
పళని మార్క్
► భారీగా బదిలీలు
► సీఎస్ ఆదేశాలు
సాక్షి, చెన్నై : పాలన మీద పట్టు సాధించే పనిలో ఉన్న సీఎం ఎడపాడి కే పళనిస్వామి అధికారుల బదిలీలను వేగవంతం చేశారు. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శితో పాటుగా పలువురు అధికారుల్ని రెండు రోజుల క్రితం బదిలీ చేశారు. దీంతో పోలీసు విభాగంలో డీజీపీ మొదలు భారీగా బదిలీలు ఉండొచ్చని సంకేతాలు వెలువడ్డాయి.
ఇందుకు అద్దం పట్టే రీతిలో కసరత్తులు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో సోమవారం సీనియర్ ఐఏఎస్‌లతో పాటుగా మరి కొందరికి స్థాన చలనం కల్పించడం సచివాలయంలో చర్చకు దారి తీసింది. పళని మార్క్ పాలనలో భాగంగా భారీగా ఐఎఎస్‌ల బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆదేశాలు జారీ చేశారు.
బదిలీలు
పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగం డైరెక్టర్‌గా ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సునిల్ పల్లివ్వాల్‌ను బదిలీ చేస్తూ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న సి.కామరాజ్‌ను సునిల్ పాడి ఉత్పత్తులు, డెయిరీ విభాగానికి బదిలీ చేశారు. తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న టి.ఉదయచంద్రన్ ను పాఠశాల విద్యా శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న సబితను తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు.
తమిళనాడు మినరల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎం.వల్లలార్‌ను మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, ఈ పదవిలో ఉన్న దయానంద్ కటారియను ట్రాన్స్ పోర్టు కమిషనర్‌గా, పరిశ్రమల విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న విక్రమ్ కపూర్‌ను ఎనర్జీ విభాగానికి, పర్యావరణ, అటవీ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతుల్య మిశ్రాను పరిశ్రమల శాఖకు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హోదాలో పబ్లిక్, రిహాబిలిటేషన్ విభాగంలో ఉన్న వి.పళనికుమార్‌ను తమిళనాడు టూరిజం చైర్మన్ గా, ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ బోర్డులో ఉన్న మహ్మద్ నజీముద్దీన్ ను పర్యావరణ, అటవీ శాఖకు బదిలీ చేశారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న వి.అన్బుసెల్వన్ ను చెన్నై జిల్లా కలెక్టర్‌గా, ఈ పదవిలో ఉన్న మహేశ్వరని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్‌గా నియమించారు. తండయార్ పేట డివిజన్ సబ్ కలెక్టర్‌గా ఉన్న పి.పొన్నయ్యను కాంచీపురం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. తమిళాభివృద్ధి, సమాచార విభాగం కార్యదర్శిగా ఉన్న ఆర్.వెంకటేషన్ ను తమిళనాడు మినరల్స్‌కు, ట్రాన్పన్స్ పోర్టు కమిషనర్‌గా ఉన్న సత్యబ్రత సాహును పరిశ్రమలు, పెట్టుబడుల కార్పొరేషన్ కు చైర్మన్ గా, పర్యాటక శాఖ చైర్మన్ గా ఉన్న హర సహాయ మీనను సాల్ట్ కార్పొరేషన్, కాంచీపురం జిల్లా కలెక్టర్ ఆర్.గజలక్షి్మని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేశారు.