చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని | Paneer made alone in party | Sakshi
Sakshi News home page

చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని

Published Fri, Feb 17 2017 12:40 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని

చిన్నమ్మ శపథం.. సీఎంగా పళని

పన్నీర్‌ని ఒంటరిని చేసిన వైనం

చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పురచ్చి తలైవి జయలలిత సమాధి వద్ద నిచ్చెలి చిన్నమ్మ చేసిన శపథంలో మొదటి ఘట్టం విజయవంతమైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంకు సీఎం పీఠం దక్కకుండా చేశారు. శశికళ నమ్మిన బంటు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిగంటలకే బలనిరూపణకు సిద్ధమవుతున్నారు. ఈనెల 18 తేదీనే అసెంబ్లీని ఏర్పాటు చేస్తున్నట్లు.. అదే రోజు బలాన్ని నిరూపించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఇచ్చిన 15 రోజుల గడువును కేవలం రెండు రోజులకే కుదించి తన రాజకీయ చతురతను ప్రద ర్శించారు. గవర్నర్‌ ఇచ్చిన 15 రోజుల సమయాన్ని సద్వి నియోగం చేసుకొని రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవచ్చని భావించిన సెల్వానికి సీఎం ఊహించని షాక్‌ ఇచ్చారు.  

జైలు నుంచే చక్రం తిప్పారా?
శశికళ జైలుకు వెళ్లినా పన్నీర్‌కు పదవి దక్కకుండా చేసి తొలిపంతం నెగ్గించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్లే ముందే వ్యూహాత్మకంగా తన అనుచరులకు దిశా నిర్దేశం చేసి వెళ్లడం... ఆ తరువాత సీఎం, మంత్రులు ప్రమాణం చేయడంతో చిన్నమ్మ కారాగారం నుంచి ప్రభుత్వాన్ని నడపనుందని తేలిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement