కొత్త సీఎస్ వచ్చేశారు
కొత్త సీఎస్ వచ్చేశారు
Published Fri, Dec 23 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM
తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగి, ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత గిరిజా వైద్యనాథన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ఐటీ అధికారులు రామ్మోహనరావు, ఆయన కుమారుడు వివేక్ రావు, మరికొందరి ఇళ్ల నుంచి మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రామ్మోహనరావు విజిలెన్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో పాటు పాలనా సంస్కరణల కమిషనర్‌గా కూడా వ్యవహరించేవారు. ఆయన స్థానంలో 1981 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది.
Advertisement
Advertisement