palani swamy
-
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ కొత్త ప్లాన్.. అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. Chennai | Former Tamil Nadu CM O Panneerselvam said, "The BJP leadership has been in regular touch with me (in recent times)... Will the AIADMK accept if the BJP asks for replacing (AIADMK general secretary) Palaniswami? Will they replace him? Then how can they ask to change BJP… pic.twitter.com/7xCrBCzHbZ — ANI (@ANI) September 29, 2023 పళణిస్వామిపై సెటైర్లు.. ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీకరిస్తుందా అని ఎదరు ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని విమర్శలు చేశారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని సీరియస్ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏకం అయ్యేందుకే ఆశ పడుతున్నా.. అని పరోక్షంగా పళణి స్వామి శిబిరాన్ని ఉద్దేశించి పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడం చర్చకు దారితీసింది. వివరాలు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాల మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చున్నా, ఒకరి ముఖాలు, మరొకరు చూసుకోవడం లేదు. పలకరించుకోవడం కూడా లేదు. ఈ నేపథ్యంలో మంళవారం మీడియా ప్రతినిధి ఓ ప్రశ్న సంధించగా, ఏకం అయ్యేందుకే తన ప్రయత్నమంటూ పరోక్షంగా పళణితో చేతులు కలిపేందుకు తాను రెడీ అనే సంకేతాన్ని ఇచ్చారు. అయితే ఇప్పటికే పళణి శిబిరం పన్నీరుకు ఇక పార్టీలో చోటు లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
తమిళనాడులో ట్విస్ట్.. పొల్లాచ్చి కేసులో పళనిస్వామికి షాక్!
సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతులు, మహిళలపై జరిగిన లైంగికదాడి వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ కేసులో బాధితుల పేర్లను వెల్లడించిన పోలీసు అధికారి పాండియరాజన్, ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పళని స్వామి, మాజీ సీఎస్‌ను విచారించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రానుంది. వివరాల ప్రకారం.. 2019లో కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కేంద్రంగా కొందరు యువకులు ఫామ్ హౌస్‌లోకి యువతలు, మహిళలను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించి వేధించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 9 మందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే బడాబాబులు, రాజకీయ ప్రముఖుల పిల్లలను ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే విధంగా హైకోర్టులో చెన్నైకు చెందిన బాలచంద్రన్ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో నిందితులను వెనకేసుకు యత్నించిన పోలీసు అధికారి పాండియరాజన్‌ను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఎం, సీఎస్‌లను కూడా ఈ కేసులో విచారించాలని, ఇందుకు సంబంధించిన ఉత్వరులు ఇవ్వాలని కోర్టుకు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. -
అన్నాడీఎంకే మరో ట్విస్ట్.. పన్నీరు సెల్వం ప్లాన్ ఫలించేనా?
సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతు కోసం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ పంపిన దరఖాస్తును ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులో ఏక పక్షంలో అభ్యర్థి పేరును సూచించారని, తమ మద్దతుదారు పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం నాటికి 46 మంది నామినేషన్లు వేశారు.ఇందులో కాంగ్రెస్, డీఎండీకే, నామ్ తమిళర్ కట్చి, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే అన్నాడీఎంకేలో విబేధాల నేపథ్యంలో ఆ పార్టీలోని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం శిబిరాలకు చెందిన అభ్యర్థులు ఇంత వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. మంగళవారంతో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్వ సభ్య సమావేశం సభ్యుల మద్దతు సేకరణకు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ శనివారం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రిలోపు ఈ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సర్వసభ్య సమావేశం సభ్యులకు సమాచారం పంపించారు. మెజారిటీ మద్దతు అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ను సోమవారం కలిసేందుకు తమిళ్ మగన్ హుస్సేన్ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆ దరఖాస్తుకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం శిబిరం ఆదివారం గళం విప్పింది. తీవ్ర వ్యతిరేకత.. దరఖాస్తును ఏక పక్షంగా సిద్ధం చేశారని పన్నీరు శిబిరం నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆ దరఖాస్తులో పళణిస్వామి ప్రకటించిన అభ్యర్థి తెన్నరసు పేరును మాత్రం సూచించారని, తమ అభ్యర్థి పేరును నమోదు చేయలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళ్ మగన్ హుస్సేన్ వ్యవహరిస్తున్నారని, ఈ దరఖాస్తును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన చోట ఫిర్యాదు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని సర్వసభ్య సభ్యుల్లో పళనిస్వామి శిబిరానికి 2,662 మంది మద్దతు ఉంది. అలాగే ముగ్గురు ఎంపీలు, 61 మంది ఎమ్మెల్యేలు, 70 మంది జిల్లాల కార్యదర్శుల మద్దతు కూడా ఆయన ప్రకటించిన అభ్యర్థి తెన్నరసుకే ఉండటం గమనార్హం. ఇక, పన్నీరు సెల్వం శిబిరానికి 148 మంది సర్వసభ్య సభ్యులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు , ఐదుగురు జిల్లాల కార్యదర్శుల మద్దతు మాత్రమే ఉండడం గమనార్హం. మద్దతు తక్కువగా ఉన్నా, రెండాకుల వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చే విధంగా దరఖాస్తును అస్త్రంగా చేసుకుని ఫిర్యాదు చేయడానికి పన్నీరు శిబిరం సిద్ధం అవుతోండడం అన్నాడీఎంకేలో ఆసక్తి రేపుతోంది. -
అన్నాడీఎంకే శిబిరాల్లో కొత్త టెన్షన్ .. ప్రధాని మోదీతో కీలక భేటీ!
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో నెలకొంది. బంతిని తమ వద్ద నుంచి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో హడావుడి పెరిగింది. కాంగ్రెస్ డీఎండీకే అభ్యర్థి ఆనందన్ ఇప్పటికే నామినేషన్ వేశారు. గురువారం నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనకా నవనీతన్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్, కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమాయ్యరు. అలాగే అన్నాడీఎంకేలో పళణిస్వామి, పన్నీరు సెల్వం శిబిరాల మధ్య వార్ ఆ పార్టీ కేడర్‌ను నిరుత్సాహంలోకి నెట్టింది. పళని శిబిరం అభ్యర్థిగా తెన్నరసు, పన్నీరు శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ పేరు ఖరారు చేసినా రెండాకుల చిహ్నం ఎవరికి చిక్కేనో అన్న ఉత్కంఠతో రోజురోజుకూ తీవ్రమవుతోంది. శివకుమార్ కోర్టులోకి బంతి.. రెండాకుల గుర్తు తమకే అప్పగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఇప్పటికే పళనిస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం గురువారం అప్పీలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఈ సమయంలో తమ కోర్టులో ఉన్న బంతిని ఈరోడ్ ఎన్నికల అధికారి శివకుమార్ కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టుకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన నివేదికలో ఆ గుర్తు కోసం తమను ఎవరు సంప్రదించలేదని పేర్కొనడం గమనార్హం. అలాగే చిహ్నం కేటాయింపుల వ్యవహారంలో తుది నిర్ణయం ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి చేతిలోనే ఉందని ఆ నివేదికలో పొందు పరిచి ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరించనున్నదో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. దీంతో ఆ రెండు శిబిరాల అభ్యర్థులు రెండాకుల కోసం ఎదురు చూస్తూ నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. 7వ తేదీ వరకు సమయం ఉండడంతో ఇరు వర్గాలు ధీమాగా ఉన్నాయి. అదే సమయంలో పళని శిబిరం నేత తంబిదురై గురువారం ప్రధాని నరేంద్రమోదీని కలిసినట్టు సమాచారం వెలువడడం గమనార్హం. పోస్టర్ టెన్షన్.. పళని స్వామి శిబిరం బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత వరకు ఆ పార్టీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేయకపోవడంతో ఆయన మద్దతుదారులు కేంద్రంపై కన్నెర్ర చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) కూటమిలో ముర్పొక్కు( ముందుస్తు ప్రణాళిక) అన్న పదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటాన్ని కూడా ఆ కూటమి పేరులో తొలగించారు. నేషనల్ డెమోక్రటిక్ ముర్పొక్కు అలయన్స్ (ఎన్డీఎంఏ) అన్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం బీజేపీ వర్గాలను షాక్‌కు గురి చేశాయి. ఈ సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగమేఘాలపై ముర్పొక్కు అన్న పదాన్ని తొలగించడం గమనార్హం. ఈ విషయంగా అన్నాడీఎంకే నేత జయకుమార్‌ను ప్రశ్నించగా, ఈరోడ్‌లో ఏర్పాటు చేసినట్లుందని దాట వేశారు. అయితే, ఈరోడ్ నియోజకవర్గంలో ఒక్కో బూత్‌కు 5 నుంచి 10 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 30 వేల మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించి, నకిలీ ఓటర్ల భరతం పట్టాలని ఎస్ఈసీ సత్యబ్రత సాహూకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. -
తమిళనాట అన్నాడీఎంకే పాలి‘ట్రిక్స్’.. ఇరకాటంలో బీజేపీ!
గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ముక్కలు చెక్కలైన అన్నాడీఎంకేలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే పారీ్టపై పట్టు కోసం నానా పాట్లు పడుతున్న పళని స్వామి, పన్నీరు సెల్వం ఈరోడ్ ఉప ఎన్నికల బరిలో తమ అనుచరులను నిలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం తమ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ధర్మానికి కట్టుబడి బీజేపీ ఏ వర్గానికి మద్దతు ఇస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి పయనమయ్యారు. సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర తర్జనభర్జల మధ్య అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి శిబిరం నుంచి మాజీ ఎమ్మెల్యే తెన్నరసు పోటీకి దిగారు. ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ రంగంలోకి వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు మద్దతుగా డీఎంకే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక డీఎండీకే అభ్యర్థి ఆనందన్, అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రెండు రోజులు 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులే బరిలో దిగారు. బీజేపీ బరిలో దిగితే.. ఉదయాన్నే పళని తమ అభ్యర్థిని.. ప్రకటించారో లేదో.. సాయంత్రానికి పన్నీరు సెల్వం సైతం తమ వర్గం నేత పేరును వెల్లడించారు. సెంథిల్‌కుమార్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి పన్నీరు సెల్వం మరోసారి ఆహా్వనం పలికారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో, తమ వర్గం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం. హస్తినకు అన్నామలై.. సంకీర్ణ ధర్మంలో భాగంగా అన్నాడీఎంకేకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సహకారం అందించేది పన్నీరు శిబిరానికా, పళని శిబిరానికా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత రెండు రోజులుగా చెన్నైలో ఈ విషయంపై అన్నామలై పార్టీ వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక అధిష్టానంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం గురు లేదా శుక్రవారం బీజేపీ తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. నువ్వానేనా.. అన్నాడీఎంకేలో పళని, పన్నీరు శిబిరాల మధ్య ఉన్న విభేదాలు ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రెండాకుల గుర్తు, బీజేపీ మద్దతు కోసం ఇరు శిబిరాలు గత కొన్ని రోజులుగా పావులు కదుపుతున్నాయి. చివరకు ఎవరు సహకారం అందించినా, అందించకున్నా.. తన బలాన్ని చాటే విధంగా పళణి స్వామి బుధవారం తమ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే, ధన బలం కలిగిన తెన్నరసును రంగంలోకి దించారు. ఇతడి పేరును మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటించారు. అన్నాడీఎంకేలో ఈరోడ్ తూర్పు సీటు కోసం పది మందికి పైగా నేతలు పోటీ పడ్డారని, వీరిలో ఒకరిని ఎంపిక చేయడంలో జాప్యం తప్పలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి 50 వేల మెజారిటీతో విజయకేతనం ఎగుర వేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. తన పేరు ఖరారు చేయడంతో సేలంలో ఉన్న పళనిస్వామిని కలిసి తెన్నరసు ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తప్పక విజయపబావుటా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
తమిళనాట శశికళ ప్లాన్ ఫలిస్తుందా.. పన్నీరు సెల్వానికి చెక్..?
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి పళణి స్వామి సొంత జిల్లాలో చిన్నమ్మ శశికళ సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటన విజయవంతానికి ఆమె మద్దతుదారులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జిల్లాలో తన పట్టు చేజారకుండా పళణి స్వామి ముందు జాగ్రత్తల్లో పడ్డారు. అన్నాడీఎంకేలో సాగుతున్న గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే సమయంలో అన్నాడీఎంకేను ఎప్పటికైనా తన గుప్పెట్లోకి తీసుకుంటానని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికే ప్రకటించారు. తన బలాన్ని చాటే విధంగా మద్దతు దారులతో భేటీలు, సంప్రదింపుల్లో ఆమె బిజీగా ఉన్నారు. దశల వారీగా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈక్రమంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎంపికైన పళణి స్వామి సొంత జిల్లాపై చిన్నమ్మ దృష్టి పెట్టారు. బలం చాటే ప్రయత్నం.. పళణి స్వామి సొంత జిల్లా సేలంలో తనకు సైతం బలం ఉందని చాటాలని చిన్నమ్మ భావిస్తోంది. ఇందులో భాగంగా తన మద్దతు దారుల ద్వారా బల నిరూపణకు సిద్ధమయ్యారు. పళణిస్వామి సొంత జిల్లాలో ఉన్న అసంతృప్తి సెగను తనకు అనుకూలంగా మలచుకునే విధంగా చిన్నమ్మ పర్యటనకు ఏర్పాట్లు జరిగాయి. సోమవారం ఆ జిల్లా పరిధిలోని ఆత్తూరు, వాలప్పాడి, సేలం టౌన్ జంక్షన్ , దాదుగా పట్టి, శీలనాయకం పట్టి, సూరమంగళంలలో సభలకు నిర్ణయించారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించడమే కాకుండా, పళణిపై గుర్రుగా ఉన్న నేతలను ఆహ్వానించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. దీంతో అందరి దృష్టి సేలంపై పడింది. సోమవారం సేలంలో, ఆ మరుసటి రోజు పక్కనే ఉన్న ఈరోడ్ జిల్లాలో చిన్నమ్మ పర్యటన జరగనుంది. సేలంలో తిష్టవేసిన పళణి తన సొంత జిల్లాలో చిన్నమ్మ పర్యటన నేపథ్యంలో పట్టు జారకుండా ముందు జాగ్రత్తల్లో పళణి నిమగ్నమయ్యారు. చిన్నమ్మ పర్యటన వైపు ఏఒక్క నేత వెళ్లకుండా కట్టడికి సిద్ధమయ్యారు. తిరుపతి పర్యటన ముగించుకున్న ఆయన నేరుగా సేలంకు వెళ్లడం గమనార్హం. రెండు రోజులు సేలంలోనే ఆయన ఉండనున్నారు. చిన్నమ్మ పర్యటన జరిగే సమయంలో తన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశాలకు పళణి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫలితంగా సేలం వేదికగా అన్నాడీఎంకే రాజకీయం రసవత్తరంగా మారింది. -
తమిళనాడు పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్
Panneerselvam.. పన్నీర్‌సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన అన్నాడీఎంకే కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. ఇక తాజాగా ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపిక కావడంతో పన్నీర్ చేతి నుంచి ఈ పదవి కూడా చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్బీ ఉదయకుమార్ ఎంపికయ్యారు. ఈయన ఎడపాడి పళనిస్వామి వర్గానికి చెందిన నాయకుడు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్ అప్పావుకు ఎస్పీ వేలుమణి బుధవారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పన్నీర్‌సెల్వం పదవీచ్యుతులయ్యే అవకాశం ఉంది. కాగా ఈనెల 11వ తేదీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకాగా, పన్నీర్‌సెల్వంను శాశ్వతంగా బహిష్కరించారు. అదే సమయంలో కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఓపీఎస్‌ను తప్పించారు. అతని మద్దతుదారులపై కూడా వేటు వేశారు. ఉన్న ఆ ఒక్క పదవీ..? ప్రస్తుతం పన్నీర్‌సెల్వం చేతులో ప్రస్తుతం ఉండేది ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి మాత్రమే. పార్టీ బహిష్కరణ వేటు వేసినా.. ప్రజాప్రతినిధిగా పన్నీరు సెల్వం అసెంబ్లీలో కొనసాగే అవకాశం మాత్రం ఉంటుంది. దీంతో ఎడపాడి ఆలోచనలో పడ్డారు. ఆ పదవి నుంచి కూడా పన్నీర్‌ను ఎలాగైనా తప్పించేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పన్నీర్స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం చెన్నై అడయారులోని ఓ ప్రయివేటు హోటల్లో ఎడపాడి మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఉదయకుమార్ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఎడపాడి పళనిస్వామి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష ఉప నాయకుడిగా తిరుమంగలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్బీ ఉదయకుమార్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తరువాత మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చెన్నై సచివాలయంలో స్పీకర్ అప్పావును కలిసి ఉదయకుమార్ నియామకపత్రాన్ని అందజేశారు. ఈసీ, కోర్టు తీర్పు పైనే.. అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్‌ను తొలగించినందున వారిని అధికారికంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా పరిగణించే పరిస్థితి ఉండదు. అయితే ఈ అంశంపై ఓపీఎస్ కోర్టు, ఎన్నికల కమిషన్‌లో పిటిషన్లు వేసి ఉన్నందున ఆ రెండు చోట్ల నుంచి స్పష్టత వచ్చేవరకు ఎమ్మెల్యేల గుర్తింపుపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అలాగే ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి ఈ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయానికి తావులేకుండా చట్ట ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ అప్పావు తెలిపా రు. ఎస్పీవేలుమణి ఓ ఉత్తరం అందజేశారని, అయితే అంతకు ముందే పన్నీర్‌సెల్వం సమరి్పంచిన వినతిపత్రం పరిశీలనతో ఉందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ కోసం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 11వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల కార్యకర్తలకు పోలీసులు సమన్లు పంపారు. వీటిలో పేర్కొన్న ప్రకారం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఓపీఎస్‌కు చెందిన 30 మంది బుధవారం హాజరుకాలేదు. అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో వారు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక 12 మంది పళనిస్వామి మద్దతుదారులు కూడా గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. అయితే ఎడపాడి వర్గం కూడా బుధవారం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలియడంతో.. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. -
పొలిటికల్ వార్: పన్నీరు సెల్వానికి ఊహించని షాకిచ్చిన పళనిస్వామి
పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన ఉనికి కాపాడుకునేందుకు తన మద్దతుదారులతో మూడోసారి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై : ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ‘చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి’లా తయారైంది. జూన్ 23వ తేదీ, జూలై 11వ తేదీ సర్వసభ్య సమావేశం జరగ్గా, తన వర్గీయులతో మూడోసారి సర్వసభ్య సమావేశానికి పన్నీర్ సెల్వం సన్నాహాలు మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఏక నాయకత్వం వివాదంపై ఎట్టకేలకూ ఎడపాడి పళనిస్వామి పైచేయి సాధించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. పదవి చేపట్టడమే అదనుగా పన్నీర్ సెల్వం, ఆయన మద్దతుదారులను పార్టీ నుంచి బహిష్కరించారు. పొన్నయ్యన్ ఆడియోపై నమ్మకం ఇటీవల మాజీ మంత్రి పొన్నయన్ పేరున విడుదలైన ఆడియో కలకలం రేపింది. ఎడపాడి నెంబర్ గేమ్ ఆడుతున్నారని, ఆయనకు పార్టీ క్యాడర్లో పెద్ద బలం లేదంటూ వ్యాఖ్యానించడం ఆ పార్టీలో దుమారం రేపింది. దీనిపై అప్రమత్తమైన ఎడపాడి పార్టీలో కొత్త టీమ్‌ను నియమించి పొన్నయ్యన్‌ను ప్రాధాన్యత లేని పదవిలోకి నెట్టారు. పొన్నయ్యన్ మాటలను విశ్వసిస్తున్న పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఎడపాడి పళనిస్వామి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తత ఇంకా సద్దుమణగకముందే పన్నీర్‌సెల్వం మరోసారి సన్నద్ధం కావడం చర్చనీయాంశమైంది. ఎడపాడి వైపు ఉన్నట్లుగా చెబుతున్న కార్యవర్గ సభ్యులకు గాలంవేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయాన్ని త్వరలో ఓపీఎస్ ప్రకటిస్తారని తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలను పదవుల నుంచి ఎడపాడి తప్పించిన అంశాన్ని కూడా చర్చించాలని ఆలోచిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు సర్వసభ్య సమావేశం జరుగగా, పన్నీర్ ప్రయత్నాలు ఫలిస్తే అది మూడో సర్వసభ్య సమావేశం అవుతుంది. కుట్రలో భాగంగానే తాళం అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులను సీఎం స్టాలిన్ అవకాశంగా తీసుకుని తమ పార్టీకి శాశ్వతంగా తాళం వేసేందుకు యత్నిస్తున్నారని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఆరోపించారు. అన్నాడీఎంకేను భూస్తాపితం చేసేందుకు ద్రోహులతో స్టాలిన్ చేతులు కలిపారని, అందుకే తమ పార్టీ కార్యాలయానికి సీలు వేశారని విమర్శించారు. పన్నీర్‌సెల్వం సైతం అన్నాడీఎంకేను అణచివేయాలని కాచుకుని ఉన్నారని, అయితే ఆయన ఆశయం నెరవేరదని ఎడపాడి వ్యాఖ్యానించారు. పోటాపోటీగా వినతిపత్రాలు ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదాను సైతం పన్నీర్‌సెల్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పదవిపై ఓపీఎస్, ఈపీఎస్ వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్‌కు వినతిపత్రాలు సమరి్పంచారు. ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఎంపికకై ఎమ్మెల్యేలతో ఈనెల 17వ తేదీ ఎడపాడి సమావేశం అవుతున్నారు. విధి విధానాలను అనుసరించి స్పీకర్ అప్పావుకు ఈ సమాచారం ఇవ్వనున్నారు. -
Tamil Nadu: నాలుగు స్తంభాలాట
అనుకున్నంతా అయింది. ఎంజీఆర్ సారథ్యంలో, ఆ తరువాత జయలలిత నాయకత్వంలో తమిళనాట తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన రాజకీయ పార్టీ ప్రతిష్ఠ అలాంటి బలమైన నేతలు లేక క్రమంగా మసక బారుతోంది. అంతర్గత కలహాలతో ‘అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం’ (అన్నాడీఎంకే) అల్లాడుతోంది. మాజీ సీఎం, నిన్నటి దాకా అన్నాడీఎంకే సమన్వయకర్త, కోశాధికారి అయిన ఓ. పన్నీర్ సెల్వమ్ (ఓపీఎస్)ను బహిష్కరిస్తూ, పార్టీపై పెత్తనాన్ని ప్రత్యర్థి ఈడపాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సోమవారం చేజిక్కించుకోవడం ఆ పార్టీ ఇంటిపోరులో తాజా పరిణామం. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పార్టీపై పట్టు బిగించిన పళనిస్వామి, తనకంటూ బలమైన వర్గం సృష్టించుకోలేకపోయిన పన్నీర్ సెల్వమ్, తగిన సమయం కోసం కాచుకుకూర్చున్న శశికళ, అన్నాడీఎంకే నేతల్ని గుప్పెట పెట్టుకొని తమిళనాట బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీలతో తమిళనాట ఆసక్తికరమైన నాలుగు స్తంభాలాట మొదలైంది. జయలలిత పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన రెండుసార్లూ, ఆమె ఆసుపత్రిలో చావుబతు కుల మధ్య ఉన్నప్పుడు మరోసారీ – మొత్తం మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకొనేందుకు పోరాడాల్సిన పరిస్థితి. ఆ మాటకొస్తే పార్టీకి ఒకే నాయకత్వం పేరిట పన్నీర్‌ను సాగనంపేందుకు ప్రత్యర్థి వర్గం కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. దాన్ని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చారు. కానీ, పార్టీ జనరల్ కౌన్సిల్ తాజా భేటీకి ముందు జూన్ 23న జరిగిన సమావేశంలోనే ఒకే నాయకుడి సిద్ధాంతాన్నీ, పళనిస్వామి నేతృత్వాన్నీ 2 వేల పైచిలుకు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, కార్యవర్గ సభ్యుల్లో అధికశాతం ఆమోదించారు. ఒక రకంగా అప్పుడే పన్నీర్ కథ కంచికి చేరింది. కోర్టు కేసులతో జూలై 11 దాకా ఆయన లాక్కొచ్చారు. పార్టీ అంతర్గత అంశాలపై కోర్టులోనూ ఊరట దొరకలేదు. పన్నీర్ ప్రత్యర్థులదే పైచేయి అయింది. నిజానికి, 2016లో జయలలిత మరణం తర్వాత ఆమె సహచరి శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. తీరా ఆమెకు నాలుగేళ్ళ జైలుశిక్ష పడడంతో 2017 ఫిబ్రవరిలో జాతకం తిరగబడింది. పగ్గాలు ఆమె నుంచి చేజారాయి. శశికళే ఉమ్మడి శత్రువుగా, ఆమెనూ, ఆమె కుటుంబాన్నీ దూరం పెట్టడానికి ఓపీఎస్, ఈపీఎస్‌లు చేతులు కలిపారు. భారత రాజకీయాల్లో ఎన్నడూ లేని రీతిలో ఒక పార్టీని ఇద్దరు నేతలు సంయుక్తంగా నడిపే అరుదైన ప్రయోగానికి తెర తీశారు. పార్టీనీ, అధికారాన్నీ పంచుకున్నారు. ఈపీఎస్ ముఖ్యమంత్రిగా, పార్టీ సహ–కన్వీనర్‌గా ఉంటే, ఓపీఎస్ ఉప ముఖ్య మంత్రిగా, పార్టీ కన్వీనర్‌గా ఉండాలనే ఏర్పాటు ఆ సెప్టెంబర్‌లో జరిగింది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వేళ ఈ అవసరార్థ మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు పూర్తిగా బయటకొచ్చాయి. అందులో తాజా అంకమే – సోమవారం నాటి జనరల్ కౌన్సిల్లో ఈపీఎస్‌కు పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి సీటు, ఓపీఎస్‌పై బహిష్కరణ వేటు. దాదాపు 15 కి.మీల దూరంలో వానగరంలోని కల్యాణమండపంలో ఒకపక్క పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే, చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ఆఫీసు అనేక నాటకీయ పరిణామాలకు వేదికైంది. ప్రత్యర్థులైన ఓపీఎస్ – ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణ, తాళాలు బద్దలు కొట్టి మరీ పార్టీ కార్యాలయాన్ని పన్నీర్ వర్గీయులు కైవసం చేసుకోవడం, పోలీసుల రంగప్రవేశం, రెవెన్యూ అధికారులు వచ్చి కార్యాలయానికి సీలు వేయడం లాంటి పరిణామాలు ప్రజల్లో అన్నా డీఎంకే గౌరవాన్ని మరింత పలుచన చేశాయి. అసలైన పార్టీ ఎవరిది, పార్టీ ఆఫీసు ఎవరిది, బ్యాంకు ఖాతాలపై హక్కు ఎవరిది సహా అనేక అంశాలపై వైరివర్గాల పరస్పర ఫిర్యాదులు తాజాగా ఎన్నికల సంఘం నుంచి హైకోర్ట్ దాకా చేరాయి. రాగల కొన్ని వారాలు ఆ డ్రామా సాగనుంది. తమిళ ప్రజలు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకేకు పట్టం కట్టినా, ప్రతిపక్షంగా అన్నాడీఎంకేకు అప్పగించిన బాధ్యత ఈ మొత్తం వ్యవహారంతో పక్కకుపోవడమే విషాదం. సామాన్య ప్రజల సమస్యలపై అధికార డీఎంకేపై పోరాడాల్సిన అన్నాడీఎంకే గత ఏడాదిగా అది వదిలేసి, అంతర్గత విభేదాలకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానంలో ఉన్నది తానే అన్న సంగతి ఈ ద్రవిడ పార్టీ మర్చిపోవడమే అదనుగా, ఆ స్థానాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. తల దూర్చడానికి తావివ్వని తమిళ ద్రవిడ రాజకీయాల్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా రాజ్యసభకు నామినేట్ చేసి, బలమైన సంకేతాలిస్తోంది. అన్నాడీఎంకే బలహీనపడడం డీఎంకేకు లాభమే కానీ, ఇప్పటి దాకా రెండు ద్రవిడ పార్టీల మధ్య పోరుగా ఉన్న తమిళనాట ఆ స్థానంలోకి కొత్తగా బీజేపీ లాంటివి వస్తే దీర్ఘకాలంలో నష్టమే. ఇక, కార్యవర్గంలో మెజారిటీ ఉన్నా, రేపు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ అంతే బలం పళని స్వామి నిరూపించుకుంటారా అన్నదీ వేచిచూడాలి. పళనిపై ప్రతీకారంతో తన సామాజిక వర్గానికే చెందిన శశికళతో పన్నీర్ చేతులు కలిపితే కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది పక్కన పెడితే, సరిగ్గా 50 ఏళ్ళ క్రితం కోశాధికారిగా లెక్కలడిగినందుకు కరుణానిధి సారథ్యంలోని నాటి డీఎంకే నుంచి బహిష్కృతుడైన ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రస్తుతం ఆందోళనకరమే. ఆ పార్టీకి ఇప్పుడు కావాల్సింది వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రజాకర్షక నాయకుడే తప్ప వేరెవరూ కాదు. పార్టీ నిలబడితేనే వారి భవిష్యత్తు అనే ఆ సంగతి కీచులాడుకుంటున్న ఈ తమిళ తంబీలకు ఎవరు చెప్పాలి? -
దూకుడు పెంచిన శశికళ.. వారితో దోస్తి!
చెన్నై: రాష్ట్రంలో వేర్వేరుగా రాజకీయాలు నడుపుతున్న శశికళ, దివాకరన్ ఏకమవుతున్నట్లు ఆదివారం ఓ వార్త ఆసక్తి కలిగించింది. శశికళ సోదరుడు దివాకరన్, అక్క కుమారుడైన టీటీవీ దినకరన్ మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న విబేధాల నుంచి కొత్తపార్టీ పుట్టుకొచ్చింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు పోటీగా అన్నా ద్రవిడ కళగం అనే పార్టీ ప్రారంభమైంది. రెండు పార్టీల్లో పెద్దగా బలం, బలగం లేకున్నా వారివురూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ వర్గం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదలైంది. శశికళ నాయకత్వంలోని అన్నాడీఎంకేలో అన్నా ద్రవిడ కళగం విలీనం కాబోతున్నట్లు, ఇందుకు సంబంధించి ఈనెల 12వ తేదీన తంజావూరులో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నాడేఎంకేలో పన్నీర్ సెల్వం వెర్సస్ పళణి స్వామి అన్నట్లు రాజకీయ వివాదం జరుగుతోంది. మరో వైపు శశికళ నాయకత్వంలోని పార్టీకి ఈ వీలినం చూస్తుంటే అన్నాడేఎంకేలో పట్టు బిగించే పనిలో ఆమె దృష్టి పెట్టినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: OPS Vs EPS: పన్నీర్ సెల్వానికి షాక్.. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
అన్నాడీఎంకే వర్గపోరులో మరో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై పన్నీర్‌సెల్వంను అన్నాడీఎంకే నుంచి శాశ్వతంగా సాగనంపాలని ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11వ తేదీన జరగున్న జనరల్‌బాడీ సమావేశాన్ని ఇందుకు వేదికగా మలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రిసీడియం చైర్మన్‌గా ఎన్నికైన తమిళ్‌మగన్ హుస్సేన్ సైతం ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వర్గపోరుతో పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేసిన నెపం చూపి క్రమశిక్షణ చర్యగా ఏకంగా పార్టీ నుంచే పన్నీర్‌సెల్వంను పంపివేసేందుకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా తన సతీమణికి కరోనా సోకడంతో కొన్నిరోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉన్న ఎడపాడి శనివారం బయటకు వచ్చి మద్దతుదారులతో సమావేశమయ్యారు. కాగా, పార్టీలో మెజారీ్ట నాయకులు ఎడపాడివైపు మొగ్గుచూపుతుండగా, వారిని తనవైపు ఆకర్షించేందుకు పన్నీర్ అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్నా రు. చెన్నై అడయారు గ్రీన్‌వేస్ రోడ్డులోని తన ఇంటిలో శనివారం పార్టీ శ్రేణులను కలిసేందుకు పన్నీర్ సిద్ధమయ్యారు. అయితే సాయంత్రం వరకు ఎదురుచూసినా ఏ ఒక్క నేత ఆ వైపు రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. పుదుచ్చేరికీ తాకిన సెగ.. తమిళనాడులో పార్టీ పరిస్థితి ఇలా ఉండగా, ఈ సెగ పుదుచ్చేరికి సైతం వ్యాపించింది. ఏక నాయకత్వం విషయంలో పుదుచ్చేరి తూర్పువిభాగం కార్యదర్శి అన్బళగన్, పడమటి విభాగం కార్యదర్శి ఓంశక్తిశేఖర్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య విబేధాలు నెలకొనగా పార్టీ చీలిపోతుందా.. అని పార్టీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. -
పన్నీర్‌సెల్వానికి చెక్ పెట్టిన పళనిస్వామి?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం రాజకీయ ప్రయాణం.. పతనం దిశగా సాగుతోందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ పదవీకాలం ముగిసిన దశలో ఆ పార్టీ కోశాధికారి బాధ్యతల నుంచి పన్నీర్‌సెల్వంను తప్పించేందుకు రంగం సిద్ధమైంది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్న తరుణంలో.. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వాహకుల సమావేశం సోమవారం జరిగింది. పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏక నాయకత్వంలో పార్టీని నడపాలని, పన్నీర్సెల్వను పక్కనపెట్టి పళనిస్వామిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలనే వ్యూహంతో ఈనెల 23వ తేదీన సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే, కన్వీనర్ హోదాలో ఎడపాడి ఆలోచనా విధానాలకు వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం 23 తీర్మానాలు ప్రవేశపెట్టారు. వీటిని వ్యతిరేకిస్తున్నట్లు ఎడపాడి వర్గం తేలి్చచెప్పడంతో పన్నీర్‌సెల్వం అలిగి వెళ్లిపోయారు. ఎడపాడి వర్గం కోర్కె మేరకు వచ్చేనెల 11వ తేదీన మళ్లీ సర్వసభ్య సమావేశం నిర్వహించేలా ప్రిసీడియం చైర్మన్ తమిళ్‌మగన్ హుస్సేన్ అనుమతించారు. ఇక ఆ తరువాత నుంచి ఈపీఎస్, ఓపీఎస్ తన ఎవరికివారు పార్టీపై పట్టుకోసం మ్ముమర ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి? అన్నాడీఎంకే ప్రధాన కార్యవర్గ సమావేశాన్ని చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రిసీడియం చైర్మన్ అధ్యక్షత వహించారు. ‘ఏక నాయకత్వమే’, ‘ప్రధాన కార్యదర్శి జిందాబాద్’ నినాదాలతో ఎడపాడికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ప్రాంగణంలోని ఓ ఫ్లెక్సీలో ఉన్న పన్నీర్‌సెల్వం ఫొటోను ఎడపాడి వర్గం తొలగించింది. వచ్చేనెల 11వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపితీరాలని తీర్మానించారు. సమన్వయ కమిటీ గడువు తీరినందున రానున్న సర్వసభ్య సమావేశంలో కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌సెల్వంను తప్పించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీని నడిపేందుకు ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించుకుని సర్వాధికారాలు ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. పార్టీ కార్యాలయంలో ఎడపాడి సమావేశం జరుపుతున్న సమయంలో తేనీ జిల్లా పెరియకుళంలో ఉన్న పన్నీర్‌సెల్వం హడావిడిగా చెన్నైకి చేరుకుని తన మద్దతుదారులతో మంతనాలు జరిపారు. అన్నాడీఎంకేలో కుమ్ములాటను టీటీవీ దినకరన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎడపాడిని వ్యతిరేకించేవారు బహిరంగంగా పన్నీర్‌సెల్వంతో భేటీ కావచ్చు, ఇందులో రహస్యం అవసరం లేదని దినకరన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు తాము ఎలాంటి కుట్ర చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకు ఏక నాయకత్వమే ఉండాలి, పార్టీ శ్రేణులే ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని శశికళ అన్నారు. సుప్రీంకోర్టులో ఓపీఎస్ కేవియట్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహణపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎవరైనా పిటిషన్ వేస్తే తమ వాదన కూడా వినాలని సుప్రీంకోర్టులో ఓపీఎస్ న్యాయవాది సోమవారం కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో పార్టీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. -
దూకుడు పెంచిన శశికళ.. ఆసక్తికరంగా తమిళ పాలిటిక్స్!
నేతల కిరికిరీ కోట దాటింది.. తకరారు తారస్థాయిని తాకుతోంది.. చివరికి నాయకుల పంచాయితీ పరిధి దాటిపోతోంది.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్నాడీఎంకే.. ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోంది..! బలం కోసం.. బలగం కోసం అగ్రనేతలైన పన్నీరు, పళని స్వామి అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటూ.. నువ్వా.. నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇలాంటి తరుణంలో తామేమీ తక్కువ కాదంటూ శశికళ, దినకరన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. బల ప్రదర్శనకు దిగడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది..! సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు పార్టీపై పట్టే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు. మదురై వేదికగా పన్నీరు సెల్వం బలప్రదర్శన నిర్వహించారు. చెన్నైలో తిష్ట వేసిన పళని శిబిరం పన్నీరుకు వ్యతిరేకంగా వ్యూహరచనలో నిమగ్నమైంది. మరోవైపు అమ్మ నెచ్చెలి శశికళ పురట్చి పయనం పేరిట తిరుత్తణి వైపుగా కదిలారు. ఇక, ఈమె ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ తిరువళ్లూరు జిల్లా అయపాక్కంలో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఎవరికి వారే.. గత రెండు వారాలుగా అన్నాడీఎంకేలో ముదురుతున్న అంతర్గత విభేదాలు, చోటు చేసుకుంటున్న మలుపులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్యనీయాంశమైన విషయం తెలిసిందే. ఇక, ఆదివారం ఎవరికి వారు పారీ్టపై పట్టుకు తమ దైన శైలిలో దూసుకెళ్లారు. జూలై 11న జరిగే సర్వ సభ్య సమావేశంతో పార్టీని కైవసం చేసుకునేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ సమావేశాన్ని నిర్వహించి తీరాలనే సంకల్పంతో ఆదివారం చెన్నైలో సుదీర్ఘ కార్యచరణలో నిమగ్నమయ్యారు. అలాగే, ఈ సమావేశానికి ముందే, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా ఉన్న పన్నీరు సెల్వంతో పాటుగా ఆయన మద్దతుదారుల జాబితా సిద్ధం చేసి పార్టీ నుంచి సాగనంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు బలాన్ని చేకూర్చే విధంగా అన్నాడీఎంకేకు చెందిన ‘నమదు అమ్మ’ దిన పత్రికలో పబ్లీషర్స్ స్థానంలో పన్నీరు సెల్వం పేరును ఆదివారం తొలగించడం గమనార్హం. తగ్గేదేలే అంటున్న పన్నీరు.. ఢిల్లీ నుంచి ఆదివారం మదురైకు చేరుకున్న పన్నీరు సెల్వం బల ప్రదర్శనకు దిగారు. ఆయన మద్దతు దారులు వేలాదిగా విమానాశ్రయానికి చేరుకుని బ్రహ్మరథం పట్టారు. దారి పొడవున ఆయనకు ఘన స్వాగతం పలికారు. తన బలాన్ని చాటే విధంగా కేడర్ తన వెంటే ఉంది అంటూ పన్నీరు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నాయకులు లేకున్నా, కార్యకర్తలు అందరూ తన వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న అసాధారణ పరిస్థితులు, సమస్యలకు కారుకులెవ్వరో కేడర్ గుర్తించారని పేర్కొన్నారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత మార్గంలో పయనిస్తున్న తాను నిత్యం కేడర్‌తో కలిసి మెలిసి ఉన్నానని, వారే ఇప్పుడు తనకు బలం అని ధీమా వ్యక్తం చేశారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించిన ఆయన ప్రత్యేక వాహనంలో మద్దతు దారులతో కలిసి ముందుకు దూసుకెళ్లారు. అలాగే, మదురై వేదికగా మద్దతు దారులతో సమావేశం అయ్యారు. అనంతరం తేని వైపుగా పన్నీరు సెల్వం బల ప్రదర్శన సాగింది. ఇక, ఈనెల 28వ తేదీన రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక ప్రకటన చేయడానికి పన్నీరు సిద్ధం అవుతోన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. కాగా పన్నీరు మద్దతుదారుడైన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మరోమారు సర్వసభ్య సమావేశానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. జులై 11న జరగనున్న సమావేశాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. చిన్నమ్మ ‘పురట్చి’ పయనం అన్నాడీఎంకేను తన గుప్పెట్లోకి తీసుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఇక, రాజకీయ కార్యక్రమాల్లో దూకుడు పెంచనున్నారు. ఆదివారం చెన్నై టీ నగర్‌లోని నివాసం నుంచి తమిళ హక్కులు, మహిళా సాధికారత నినాదంతో పురట్చి పయనానికి చిన్నమ్మ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక వాహనంలో కోయంబేడు, పూందమల్లి, తిరువళ్లూరు, తిరుత్తణి, కోర మంగళం, కేజీ కండ్రిగ, ఆర్కే పేట, అమ్మయార్ కుప్పం వరకు చిన్నమ్మ పయనం సాగింది. అమ్మయార్ కుప్పం బహిరంగ సభ వేదిక వద్దకు చిన్నమ్మ చేరుకున్నారు. ఇక, చిన్నమ్మ ప్రతినిధి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ సైతం వ్యూహాలకు పదును పెట్టే విధంగా ముఖ్య నేతలతో సమావేశంలో మునిగారు. చిన్నమ్మ తీసుకునే నిర్ణయాలు, ఆమె వేసే అడుగులకు బలాన్ని చేకూర్చే విధంగా తిరువళ్లూరు జిల్లా అయపాక్కం వేదికగా ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలతో సమాలోచించడం గమనార్హం. అన్నాడీఎంకే ఆత్మగౌరవాన్ని కాపాడుతా: శశికళ తిరువళ్లూరు: అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిస్టంభన తొలగించి పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడుతానని శశికళ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం తిరువళ్లూరు జిల్లాకు ఆమె వచ్చారు. ఈ మేరకు పూందమల్లి, నేమం, తిరువళ్లూరు, పాండూర్ తదితర ప్రాంతాల్లో పార్టీ నేతలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పూందమల్లిలో పార్టీ నేతలతో మాట్లాడుతూ త్వరలోనే అన్నాడీఎంకేలో అన్ని పరిస్థితులు చక్కదిద్దుతా, కార్యకర్తలు అధైర్యపడవద్దు అని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నరసింహన్, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్‌రామ్, పార్టీ నేతలు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నేనే ప్రధాన కార్యదర్శి.. తిరుత్తణి: కేజీ కండ్రికలో చిన్నమ్మ శశికళ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు ప్రధాన కార్యదర్శి తానే అని స్పష్టం చేశారు. తనను తొలగించే అధికారం పన్నీరు, పళని స్వామికి లేదు అని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునే అధికారం క్షేత్రస్థాయిలోనే కార్యకర్తలకు మాత్రమే ఉందని వివరించారు. జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నాయకుల్ని అడ్డం పెడ్డుకుని పళని స్వామి ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారని, ఇందుకు అవకాశం లేదన్నారు. పన్నీరు సెల్వంతో చేతులు కలుపుతారా..? అని ప్రశ్నించగా, వేచి ఉండండీ..! అన్నాడీఎంకేకు మంచి రోజులు రాబోతున్నాయని ఆమె సమాధానం ఇవ్వడం విశేషం. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక మలుపు -
Tamil Nadu: కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..!
సాక్షి, చెన్నై : గతంలో అన్నాడీఎంకే అధికార ప్రతినిధిగా వ్యవహరించిన పుగలేంది తీరు ఆపార్టీ అగ్రనాయలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామికి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పుగలేంది వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. అయితే ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను అకారణంగా తొలగించారంటూ పుగలేంది కోర్టుకెక్కారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. తన పరువుకు భంగం కల్గించిన పన్నీరు సెల్వం, ‡పళనిస్వామిపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించాలని కోర్టుకు పుగలేంది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పన్నీరు సెల్వం, పళని స్వామి కోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని గత విచారణలో న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం విచారణకు ఆ ఇద్దరు హాజరు కావాల్సి ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపుతూ, నేరుగా కోర్టుకు హాజరయ్యే అంశం నుంచి మినహాయింపు ఇవ్వాలని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్ వేశారు. ఈ విజ్ఞప్తి కోర్టు తిరస్కరించింది. సెప్టెంబర్ 14వ తేదీ విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశించారు. కొడనాడు కేసులో.. వాదోపవాదాలు కొడనాడు ఎస్టేట్‌లో హత్య, దోపిడీ వ్యవహారం తాజాగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సాక్షిగా ఉన్న కోయంబత్తూరుకు చెందిన రవి దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ బెంచ్‌లో విచారణకు వచ్చింది. ఈ కేసులో విచారణ ముగించి, చార్జ్‌షీట్ సైతం దాఖలై ఉందని, ఈ సమయంలో మళ్లీ పునఃవిచారణ చేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. స్టే విధించాలని కోరారు. అయితే, రవి ఓ సాక్షి మాత్రమేనని, అతడి వాదనను పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాదులు స్పష్టం చేశారు. అలాగే, ఈ కేసులో మాజీ సీఎం పళనిస్వామి, శశికళ, ఆమె బంధువు ఇలవరసిని విచారించేందు అనుమతివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈనేపథ్యంలో న్యాయమూర్తి తీర్పును శుక్రవారం వెలువరించనున్నట్లు ప్రకటించారు. -
సీఎంతో హీరో విజయ్ భేటీ..!
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. విజయ్ను రాజకీయాల్లోకి రప్పించడానికి ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే విజయ్ వ్యతిరేకత తెలపడంతో ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ పేరు నమోదును వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నా, తెర మీదకు రావడంలో సమస్యలు తప్పడం లేదు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అయి తే, కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యా రు. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మేరకు మాత్రమే సీట్ల భర్తీకి అను మతి ఉంది. ఈ సమయంలో సినిమా విడుదల చేస్తే నష్టం తప్పదన్న ఆందోళన చిత్ర బృందం ఉంది. రహస్య భేటీ.. మాస్టర్ చిత్రాన్ని రూ. 143 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్న చిత్ర బృందం వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సీఎం పళనిస్వామిని కలిసి తమ అభ్యర్థనను ఉంచేందుకు సిద్ధమయ్యారు. విజయ్‌తో పాటు నిర్మాతలు, దర్శకుడు సీఎంతో భేటీకి నిర్ణయించారు. అయితే ఈ భేటీని రహస్యంగా ఉంచారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో గ్రీన్ వేస్ రోడ్డులోని సీఎం ఇంటికి విజయ్ వెళ్లారు. తమ తరఫున ఓ లేఖను సీఎంకు అందజేశారు. అందులో థియేటర్లను పూర్తి స్థాయిలో తెరవడం, వంద శాతం సీట్లను భర్తీ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. అన్ని పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని విజయ్‌కు సీఎం హామీ ఇచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా గతంలో విజయ్ నటించిన అనేక చిత్రాలు అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో ముందుగానే సీఎంతో విజయ్ భేటీ కావడం గమనార్హం. ఎన్నికల సమయంలో కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా..
అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెర పడింది. సామరస్య పూర్వకంగా నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సీఎం పళనిస్వామికి పట్టం కట్టారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళనిస్వామి అని బుధవారం ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం స్వయంగా ప్రకటించారు. అలాగే, పార్టీకి 11 మందితో కూడిన మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందు లో చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్న వాళ్లే ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం ఎవరో, మార్గదర్శక కమిటీలో ఎవరెవరు ఉండాలో అన్న అంశాలపై అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో బుధవారం వేకువజామున మూడు గంటల వరకు సీనియర్ మంత్రుల మంతనాలు వేర్వేరుగా సాగడంతో ఉత్కంఠ తప్పలేదు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించే రీతిలో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం సాగింది. ఈ సమావేశం నిమిత్తం ముందుగా పన్నీరు సెల్వం అక్కడికి వచ్చారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాల వద్దకు చేరుకుని అంజలి ఘటించి లోనికి వెళ్లారు. ఆ తర్వాత పళనిస్వామి రావడంతో ఆయన మద్దతుదారుల హంగామా అంతా ఇంతా కాదు. పూల వర్షంలో ఆయన కాన్వాయ్ తడిసి ముద్దయింది. ముందుగా మార్గదర్శక కమిటీ.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు, పళని హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళనిస్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్‌లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్‌పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, చోళవందాన్ ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. సీఎం అభ్యర్థి పళని.. పన్నీరుసెల్వం ప్రసంగిస్తూ అన్నాడీఎంకే 2021 ఎన్నికలకు సిద్ధమైందని, పార్టీ నేతృత్వంలో కూట మి ఏర్పాటు అంటూ, సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ని ఏకగ్రీవంగా ఎంపిక చేశామని ప్రకటించారు. సంబరాల్లో సేన.. పళనిస్వామి సీఎం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ, ఏకగ్రీవ ఎంపిక ప్రకటనను పన్నీరు చేశారో లేదో, రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగాయి. అన్నాడీఎంకే కార్యాలయం పరిసరాల్లో బాణసంచా పేల్చుతూ, స్వీట్లు పంచారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలతో బారులు తీరారు. సమావేశాన్ని ముగించుకున్న నేతలందరూ మెరీనా తీరం వైపుగా కదిలారు. అక్కడి ఎంజీఆర్, జయలలిత సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం పన్నీరు సెల్వం ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నమ్మకు చెక్ పెట్టినట్టేనా.. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టినట్టున్నారు. శశికళ వ్యతిరేకులకు ఈ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. పార్టీలో, ప్రభుత్వంలో తటస్థంగా వ్యవహరించే మంత్రులు జయకుమార్, కామరాజ్ కమిటీలో ఉన్నారు. వీరూ చిన్నమ్మ వ్యతిరేకులే. మిగిలిన నలుగురు మంత్రులు సీఎం మద్దతుదారులు. పన్నీరు మద్దతుదారులుగా ఓ ఎమ్మెల్యే, నలుగురు మాజీలు ఈ కమిటీలో ఉన్నారు. వీరంతా మొదటి నుంచి చిన్నమ్మకు వ్యతిరేకంగా అన్నాడీఎంకేలో గళాన్ని స్వరాన్ని వినిపిస్తున్న వాళ్లే. ఇక, ఈ కమిటీలో పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. అలాగే, మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్ల ప్రయత్నాలు చేసినా, వీరు అప్పుడప్పుడు పరోక్షంగా చిన్నమ్మకు అనుకూలంగా నోరు జారిన వాళ్లే కావడం గమనార్హం. -
ఎవరి లెక్కలు వారివే!
సాక్షి, చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు తమిళ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీట్ల పంపకాలు, గెలుపు స్థానాల ఎంపిక మీద దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. వివాదాలకు చోటు ఇవ్వకుండా తమ మద్దతు దారులకు సమంగా సీట్లను పంచేందుకు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్, కో కన్వీనర్ పళని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక, తమ గెలుపు ఖాయమన్నట్లు సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్‌కు సీట్ల సంఖ్య తగ్గించేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కసరత్తులు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. 2021 సార్వత్రిక నగారా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌లో మోగే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఎన్నికల కమిషనర్ సత్యప్రద సాహూ కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 16న నమూనా ఓటరు జాబితా, జనవరి 15న తుది ఓటర్ల జాబితాను ప్రకటించ బోతున్నట్లు ప్రకటన చేశారు. డిసెంబరు 15 వరకు ఓటరు జాబితాలో ఆన్లైన్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉన్నా, తమిళ పార్టీలు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసుకుని కసరత్తుల వేగాన్ని పెంచాయి. ఇందులో డీఎంకే, అన్నాడీఎంకేలు ముందు ఉండగా, మేము సైతం అంటూ బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. సమానంగానే పంపకాలు.. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు అన్నాడీఎంకే నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో కన్వీనర్ పళని స్వామి శిబిరాలు సమానంగా సీట్లను పంచుకునేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీకి 20, పీఎంకేకు 20, డీఎండీకేకు ఓ ఐదు, మిగిలిన మిత్రులకు తలా ఒకటి రెండు అప్పగించి, కనీసం 180 స్థానాల్లో పోటీ లక్ష్యంగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుంన్నాయి. బీజేపీ కలిసి రాకపోతే పీఎంకేకు మరో ఐదు సీట్లు ఇచ్చి, మిత్రులకు తలా ఓ సీటు కోత పెట్టి, అవసరం అయితే, 200 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోన్నట్లు చర్చ సాగుతోంది. ఏ శిబిరం అయితే, అధిక స్థానాల్లో గెలుస్తుందో, వారే సీఎం అనే ఏకాభిప్రాయానికి సైతం రాబోతున్నారని ఓ నేత పేర్కొనడం గమనార్హం. ఇందు కోసం మరి కొద్ది రోజుల్లో పార్టీ సర్వ సభ్యం సమావేశం కానున్నదని, ఇందులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు. సర్వేలను నిజం చేద్దామంటూ.. డీఎంకే ఉదయ సూర్యుడి గెలుపు ఖాయమని ఓ సర్వేలో తేలింది. ఆ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బృందం ఓ నివేదికను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఇచ్చినట్టు సమాచారం. ఇందులోనూ అధికారం డీఎంకేకు ఖాయం అన్నట్టుగా ఉండటం గమనార్హం. అయితే డీఎంకే విజయం సాధించాలంటే అధిక స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ఆ పార్టీకి మిత్ర పక్షాలు ఎక్కువే అయినా, వారికి సింగిల్ డిజిట్ సీట్లతో సర్దుబాటుకు అవకాశం ఎక్కువే. ఇక్కడ సమస్య అంతా కాంగ్రెస్ రూపంలోనే. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 63, 40 అంటూ సీట్లు కేటాయించినా, గెలిచింది సింగిల్ డిజిట్ మాత్రమే. ఈ దృష్ట్యా, ఈ సారి కాంగ్రెస్ ఆశించిన మేరకు సీట్లను డీఎంకే ఇచ్చే అవకాశాలు లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. 30 లోపు సీట్లను కాంగ్రెస్‌కు సర్దుబాటు చేసి, కనీసం 180కు పైగా స్థానాల్లో పోటీ లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టినట్లు డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో సీఎం అభ్యర్థి స్టాలిన్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వ్యాఖ్యానించడం గమనార్హం. గెలిపిస్తే...ఇనోవా ఎన్నికల వ్యూహాలకు ఆ పార్టీ నేత మురుగున్ పదునుపెడుతున్నారు. జిల్లాల నేతలతో సమావేశాలు, సమీక్షలు అంటూ వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని గెలిపించే జిల్లా కార్యదర్శికి ఓ ఇన్నోవా కారు బహుకరించనున్నట్టు మురుగన్ ప్రకటించారు. కనీసం 25 మంది ప్రతినిధులు అసెంబ్లీలో ఈ సారి అడుగు పెట్టాల్సిందేనని, అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచి ఎన్నికల కసరత్తుల వేగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అన్నాడీఎంకే వద్ద కనీసం 40 నుంచి 50 మేరకు సీట్లను బీజేపీ ఆశించే అవకాశాలు ఉన్నాయి. -
తీర్థయాత్రలా ఎన్నికల ప్రచారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలు భిన్నం అన్న ఆయన.. కేవలం పార్టీయే కాకుండా ప్రజల పోరాటంగా ఈ ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర మంత్రులను కలిసి, దేశానికి సేవలందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు సానుకూలంగా ఉండటం, 23వ తేదీన ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ‘కృతజ్ఞతాపూర్వక సమావేశం’ ఏర్పాటు చేశారు. ‘గతంలో ఎన్నో ఎన్నికలు చూశా. కానీ, ప్రస్తుత ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగాయి. ఈసారి ప్రజలే ఎన్నికల పోరాటంలో పాల్గొన్నారు. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారం తీర్థయాత్ర మాదిరిగా సాగిందనిపించింది’ అని ప్రధాని అన్నారని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరులకు తెలిపారు. అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘గత ఐదేళ్లలో ఎంతో కృషి చేసి గొప్ప విజయాలు సాధించిన మోదీ సర్కార్ టీంకు కృతజ్ఞతలు. నరేంద్ర మోదీ నేతృత్వంలో నవీన భారత నిర్మాణానికి ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, గడ్కరీ, జైట్లీ, జేపీ నడ్డా, ప్రకాశ్ జవడేకర్ తదితరులతో పాటు ఎన్డీఏలోని లోక్‌జన్ శక్తి పార్టీకి చెందిన పాశ్వాన్, అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్ ఉన్నారు. ఎన్డీఏ నేతలకు విందు సాయంత్రం స్థానిక అశోకా హోటల్లో అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన విందుకు శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ప్రకాశ్‌సింగ్ బాదల్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితర కూటమి నేతలంతా పాల్గొన్నారు. వీరందరినీ ప్రధాని మోదీ శాలువా కప్పి సన్మానించారు. ఈ విందు కేవలం మర్యాద పూర్వకంగా ఏర్పాటు చేసింది మాత్రమేనని పార్టీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేంత మెజారిటీ దక్కినప్పటికీ కొత్త ప్రభుత్వంలో వారిని కూడా కలుపుకుని పోయేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం: మోదీ అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలని అధికార పార్టీ నేతలు యోచిస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎంలపై అనవసర వివాదం సృష్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు చెందిన 36 పార్టీల నేతలు ఈ విందు సమావేశంలో పాల్గొన్నారు. 2022 నాటికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశాన్ని సంపన్న, బలమైన, అభివృద్ధి చెందిన, సమ్మిళిత భారత్‌గా మార్చేందుకు కట్టుబడి ఉంటామంటూ ఈ సందర్భంగా ఒక తీర్మానం చేసినట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఎన్డీయేతర మూడు పార్టీల నేతలు కూడా మద్దతు తెలుపుతూ లేఖలు పంపినట్లు ఆయన వివరించారు. -
‘అభినందన్‌కు పరమవీరచక్ర అవార్డు ఇవ్వాలి’
చెన్నై : పాక్ చెరలో వేధింపులు ఎదుర్కొన్ని అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అత్యున్నత సైనిక పురస్కారమైన పరమవీరచక్ర అవార్డు ప్రదానం చేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు సేనలకు చిక్కినా మొక్కవోని విశ్వాసం, సంయమనం పాటించిన ఐఏఎఫ్ పైలట్ అభినందన్‌కు అత్యున్నత సైనిక పురస్కారం అందించడం సముచితమని ప్రధానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురైన ఒత్తిడితో పాటు ప్రధాని దౌత్యపరమైన వ్యూహాలతో అభినందన్‌ను పాకిస్తాన్ విడుదల చేసిందని చెప్పారు. మాతృదేశం పట్ల అభినందన్ ప్రదర్శించిన విశ్వాసం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చెదరని సంకల్పం దేశవ్యాప్తంగా కోట్లాది హృదయాలను గెలుచుకుకుందని, పరమవీరచక్ర పురస్కారంతో ఆయనను గౌరవించడం సముచితమని సీఎం పళనిస్వామి ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ విమానం కూలిపోగా...ఆయన పాక్ భూభాగంలో దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించింది. -
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ట్విస్ట్
-
ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్
సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వీరి సభ్యత్వాల రద్దును ఆమోదిస్తూ హైకోర్టు తీర్పునిస్తే.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముంది. అనేక ఒడిదుడుకుల మధ్య అధికారంలో కొనసాగుతున్న పళనిస్వామి ప్రభుత్వం ఈ ఉప ఎన్నికల్లో గట్టెక్కడం సవాలేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి హైకోర్టు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేసినా పళని ప్రభుత్వానికి సంకటమే. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో పళనిస్వామి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించినట్టు అయింది. ఎక్కువమంది సభ్యుల మద్దతు పళని సర్కారుకు ఉన్నా.. తగినంత మెజారిటీ మాత్రం లేదు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకేకు 114మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరో 18మంది ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా.. పళని ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. వీరి అనర్హత వేటును ఉపసంహరిస్తే.. తిరిగి వీరు పళని ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ వ్యూహాలకు అనుగుణంగా పనిచేసే అవకాశముంది. పళనిని సీఎం పదవి నుంచి దింపేసి.. దళిత ముఖ్యమంత్రిని పీఠం ఎక్కించాలని దినకరన్ ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీర్పు మరోసారి తమిళనాట రాజకీయ సంక్షోభాన్ని సృష్టించే అవకాశం కనిపిస్తోంది.