► కేంద్ర మంత్రులతో భేటీలు
► వినతి పత్రాల సమర్పణ
► కొన్నింటికి ఆమోదం
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి మంగళవారం ఢిల్లీలో క్షణం తీరిక లేకుండా బిజిబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేంద్ర పథకాలకు నిధుల కేటాయింపులపై వినతి పత్రాలను సమర్పించారు. హార్బర్–మధురవాయిల్ ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ విస్తరణ తదితర పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు మంత్రులు హామీలు ఇచ్చారు.
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు ఆదివారం రాత్రి ఎడపాడి కే పళని స్వామి వెళ్లిన విషయం తెలిసిందే. మంత్రులు జయకుమార్, ఉడుమలై కే రాధాకృష్ణన్, సీవీ షణ్ముగం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో కలిసి రాష్ట్రంలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో సీఎం పళనిస్వామి బిజీ అయా్యరు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం మంగళవారం మరింత బిజీ అయ్యారు.
ఉదయాన్నే తన మంత్రులతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, సహాయ కార్యదర్శి పొన్ రాధాకృష్ణన్ టీ అయా్యరు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారుల విస్తరణ, కొత్త రోడ్లు, హార్బర్ పనులను వివరిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఇందులో చెన్నై హార్బర్–మధురవాయిల్ ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్ రోడ్డు విస్తరణ, మధురై అవుటర్ రోడ్డు, రెండు వందల కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి విస్తరణ తదితర పనులు ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ వే, ఈసీఆర్, జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఆ పనులకు తగ్గ చర్యలకు నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు.
లక్ష గృహాలు: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడుతో సీఎం పళనిస్వామి భేటీ అయా్యరు. చెనై్నలో సాగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు నిధుల కేటాయింపులు, కొత్త మార్గాలు, విమ్కో నగర్ వరకు విస్తరణ పనులకు నిధులు తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోయంబతూ్తరు, మధురై నగరాలో్లనూ మెట్రో రైలు ప్రాజెక్టు అమలుకు తగ్గ వినతి పత్రాన్ని సమర్పించారు.
స్మార్ట్ సిటీల అభివృద్ధి నిధులు, చెన్నైలో లక్ష గృహాల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. చెనై్నలో ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణకు మరిన్ని కొత్త పథకాల కోసం విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ పరిశీలిస్తామని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోనూ పళనిస్వామి భేటీ అయా్యరు. నీట్ పరీక్షలకు తమిళనాడును నినహాయించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానానికి త్వరితగతిన చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.