Girija Vaidyanathan
-
ఐటీ గాలం
► కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి డైరీలో 12 మంది మంత్రుల వివరాలు ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో అక్రమార్కుల చిట్టా ► జాబితాలో 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌లు ► దాడులకు అనుమతి కోరిన ఢిల్లీ సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలను గాలం వేసి పట్టుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు అక్రమార్కుల చిట్టాను అందజేసిన ఐటీశాఖ ఉన్నతాధికారులు దాడులకు అనుమతి కోసం వేచి ఉన్నారు. ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు నడిపి లబ్ధి పొందిన 12 మంది మంత్రుల మెడకు సైతం ఐటీ ఉచ్చు చుట్టుకోనున్నట్లు సమాచారం. తమిళనాడు ప్రభుత్వంలో ప్రజాపనులశాఖ ఇసుక కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై గత ఏడాది ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల నగదు, భారీ స్థాయిలో రూ.2000 కొత్త కరెన్సీ నోట్లు, బంగారం స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి శేఖర్రెడ్డితోపాటూ ఆయన వ్యాపార భాగస్వాములు శ్రీనివాసులు, ఆడిటర్ ప్రేమ్‌కుమార్, రత్నం, రామచంద్రన్, అశోక్, ఎం.జైన్, మహావీర్ గిరాణీ, పరాస్మల్ లోధా తదితర 8 మంది అరెస్టయ్యారు. శేఖర్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసిన సమయంలో రూ.300 కోట్ల విలువైన అక్రమాల వివరాలతో కూడిన డైరీ ఐటీ అధికారులకు లభించినట్లు తెలు స్తోంది. శేఖర్‌రెడ్డితో అక్రమ లావాదేవీలు జరిపిన వారిలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నా రు. అంతేగాక వారికి ఇచ్చిన కమీషన్ వివరాలు సైతం పొందుపరిచి ఉన్నాయి. డైరీలో లభించిన వివరాల ఆధారంగా ఒక్కొక్క పేరును బయటకు తీసి రహస్య విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన పాన్ మసాలా, గుట్కా తదితర మత్తు పదార్థాలు రహస్య అమ్మకాలకు మార్గం సుగమం చేసి, కమీషన్ పుచ్చుకున్న సుమారు 50 మంది అధికారుల పేర్లు ఐటీ చేతుల్లో ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌కు ఐటీ శాఖ అందజేసి, తగిన చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా శేఖర్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ ఆధారంగా 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారుల ఇళ్లపై దాడులు జరిపేందుకు ఢిల్లీ ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో ఐటీ దాడులు సాగుతాయని అంటున్నారు. గవర్నర్ విచారణకు స్టాలిన్ విజ్ఞప్తి అన్నాడీఎంకే (అమ్మ) ప్రభుత్వంలోని మంత్రుల, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు సోమవారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతి హిమాలయ పర్వతాల అంత ఎత్తుకు చేరుకుందని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియా శేఖర్‌రెడ్డి ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పేర్లతో రూ.300 కోట్ల అవినీతి చిట్టా బయట పడిందని ఆయన చెప్పారు. ఈ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపి, తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులు కోరినట్లు ఆయన తెలిపారు. జయలలిత మరణించిన తరువాత 15 రోజుల్లో ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బీమా బిల్లు కోసం రూ.808 కోట్ల నిధులను ఒకే సంతకంతో విడుదల చేయడం వెనుక దాగి ఉన్న అవినీతి ఇప్పటికే ఒక ప్రచార మాధ్యమం ద్వారా వెలుగు చూసిందని చెప్పారు. ఆహారశాఖా మంత్రి కామరాజ్, వైద్యమంత్రి విజయభాస్కర్, కొందరు అధికారులపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నందున విచారణకు ఆదేశించాలని గవర్నర్‌కు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. వివరాలు విడుదల చేయాలి కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి నుంచి అక్రమంగా లబ్ధి పొందిన మంత్రులు, అధికారుల జాబితాను విడుదల చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ను సోమవారం ఒక ప్రకటనలో కోరారు. -
పళని మార్క్
► భారీగా బదిలీలు ► సీఎస్ ఆదేశాలు సాక్షి, చెన్నై : పాలన మీద పట్టు సాధించే పనిలో ఉన్న సీఎం ఎడపాడి కే పళనిస్వామి అధికారుల బదిలీలను వేగవంతం చేశారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో పాటుగా పలువురు అధికారుల్ని రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. దీంతో పోలీసు విభాగంలో డీజీపీ మొదలు భారీగా బదిలీలు ఉండొచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలో కసరత్తులు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం సీనియర్ ఐఏఎస్‌లతో పాటుగా మరి కొందరికి స్థాన చలనం కల్పించడం సచివాలయంలో చర్చకు దారి తీసింది. పళని మార్క్ పాలనలో భాగంగా భారీగా ఐఎఎస్‌ల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆదేశాలు జారీ చేశారు. బదిలీలు పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగం డైరెక్టర్‌గా ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సునిల్ పల్లివ్వాల్ను బదిలీ చేస్తూ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సి.కామరాజ్‌ను సునిల్ పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగానికి బదిలీ చేశారు. తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న టి.ఉదయచంద్రన్ ను పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న సబితను తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు. తమిళనాడు మినరల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎం.వల్లలార్ను మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, ఈ పదవిలో ఉన్న దయానంద్ కటారియను ట్రాన్స్ పోర్టు కమిషనర్‌గా, పరిశ్రమల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విక్రమ్ కపూర్‌ను ఎనర్జీ విభాగానికి, పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్య మిశ్రాను పరిశ్రమల శాఖకు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదాలో పబ్లిక్, రిహాబిలిటేషన్ విభాగంలో ఉన్న వి.పళనికుమార్ను తమిళనాడు టూరిజం చైర్మన్ గా, ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ బోర్డులో ఉన్న మహ్మద్ నజీముద్దీన్ ను పర్యావరణ, అటవీ శాఖకు బదిలీ చేశారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న వి.అన్బుసెల్వన్ ను చెన్నై జిల్లా కలెక్టర్‌గా, ఈ పదవిలో ఉన్న మహేశ్వరని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. తండయార్ పేట డివిజన్ సబ్ కలెక్టర్‌గా ఉన్న పి.పొన్నయ్యను కాంచీపురం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. తమిళాభివృద్ధి, సమాచార విభాగం కార్యదర్శిగా ఉన్న ఆర్.వెంకటేషన్ ను తమిళనాడు మినరల్స్‌కు, ట్రాన్పన్స్ పోర్టు కమిషనర్‌గా ఉన్న సత్యబ్రత సాహును పరిశ్రమలు, పెట్టుబడుల కార్పొరేషన్ కు చైర్మన్ గా, పర్యాటక శాఖ చైర్మన్ గా ఉన్న హర సహాయ మీనను సాల్ట్ కార్పొరేషన్, కాంచీపురం జిల్లా కలెక్టర్ ఆర్.గజలక్షి్మని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. -
పళని బిజీ
► కేంద్ర మంత్రులతో భేటీలు ► వినతి పత్రాల సమర్పణ ► కొన్నింటికి ఆమోదం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి మంగళవారం ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులపై వినతి పత్రాలను సమర్పించారు. హార్బర్–మధురవాయిల్ ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ విస్తరణ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు మంత్రులు హామీలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు ఆదివారం రాత్రి ఎడపాడి కే పళని స్వామి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులు జయకుమార్, ఉడుమలై కే రాధాకృష్ణన్, సీవీ షణ్ముగం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో కలిసి రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో సీఎం పళనిస్వామి బిజీ అయా్యరు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం మంగళవారం మరింత బిజీ అయ్యారు. ఉదయాన్నే తన మంత్రులతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సహాయ కార్యదర్శి పొన్ రాధాకృష్ణన్ టీ అయా్యరు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల విస్తరణ, కొత్త రోడ్లు, హార్బర్ పనులను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఇందులో చెన్నై హార్బర్–మధురవాయిల్ ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ రోడ్డు విస్తరణ, మధురై అవుటర్ రోడ్డు, రెండు వందల కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి విస్తరణ తదితర పనులు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్, జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు. లక్ష గృహాలు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో సీఎం పళనిస్వామి భేటీ అయా్యరు. చెనై్నలో సాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు నిధుల కేటాయింపులు, కొత్త మార్గాలు, విమ్కో నగర్ వరకు విస్తరణ పనులకు నిధులు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోయంబతూ్తరు, మధురై నగరాలో్లనూ మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు తగ్గ వినతి పత్రాన్ని సమర్పించారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి నిధులు, చెన్నైలో లక్ష గృహాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చెనై్నలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు మరిన్ని కొత్త పథకాల కోసం విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తామని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోనూ పళనిస్వామి భేటీ అయా్యరు. నీట్ పరీక్షలకు తమిళనాడును నినహాయించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి త్వరితగతిన చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
తొలగించాల్సిందే!
► జయ బొమ్మ వివాదం ► దోషి పేరిట పథకాలా? ► స్టాలిన్ ప్రశ్న కోర్టు తీర్పు తో దోషిగా ముద్రపడ్డ దివంగత సీఎం జయలలిత ఫొటోల వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో ఆమె ఫొటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగుతుండడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణించింది. వాటిని తొలగించాల్సిందేనని పట్టుబడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు వినతి పత్రం సమర్పించారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అమ్మ జయలలిత పేరిట పథకాలు కోకొల్లలు. అమ్మ పథకాలకు ప్రజల్లో విశేష స్పందనే ఉంది. అయితే, ప్రస్తుతం ఆ పథకాలకు పేర్ల మార్పు తప్పనిసరి కానుంది. ఇందుకు కారణం అక్రమాస్తుల కేసులో జయలలిత కూడా ఓ దోషి కావడమే. ఆమె భౌతికంగా లేకున్నా, కోర్టు తీర్పు లో జయలలితను కూడా దోషిగా పేర్కొన్నారు. దీంతో దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించేందుకు వీలు లేదు. అలాగే, వారి ఫొటోలు కార్యాలయాల్లో ఉండ కూడదు. అయితే, ఇక్కడ అన్నాడీఎంకే సర్కారు అధికారంలో ఉండడంతో తాము పెట్టిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పథకాలు కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేర్లు పెట్టేందుకు కసరతు్తలు జరుగుతున్నాయి. ఇక, అమ్మ జయంతిని అధికారిక వేడుకగా కూడా నిర్వహించారు. వీటన్నింటినీ తీవ్రంగా పరిగణించి ప్రధాన ప్రతి పక్షం ఇక, అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్ పెట్టేందుకు సిద్ధవైుంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం సచివాలయంకు వచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు అన్భళగన్, శేఖర్‌బాబులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో భేటీ అయా్యరు. ఆమెకు ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో, మంత్రుల ఛాంబర్లలో ఉన్న జయలలిత ఫొటోను తొలగించాల్సిందేనని, పథకాల్లో సైతం మార్పులు తప్పనిసరి అని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, అయితే, ఇంకా ఆమె ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్ట విరుద్దం అని అన్నారు. సీఎం నేతృత్వంలో ఆమె జయంతిని అధికారిక వేడుకగా నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. అమ్మ పేరిట ఉన్న పథకాలను కొనసాగిస్తాం, కొత్త పథకాలకు పేర్లు పెడుతామని పాలకులు వ్యాఖ్యానిస్తుండడం బట్టి చూస్తే, చటా్టలను ఏ మేరకు తుంగలో తొకు్కతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించామని, స్పందించని పక్షంలో కోరు్టలో తేల్చుకుంటామన్నారు. దోషిగా ముద్ర పడ్డ వారి ఫొటోలను ఇంకా తొలగించకుండా ఉండడం చట్ట విరుద్ధం అని తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ మండిపడ్డారు. కోర్టు తీరు్పను ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్న తమిళనాడు ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, పనిగట్టుకుని తమ ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే చేస్తున్న కుట్రల్లో భాగంగానే, ప్రస్తుతం అమ్మ ఫొటోల వివాదాన్ని సృష్టిస్తున్నారని, అన్నాడీఎంకే ఉప ప్రధానకార్యదర్శి టీటీవీ దినకరన్, మంత్రులు తంగమణి, దిండుగల్ శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కన్నమ్మ
తొమ్మిది నెలలు మోసే భారాన్ని... భారం కాకుండా చేసింది .ప్రభుత్వాలలో కూడా మమకారం ఉంటుందని నిరూపించింది the human face of tamilnadu goverment.. తమిళనాడు రాష్ట్రానికి మానవీయ ముఖచిత్రం గిరిజా వైద్యనాథన్. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీర్వచనం మాత్రమే చాలునని... ప్రమోషన్లతో నిమిత్తం లేకుండా తన పని తను చేసుకుపోతోంది. సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు పురుడు పోస్తున్న ఈ ఆఫీసరమ్మ... ప్రతి ఉద్యోగినికీ ఇష్టమైన కన్నమ్మ. స్త్రీ కష్టం స్త్రీకి మాత్రమే తెలుస్తుంది. ‘పురిటినొప్పులు, పుడమి తల్లులు’ అని మగవాళ్లు ఎన్ని కవిత్వాలు రాసినా అవి కాగితం పువ్వులే. అది కాగితం పూల అర్చనే. ఆ అర్చన కూడా గర్భిణులకు అక్కరకు రానిదే! మరి వాళ్లకేం కావాలి? మంచిమాట కావాలి. దాన్నివ్వాలి. చల్లనిచూపు కావాలి. దాన్నివ్వాలి. ధైర్యం కావాలి. దాన్నివ్వాలి. ఒక వెచ్చని స్పర్శ కావాలి. దాన్నివ్వాలి. ఆ తొమ్మిదినెలలు వారిని ‘కంఫర్ట్’గా ఉంచాలి. చుట్టూ కుటుంబ సభ్యులు చేరాలి. చేతిని చేతిలోకి తీసుకుని ‘మేమున్నాం కదా.. నిశ్చింతగా ఉండు’ అని నమ్మకాన్ని ఇవ్వాలి. కుటుంబ సభ్యులే కాదు, కుటుంబ పెద్ద లాంటి ప్రభుత్వం కూడా గర్భిణికి ధీమా ఇవ్వాలి. ‘నువ్వేం ఆలోచించకు, ఈ తొమ్మిది నెలలు నీ గురించి నేనే ఆలోచిస్తాను’ అన్నంతగా... తల్లి కాబోతున్న ఆ తల్లిని ప్రత్యేక సదుపాయాలతో ప్రభుత్వం తన పొత్తిళ్లలోకి తీసుకోవాలి. ఇది సాధ్యమా? ఇళ్లలో ఉన్నట్లే, ప్రభుత్వాలలోనూ కర్తవ్య పాలనంతా దాదాపుగా మగవాళ్లదే అయినప్పుడు.. స్త్రీకి ఇంత లాలన, స్త్రీ చుట్టూ ఇంత సావధాన సంరక్షణ సాధ్యమా? సాధ్యమే! ప్రభుత్వ యంత్రాంగంలో గిరిజా వైద్యనాథన్ వంటి సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారులు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. అలా సాధ్యమైనదే... గర్భిణులకు తొమ్మిది నెలల సెలవు హక్కు! సెలవులో ఉంటూనే ఆ తొమ్మిది నెలలూ జీతం పొందే హక్కు. అమ్మ.. జయమ్మ.. గిరిజమ్మ ‘‘తొమ్మిది నెలలు తల్లి బిడ్డను మోస్తుంది. ఆ తొమ్మిది నెలలూ మనం తల్లిని మోయాలి’’. గిరిజా వైద్యనా£ý న్ ఈ మాట అన్నప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఆమె వైపు అబ్బురంగా చూశారు. మంచి ఆలోచన! 2011లో జయలలిత మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, స్త్రీల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని యోచిస్తున్నప్పుడు గిరిజ ఈ ఐడియా ఇచ్చారు. అప్పుడామె ఆరోగ్యశాఖలో కీలకమైన నిర్ణయాధికారి. చెన్నై ఐ.ఐ.టి. నుంచి హెల్త్ ఎకనమిక్స్‌లో íపీహెచ్డీ చేసిన గిరిజకు.. గర్భిణి ఆరోగ్యానికి, ఆమె ఆర్థిక అవసరాలకు మధ్య ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో బాగా తెలుసు. జయకు గిరిజ ఆలోచన నచ్చింది. అప్పటి వరకు గర్భిణులకు ఉన్న 3 నెలల మెటర్నిటీ లీవును 6 నెలలకు పెంచుతూ తక్షణం ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి ఈ ఏడాది సెప్టెంబర్‌లో జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరే ముందు ఆ 6 నెలల మెటర్నిటీ లీవును 9 నెలలకు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 8 నుంచి అక్కడ ఈ జీవో అమలు అవుతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా క్రమంగా మూడు నుంచి ఆరుకు, ఆరు నుంచి తొమ్మిదికి షిఫ్ట్ అవడం వెనుక ఉన్నది తమిళనాడు అయితే, తమిళనాడు వెనుక ఉన్నది జయ, జయ వెనుక ఉన్నది గిరిజా వైద్యనాథన్! దేశాన్ని ఇప్పుడు మోదీ స్పీడుగా నడిపిస్తుండవచ్చు. కానీ ఉద్యోగినులైన గర్భిణీ స్త్రీలను పదిలంగా చెయ్యిపట్టి నడిపిస్తున్నది మాత్రం.. గిరిజా వైద్యనాథన్. సీనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. అందమైన ఓ పూల ముగ్గు! చెన్నై నుంచి 235 కి.మీ. దూరంలో ఉంటుంది సర్కళి. అక్కడికి సమీపంలో ఉన్న వైదీశ్వరన్ ఆలయ దర్శనానికి వెళుతున్నప్పుడు.. గిరిజను తమిళనాడు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని చేసిందన్న న్యూస్ బ్రేక్ అయింది. విషయం తెలిసేటప్పటికే గిరిజ వైదీశ్వరన్ ఆలయంలోని శివుని సన్నిధిలో ఉన్నారు. ఆ పదోన్నతి ఆదేశాలు ఆలయ ప్రాంగణంలో ఆమె కోసం కాసేపు వేచి ఉండవలసి వచ్చింది. విశేషం ఏమిటంటే.. కెరియర్లోని ప్రతి ఉన్నతీ అలా ఆమె కోసం ఎదురు చూసిందే! మరో మూడేళ్లలో రిటైర్ కాబోతున్న గిరిజ గత 34 ఏళ్లలో దాదాపు 12 శాఖల్లో పనిచేశారు. మాతా, శిశు సంక్షేమం; విద్య, ఆరోగ్యం, పౌర సరఫరాలు, సాధారణ పరిపాలన, పరిశ్రమలు, ఫైనాన్స్; అడవులు, పర్యావరణం; ప్రణాళికలు, పథకాల అమలు; పవర్, పట్టాణాభివృద్ధి, భూములు, పాలనా సంస్కరణలు! ఎక్కడా తొట్రు పడలేదు. ఎక్కడా రాజీ పడలేదు. ఎక్కడా మాట పడలేదు. మీడియాలోనూ కనిపించలేదు. పనిని తప్ప గుర్తింపును, ప్రమోషన్లను పట్టించుకోని గిరిజ.. ఇప్పుడీ ప్రమోషన్ కూడా మరో కొత్త పనిలా భావిస్తున్నారు తప్ప, మహా ప్రసాదంగా భావించడం లేదు. ఇన్నేళ్లుగా గిరిజ పని మాత్రమే అప్డేట్ అయింది. ఇతరత్రా వివరాలు ఎక్కడా అప్డేట్ కాలేదు. ఆఖరికి ఆమె ఫేస్బుక్ అకౌంట్లో కూడా. ఆమె వాల్‌పేపర్‌లో అందమైన ఓ పూలముగ్గు మాత్రం కనిపిస్తుంది... ఎప్పటికీ వాడిపోని ఆమె చిరునవ్వులా! అప్రైట్.. క్లీన్.. బ్రిలియంట్ గిరిజా వైద్యనాథన్‌కి ఇవి తల్లిదండ్రులు పెట్టని పేర్లు. కెరియర్లో తన ఈడువారు, తన కిందివారు, తన పైఅధికారులు గిరిజకు పెట్టిన పేర్లు! తనకు ఇలాంటి పేర్లు ఉన్నట్లు కూడా గిరిజకు తెలీదు! ఎవరూ పేరు పెట్టకుండా, ఎవరూ వేలెత్తి చూపకుండా తన పని తను చేసుకుపోవడం ఒక్కటే ఆమెకు తెలుసు. అయితే డిసెంబరు 22న కొన్ని వేళ్లు ఆమె వైపు తిరిగాయి! తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్రావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాలలో 30 లక్షల విలువైన కొత్త కరెన్సీ, 5 కిలోల బంగారం బయటపడడంతో వెంటనే ఆయన స్థానంలో ఆ ప్రభుత్వానికి ఒక కొత్త కార్యదర్శి అవసరం ఏర్పడింది. ఇదిగో అప్పుడే అందరి వేళ్లూ గిరిజా వైద్యనాథన్ వైపు తిరిగాయి. షి ఈజ్ ద రైట్ పర్సన్ అని. పనే తన పదవి, పనే తన పదోన్నతి! నిజానికి రెండేళ్ల క్రితమే గిరిజ ఈ పోస్టులోకి రావలసింది! కనీసం ఆరు నెలల క్రితమైనా ఆమె ప్రధాన కార్యదర్శి కావలసింది. కానీ ఈ రెండు సందర్భాలలోనూ ఆమె కన్నా జూనియర్లు ‘ఆమె పోస్టు’లోకి వచ్చేశారు. వాటి వెనుక ఉన్న రాజకీయ కారణాలను, ఒత్తిళ్లను గిరిజ పట్టించుకోలేదు. వాస్తవానికి ఇప్పుడు కూడా ఆమెను పక్కన పెట్టి రామ్మోహన్రావు స్థానంలో ఆమె కన్నా నాలుగేళ్లు జూనియర్ అయిన ప్రస్తుత ఆర్థిక కార్యదర్శి కె.షణ్ముగంను తెచ్చే పెట్టే ప్రయత్నాలు జరిగాయి. అక్రమం జరిగిందని రావును తొలగించినప్పుడు, ఆ స్థానానికి జరిగే ఎంపికలో అక్రమం ఉండకూడదన్న నైతిక స్పృహ ఎవరికి కలిగిందో కానీ, గిరిజకు న్యాయం జరిగింది. అయితే అన్యాయం జరిగినప్పుడు తనకు అన్యాయం జరిగిందని ఆమె ఎలాగైతే చెప్పుకోలేదో, న్యాయం జరిగిందని కూడా ఇప్పుడు చెప్పుకోవడం లేదు. ఎప్పటిలా... ముందున్న పని మీదే ఆమె తన దృష్టిని కేంద్రీకరించారు. చెన్నైలోని మా సాక్షి ప్రతినిధి చెబుతున్న దానిని బట్టి .. ఆమె వెంటనే పనిలో పడిపోయారు!గిరిజా వైద్యనాథన్‌కు ముందు ముగ్గురు మహిళలు.. లక్ష్మీ ప్రాణేశ్ (2002–2005), ఎస్.మాలతి (2010–2011), షీలా బాలకృష్ణన్ (2013–2014) తమిళనాడు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఆ వరుసలో గిరిజ నాల్గవ మహిళా ప్రధాన కార్యదర్శి. గిరిజ ఎంతగా ‘లో–ప్రొఫైల్’లో ఉంటారంటే.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం గం. 9.20 కు సచివాలయంలోని తన కార్యాలయానికి చేరుకున్న ఈ ప్రధాన కార్యదర్శి.. మీడియా దృష్టిని తప్పించుకోడానికి దాదాపు 40 నిమిషాలు వేచి ఉండి, ఆ తర్వాత మాత్రమే తన కేబిన్‌లోకి వెళ్లారు. మహిళల్లో నెం.1 లక్ష మందిలో నెం.9 మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ్ట. డిగ్రీలో గిరిజ సబ్జెక్టులు. చెన్నైలోని ఖయెదె మిల్లత్ ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివారు. తమిళ్, హిందీ, ఇంగ్లిష్... ఈ మూడు భాషల్లో గిరిజ ఎక్స్పర్ట్. ఇంచుమించు ఒక భాషా పండితురాలు. 1981లో సివిల్స్‌లో ఆమె సాధించిన ర్యాంకు.. మహిళల్లో నెం.1. మొత్తం లక్ష మంది అభ్యర్థులలో 9వ ర్యాంక్. 1983లో తిరువళ్లూరు కలెక్టర్‌గా గిరిజ కెరీర్ మొదలైంది. 1991లో మధురై కలెక్టర్‌గా బదిలీ అయింది. తర్వాత తమిళనాడులోని రెండు ప్రభుత్వాల (డి.ఎం.కే., అన్నాడీఎంకే) హయాంలోనూ ఆర్థికశాఖలో ఉన్నతాధికారిగా పని చేశారు గిరిజ. ఐ.ఏ.ఎస్. అధికారిగా తీరిక లేని విధుల్లో ఉంటూనే 2011లో ఆమె చెన్నై ఐ.ఐ.టి. నుంచి హెల్త్ ఎకనమిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. తమిళనాడు మాతాశిశు సంక్షేమ పథకాల వ్యూహరచనలో గిరిజకు ఆ íపీహెచ్డీ ఎంతగానో తోడ్పడింది. ఒక్క రిమార్కు కూడా లేదు ఐఏఎస్ పూర్తి చేసిన నాటి నుండి నేటి వరకు ఒక్కటంటే ఒక్క వివాదాన్ని కూడా ఆమె ఎరుగరు. రూల్స్, రెగ్యులేషన్స్‌ను కాదని ప్రభుత్వంలో ఏపనీ చేయరు. ఈ క్వాలిఫికేషన్స్ వల్లనే ఎవరి సిఫార్సు లేకుండా ఆమె సీఎస్ అయ్యారు. ఇలాంటి నిజాయితీ పరురాలైన వ్యక్తి ప్రభుత్వ కార్యదర్శి కావడం మా కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికే గర్వకారణం. – ఎస్వీశేఖర్, ప్రముఖ తమిళ సినీ, స్టేజీ హాస్యనటుడు, రాజా వైద్యనాథన్ అన్న గిరిజా వైద్యనాథన్ (57) తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి జన్మస్థలం : నాగర్ కోయిల్ (దక్షిణ తమిళనాడు) కుటుంబం : అయ్యంగార్లు తల్లి : జలజా వెంకిటరమణన్ (గృహిణి) తండ్రి : ఎస్.వెంకిటరమణన్ (1990–92లో రిజర్వుబ్యాంకు గవర్నర్) భర్త : రాజా వైద్యనాథన్ ఆశీర్వాద్ మైక్రోఫైనాన్స్ సీఎండీ (సొంత కంపెనీ) కుమారుడు : సంజీవ్ వైద్యనా«థన్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కుమార్తె : డాక్టర్ అంజనా ఆనంద్. ఎండీ మాధవ్ శింగరాజు ఇన్పుట్స్: సాక్షి చెన్నై ప్రతినిధి కొట్రా నందగోపాల్ -
సీఎస్‌గా పగ్గాలు!
► గిరిజా వైద్యనాథన్ బాధ్యతల స్వీకరణ ► తొలి రోజే బిజీబిజీ ► తంగంకు రూ. 2 కోట్లు ► చెన్నై ఓపెన్ కు మరో రూ. రెండు కోట్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణతో శుక్రవారం తన విధుల్లో బిజీ అయ్యారు. సీఎం పన్నీరుసెల్వంతో కలసి సమీక్షల్లో, సచివాలయంలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా రియో పారాలింపిక్ హీరో తంగవేల్‌కు, చెన్నై ఓపెన్ కు ప్రభుత్వ వాటా గా తలా రూ.రెండు కోట్లు చొప్పున చెక్కులను అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా సచివాలయంకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు మచ్చ చేకూర్చే రీతిలో ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు అవినీతి బండారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఉద్వాసన పలికి ప్రధాన కార్యదర్శి స్థానాన్ని మహిళా అధికారి గిరిజా వైద్యనాథన్ ద్వారా భర్తీ చేస్తూ సీఎం పన్నీరుసెల్వం ప్రభుత్వం నిర్ణయించింది. 1981వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్ 1983లో తిరువళ్లూరు సబ్‌కలెక్టర్‌గా, 1992లో మధురై కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో అడుగు పెట్టి, ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో 45వ ప్రధాన కార్యదర్శిగా, మహిళా శక్తుల్లో నాలుగో అధికారిగా పగ్గాలు చేపట్టేందుకు శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన గిరిజా వైద్యనాథన్ కు సహచర అధికారులు సాదర స్వాగతం పలికారు. తన చాంబర్లో కొత్త సీఎస్‌గా పగ్గాలు చేపట్టినానంతరం సీఎం పన్నీరుసెల్వంను మర్యాద పూర్వకంగా గిరిజా వైద్యనాథన్ కలిశారు. ఈసందర్భంగా పలువురు ఐఏఎస్‌లు, సచివాలయం వర్గాలు, కార్యదర్శులు కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలను అందజేశారు. పగ్గాలు చేపట్టగానే, సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి ఉంటూ, పలు కార్యక్రమాల్లో గిరిజా వైద్యనాథన్ తొలి రోజే తన పదవికి న్యాయం చేకూర్చే విధంగా బిజీ అయ్యారు. తంగంకు రూ.2 కోట్లు : రియోలో జరిగిన పారాలింపిక్లో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు బంగారు పతకం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన తంగంను సత్కరించే విధంగా, ప్రోత్సహించే రీతిలో అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు నగదు బహుమతిని ప్రకటించారు. రియో నుంచి చెన్నైకు తంగం వచ్చే సమయానికి అమ్మ జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, తదనంతర పరిణామాలతో ఆ నగదు బహుమతి వ్యవహారం తెర మరుగున పడిందని చెప్పవచ్చు. అయితే, అమ్మ జయలలిత చేసిన ప్రకటన మేరకు తంగంకు రూ. రెండు కోట్లు బహుమతిని అందించేందుకు సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. కొత్త సీఎస్ పగ్గాలు చేపట్టిన రోజే, తంగంకు ఆ బహుమతిని సచివాలయంలో అందజేశారు. తన కోచ్ సత్యనారాయణన్ తో కలిసి సచివాలయానికి వచ్చిన మారియప్పన్ తంగ వేలు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరు సెల్వం చేతుల మీదుగా అందుకున్నారు. చెన్నై ఓపెన్ కు రూ. రెండు కోట్లు : ప్రతి ఏటా చెన్నైలో టెన్నిస్ పోటీలు సాగుతున్న విషయం తెలిసిందే. చెన్నై ఓపెన్ పేరుతో సాగుతున్న ఈ పోటీలకు అమ్మ జయలలిత తొలి నాళ్లలో రూ. కోటి నగదు కేటాయించారు. తదుపరి రూ. రెండు కోట్ల మేరకు నగదును అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది పోటీలకు రూ. రెండు కోట్లకుగాను చెక్కును సీఎం పన్నీరుసెల్వం అందించేందుకు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో చెన్నై ఓపెన్ అధ్యక్షుడు అళగప్పన్ ఆ చెక్కును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో కొత్త సీఎస్ గిరిజా వైద్యనాథన్ పాల్గొన్నారు. తదుపరి రాష్ట్రంలో పెట్టుబడులు లక్ష్యంగా ముందుకు వచ్చిన జపాన్ కు చెందిన ప్రతినిధుల బృందంతో జరిగిన సమీక్షలో సీఎం పన్నీరుసెల్వం, ఇతర మంత్రుల బృందంతో కలిసి కొత్త సీఎస్ బిజీ అయ్యారు. -
కొత్త సీఎస్ వచ్చేశారు
-
కొత్త సీఎస్ వచ్చేశారు
తమిళనాడు ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావు ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగి, ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత గిరిజా వైద్యనాథన్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు రామ్మోహనరావు, ఆయన కుమారుడు వివేక్ రావు, మరికొందరి ఇళ్ల నుంచి మొత్తం రూ. 30 లక్షల కొత్త 2వేల నోట్లు, 5 కిలోల బంగారం, మరో 5 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు రామ్మోహనరావు విజిలెన్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలతో పాటు పాలనా సంస్కరణల కమిషనర్‌గా కూడా వ్యవహరించేవారు. ఆయన స్థానంలో 1981 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. -
తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
-
తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ నియమితులయ్యారు. తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ముఖ్య అధికారుల సమావేశానంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శివదాస్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు కేడర్(1981 బ్యాచ్)కు చెందిన గిరిజా వైద్యనాథన్ చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఐఐటీలో పట్టభద్రురాలైన ఆమె.. ‘సంక్షేమం –ఆర్థిక ప్రగతి’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆరోగ్య శాఖలో ఎక్కువ కాలం పని చేశారు. మాతా, శిశు సంక్షేమ పథకం అమల్లో ఆమె సేవలు ప్రశంసనీయం. అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమెను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. -
మహిళకేపట్టం!
► సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్ ► రామ్మోహన్ రావుకు ఉద్వాసన ► సస్పెండ్... వీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహిళా ఐఏఎస్ అధికారికి పట్టం కట్టారు.రెండేళ్ల అనంతరం ఓ మహిళా అధికారి ఆ పదవిని దక్కించుకున్నారు. గిరిజా వైద్యనాథన్ ను ఆ పదవికి ఎంపిక కావడంతో సహచర ఐఏఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐటీ ఉచ్చుకు చిక్కిన రామ్మోహన్ రావుకు ఉద్వాసన పలికారు. ఆయన్ను సస్పెండ్ చేసి వీఆర్‌కు పంపించారు. సాక్షి, చెన్నై :2016లో తమిళనాడులో రాజకీయంగా అన్నీ సంచలనాలే. జయలలిత రాష్ట్ర చరిత్రను తిరగరాస్తూ రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టారు. అలాగే, ప్రప్రథమంగా బలమైన ప్రతి పక్షంగా డీఎంకే అవతరించింది. సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ వచ్చిన అమ్మ జయలలిత అందని దూరాలకు చేరడం పెను విషాదమే. ఆ అమ్మ లేని లోటును తీర్చేందుకు తగ్గట్టుగా అన్నాడీఎంకేలో విశ్వ ప్రయత్నాలే సాగుతున్నాయి. అమ్మ విధేయుడు, నమ్మిన బంటు పన్నీరు సెల్వం మళ్లీ సీఎం అయ్యారు. ఇక, వర్దా రూపంలో తుపాన్ తాండవం మరువక ముందే, తమిళనాడు చరిత్రలో బుధవారం మరో సంచలనం చోటు చేసుకుంది. రాష్ట్ర చరిత్రలో ప్రధాన కార్యదర్శి హోదా అధికారి రామమోహన్ రావు ప్రపథమంగా ఐటీ ఉచ్చులో పడ్డారు. నల్లధనాన్ని దాచి పెట్టిన అపఖ్యాతిని మూట గట్టుకోవడమే కాకుండా, ఆయన రూపంలో సచివాలయంకు మాయని మచ్చ పడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్లో సైతం ఐటీ సోదాలు సాగిన రోజు. పాలకుల అవినీతిలో భాగస్తుడిగా అవతరించిన ఈ అధికారి రూపంలో నిజాయితీతో ముందుకు సాగే ఐఎఎస్‌లు సైతం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఐటీ ఉచ్చులో బిగుసుకున్న రామమోహన్ రావు చర్యలపై రాజకీయపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో సీఎం పన్నీరు సెల్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టున్నారు. మహిళకే పట్టం : దివంగత సీఎం, అమ్మ జయలలిత 2011లో అధికార పగ్గాలు చేపట్టగానే, మహిళకు పట్టం కట్టే రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పగ్గాలను షీలా బాలకృష్ణన్ కు అప్పగించారు. డిఎంకే హయంలో ఓ మహిళా అధికారి సీఎస్‌గా పనిచేసినా, ప్రభుత్వ, సీఎంతో సన్నిహితంగా మెలిగిన ప్రధాన కార్యదర్శి మాత్రం షీలా బాలకృష్ణన్ మాత్రమే. అందుకే నేటికి ఆమె సేవలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తూ,పన్నీరు సెల్వం ప్రభుత్వానికి ప్రస్తుతం అండగా ఉన్నారని చెప్పవచ్చు. షీలా తదుపరి మోహన్ వర్గీస్, జ్ఞాన దేశిక¯ŒSలు సీఎస్‌లుగా పనిచేశారు. తాజాగా సీఎస్ పదవిలో ఉన్న రామ్మోహన రావు రూపంలో పడ్డ మచ్చను తొలగించుకునేందుకు పన్నీరు సెల్వం చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు తీవ్ర కసరత్తులు చేశారని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ బ్యాచ్‌కు చెందిన శక్తి కాంత్ దాస్ ముందు వరుసలో ఉన్నా, ఆయన కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండడం, మరికొన్ని నెలల్లో పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టారు. తదుపరి స్థానంలో గిరిజా వైద్యనాథన్ , అశోక్ కుమార్ గుప్తా, రాజీవ్ నయన్ పేర్లు పరిశీలనకు వచ్చినా, చివరకు మహిళకే పన్నీరు ప్రభుత్వం పట్టం కట్టడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ ను నియమించడంతో సహచర ఐఏఎస్‌లకు ఆనందమే. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె అందర్నీ కలుపుకొనే వెళ్లే తత్వం కల్గిన అధికారిగా ముద్ర వేసుకుని ఉన్నారు. 1981 బ్యాచ్‌కు చెందిన గిరిజా వైద్యనాథన్ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో తన సేవల్ని అందించారు. అత్యధికంగా కొన్ని సంవత్సరాల పాటు వైద్య శాఖకు సేవల్ని అందించిన ఘనత ఆమెకే దక్కుతుంది. గిరిజా వైద్యనాథన్‌కు ఇంకా రెండున్నరేళ్ల సర్వీసు ఉంది. రెండేళ్ల అనంతరం మళ్లీ మహిళా అధికారి సీఎస్ పగ్గాలు చేపట్టనుండడంతో పరిపాలన పరంగా దూసుకెళ్లేందుకు తగ్గ అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే, సీఎం పన్నీరు ప్రభుత్వానికి ఓ వైపు సలహాదారుగా షీలా బాలకృష్ణన్, మరో వైపు గిరిజా వైద్యనాథన్ ల రూపంలో మహిళా శక్తి అండగా ఉండడమే..! -
సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
-
సీఎస్‌కు ఉద్వాసన.. కొత్త అధికారి నియామకం
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావును ఆ పదవి నుంచి తొలగించారు. కొత్త ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిగిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. రాష్ట్రప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అందులోనే సీఎస్‌ను తప్పించాలని గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్.