తమిళనాడు సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్
చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్ నియమితులయ్యారు. తమిళనాడు ప్రభుత్వ సీఎస్‌గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ముఖ్య అధికారుల సమావేశానంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను సీఎస్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శివదాస్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తమిళనాడు కేడర్(1981 బ్యాచ్)కు చెందిన గిరిజా వైద్యనాథన్ చెన్నైలోనే పుట్టి పెరిగారు. ఐఐటీలో పట్టభద్రురాలైన ఆమె.. ‘సంక్షేమం –ఆర్థిక ప్రగతి’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆరోగ్య శాఖలో ఎక్కువ కాలం పని చేశారు. మాతా, శిశు సంక్షేమ పథకం అమల్లో ఆమె సేవలు ప్రశంసనీయం. అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో ల్యాండ్ అడ్మిని స్ట్రేషన్ కమిషనర్‌గా ఉన్న ఆమెను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.