ఢిల్లీకి పళని | Palani swamy going to Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి పళని

Published Mon, Feb 27 2017 3:32 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

Palani swamy going to Delhi

నేడు మోదీతో భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి ఆదివారం రాత్రి ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
సాక్షి, చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఏడపాడి పళనిస్వామి నిర్ణయించారు. రాష్ట్రంలో హైడ్రో కార్బన్ మంటలు, మిథైన్  తవ్వకాల సెగలు ఓ వైపు సాగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు  కావేరి జలాల్ని అడ్డుకునే విధంగా మేఘదాతులో కర్ణాటక డ్యాం నిర్మాణ పనుల వేగం పెరిగింది. అలాగే, రాష్ట్రానికి రేషన్ ఠిలం అవుతుండడం వెరసి ఎడపాడి పళని స్వామి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అలాగే, నీట్‌ పరీక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం రాజుకునే అవకాశాలు ఉండడంతో, ఇక్కడి సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు నివేదికను సీఎం సిద్ధం చేసుకున్నారు.

అలాగే, రాష్ట్రంలో కరువు తాండవం చేస్తున్న దృష్ట్యా, నివారణ నిధి, వర్దా రూపంలో ఎదురైన నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా నిధుల్ని రాబట్టేందుకు తగ్గ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడానికి నిర్ణయించారు. అలాగే, తన ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా డీఎంకే తీవ్రంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో కేంద్రం మద్దతును కూడగట్టుకునేందుకు తగ్గ అస్త్రాలతో ఢిల్లీ పర్యటనకు ఎడపాడి సిద్ధవైునట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ భేటీ నిమిత్తం రాత్రి ఏడున్నర గంటలకు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురైతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్  తదితర అధికారులు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీలోని తమిళనాడు భవన్ లో ఆయనకు గౌరవ వందన సమర్పించేందుకు, ఆహ్వానం పలికేందుకు అక్కడి అధికారులు ఏర్పాట్లు చేశారు.

రాత్రి అక్కడే బస చేసి ఎడపాడి ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చే పిలుపు మేరకు భేటీ కానున్నారు. ప్రధానమంత్రి మోదీకి సమర్పించేందుకు నివేదిక రూపంలో వినతి పత్రాన్ని సిద్ధం చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ప్రధానితో భేటీ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ ఎడపాడి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మధ్యాహ్నం లేదా రాత్రికి చెనై్నకు తిరుగు పయనం అవుతారు. ఇక, నెడువాసల్‌ వేదికగా జరుగుతున్న హైడ్రో కార్బన్  వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారితో బుధవారం భేటీకి ఎడపాడి నిర్ణయించారు. కేంద్రం ఇచ్చే హామీ మేరకు ఉద్యమకారుల్ని ఆయన బుజ్జగించే అవకాశాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement