క్యాంప్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్‌? | Five MLAs jump from Dinakaran | Sakshi
Sakshi News home page

క్యాంప్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్‌?

Published Mon, Sep 4 2017 2:29 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

క్యాంప్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్‌?

క్యాంప్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్‌?

సీఎం పళని స్వామి కొత్త వ్యూహం  
 
సాక్షి, చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో తాజాగా ఐదుగురు శాసనసభ్యులు పుదుచ్చేరి క్యాంప్‌ నుంచి జారుకున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంప్‌ను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు మార్చాలని దినకరన్‌ యోచిస్తున్నట్లు తెలిసింది.

అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో కార్యక్రమాలు, వ్యక్తిగత పనులు, కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి తీసుకున్నట్లు దినకరన్‌ వర్గానికి చెందిన నేత జగ్గయ్యన్‌ తెలిపారు. త్వరలోనే వారందరూ వెనక్కు వస్తారని వెల్లడించారు. మరోవైపు దినకరన్‌ శిబిరం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి క్యాంప్‌కు వెళ్లకుండా నిరోధించడానికి తమిళనాడు సీఎం పళని స్వామి పలువురు మంత్రులను రంగంలోకి దించినట్లు సమాచారం.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement