోగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానిక సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తు ఆధారంగా పరిశీలన చేసి అక్కడే నివాసం ఉంటే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా జారీ చేయనున్నారు. ఉద్యోగులకే కాకుండా అక్కడికి తరలివెళ్లే ఎవరికైనా స్థానికత కల్పించనున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు వెళితే అతనికి స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు హైదరాబాద్‌లోనే స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో జూన్ 2, 2017లోగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎక్కడకు తరలివెళ్లినా స్థానికత వర్తిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా మాత్రమే మార్గదర్శకాలను రూపొందించారు. -
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి మార్పు!
సాక్షి, హైదరాబాద్: కీలకమైన బడ్జెట్ తయారీ, సమావేశాల సమయంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర 2 నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇటీవలే ప్రదీప్‌చంద్ర కాలి ప్రధాన నరంచిట్లడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఆయన అమెరికాకు వెళ్తున్నారు. శుక్ర లేదా శనివారం ఆయన అమెరికాకు వెళ్లే అవకాశముంది. శస్త్రచికిత్స అనంతరం కనీసం 2 నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ సమయంలో ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వర్తించే అధికారి లేకపోవటంతో ఎక్కడి ఫైళ్లు అక్కడే ఆగిపోతున్నాయి. అందుకే ప్రదీప్ చంద్ర స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంజీ గోపాల్ పేరు సీఎం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. -
'తెలంగాణ విజయరహస్యం ఇదే..'
మహిళా ఉద్యోగుల జాతీయ సదస్సులో సీఎస్ రాజీవ్‌శర్మ హన్మకొండ, అర్బన్: పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమనేత ముఖ్యమంత్రిగా ఉండటంవల్ల రాష్ట్రంలో బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వరంగల్ నిట్‌లో జరిగిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సమాఖ్య 5వ జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ చేస్తున్న టీం వర్క్‌తోనే రాష్ట్రం దేశాన్ని ఆకర్షిస్తున్నదన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాజీవ్‌శర్మ అన్నారు. షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా సమస్యల పరిష్కారం, రక్షణకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ శర్మ అన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పరిశీలన దుగ్గొండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఊరచెరువు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చెరువు సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధికోరుతున్నా రు..పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు.. ఏమి చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. తయారీ మానేసిన వారికి సాయం ముద్దునూరుని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో అక్కడి మహిళలతో సీఎస్ చాలా సేపు సంభాషించారు. గుడుంబాపై ఆధారపడి.. ప్రస్తుతం ఆ వృత్తి మానేసిన నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. గుప్పెడు బియ్యం పథకంలో భాగంగా మహిళలు సేకరించిన బియ్యాన్ని పేదలకు అందించి, మహిళలను అభినందించారు. అలాగే, దళిత మహిళలకు భూ పంపిణీ పథకంలో భాగంగా గ్రామంలోని 25.12 ఎకరాల భూమిని రూ.1.36 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేయగా, సీఎస్ పరిశీలించారు. -
తెలంగాణ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల ప్యాకేజీ
నీతి ఆయోగ్ తో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో భేటీ వివరాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు సాయం చేయాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రూ400 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన ఇచ్చినట్లు వివరించారు. మేడారం, కృష్ణా పుష్కరాలకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. -
'ఫేస్బుక్లో ఆ పోస్టింగ్‌ను వెనక్కి తీసుకోవాలి'
కేరళ: కేరళలోని ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ(సీఎస్) తన ఫేస్బుక్ లో అబ్దుల్ కలాంపై చేసిన పోస్టింగ్‌ను కేరళ ప్రభుత్వం బుధవారం తీవ్రంగా ఖండించింది. అబ్దుల్ కలాం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కలాం మృతికి నివాళిగా వచ్చే ఆదివారం కేరళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేయాలంటూ ఫేస్బుక్లో చీఫ్ సెక్రటరీ థామ్సన్ పోస్టింగ్ చేయడంపై సీఎం కార్యాలయం మండిపడింది. ఆదివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని సీఎం కార్యాలయం అధికారకంగా నిర్ణయించలేదని పేర్కొంది. ఫేస్బుక్లో ఆ పోస్టింగ్ ను వెనక్కి తీసుకోవాలని థామ్సన్ కు ప్రభుత్వం సూచించింది. -
'ఇక్కడి సంస్థలన్నీ మావే'
-
'జూన్ 2న విజయవాడకు తరలండి'
హైదరాబాద్: "వచ్చే నెల (జూన్) 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులెవరూ హైదరాబాద్‌లో ఉండటానికి వీల్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రధాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దీనికి నవ నిర్మాణ దీక్ష అనే పేరు పెట్టారు. ఈ నవ నిర్మాణ దీక్షకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్లందరూ తమ ఉద్యోగులతో కలిసి విజయవాడ మున్సిపల్ స్టేడియానికి జూన్ 2న ఉదయం 9 గంటలకు చేరుకోవాలి" అని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ బుధవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. 'సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి సత్కరిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా నవ నిర్మాణ దీక్ష పేరుతో ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆ సర్క్యులర్‌లో సూచించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష తరువాత 3 నుంచి 7వ తేదీ వరకు "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం నిర్వహించాలని, 8న బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని సీఎస్ అందులో పేర్కొన్నారు. -
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయండి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లుపై వెంటనే అనర్హత వేటువేయాలని స్పీకర్ మధుసూదనాచారికి వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి స్పీకర్‌ను ఆయన నివాసంలో తెలంగాణ వైఎస్సార్సీపీ పక్షనేత పాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ కలుసుకుని వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ విషయంలో ఇప్పటికే ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు నోటీసు ఇచ్చినందున, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు ఇప్పటివరకు నోటీసే ఇవ్వలేదన్న విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట స్థానం నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తుపై గెలుపొం దిన తాటి వెంకటేశ్వర్లు, జనవరి 9న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విదితమే. గతంలో మదన్‌లాల్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు సమర్పించిన తాటి వెంకటేశ్వర్లు ఆ తర్వాత తానూ టీఆర్ఎస్లోకి ఫిరాయించారని, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దుచేయాలని మరోలేఖలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
మూసీ పరిధిలో కబ్జా ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి: సీఎస్
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో పనులు జరిగేందుకు వీలుగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి రంగ్‌మహల్ జంక్షన్ వరకు మూసీపై మూడోవంతెన నిర్మాణానికి వీలుగా నదిగర్భంలో కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ విభాగం అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం మెట్రో ప్రాజెక్టుపై సచివాలయంలో జరిగిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఆస్తుల స్వాధీనానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎంఆర్ ఎండీలు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మూసీపై మూడో వంతెన నిర్మాణానికి ఇరిగేషన్ విభాగం జీహెచ్ఎంసీ,హెచ్‌ఎంఆర్‌లకు సహకరించాలని సూచిం చారు. ప్రధాన నగరంలోని రహదారులపై మెట్రో పనులు జరిగేందుకు వీలుగా తాజాగా 27 ఆస్తులను తొలగించామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మరో 254 ఆస్తులను తొలగించాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో 193 ప్రైవేటు, మరో 61 మున్సిపల్ ఆస్తులున్నట్లు తెలిపారు. ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మ దేవాలయం, మాదాపూర్, మధురానగర్, ఖైరతాబాద్,నాంపల్లి ప్రాంతాల్లో మెట్రో పనులకు అడ్డుగా ఉన్న 33 కెవి, 11 కెవి విద్యుత్ లైన్స్‌ను మార్పుచేయాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. మెట్రో పనుల కోసం రహదారులపై తవ్విన గుంతలను తక్షణం పూడ్చివేయాలని, పనులు పూర్తయిన ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్,హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మెట్రో ప్రాజెక్టుపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం టాస్క్ ఫోర్స్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రోరైలు నిర్మాణానికి అవసరమైన ఆస్తులను మార్చిలోపు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 219 ప్రైవేటు, 85 ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక రూపొందించారు. మెట్రోరైలు భద్రత కోసం ప్రత్యేక భద్రతా దళాన్ని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని రాజీవ్ శర్మ సూచించారు. నాగోలు, మెట్టుగూడ ప్రాంతాల్లో మెట్రోరైలు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
'గోదావరి తీరం వెంట హారతి కార్యక్రమం'
గోదావరి పుష్కరాలు జరిగే ఉభయ గోదావరి జిల్లాల్లో తీరం వెంట హారతి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆ జిల్లాల కలెక్టర్లు శుక్రవారం తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై జిల్లా అధికారులు, కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో శుక్రవారం రివ్యూ సమావేశం ఏర్పాటుచేశారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ ఎన్పవర్మెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. పుష్కరాల ప్రారంభం నాటికి రెండు గోదావరి జిల్లాల్లో తీరంలో ఉన్న గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పారు. -
పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ
తూర్పుగోదావరి: గోదావరి పుష్కర నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లతో పాటు, అధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. -
‘భద్రత’ నిర్ణయం ప్రధాన కార్యదర్శులదే..
సాక్షి, ముంబై: రాజకీయ ప్రముఖులకు ఏ స్థాయి భద్రత కల్పించాలో ప్రధాన కార్యదర్శులే నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టం చేశారు. తనకు శత్రువులెవరూ లేరని, జెడ్ ప్లస్ స్థాయి భద్రత అవసరం లేదని ఇదివరకే ఫడ్నవిస్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ అధికారాలు తమవద్ద ఉంచుకోకుండా ప్రధాన కార్యదర్శులకే బాధ్యత అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు, ఇతర రంగాల వీవీఐపీ, వీఐపీలకు జెడ్ ప్లస్, జెడ్ లేదా వై, ఎక్స్ స్థాయి.. ఇలా వివిధ స్థాయిల్లో భద్రత కల్పించే అధికారం ఇదివరకు ముఖ్యమంత్రికి లేదా హోం శాఖ వద్ద ఉండేవి. భద్రత కంటే ‘స్టేటస్ సింబల్’కు ప్రాధాన్యత ఇచ్చే మంత్రులు జెడ్ ప్లస్, జెడ్ భద్రత కావాలని ప్రయత్నాలు చేస్తుండేవారు. అందుకు ముఖ్యమంత్రి లేదా హోం శాఖతో ఉన్న సంబంధాలను సద్వినియో గం చేసుకునేవారు. కాని ఇప్పడా అధికారాలు ప్రధాన కార్యదర్శుల చేతుల్లోకి వెళ్లాయి. సంబంధిత వీఐపీలు, కీలక నాయకులకు భద్రత కల్పించే ముందు వారి ప్రాణాలకు ఏ స్థాయిలో ముప్పు పొంచి ఉంది...? ఏ స్థాయి భద్రత కల్పించాలి తదితర అంశాలను పరిగణంలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఆ ప్రకారం అవసరాన్ని బట్టి ఆ స్థాయి భద్రత వారికి సమకూర్చి ఇవ్వాలి. కాగా, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన కమిటీలో ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని ఫడ్నవీస్ తెలిపారు. అడ్వకేట్ జనరల్‌గా సునీల్ నియామకం.. రాష్ట్రంలో కీలకమైన అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది సునీల్ మనోహర్ నియమితులయ్యారు. ఇక్కడ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న అడ్వకేట్ దరాయస్ ఖంబాటా రాజీనామాను స్వీకరించాలని గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నారు. సీనియర్ లాయరైన సునీల్ మనోహర్ నాగపూర్ యూనివర్సిటీలో లా పట్టా పొందారు. ముంబై హైకోర్టులోని నాగపూర్ బెంచిలో కీలక న్యాయవాదిగా ఉన్నారు. 27 సంవత్సరాలకు పైగా ఆయన న్యాయవృత్తిలో కొనసాగుతున్నారు. మంచి అనుభవమున్న వ్యక్తిగా ఇదివరకు హైకోర్టులో అనేక కీలక కేసులను వాధించారు. కాగా, అడ్వకేట్ జనరల్‌గా ఉత్తమ సేవలందించినందుకుగాను దరాయస్ ఖంబాటాను కేబినెట్ సమావేశంలో అభినందించారు. కరువుపై సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొనేలా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు అవసరమైతే వెంటనే కీలక నిర్ణయాలు తీసుకునే విషయంపై ఓ కమిటీని స్థాపించినట్లు ఆయన ప్రకటించారు. -
మైలసంత
ఓరుగల్లు, క్రీ.శ. 1300 ఆ రోజు ముఖ్య సమావేశం. బాహత్తర నియోగాధిపతి (చీఫ్ సెక్రటరీ) పిలుపు అందుకోగానే అన్ని శాఖల అధిపతులతో పాటుగా హడావుడిగా రాతికోటలోని సభామంటపం చేరాడు దండనాయకుడు (పోలీస్ కమిషనర్) సింగమనాయుడు. ఇంకా సమావేశం మొదలవలేదు. అధికారులంతా ముఖమండపంలో ఎదురు చూస్తున్నారు.‘ఎందుకో అత్యవసర సమావేశం?’ మండపంలో కూర్చొని వున్న గజసాహిణి గోన విఠలరెడ్డిని అడిగాడు సింగమనాయుడు. గోన విఠలరెడ్డి వర్ధమానపురం రాజు. కాకతీయుల అపారమైన గజసైన్యానికి నాయకుడు. ‘ఏముందప్పా? నూటికి ముప్పై కప్పంగా కట్టినా భాండాగారం వట్టిపోయిందని ఒకటే గొడవ. అంబయ్యదేవుడిని ఓడించాక ఖజానాలో చేరిన నలభై కోట్లు కోటగోడ మరమ్మతుకే సరిపోయాయట. నాయకుల కప్పాలు, భూములపైన ఆదాయం, వాణిజ్యపన్నులూ అన్నీ కలిపి ఈసారి ఎనభై కోట్లే వచ్చాయట. అవి వీరభటుల బత్యాలు, నవలక్ష ధనుర్థారులకే చాలడంలేదు. ఇక వాళ్లని కూడా గ్రామాలనికి తోలి నాయంకరాలకి పంచాలని అయ్యగారి ఉద్దేశ్యం. వడ్డమాను ఆదాయమంతా ఆరువేల ఏనుగుల్ని మేపడానికే చాలదు. ఇక వీళ్లు కూడా మా పైనబడితే మా రాజ్యాల్లో ఏమీ మిగలదు’ అన్నాడు గోన విఠలరెడ్డి. ఇంతలో రొప్పుకుంటూ వచ్చిన తలారి సాంబడు ‘దన్నాయకులు సింగప్రభువులకి దండాలు. మైలసంతలో దిక్కులేని శవం పడి ఉందట’ అన్నాడు. సింగమనాయుడు ఉలిక్కిపడ్డాడు. ‘ఎన్నడూ లేనిది ఇదేం ఉపద్రవం?’ అనుకుంటూ హుటాహుటిగా బయల్దేరాడు. ఓరుగల్లు కోట బయట వందల కొలదీ అంగళ్లతో దేశవిదేశాల వర్తకులతో ప్రతి మంగళవారం మైలసంత జరుగుతుంది. ఆ సంత నుంచి ప్రభుత్వానికి సుంకాల ద్వారా వచ్చే ఆదాయమే సాలుకి మూడుకోట్లు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ మధ్య ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకి తావులేదు. మరి ఇది ఎలా జరిగినట్టు? నూనె అంగళ్ల మధ్య భటులు కట్టిన దడి మధ్యలో బోర్లా పడివున్న శవం. కంసాలి వేషంలో వచ్చిన గజదొంగ కన్నప్పది. చుట్టూ పరికించి చూశాడు సింగమనాయుడు. దుకాణాలలో లావాదేవీలు మామూలుగానే జరుగుతున్నాయి. చోద్యానికి వచ్చిన జనాలు భటులు కలుగచేసుకోవడంతో దూరంగా పారిపోయారు. ‘చచ్చినవాడు కంసాలివాడట. అక్కలవీధిలో విడిది. శవం అప్పటికే నీలిరంగు తిరిగి ఉంది. అంటే హత్య జరిగి చాలాసేపే అయింది. బహుశా నిన్న సాయంత్రమే మరణించి ఉంటాడు’ వివరించాడు తలారి సాంబడు. ‘కావలి భటులకి వివరాలు చెప్పకుండా ఊరు దాటడం సాధ్యం కాదు. అలాంటప్పుడు అతడు కోటదాటి బయటకి ఎలా వచ్చినట్లు? ‘అక్కలవీధిలో విచారిస్తే తెలుస్తుంది!’ ‘ఊ! శవాన్ని గోళకీమఠానికి శవపరీక్షకి పంపండి’ అని తలారి భటులకి ఆదేశమిచ్చి కోటవైపు కదిలాడు సింగమనాయుడు. సంతలో విపరీతమైన రద్దీ. తమలపాకులు, టెంకాయలు, నువ్వులు, గోధుమలు, ఆవాలు, పెసలు, వడ్లు, ఉప్పు, బెల్లం, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం... ప్రతిదానికి ప్రత్యేకమైన అంగళ్లు. గంపలో గాజుబుడ్లతో ‘సంపెంగనూనె...’ అని అరుస్తూ గుర్రానికి అడ్డం వచ్చిన మాలపిల్లని అదిలించి వేగంగా ముందుకి కదిలాడు సింగమనాయుడు. పట్టుబట్టల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కాకతమ్మ బోనాల పండుగ ఇంకా ఎన్నాళ్లో లేదు. అక్కసాలెవాడ వద్ద దండాలు పెడుతూ ఎదురొచ్చాడు సుంకాధికారి. చుట్టూ ఉన్న తగరం, సీసం, రాగి, ఇనుము కర్మాగారాల ఠంగుఠంగనే సుత్తుల శబ్దంలో అతడు చెప్పేది వినపడక గుర్రం దిగాడు సింగమనాయుడు. ‘ఏమిటి సంగతి?’ ‘ఏముంది ప్రభూ! ఈ సాలు మిరియాలపై సుంకం పదోవంతు కూడా రాలేదు. అంటే బొక్కసానికి ముప్పైలక్షలు నష్టం. ఏమైందని మన కరణాలని అడిగితే అమ్మకాలే లేవంటారు. పన్ను కట్టాల్సిందే అని పట్టుబడితే ఈ వర్తకులు తీర్పరుల సభక్తి (ట్రిబ్యునల్) వ్యాజ్యం తెచ్చారు’ ‘మిరియాల చారు లేకుండా ముద్ద దిగని మన ప్రజలు ఉప్పూకారాలు మానేసే వ్రతం పట్టారా ఏమిటి? ఊహ్. మీ తిప్పలు మీరు పడండి. నా తిప్పలు నాకున్నాయి. సంతలో ఎవరో కంసాలిని హత్య చేశారు. బంగారం కోసమై ఉండొచ్చు. దొంగసొమ్ము కొనేవాళ్ల మీద కాస్త నిఘా పెట్టండి. ఎవరిపైనన్నా అనుమానం వస్తే వెంటనే తలారికి తెలియపర్చండి.’ ‘చిత్తం ప్రభూ’ అని సెలవు తీసుకున్నాడు సుంకాధికారి. పూటకూళ్లింట్లో కన్నప్ప అద్దెగదిని చూపిస్తూ ‘ఇదే గది. పాపం అబ్బాయి మంచివాడే! వచ్చి వారమైంది. ఎవరితోనూ గొడవలేదు’ అంటూ మారుతాళంతో తలుపు తెరిచింది పూటకూళ్ల సీతక్క. గది చక్కగా సర్దినట్లుంది. దానిని పరిశీలించే పని తలారి సాంబడికి అప్పజెప్పి ‘వ్యాపారం కోసం ఎవరెవరిని కలిసాతో తెలుసా? అతడి కొరకు వచ్చినవాళ్ల వివరాలేమైనా ఉన్నాయా?’ సీతక్కని అడిగాడు సింగమనాయుడు. ‘అతడి కోసం ఎవరూ రాలేదు. కాని నాలుగురోజుల క్రితం అనుమయ్యశెట్టిని పరిచయం చేయమని కోరితే నేనే చేశాను’ ‘కంసాలికి జొన్నల వ్యాపారితో ఏంపని?’ ‘అతడి వద్ద నగలేవో బేరానికి పెట్టాలని.’ ఇంతలో ‘అయ్యా! తమరిది చూడాలి’ గదిలోంచి కేకపెట్టాడు సాంబడు. సంచిలో నల్లబట్టల మధ్య చోరవృత్తికి కావాల్సిన పరికరాలు. ‘ఇతడు కంసాలి కాదు. దొంగ’ అన్నాడు తలారి సాంబడు. ‘అంటే, వీడు అనుమయ్యశెట్టి ఇంటికి కన్నం వేయటానికి పథకం వేశాడా? ఆ మూడో గోనెసంచి విప్పండి. అందులో ఏముందో?’ అన్నాడు సింగమనాయుడు. విప్పారు. జొన్నలు. గోనెసంచి మీద నీలిరంగు ముద్ర ఉంది. అనుమయ్యశెట్టిది. మూతివిప్పి తలకిందులు చేశాడు. జలజలమని రాలే జొన్నల మధ్య మరో మూట. సంచిలో సంచి! మూటవిప్పాడు సింగమనాయుడు. నల్లబంగారం! ‘పదండి. వెంటనే అనుమయ్యశెట్టి కోష్టాలు పరిశీలించాలి. సాంబయ్యా.. నువ్వు వెంటనే సుంకాధికారి మల్లన్నని అక్కడికి తోడ్కొనిరా’ అంటూ బయలుదేరాడు దండనాయకుడు సింగమనాయుడు. తీర్పరుల ధర్మాసనం ముందు పొగడదండతో దోషిగా నిలబడ్డాడు అనుమయ్య. సామాన్యుల ఆహారమైన జొన్నలపై కాకతీయ రాజ్యంలో సుంకంలేదు. ధనికులు తినే వడ్లూ, గోధుమలూ, ఇతర దినుసులపై సుంకం మాడబడివీసం- అంటే 16వ వంతు. సుగంధద్రవ్యాలు, హస్తకళ సామాగ్రులపై మాడబడిచిన్నం- అంటే 8వ వంతు. కానీ నల్లబంగారమనే మిరియాలపై మాత్రం అత్యధికంగా మాడబడిపణం- అంటే సగం. ‘గత పది నెలలుగా జొన్నల సంచులలో మిరియాలు తేవటం ద్వారా అనుమయ్య ఎగవేసిన సుంకం ముప్పైలక్షల మాడలకి పైబడే’ అంటూ నేరాన్ని వివరించాడు వడ్ల వ్యవహారి (ప్రాసిక్యూటర్). శెట్టి ఆస్తిపాస్తులు జప్తు చేసి అతడి వద్ద కొనగోళ్లు చేసిన అంగళ్లపై మడిగసుంకం (అంగడిపన్ను) రెండు రెట్లు పెంచాల్సిందిగా సుంకాధికారికి ఆదేశాలిచ్చాడు మైలసంత తీర్పరి. ‘రహస్యం తెలుసుకొని బెదిరించి డబ్బు గుంజేందుకు వచ్చిన కన్నప్పని హత్య చేయించినందుకు, నిందితునికి తగిన శిక్ష విధించేందుకు దండ న్యాయస్థానానికి అప్పగించడమైనది’ అంటూ లేచాడు తీర్పరి. అంతా ఎటువాళ్లటు వెళ్లిపోయారు. సింగమనాయుడికి కన్నప్ప గుర్తొచ్చాడు. పాపం దొంగకన్నప్ప! వచ్చింది దొంగతనానికే అయినా వీడి వల్ల ఇంటిదొంగలు బయటపడ్డారు అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సింగమనాయుడు. లోటు బడ్జెట్ కాకతీయ సామ్రాజ్యం ఒక ఫెడరల్ వ్యవస్థ. మధ్యయుగం ఆరంభంలోనే కే ంద్రీకృత ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. రాజ్యం నాడులు, విషయాలుగా విభజింపబడి, అవి సామంతరాజుల చేతుల్లో ఉండేవి. వాళ్లు అవకాశం వచ్చినప్పుడల్లా తిరుగుబాటు చేసేవారు. ఆ పరిస్థితుల్లో ఓరుగల్లు చక్రవర్తికి కుడిభుజాలుగా నిలిచిన గోన, మల్యాల, చెరకు, రేచర్ల నాయకులు ఆంధ్రసామ్రాజ్యం ముక్కచెక్కలు కాకుండా కాపాడారు. కాని కుట్రలూ కుతంత్రాలూ సాగేవి. నేడో రేపో తెగబడేందుకు ఢిల్లీలో పొంచి ఉన్న ముస్లిం సైన్యాల భయం ఒకటి. దాంతో రాజధాని రక్షణ అత్యంత కీలకమై ఏడు ప్రాకారాలతో ఓరుగల్లు కోట నిర్మించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ శత్రుదుర్భేధ్యం చేయక తప్పలేదు. చక్రవర్తి రక్షణకై నవలక్ష ధనుర్థారులతో మూలబలాన్ని పోషించారు. యుద్ధసమయంలో సామంతుల సైన్యాలు చక్రవర్తికి సహాయపడేవి. ప్రతాపరుద్రీయం, సిద్ధేశ్వరచరిత్ర అనే గ్రంథాల్లో కనిపించే కాకతీయ సామ్రాజ్యపు ఆదాయ వ్యయాల (పక్కన ఉన్న) పట్టిక చూస్తే ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతుంది. వ్యయం ఆదాయం (ప్రతాపాలు = రూపాయలు) చక్రవర్తి తులాభారం 3.5 కోట్లు చక్రవర్తి నిత్యవైభవాలకి 3.6 కోట్లు జీతాలు నవలక్ష ధనుర్ధారులకి 38 కోట్లు జీతాలు ఇతరులు, రక్షకభటులు 50 కోట్లు సత్రాలు 1 లక్ష బ్రాహ్మణులకి దానాలు 1.3 కోట్లు అంతఃపురం, ద్వారపాలకులకు 3.8 కోట్లు గుర్రాలు, ఏనుగులు 2.5 కోట్లు ఆలయానికి మఠాలకి(వ రంగల్లు) 1 కోటి రాజగృహాల నిర్మాణం 1 కోటి సామంతుల కప్పం 24 కోట్లు భూములనుండి ఆదాయం 20 కోట్లు వాణిజ్య సుంకాలు 44 కోట్లు మొత్తం 88 కోట్లు లోటు 16 కోట్లు మొత్తం 104 కోట్లు 104 కోట్లు అంటే అదొక లోటు బడ్జెట్! చక్రవర్తి ఆదాయం రక్షణ వ్యవస్థకే చాలేది కాదు. ఆదాయం పెంచేందుకు పన్నులు వసూలు చేసే వ్యవస్థని పటిష్టం చేశారు. సామంతులు కూడా సైన్యపు భారాన్ని మోసేందుకు వ్యవసాయాభివృద్ధికై చెరువులు, కాలువలు తవ్వించారు. వాణి జ్యానికి ప్రోత్సాహం లభించింది. వాణిజ్యాన్ని నియమితం చేసేందుకు ప్రతి పట్టణంలో రెండు రకాల సంతలను ప్రభుత్వమే నిర్వహించేది. పట్టణం మధ్యలో మడిసంత, ఊరి వెలుపల మైలసంతలను నిర్వహించారు. వరంగల్‌లోని ఖాన్సాహెబ్తోట ప్రాంతంలో ఒకప్పటి మైలసంత ఉండేది. ఆ సంతలో అమ్మిన వస్తువులూ వాటిపై పన్నుల వివరాలు కూడా అక్కడి శాసనంలో దొరుకుతాయి. కోటలో సుంకాల వల్ల ధరలు ఎక్కువ. అయితే మైలసంతలో తక్కువ పన్నుతో ఉత్పత్తిదారులే స్వయంగా అమ్ముకునే అవకాశం ఉండేది నేటి రైతుబజార్లలా! అయితే ప్రతాపరుద్రుని కాలానికి సామంతులపై కప్పం భారం విపరీతంగా పెరిగింది. 72 శాఖల అధికారుల జీతాలకి బదులుగా, రాజ్యాన్ని 72 నాయంకరాలుగా విభజించి వారికి పన్నుల వసూలు, సైన్యాన్ని పోషించడం వంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారిలో వెలమలు ఎక్కువ. అది ముందు నుంచీ కాకతీయుల ధ్వజం పట్టి సామ్రాజ్యాన్ని కాపాడిన సామంతుల కన్నెర్రకి కారణమైంది. ఇదే తరువాతి యుగంలో వెలమల, రెడ్ల మధ్య వైరానికి దారితీసింది. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గాను, అక్కడే సీఎం ముఖ్యకార్యదర్శిగాను సతీష్ చంద్ర వ్యవహరిస్తున్నారు. ఆయనను సీఎం ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. జయలక్ష్మిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఏపీ వైద్య, ఆరోగ్య, గృహ, మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఎం. రవిచంద్రను ఎక్సైజ్ కమిషనర్‌గా, చేనేత జౌళి శాఖ డెరైక్టర్‌గా ఉన్న కె.వి. సత్యనారాయణను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు. -
పిల్లలు తప్పిపోతే సీఎస్, డీజీపీలదే బాధ్యత
చాలా రాష్ట్రాల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో తప్పిపోతున్నారని, ఇక మీదట ఇలా పిల్లలు తప్పిపోతే మాత్రం ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలనే పిలిపిస్తామని, వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఇందులో తొలి అడుగుగా.. బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎస్, డీజీపీలను ఈనెల 30వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విషయాల్లో చాలా యాంత్రికంగా సమాధానాలిస్తున్నాయని, దీన్ని ఇక సహించేది లేదని సుప్రీంకోర్టు చెప్పింది. -
అన్ని జిల్లాల్లోనూ రీ షెడ్యూల్ చేయండి
రేపు ఆర్బీఐ గవర్నర్‌తో భేటీలో కోరనున్న ఏపీ సీఎస్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గత ఖరీఫ్ సందర్భంగా రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు రిజర్వ్బ్యాంక్ను కోరనున్నారు. ఆర్బీఐ సోమవారం ముంబైలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సీఎస్‌తో పాటు ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లాం హాజరుకానున్నారు. ఈ సందర్భంగానే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో భేటీ అయ్యేందుకు కృష్ణారావు సమయం కోరారు. రాష్ట్రంలో 4 జిల్లాల్లోని 120 మండలాల్లో రీ షెడ్యూల్‌కే అనుమతించారని చెబుతూ.. మిగతా జిల్లాల్లోని మండలాల్లో పంటలు కోల్పోయిన రైతుల రుణాల రీ షెడ్యూల్‌కూ అనుమతించాల్సిందిగా రాజన్‌ను సీఎస్ కోరనున్నారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ శనివారం ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రుణ మాఫీకి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలు తదితర అంశాలపై సమీక్షించారు. -
యూపీఎస్సీతో ఏపీ సీఎస్ భేటీ
నూతన డీజీపీ ఎంపికపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న జె.వి. రాముడు ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాముడును మరో రెండేళ్లపాటు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారు. డీజీపీ పదవికి ఎంపిక చేసిన అధికారిని రెండేళ్ల పాటు ఆ పదవీలో కొనసాగింప చేయాలని, ఇందుకు పదవీ విరమణతో సంబంధం లేకుండా చేయాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించకుండా పదవీ విరమణ చేస్తే రెండేళ్ల పాటు వర్తించదని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు సోమవారం ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీలైనంత వరకు రాముడు కొనసాగింపునకు కృష్ణారావు ఢిల్లీలో ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నం ఫలించని పక్షంలో మరో ఐపీఎస్ సీనియర్ అధికారి అరుణా బహుగుణను తాత్కాలిక డీజీపీగా నియమించేందుకు అనుమతించాలని ఆయన కోరనున్నారు. బహుగుణ ప్రస్తుతం జాతీయ పోలీసు అకాడమీలో పనిచేస్తున్నారు. ఆమె తెలంగాణకు చెందిన వ్యక్తి. అయినప్పటికీ ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తి అయ్యే వరకు బహుగుణను ఏపీ డీజీపీగా నియమించాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. మరోపక్క, సీనియారిటీ ప్రకారం డీజీపీ పోస్టుకు పది మంది పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీకి సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసులో ఉన్న అధికారుల పేర్లతో ఈ జాబితాను రూపొందించారు. -
‘మెట్రో’ మార్పులపై వెనక్కి తగ్గని సర్కారు!
అలైన్మెంట్ మార్పుపై సీఎస్ సమీక్ష హైదరాబాద్: చారిత్రక కట్టడాలున్న ప్రదేశాల్లో మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పుపై వెనక్కి తగ్గేదిలేదని సర్కారు స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయంపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ (మెట్రో) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విషయంలో రాజీలేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. సుల్తాన్‌బజార్, బడీచౌడి, మొజాంజాహీమార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం నిర్మిస్తే అత్యధిక వ్యయంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం కొన్నేళ్లపాటు ఆలస్యమవుతుందని అధికారులు సీఎస్ శర్మకు వివరించినట్లు తెలిసింది. చారిత్రక ప్రదేశాలున్న మార్గాల్లో భూగర్భ మెట్రో లేదా అలైన్మెంట్ మార్పు అంశంపై నిపుణుల ఆధ్వర్యంలో విస్తృత పరిశీలన జరిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నివేదికను త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పించనున్నారు -
జేసీ బదిలీ.. డిప్యూటి కలెక్టర్లకూ స్థానచలనం
హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇ.శ్రీధర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన జేసీ శ్రీధర్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ కేటాయించలేదు. అలాగే ఈ స్థానంలో వేరెవరినీ ప్రభుత్వం నియమించలేదు. జాయింట్ కలెక్టర్ విధులను కూడా జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనాకే (అదనపు బాధ్యతలు) అప్పగించారు. బదిలీ అయిన జేసీ శ్రీధర్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. అయితే.. మంగళవారం జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా కూడా సెలవు పెట్టడంతో ఇంచార్జి కలెక్టర్‌గా, ఇంచార్జి జేసీగా కూడా ఏజేసీ సంజీవయ్య వ్యవహరించారు. జేసీగా మంచిపేరు .. హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా 2012 మే 2న బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ రెండేళ్ల పాటు జిల్లాకు విశేషమైన సేవలందించారు. రెండేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మండలాల వాగా ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాల వివరాల సేకరణ, ఎప్పటికప్పుడు వాటి స్థితిగతులను అప్డేట్ చేసేందుకు.. అన్ని మండలాల తహశీల్దార్లకు ట్యాబ్లెట్ పీసీలను సమకూర్చారు. జిల్లాకు కలెక్టర్లుగా పనిచేసిన నటరాజన్ గుల్జార్, సయ్యద్ ఆలీ ముర్తుజా రిజ్వీ, ముఖేశ్ కుమార్ మీనా ఉన్నపుడు జేసీగా శ్రీధర్ కీలకమైన అంశాల్లో మంచి సహకారాన్ని అందించారు. శ్రీధర్‌కు త్వరలోనే పదోన్నతిపై మెదక్ జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ దక్కవచ్చని తెలిసింది. డిప్యూటి కలెక్టర్లు బదిలీ హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జిల్లా కలెక్టరేట్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆర్.అంజయ్యను ఖమ్మం జిల్లా భద్రాచలం ఆర్డీఓగా బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి.మాసుమ బేగం కూడా బదిలీ అయ్యారు. అయితే తదుపరి పోస్టింగ్ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం ప్రత్యేక అధికారిగా ఉన్న వి.ఆనందరావును తార్నాకలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కార్యాలయానికి స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. యూఎల్సీ స్పెషలాఫీసర్‌గా పోస్టింగ్ కోసం వేచి ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సత్తయ్యను ప్రభుత్వం నియమించింది. -
రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరణ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మ కూడా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ డీజీపీగా ఈరోజు ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. -
తొలి సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ
- హైదరాబాద్ సీపీగా మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డి - పదవీ విరమణ చేసిన మహంతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు. అలాగే తొలి డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా అనురాగ్‌శర్మను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ శర్మ పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం డెప్యుటేషన్‌పై కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన రూర్కీలో ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత ఇంగ్లండ్‌లోని అంగీలియాలో గ్రామీణాభివృద్ధిలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. అమెరికాలోని మిలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. 1982లో ఐఏఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వచ్చారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా, డెరైక్టర్ పోర్ట్స్, పురపాలక శాఖ స్పెషల్ కమిషనర్, సాంకేతిక విద్య డెరైక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డెరైక్టర్ జనరల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కీలక భూమిక పోషించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అవసరమైన సమాచారాన్ని అందించడమేకాక, ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించారు. మహంతి పదవీ విరమణ ప్రస్తుత ప్రభుత్వ సీఎన్ మహంతి ఆదివారం పదవీ విరమణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నియమించాక ఆయన తప్పుకున్నారు. మరో నెలరోజులు గడువున్నా ఈ నిర్ణయం తీసుకున్నారు. సంతోషంగా ఉంది: అనురాగ్ శర్మ తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీ కావడం సంతోషంగా ఉందని అనురాగ్ శర్మ సాక్షితో అన్నారు. పోలీసు శాఖలో కీలకమైన ఈ పదవిని నిర్వహించడం కత్తిమీద సామే అయినా ప్రజా సేవకు ఎక్కువ అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా తనకు ఎన్నికల బందోబస్తులో, శాంతిభద్రతల పరిరక్షణలో నగర పోలీసు సిబ్బంది, అధికారులు వెన్నుదన్నుగా నిలిచారంటూకృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ డీజీపీగా సోమవారం ఉదయం 7.15కు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఆయన స్థానంలో సీపీగా వస్తున్న మహేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు చేపట్టనున్న శివధర్‌రెడ్డిని ఇటీవలే వైజాగ్ సీపీ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి అటాచ్ చేశారు. వీరిద్దరూ సమర్థులైన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. అత్యుత్తమ సేవలందించినందుకు రాష్ట్రపతి పోలీసు పతకాలు అందుకున్నారు. మహేందర్‌రెడ్డి 1986, శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. మహేందర్‌రెడ్డి నిజామాబాద్ ఎస్పీగా, హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీ, గ్రేహౌండ్స్ కమాండెంట్, సైబరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఎన్పీఏ డీఐజీగా చేశారు. ఐదేళ్లుగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. శివధర్‌రెడ్డి శ్రీకాకుళం, నల్లగొండ జిల్లాల ఎస్పీగా, ఎస్ఐబీ డీఐజీ, వైజాగ్ సీపీగా పలు హోదాల్లో పని చేశారు. వీరిరువురూ సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
చివరి 5 గంటలు...సమైక్యాంధ్ర సీఎస్‌గా కృష్ణారావు
ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలు స్వీకరణ నేడు ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జె.వి.రాముడు నియామకం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బయ్యారపు ప్రసాదరావు హైదరాబాద్: రాష్ట్రం విడిపోవడానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆదివారం రాత్రి 7 గంటలకు బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని సీ బ్లాకులో పదవీ విరమణ చేయనున్న సీఎస్ మహంతి నుంచి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా కొనసాగిరికార్డు సృష్టించినట్లైంది. ఒక రాష్ట్రానికి కేవలం ఐదు గంటల పాటు సీఎస్‌గా పనిచేసిన చరిత్ర ఇప్పటివరకూ ఎక్కడా లేదు. 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్.కృష్ణారావు సీసీఎల్ఏ కమిషనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహంతి ఆదివారం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయటంతో.. కృష్ణారావుకు సమైక్యాంధ్రప్రదేశ్ సీఎస్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ తొలుత ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐ.వై.ఆర్.కృష్ణారావును నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారమే మరో ఉత్తర్వును జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి ఐ.వై.ఆర్.కృష్ణారావు నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆయన సీఎస్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కృష్ణారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు నెలల కిందటే సీఎస్ కావాల్సింది... సీఎస్‌గా మహంతి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అప్పుడే కృష్ణారావు సీఎస్ అవుతారని అందరూ భావించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పలనాపరమైన కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం మహంతినే మరో నాలుగు నెలలు సీఎస్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పుడే కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహంతి ఈ నెలాఖరు వరకు సీఎస్‌గా కొనసాగేందుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో నెల రోజుల ముందుగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. దీంతో కృష్ణారావుకు రాష్ట్రం విడిపోవటానికి ఐదు గంటల ముందు సమైక్యాంధ్రప్రదేశ్‌కు సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా రాముడు రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా ఉన్న డాక్టర్ బయ్యారపు ప్రసాదరావును ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి టి.పి.దాస్‌ను ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డెరైక్టర్ జనరల్‌గా, ఆర్.పి.ఠాకూర్‌ను ఆ విభాగం అదనపు డెరైక్టర్ జనరల్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ ప్రసాదరావుకు విచిత్రమైన అనుభవం ఎదురవుతోంది. సాధారణంగా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కొత్తగా ఆ పోస్టులోకి వచ్చిన వారికి లేదా మరో డీజీ స్థాయి/అదనపు డీజీ స్థాయి వారికి అప్పగించి రిలీవ్ అవుతుంటారు. ప్రసాదరావు విషయం దీనికి పూర్తి భిన్నంగా ఉండనుంది. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డీజీపీ కావడంతో ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తాత్కాలిక డీజీపీలుగా నియమితులైన జె.వి.రాముడు, అనురాగ్ శర్మలకు బాధ్యతలు అప్పగించనున్నారు. పోలీసు విభాగంలో హెచ్ఓడీలుగా (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) వ్యవహరించే వారంతా ఈ రకంగానే బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఉంది. ఐదుగురు ఐపీఎస్‌ల డెప్యుటేషన్ పొడిగింపు రాష్ట్రంలో డెప్యుటేషన్‌పై పని చేస్తున్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల డెప్యుటేషన్ కాలాన్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న జె.అజయ్‌కుమార్ (1997), డి.కల్పననాయక్ (1998), మహేందర్కుమార్రాథోడ్ (2001), ఎస్.గోపాల్‌రెడ్డి (1985), బి.బాలనాగదేవి (1995) డెప్యుటేషన్ కాలం ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. -
సీఎస్‌గా మహంతి పదవి విరమణ
-
క్లిష్ట సమయంలో బాగా పనిచేశారు
కలెక్టర్లకు మహంతి ప్రశంసలు హైదరాబాద్: రాష్ట్ర విభజన.. వరుస ఎన్నికలు వంటి సంక్లిష్ట సమయాల్లో అద్భుతంగా పనిచేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి ప్రశంసించారు. ‘అత్యంత క్లిష్టమైన సమయాల్లో కష్టపడి పనిచేసిన మీకు, జిల్లాల అధికార యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా’ అంటూ వారిని కొనియాడారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో మహంతి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన విధంగానే కొత్త రాష్ట్రాల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉద్బోధించారు. ‘ఐఏఎస్‌లకు ప్రాంతీయ పరిధులు లేవు. మీరు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల్లో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. రెండు రాష్ట్రాల ప్రగతి మీ చేతుల్లో ఉంది’ అని అన్నారు. ఈ సదస్సులో భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు పలువురు సీనియర్ ఐఏఎస్‌లు పాల్గొన్నారు. విభజన అనంతరం కొత్తలో సమస్యలు ఉండవచ్చని, వాటి పరిష్కారంలో కలెక్టర్లు కీలక భూమిక పోషించాలని కృష్ణారావు సూచించారు. -
25న సీఎస్ మహంతికి ఐఏఎస్‌ల వీడ్కోలు సభ!
హైదరాబాద్: పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతికి వీడ్కోలు పలికేందుకు ఐఏఎస్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఈ వీడ్కోలు సభను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. జూన్ 2న అపాయింటెడ్ డే అయినందున విభజన పనుల్లో అధికారులు తీరికలేకుండా ఉన్నారు. ఈ క్రమంలో 25నే వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం -
తెలంగాణ తొలి ముఖ్యకార్యదర్శిగా గోపాల్‌రెడ్డి
-
టీచర్లకు ఆప్షన్ అవకాశమివ్వాలి: పీఆర్టీయూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి పీఆర్టీయూ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఓపెన్ కేటగిరీలో 20 శాతమే భర్తీ చేస్తున్నారని, 2000 సంవత్సరం వరకు డీఎస్సీల ద్వారా ఓపెన్ కేటగిరీలో 30 శాతం భర్తీ చేసినందున స్థానికేతరులు ఎక్కు వ మంది తెలంగాణ జిల్లాలకు వచ్చారని, వారు తమ సొంత జిల్లాలకు వెళ్లేలా ఆప్షన్ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి గురువారం సీఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆప్షన్ ఇస్తే దాదాపు మూడువేల మంది తెలంగాణ నుంచి తమ సొంత జిల్లాలకు వెళతారని, ఆ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. -
'మహంతి ఎక్స్ టెన్షన్'పై కృష్ణారావు మండిపాటు!
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీకే మహంతి పదవీ కాలాన్ని పొడిగించినట్టు వస్తున్న వార్తలపై ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. ప్రదాన కార్యదర్శిగా మహంతిని కొనసాగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ 10 రోజులపాటు సెలవులో వెళ్లినట్టు తెలుస్తోంది. విభజన సమయంలో బయటి వారు ఉంటనే న్యాయం జరుగుతుందన్న వాదనలో అర్థం లేదు అని ప్రధాన కార్యదర్శికి కృష్ణారావు లేఖాస్త్రాన్ని సంధించారు. ఐఏఎస్ లకు ప్రాంతీయత ఆపాదించడంపై లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పదవీకాలం పొడిగింపు అనేది నా దృష్టిలో అద్భుతమైన పనితీరు ఉన్న వారికే ఇవ్వాలని సన్నిహితుల దగ్గర కృష్ణారావు అన్నట్టు సమాచారం. నా దృష్టిలో మహంతికి ఆ స్థాయి లేదని, దినేష్‌రెడ్డి వర్సెస్ ఉమేష్‌కుమార్ కేసులో మహంతి పనితీరును సుప్రీం తప్పుపట్టిందనే విషయాన్ని సన్నిహితుల వద్ద కృష్ణారావు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
సీఎస్‌గా మహంతి కొనసాగింపు!
-
మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు
-
మహంతి వద్దకు చేరిన తెలంగాణ బిల్లు
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపారు. శాసనసభలో చర్చల సారాంశం, తీర్మానాలను క్రోడీకరించి అందులో పొందుపరిచారు. అయితే సభలో సభ్యులు అందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయని విషయం తెలిసిందే. విభజన బిల్లు కేంద్రం నుండి ప్రత్యేక విమానంలో తెచ్చి నేరుగా మహంతికే అప్పగించారు. ఇప్పుడు దానిని పంపించే బాధ్యత కూడా ఆయనదే. ఈ బిల్లును మహంతి కేంద్ర హొం శాఖకు పంపుతారు. సోమవారం ఉదయం విమానంలో ప్రత్యేకాధికారి దీనిని ఢిల్లీ తీసుకు వెళ్లే అవకాశం ఉంది. -
అటవీ అధికారుల హత్య కేసులో...348 మందిని అరె స్ట్ చేశాం
=అధికారులను కొట్టి చంపిన 9 మందిని కూడా.. =ఫారెస్ట్ సిబ్బందికి ఫైరింగ్‌లో శిక్షణ = ఒక్కో ఫారెస్ట్ డివిజన్‌కు ఒక ఏఅర్ ప్లాటున్ =అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుమల అడవిలో ఈ నెల 15వ తేదీన ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారుల కేసులో ఇప్పటి వరకు 348 మందిని అరెస్ట్ చేశామని అర్బన్ ఎస్పీ ఎస్వీ.రాజశేఖరబాబు తెలిపారు. అటవీ అధికారులను ఆయుధాలతో కొట్టి చంపిన మరో 9 మంది స్మగ్లర్లను కూడా అరె స్ట్ చేశామని చెప్పారు. గురువారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. అటవీ అధికారుల హత్యలు జరిగిన 24 గం టలలోపే నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టడంతోపాటు స్మగ్లిం గ్ను తుదముట్టించేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఫారెస్ట్ అధికారుల హత్యపై దర్యాప్తు ము మ్మరం చేశామని, ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటివరకు 348 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 24 మంది స్మగ్లర్లు, 51 మంది మేస్త్రీలు.. 24 మంది స్మగ్లర్లు, ఎర్రచందనం దుంగలను నరికే కూ లీలను సరఫరా చేసే 51 మంది మేస్త్రీల పేర్లను అర్బన్ ఎస్పీ విడుదల చేశారు. స్మగ్లర్లలో ఎక్కువమంది కర్ణాటకలోని కటిగ న హళ్లి, బెంగళూరు, హోస్కోట్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కూలీలను సరఫరా చేసే మేస్త్రీలు తమిళనాడులోని తిరుణ్ణామలై, సేలం, వేలూ రు జిల్లాలకు చెందినవారున్నారు. మనరాష్ర్టంలోని వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన శీనప్ప(45), చిత్తూరు జిల్లా పలమనేరు నూనెపల్లెకు చెందిన నాగరాజు(42), అంబరుసుపల్లెకు చెందిన రెడ్డెప్ప ఉన్నా రు. వీరి సమాచారం తెలిస్తే వెంటనే అర్బన్ ఎస్పీ కా ర్యాలయానికి తెలియజేయాలని ఎస్పీ కోరారు. అరెస్టై న వారిలో 19 మందిని పోలీస్ కస్టడికి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నై ఓడరేవు నుంచి మలేషియా, చైనా, సింగపూర్, దుబాయ్‌లకు ఎర్రచందనం రవాణా జరుగుతున్నట్లు తెలిసిందన్నారు. విదేశాలకు ఎర్రచందనం ఎలా ఎగుమతి చేస్తున్నారనేదిశగా విచారణ చేపడుతున్నామని, అందుకోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని తెలిపారు. వేలూరు, తిరువణ్ణామలై ఎస్పీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇప్పటికే స్మగ్లర్ ప్రభు అక్కడి పోలీసులకు సరెండర్ అయ్యాడన్నారు. ఫారెస్ట్ సిబ్బందికి ఫైరింగ్‌లో శిక్షణ 250 మంది పారెస్ట్ అధికారులు, సిబ్బందికి నాలుగైదు రోజుల్లో ఫైరింగ్‌లో శిక్షణ ప్రారంభించనున్నామని ఎస్పీ తెలిపారు. ఒక్కో ఫారెస్ట్ డివిజన్‌కు 21 మందితో కూడిన ఒక ప్లాటున్ ఆర్ముడ్ రిజర్వును ఇచ్చామన్నారు. అలాగే ఒక ఏపీఎస్పీ ప్లాటున్ను అప్పగించామని తెలిపారు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా పోలీసులు, ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుని నిరంతరం కూంబింగ్ చేస్తున్నామన్నారు. ఎర్రచందనం దుంగలను నరకడం తగ్గుముఖం పట్టిందన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్‌పోస్టులను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ బిల్లు) రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ బిల్లును పంపారు. న్యాయనిపుణుల సలహా తీసుకున్న అనంతరం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీన్ని శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్లకు పంపనున్నారు. అసెంబ్లీలో చర్చించి 40 రోజుల్లోగా తిరిగి పంపాలని కోరారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యతలను గవర్నర్‌కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
అగమ్యగోచరం
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు భారత పశు వైద్య మండలి (వీసీఐ) గుర్తింపు లభించకపోవడంతో ఇక్కడ చదివిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పశుసంవర్థకశాఖ జారీ చేసిన 469 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారంతో గడువు ముగియనుంది. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాగైనా తమకు అర్హత కల్పించాలని ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలలో చదివిన విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇందు కోసం వీరు గత 10 రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. సీఎం పేషీతోపాటు పశుసంవర్థకశాఖ డెరైక్టర్, చీఫ్ సెక్రటరీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. 2008 -09 విద్యా సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరులో పశువైద్య కళాశాలను ప్రారంభించారు. అంతకుముందు రాష్ట్రంలో హైదరాబాద్, తిరుపతి, కృష్ణా జిల్లా గన్నవరంలో మాత్రమే పశువైద్య కళాశాలలు ఉండేవి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పాడి పరిశ్రమాభివృద్ధితో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు, కరీంనగర్ జిల్లా కోరుట్లలో కొత్తగా పశు వైద్య కళాశాలలను ప్రారంభించారు. ప్రొద్దుటూరులో రూ.115 కోట్లతో కళాశాలను నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేయగా అందులో భాగంగా వైఎస్ తొలి విడతగా రూ.25 కోట్లు మంజూరు చేశారు. అలాగే కళాశాల నిర్మాణానికి సంబంధించి రంగయ్యగారి సత్రానికి చెందిన 85 ఎకరాల భూమిని గోపవరం గ్రామం వద్ద కేటాయించారు. అయితే వైఎస్ మరణానంతరం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో భవన నిర్మాణాలు గత మూడేళ్లుగా నత్తనడక సాగుతున్నాయి. విద్యుత్, నీటిసరఫరా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ప్రస్తుతం కళాశాల ప్రొద్దుటూరు పాల పదార్థముల కర్మాగారంలోని భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరో వైపు అధ్యాపక పోస్టుల భర్తీలో కూడా జాప్యం జరిగింది. గతంలో కళాశాలను తనిఖీ చేసిన వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (భారత పశువైద్య మండలి) ఈ విషయాలపై ఆరా తీసింది. వారి సూచనమేరకు ఇటీవల పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు కళాశాలకు గుర్తింపు ఇవ్వలేదు. గత ఆగస్టులో కళాశాల విద్యార్థులు తమకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ కళాశాలలో ఆందోళన చేశారు. ఆ సందర్భంగా సెప్టెంబర్ ఆఖరి లోపు కళాశాలకు వీసీఐ గుర్తింపు లభిస్తుందని అధికారులు విద్యార్థులకు రాతపూర్వకంగా తెలిపారు. అయితే కోర్సు పూర్తయినా కళాశాలకు గుర్తింపు లభించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీన పట్టాలు కూడా పొందారు. కాగా గతంలో మాదిరి కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం పోస్టుల భర్తీకి సంబంధించి జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొత్తం రాష్ట్రంలోని 6 జోన్లకు కలిపి 469 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జోనల్ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఓ విద్యార్థి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ శనివారం ఎలాగోలా తమ దరఖాస్తులను స్వీకరించారని, అయితే వాటికి అర్హత ఉందా లేదా అన్న విషయం మళ్లీ చెబుతామని ఉన్నతాధికారి తెలిపారన్నారు. వీసీఐ నిబంధనల ప్రకారం దరఖాస్తులో గుర్తింపు సంఖ్యను నమోదు చేయాల్సి ఉండగా తమను తాత్కాలిక రిజిస్ట్రేషన్ కింద తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈనెల 5వ తేదీ వరకు కూడా యూనివర్సిటీ నుంచి వీసీఐకి తమ కళాశాల వివరాలను పంపలేదని మరో విద్యార్థి తెలిపారు. దీనిని బట్టే యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోందన్నారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరరావును న్యూస్‌లైన్ వివరణ కోరగా కళాశాలకు వీసీఐ గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఈ ఏడాది అడ్మిషన్లకు సంబంధించి అనుమతి ఇప్పటికే వచ్చిందన్నారు. ప్రతి నెల కళాశాలకు సంబంధించిన సమాచారాన్ని యూనివర్సిటీ అధికారులు వీసీఐకి పంపుతున్నారన్నారు. విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బంది కూడా బాధాకరంగా ఉందని చెప్పారు. మొత్తానికి ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు లభించడంపైనే ఇక్కడ చదివిన విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోర్టును ఆశ్రయిస్తాం తమకు ప్రస్తుతం న్యాయం జరగని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తాం. ప్రభుత్వ కళాశాలలో చదివిన తాము అనర్హులమని చెప్పుకోవడానికే బాధగా ఉంది. ఓ విధంగా చెప్పాలంటే తాము ఇక్కడ చదివి తీవ్రంగా నష్టపోయాం. - బాల వెంకట్, విద్యార్థి ఎలాగైనా అవకాశం కల్పించాలి ప్రస్తుతం జరుగుతున్న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాగైనా తమకు అవకాశం కల్పించాలి. నోటిఫికేషన్ అనేది చీటికిమాటికి వచ్చేది కాదు. చదువు పూర్తయినా గుర్తింపు రాకపోవడం బాధగా ఉంది. - అశోక్, విద్యార్థి -
ఏపీఎన్జీఓలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జరిపిన చర్చలు విఫలం